పుష్కరుడు చెప్పెను : రాజు తన పుత్రుని బాగుగా రక్షించుకొనుచు ఆతవిక ధర్మశాస్త్ర - ఆర్థశాస్త్ర కామశాస్త్ర - ధనుర్వేదములందు శిక్షణ ఇవ్వవలెను. వివిధ శిల్పములమ గూడ నేర్పవలెను. విశ్వాసపాత్రులు, ప్రియముగా మాటలాడువారు ఆగువారిని క్షకులుగా నియమించవలెను. రాజకుమారుని శరీరర శార్థమై కొందరిని నియమింపవలెను. కోపము కలవారు, లుబ్దులు, అవమానితులు అయినవారినుండి రాజకుమారుని దూరముగా ఉంచవలేను. మంచి గుణములు నేర్పుట అంత సులభము కాదు. అందుచే రాజకుమారుని ఎక్కువగా సుఖ పెట్టరాదు. ఆతడు చక్కగా శిక్షితుడైన పిమ్మట ఆతనిని అన్ని పనులందును నియమించవలెను. వేట, జూదము, మద్యపానము- ఇవి రాజ్య వినాశకరములగు దోషములు. రాజు వీటిని పరిత్యజించవలెను. పగటినిద్ర, పనిలేకుండగ తిరుగుట, కటుభాషణము- వీటిని పరిత్యజించ వలెను. ఇతరులను నిందించుట, తీక్షదండము, అర్థదూషణము కూడ విడువవలెను. ఐంగారము గనులు మొదలగునవి వశించిపోవుట, దుర్గాదులకు మరమ్మతులు చేయకుండుట. ఇవి ఆర్థదూషణములు. ధనమును కొంచెము కొంచెము అనేక స్థానములందు ఉంచుట, అయోగ్యముడైన దేశ కాలములందు అపాత్రలకు దానము చేయుట చెడ్డపనులకై ధనవంవెచ్చించుట, ఇవి కూడ అర్థదూషణములు కామ - క్రోధ - మధ - మాన - లోభ - దర్పములమ త్యజించవలెను. పిదప భృత్యు అను వశమునందుంచుకొని, పిమ్మట వగరములోని వారిని, దేశములోని వారిని వశంగతులను చేసికొనవలెను. పిదప బాహ్యశ త్రువులను జయించుటకై ప్రయత్నించవలెను. బాహ్యశత్రువులు మూడు రకములు పాత శత్రుత్వము కలవారు రాజ్యవు సరిహద్దులలో ఉండువారు, తనతో శత్రుత్వ మేర్పడినవారు. వీరిలో పూర్వపూర్వులు అధిక శత్రువులు. తాత ముత్తాతలనుంచి మిత్రులు శత్రువుల శత్రువులు, కృత్రిములు అని మిత్రులు కూడ మూడు విధములు.
ధర్మవేత్తవైన పరశురామా! రాజ్యమునకు - రాజు, మంత్రి, జనపదము, దుర్గమ, సేన, కోషము, మిత్రులు అని ఏడు అంగములు. రాజ్యమునకు మూలము స్వామి (రాజు). అందుచే ఆతనిని ఎక్కువగా రక్షించవలెను. రాజ్యాంగ విద్రోహులను చంపివేయవలెను. సమయానుసారముగా రాజు కఠోరముగాను మృదువుగాను కూడ ప్రవర్తించవలెను. ఇట్లుండుటచే ఆతనికి రెండులోకములును బాగుపడును రాజు భృత్యులతో పరిహాసము చేయరాదు. అందరితోడను నవ్వుతూ మాటలాడే రాజును సేవకులు అవమానింతురు. లోకులతో కలిసిమెలిసి ఉండుటకై రాజు కొన్ని లేని వ్యసనములు కూడ ఉన్నట్లు ప్రవర్తించవలెను. ప్రజలు ప్రసన్నులగు విధమున చిరునవ్వు నవ్వుచూ మాటలాడవలెను. దీర్ఘసూత్రి (పనులు చేయుటలో చాలాకాలం ఆలోచించువాడు) యైనరాజుయొక్క కార్యము లన్నియు నశించును. కాని రాగ - దర్పఅభిమాన - ద్రోహ - పాపకర్మ - అప్రియభాషణాదులలో దీర్ఘసూత్రియైన రాజును ఆందరును ప్రశంసింతురు. రాజు తన మంత్రమును [ఆలోచనలను] గుప్తముగా ఉంచుకొనవలెను. ఆట్లు ఉంచుకొన్నచో ఎన్నటికిని ఆపదరాదు.
