అగ్ని దేవుడు పలికెను. వశిష్ఠా! ఇపుడు గోనసాది సర్ప విషమునకు చికిత్స చెప్పెడను. పినుము. “ఓహ్రాం హ్రీం, ఆమల పక్షిస్వాహా” అను మంత్రముతో అభిమంత్రించిన తాంబూలమును ఇచ్చుటచే మంత్ర వేత్త మండలి సర్ప విషమను తొలగించను. లశునము రామఠ ఫలము కుష్టము, అగ్ని, వ్యోషకము వీటిని సర్పవిషము నందు త్రాగవలయును, స్నుహీ క్షీరము గోఘృతము పదునైదు దినములు త్రాగవలయును. రాజిల సర్పము కరచినపుడు సైంధవలవణము ఆజ్యమధు గోమయర సములు పురితత్” భక్షించినచో విషము తొలగను. సర్పము కరచిన వాడు కృష్ణఖండము దుగ్ధము, ఆజ్యము, తేనె. వీటిని త్రాగవలెను. త్రికటువులు మయూర పించము పిల్లి, యెముక ముంగిసరోమములు వీళిని సమానభాగములుగ గ్రహించి చూర్ణము చేసి గొఱ్ఱపాలలో తడిపిదాని ధూపమువేసికచో అన్ని విధములగు విషములు నశించను. రోమ నిర్గుండికా, ఆంకోల, పత్రములను సమభాగముల గ్రహించి, వాటి అన్ని టితో సమముగ లగునము చేర్చి వేసిన ధూపము కూడ విషనాళకము. అగస్త్యపత్రములను, గంజిలో ఉడికించి దానితో పాము కరచిన చోట కాచినచో విషము డిగిపోవును. మూషకములు పదహారు విధములు కార్పాస రసమును త్రాగినచో వాటి విషము తొలగును. .ఫలునీ పుష్పములను నాగర గడములతో కలిపి భక్షించినచో విష రోగము పోవును. సాలె పురుగులు ఇరువది విధములై నువి. వాటిని విషమునకు చికిత్స చేయుటకు పద్మక పాటలీ కష్ట ఉశీర, చందన, నత, నిర్గుండి, శారివ, సేలులను ఉపయోగించవలయును. గుంజ నిర్గుండి కంకోల పత్ర శుంఠి, ద్వివిధ హరిద్ర కరంజ వల్కము లను ఉడికించి (సాలె పురుగు) లూత విషముతో బాధపడు వానికి పైన చెప్పిన ఓషధులు కలిపిన నీటిని త్రాగించ వలయును. ఇపుడు వృశ్చిక విషమును తొలగించు చికిత్సను వినుము. మంజిష్ఠా చందన వ్యోష శిరీష, కుముద పుష్పములను, నాలుగు యోగములను కలిపి లేపాడికము చేసినచో వృశిక విష బాధ నశించును. “ఓం నమో భగవతే రుద్రాయ” మొదలు “ఓం హ్రూంఫట్” వరకు వున్న మూరోక్త మంత్రముతో అభిమంత్రించిన ఔషధము మనుమతనికి ఇచ్చినచో గర్దభాది విషము లను తొలగించును. త్రిఫలా ఉశీర, ముస్తా. ఆంబు మాంసి, పద్మక. చందనములను మేక పాలతో కలిపి తాగించినచో గర్గభాది విషము నశించును. శిరీష పంచాంగములు వ్యోషము శత పదీ విషమును నశింప చేయును . కంధరముతో కూడిన శిరీష వృక్షపు బెరడు ఉందూరజ విషమును తొలగించును. వ్యోషమును తగర మూలమును మృతముతో ఉపయోగించినచో “మత్స్యవిషము నశించును. యవ, షార, వ్యోష, వచా, హింగు, విడంగ, సైంధవ - తగర, అంబషా, అతిబలా కుషములు సకల విధకీట విషమ్మును హరించును. యష్ట్రవ్యోషగుడ క్షీరములతో చేసిన యోగము శూనక విషమును తొలగించును. “ఓం సుభద్రాయైనమః” ఓం సుప్రభాయై నమః అనునవి ఓషధులును పైకి తీయువపుడు ఉపయోగించు మంత్రములు. విదానానుసారముగ కాక మానవులు ఏ ఓషధులను గ్రహింతురో వాటి సారమను నీవు తీసుకొనుము యని బ్రహ్మ "సుప్రభా" దేవికి చెప్పెను. అందుచేత ముందుగ సుప్రభాదేవికి నమస్కరించి పిడికిలితో యవలు చల్లి పది పర్యాయములు జపించి' ఓషధికి నమస్కరించి “ఊర్వనేత్రవగు నిన్ను ఉద్దరించుచున్నాను". యని చెప్పుచు ఆ ఓషధిని పైకి లాగి “పురుష సింహుడగు గోపాలునకు నమస్కారము. యుద్ధమునందు తనపరాజయమును గూర్చి శ్రీకృష్ణుడే యెదగును. ఈ సత్యవాక్య ప్రభావముచే నాకు ఈ ఓషధి సిద్ది ప్రదమగు గాక ! యని చెప్పుచు దానిని భక్షించవలయును. సావర విషమునకు ఉపయోగించు ఓషధుల విషయమున "నమోవై దూర్య మాత్రే" మొదలు హరిమాయే" వరకును వున్న మూలో మౌ మంత్రమును జపించవలయును. విషమును భక్షించిన వానిచే ముందుగవమనము చేయించి వాని శరీరము చల్లని జలము తడుపవలయును. పిదప తేనె నెయ్యి త్రాగించి విరేచనము చేయించవలయును.
అగ్ని మహాపురాణమున గోనసాది చికిత్సా కథనమను రెండువందల తొంబది యెనిమిధవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 298 of the Agni Purāṇa is as follows:
Treatment for bites of the specific snake species goṃnasa (a non-cobra ground serpent), and then maṇḍali, rājila, and other serpent varieties is presented. Agni narrates to Vasiṣṭha. For the maṇḍali bite, a betel leaf abhimantrita with "Hrīṃ hrīṃ amalapakṣi svāhā" is given; for goṃnasa, laśuna-rāmaṭha-phalagu-kuṣṭha-agni-vyoṣa is prescribed. Treatments for mouse bites (mūṣika-viṣa), spider bites (lūtā-viṣa), and scorpion stings (vṛścika-viṣa) follow. The chapter includes the sacred procedure of uprooting medicinal herbs with the mantra "Namaḥ puruṣa-siṃhāya" and the goddess Suprabhā's blessing for empowering all plant medicines. Mantras to Cāmuṇḍā and the protective names Gaurī, Gāndhārī, Cāṇḍāla, and Mātaṅginī are invoked against sthāvara (plant) poisons.