నారదుడు చెప్పెను: భద్రమండలము మధ్య నున్న కమలమున అంగ దేవతాసహితబ్రహ్మను పూజింపవలెను. తూర్పున నున్న కమలమున పద్మనాభుని, ఆగ్నేయమున నుద్న కమలమున ప్రకృతిని, దక్షిణమున నున్న కమలమున పురుషుని దక్షిణభాగమున అగ్ని దేవతను, నైరృతిదిక్కున నిరృతిని, పశ్చిమదిక్కున నున్న కమలమున వరుణుని, వాయవ్యదిక్కునం దున్న కమలమున వాయువును, ఉత్తరదిక్కునం దున్న కమలమున ఆదిత్యుని, ఈశాన్య దిక్కునం దున్న కమలమున ఋగ్వేదయజుర్వేదములను పూజింపవలెను. రెండవ ఆవరణమునందు ఇంద్రాది దిక్పాలకులను, షోడశదల కమలమున క్రమముగా సామవేద, ఆథర్వవేద, ఆకాశ, వాయు, తేజో, జల, పృథివీ, మనః, శ్రోత్ర, త్వక్, నేత్ర, రసనా, ప్రణ, భూర్లోక, భువర్లోకములను పూజింపవలెను.
పిమ్మట తృతీయావరణము నందలి, ఇరువదినాలుగు దళముల కమలము క్రమముగ మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోక, అగ్ని ప్రోమ, ఆక్యగ్ని షోమ, ఉక్త, షోడశీ, వాజపేయ, అతిరాత్ర, అప్తోర్యామ, వ్యష్టిమనో, వ్యష్టిబుద్ధి, వ్యష్ట్యహంకార, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, జీవ, సమష్టిమ, సమష్టిబుద్ధి (మహత్తత్వ), సమష్ట్యహంకార, ప్రకృతులను పూజింపవలెను. వీటి అన్నింటిక్క స్వరూపము శబ్దమాత్రమే. అనగా కేవలము వీటి పేరులు చెప్పి నమస్కరించిన చాలును; మూర్తులను ధ్యానింపవసరము లేదు. ఇరువదియైదవ అధ్యాయములో చెప్పిన వాసుదేవాదిమూర్తులను తొమ్మిదింటిని, దశ విధ ప్రాణములను, మనో, బుద్ద్య, హంకార, పాయు, ఉపస్థలను, శ్రోత్ర, త్వక్, నేత్ర, రసనా, ఫ్రణ, వాక్, పాణి, పాదములను, ఈ ముప్పది రెండింటిని, ముప్పది రెండు దళముల కమలమున అర్చన చేయవలెను. ఇవి నాల్గవ ఆవరణమునందలి దేవతలు. ఈ ఆవరణమున సాంగసపరివార దేవతాపూజ చేయవలెను.