రాజ్యకార్యములు పూర్తియైన తరువాతనే ఇతరులకు తెలియవలెను. వాటి ప్రారంభము ఎవ్వరికిని తెలియ కూడదు. మనుష్యుల ఆకారము, సంజ్ఞలు, చేష్టలు, ప్రవర్తన, మాటలు, నేత్రముఖ వికారములు - వీటిని పట్టివారి మనస్సులోని ఆలోచనను పసిగట్ట వచ్చును. రాజు ఒంటరిగా రహస్యమైన విషయములను గూర్చి ఆలోచించగూడదు. చాల మందితో సలహా తీసికొనవచ్చును గాని ఒక్కొక్కరినే పిలిపించి తీసికొనవలెను. రాజు యొక్క రహస్యాలోచనలను మంత్రి ఇతర మంత్రులకు గూడ చెప్పగూడదు. మనుష్యులకు సాధారణముగా ఎవ్వరో ఒక వ్యక్తిపైననే విశ్వాసమేర్పడును. ఆందుచే రాజు విద్వాంసుడైన ఒక మంత్రితో సూత్రమే ఆలోచనలు చేయవలెను. వినయములేని రాజు నశించును. వినయ వంతుడు రాజ్యము పొందగల్గును. వేదత్రయ పండితులనుండి, వేదత్రయమును, ప్రాచీనదండనీతిని, ఆన్వీక్షకిని, (న్యాయవేదాంతాచులు) ఆర్థశాస్త్రమును నేర్వవలెను వార్తను [కృషి, గోరక్ష, వాణిజ్యము మొ.] గూర్చిన జ్ఞానమును లోకమునుండి సంపాదించుకొనవలెను. తన ఇంద్రియములను వశములో ఉంచుకొన్న జడే ప్రజలను పశములో ఉంచు కొన గల్గును. దేవతలను సమస్త బ్రాహ్మణులను పోషించవలెను. వారికి దానములీయవలెను. బ్రాహ్మణునకిచ్చిన దానము అక్షయమగు. దానినెవ్వరును నశింపచేయజాలరు. యుద్దము నందు వీపు చూపకుండుట, ప్రజలను పాలించుట, బ్రాహ్మణులకు జనము లిచ్చుట ఇవి రాజునకు కల్యాణదాయకములు. దీనులు, అనాథులు, వృద్ధులు, విధవలగు, స్త్రీలు మొదలగు వారి యోగ క్షేమములు చూచుచు, వాటికి జీవనోపాధి కల్పింపవలెను. వర్ణాశ్రమధర్మ రక్షణము, మునులను సత్కరించుట ఇవి రాజుల కర్తవ్యములు. రాజు ఎవ్వరిని నమ్మకూడదు. కాని మునులను మాత్రము నమ్మవచ్చును. సరియేన ఉపాయముల చే ఇతరులకు తన పై విశ్వాసమేర్పడునట్లు చేసికొనవలెను. రాజు స్వార్థ మునుగూర్చి కొంగవలె ఆలో చించవలెను. సింహమువలె పరాక్రమము చూపవలెను. తోడేలు వలే శత్రువులను ఆక్రమించి చర్చించవలెను. చేవులపిల్లి వలె దుముకుచు అదృశ్యుడు కావలెను. సూకరమువలె దృడప్రహారము చేయవలెను. నెమలివలె విచిత్రవేషమును ధరించవలెను. గుఱ్ఱమువలె దృఢమైన భక్తి కలిగియుండ వలెను. కోకిలవలే మధురముగా నూటలాడవలేను. కాకివలె అందరి మండి తప్పించుకొని యుండవలెను. ఎవరికిని తెలియని చోట నివసించవలెను. పరీక్షించకుండగ భోజనము చేయరాదు. శియ్యపై పరుండరాదు. ప్రజలను పీల్చివేయువాడు రాజ్యమును, జీవితమును కూడ కోల్పోవును, పోషింపబడిన లేగ దూడ బలము కలదై న పిమ్మట పనులు చేయుటకు ఉపయోగించునట్లు, బాగుగా రక్షింపబడిన రాష్ట్రము రాజునకు ఉపకరించును. కార్యముల్న యు దైవము మీదను పురుషకార ముమీదను ఆధారపడి యుండును. వీటిలో దైవము అచింత్యము. వురషకారము కార్యమును సాధించగలగును. ప్రజానురాగమే రాజ్యమును, పృథివిని. లక్ష్మిని ఇచ్చు ఏకైక హేతువు.
అగ్నిమహాపురాణమునందు రాజధర్మకథనమను రెండువందల ఇరువదియైదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 225 of the Agni Purāṇa is as follows:
Agni provides the detailed procedure for daily pitṛ-tarpana, the water-offering to the manes. The specific mantras for tarpana to the three classes of pitṛs — Vasus, Rudras, and Ādityas — corresponding to one's father, grandfather, and great-grandfather, are given. The role of the sacred kuśa grass and black sesame in the tarpana ritual is explained. Agni declares that sincere tarpana, even with plain water offered with faith, reaches the pitṛs in whatever loka they reside.