పిమ్మట, వెలుపలి ఆవరణమునందు ఫోయు-ఉపస్థల పూజ చేసి, పండ్రెండు మాసాల ఆధిపతులను, పురుషోత్తముడు మొదలగు ఇరువది యాడు తత్త్వములను పూజింపవలెను. మాసాధిపతుల పూజ చక్రాబ్దము పై క్రమముగా చేయవలెను. ఎనిమిది, లేదా ఆరు, లేదా ఐదు ప్రకృతులను ఆచటనే పూజింపవలెను. పిమ్మట మండలములపై వేరు వేరు రంగులు గల చూర్ణములు చల్లవలెను. ఎచట ఏ రంగుగల: చూర్ణము. చల్లవలెనో చెప్పెదను; వినుము; కమలకర్ణిక రంగు - పసుపు పచ్చగా ఉండవలెను. సమ స్తరేఖలును సమప్రమాణము గలవై తెల్ల రంగులో నుండవలెను. రెండు హస్తముల మండలముల రేఖలు బొటననేలంత లావుగా ఉండవలెను. “ఒక హస్తము” మండలమునందలి రేఖలు బొటనవేలి లావులో సగము లావు ఉండవలెను. రేఖలు తెల్లగా ఉండవలెను. పద్మములకు తెల్లరంగును, సంధులకు నలుపు లేదా నీలి రంగు. వేయవలెను. కేసరములు ఎరుపు-పసుపురంగులో ఉండవలెను. కోణములం దున్న కష్టములను ఎఱ్ఱని రంగు గల చూర్ణముతో నింపవలెను. ఈ విధముగ యోగపీఠమును యథేష్ట ముగ అన్ని రంగులతోను అలంకరింపవలెను. వీథిని లతలతోడను, పత్రాదులతోడను అలంకరింపవలెను. పీఠద్వారమును తెల్లని రంగు గల చూర్ణముతోను, శోభాస్థానములను ఎట్టిని చూర్ణములతోదను- నింపవలెను. ఊపశోభలపై నీలి రంగు చూర్ణము చల్లవలెను. కోణముల శంఖములను తెల్లగా, చిత్రింప వలెను. ఇది. భద్రమండలముపై రంగు లుంచు విధానము. ఇతరమండలము పై గూడ ఈ విధముగనే అనేక విధములగు వర్ణములు గల చూర్ల ములు చల్లవలెను. త్రికోణమండలము తెలుపు - ఎరుపు - నలుపురంగులతో అలంకరింపవలెను. ద్వీకోణమును ఎరుపు-పసుపురంగులతో అలంకరింపవలెను. చక్రకమలమునందలి నాభిస్థానమును నలుపురంగు చూర్ణముతో అలంకరింపవలెను.
చక్రకమలము ఆకులకు పసుపు ఎరుపు రంగులు వేయవలెను. చక్రము అంచును నీలము - ఎరుపు రంగులు వేసి ఆలంకరింపవలెను. బైట నున్న రేఖలకు తెలుపు, క్యానము, ఎరుపు, లుపు, పసుపు రంగులు వేయవలెను. వరిపిండి మొదలగువాటిని తెలుపురంగునకు ఉపయోగించవచ్చును. కుసుంధ చూర్ణాదులు ఎరుపురంగునకును, పసుపు, పసుపురంగునకును, మాడ్చిన బియ్యపు పిండి నల్లరంగునకును ఉపయోగించును. శమీపత్రాదులచే శ్యామవర్ణము వేయవచ్చును. బీజమంత్రములను ఒక లక్ష జపించుటచేతను, ఇతరమంత్రములను అక్షరలక్షలు జపించుటచేతను, విద్యలను ఒక లక్ష జపించుటచేతను, బుద్ధవిద్యలను పదివేల సార్లు జపముచేయుటచేతను స్తోత్రములను వేయి పర్యాయములు జపించుట చేతను, లేదా అన్ని మంత్రమును మొదట ఒక లక్ష జపించుటచేతను, మంత్రశుద్దియు, ఆత్మశుద్ధియు కూడమడ్డల విధిః కల్గును. రెండవ పర్యాయము ఒక లక్ష జపించుటచే మంత్రము క్షేత్రీకృత మగును (సాధకునకు దాని పై నిలకడ ఏర్పడును.) బీజమంత్రజపము మొదట ఎంత సంఖ్యలో చేయబడునో హోవుము కూడ అంత సంఖ్యలోనే చేయవలెను. ఇతరమంత్రముల విషయమున హోమము జపసంఖ్యలో పదవవంతు చేయవలెను. ముంత్రపురశ్చరణము చేయ సంకల్పించినప్పుడు ఒక్కొక్క మాసము వ్రతము ఆవలంబింపవలెను. నేలపై మొదట ఎడమ కాలు ఉంచవలెను. దానము పట్టగూడదు. ఈ రెండు రెట్లు మూడు రెట్లు జపము చేసిననే మధ్యమ-ఉత్తమ శ్రేణికి చెందిన ఫలములు లభించును.
ఇపుడు మంత్రమువలన ఫలము సిద్దించుటకై ఉపయోగించు మత్రధ్యానమును చేప్పెదను మంత్రముయొక్క స్థూలరూపము శబ్దము. ఇది దాని బాహ్యరూపము. మంత్రము యొక్క సూక్ష్మరూపము జ్యోతిర్మయ మైనది. ఇదే దాని ఆంతర రూపము. ఇది కేవంము చింతనామయ మైనది. చింతనమునకు కూడ అతీతమైనది మంత్రము యొక్క పర రూపము. వరాహ నరసింహ శ క్తిమంత్రముల స్థూలరూపమునకే ప్రాధాన్యము. వాసుదేవుని రూపము చిన్లనరహిత మని చెప్పబడినది.
ఇతర దేవతల చింతామయ మగు ఆంతంకరూపమే సర్వదా ముఖ్యమైనదిగా పరిగణింపబడుచున్నది. విరాట్టు యొక్క స్వరూపము స్థూలము. లింగమయస్వరూపము సూక్ష్మము. ఈశ్వరుని రూపము చింతారహితము. బీజమంత్రము హృదయకమలమునందు నివసించునది; అవినాశి; చిన్మయము; జ్యోతిస్వరూపము. జీవాత్మక ము. దాని ఆకాశము కదంబ పుష్పముతో సమానము. ఈ విధముగ ధ్యానింపవలేను. కుండలో నుంచిన దీపముయొక్క కాంతి. పేకి ప్రసరింపకుండునట్లు నిరుద్ధమై సంహతరూపమున ఒంటరిగా ఉన్నట్లు, మంత్రేశ్వరుడు హృదయమునందు ప్రకాశించుచుండును. అనేక రంధ్రము లున్న కుంభము నుంచిన దీపము కాంతులు ఎన్ని రంధ్రము లున్నవో అన్ని బైటకు ప్రసరించినట్లు. జ్యోతిర్మయబీజ మంత్రముల రశ్ములు నాడుల ద్వారా ప్రసరించుచు దేవాత్మకదేహముతో ప్రకాశించును. నాడులు హృదయమునుండి బయల్వెడలి నేత్రేంద్రియమువరకును ప్రసరించి ఉన్నవి. వాటిలో అగ్ని సోమాత్మకము లగు రెండు నాడులు నాసికాగ్ర భాగమునం దుండును. మంత్రసాధకుడు ఉద్ఘాతయోగ ముచే శరీర వ్యాపియై యున్న ప్రాణవాయువును చక్కగా జయించి జపధ్యానతత్పరుడై యున్నచో ఆతనికి మంత్రఫలము లభించును. పంచభూతతన్మాత్రల శుద్ది చేసికొని యోగాభ్యాసము చేయు సాధకుడు కోరికలు కలవాడై నచో ఆణిమాది :సిద్దులను పొందును. వైరాగ్యవంతు డైనచో ఆ సిద్ధులను దాటి, చిన్మయస్వరూపముతో నుండి, భూతమాత్రలనుండియు, ఇంద్రియము లనెడు గ్రహములనుండియు సర్వదా విముక్తు డగును.
అగ్ని మహాపురాణమునందు మండలాదివర్ణన మను ముప్పదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 30 of the Agni Purāṇa is as follows:
Expanding on the previous chapter, this chapter provides a comprehensive manual for Śrāddha — the ceremony of offerings to the departed ancestors performed on specific lunar tithis, at eclipses, at sacred tīrtha-s, and especially during the Pitṛ Pakṣa fortnight. The preparation of ritual foods — piṇḍa (balls of cooked rice mixed with sesame, honey, and milk) — and the sequence of their offering to the three generations of paternal and maternal ancestors are described. The categories of brāhmaṇas to be invited to the śrāddha feast and those who must be excluded are enumerated. The belief that ancestral spirits, however far removed in time, receive the essence of whatever is offered through the ritual is affirmed. The extraordinary merit of śrāddha — removing the pitṛ-s from suffering states and ensuring the flourishing of the living family — is celebrated.