హయగ్రీవుడు చెప్పెను : బ్రహ్మదేవా, ఇపుడు ఐదు ప్రతిష్టాంగములను చెప్పెదను. ప్రతిమ పురుషునికి ప్రతీకయైనచో పిండిక ప్రకృతికి ప్రతీకము. లేదా ప్రతిమనారాయణస్వరూపము, పిండిక లక్ష్మీస్వరూపము. ఈ రెండింటి యోగమునే ప్రతిష్ట అందురు. అందుచే ఆయా ఫలములు కోరువారు ఆయాదేవతల ప్రతిష్ట చేయుదురు. ఆచార్యుడుదేవాలయము ఎదుట గర్భసూత్రము తొలగించి ఎనిమిది, లేదా పదునారు లేదా ఇరువది హస్తముల మండపము నిర్మింపవలెను. ఎనిమిదిహ స్తముల మండపము 'నిమ్నము', పదునారు హస్తములది 'మధ్యమము', ఇరువదిహ స్తుంది 'ఉత్తమము'. మండపములో సగము భాగమును దేవతాస్నానమునకు కలశస్థాపనకొరకు, యాగమునకు సంబంధించిన ద్రవ్యములను ఉంచుటకును కేటాయించవలెను. మిగిలిన సగ ముమండపములో, లేదా మూడవవంతు మండపములో సుందరమైన వేది ఏర్పరుపవలెను. దానిని పెద్ద పెద్ద కలశ లతోడను, చిన్న చిన్న కలశ లతోడను, చాందనీలు మొదలైన వాటితోడను అలంకరింపవలెను. మండపములోపల పంచగవ్యములుచల్లి, శుద్ధిచేసి, అచట సామగ్రియంతయు ఉంచవలెను. పిమ్మట ఆచార్యుడు వస్త్రమాలాద్యలంకృతుడై , విష్ణువును ధ్యానించి పూజింపవలెను.
ఉంగరములు మొదలగు ఆభరణములిచ్చి, ప్రార్థించి మూర్తిపాలకులగు విద్వాంసులను సత్కరించి వారిని చతుర ప్రముఖు, ఆర్ధచంద్రాకారములు, గోలాకారములు, లేదా పద్మ సదృశములుగ కుండములపై కూర్చుండ పెట్టవలెను. పూర్వాష్టి దిక్కులతోరణములకు ఆశ్వత్థ - ఉదుంబర - వట - ప్లక్షదారువులను ఉపయోగింపవలెను. తూర్పుద్వారమునకు ‘సుశోభన’ మని పేరు. దక్షిణద్వారము 'సుభద్రము', పశ్చిమద్వారము 'సుకర్మ' ఉత్తర ద్వారము - 'సుహోత్రము'. ఆ తోరణ స్తంభములన్నియు ఐదుహస్తము ఎత్తు ఉండవలెను. వీటిని స్థాపించి “స్యోనా” పృథవీన్ అనే మంత్రముచే పూజించవలెను. తోరణ స్తంభము మూభాగములందు మంగళకరమైన చూత పల్లవ - యవాంకురాచ్యంకురములున్న కలశలు స్థాపింపవలెను. తోరణ స్తంభము పైన సుదర్శనచక్రము స్థాపింపవలెను. నేర్పుగల విద్వాంసుడు ఐదు అడుగుల ఐదు హస్తముల ధ్వజముకూడ స్థాపింపవలెను. దీని వెడల్పు పదునారు అంగుళములుండవలెను. ఓ సురశ్రేష్టా! ఆ ధ్వజదండము ఏడుహస్తము: ఎత్తు ఉండవలెను. పూర్వాది దిశలందు ధ్వజములపై ఆరుణవర్ణము, అగ్ని (యాత్ర వర్ణము), కృష్ణ-శుక్ల-పీత-రక్త - శ్వేత వర్ణములు ఉండవలెను.
పూర్వాది దిక్కులలోనున్న - ధ్వజముపై కుముద.కుముదా పుండరీక-వామన-శంకుకర్ణ-సర్వనేత్ర.సుముఖసుప్రతిష్టితులను దేవతలను పూజింపవలెను... వీరందరును కోట్లకొలది సద్గుణములు కలవారు. ఎఱ్ఱని దొండపండువలె ఎఱ్ఱగాకాలిన నూట ఇరువది ఎనిమిది కలకలను నాలుగు కేర్ల నీళ్లతోనింపి 'కాలదండ' మను యోగములేని సమయమున స్థాపింపవలెన్లు. వీటి ఆన్నింటికి కంఠభాగమునందు. వస్త్రములుకట్టి. వాటిలో సువర్ణము. ఉంచి, తోరణముల వెలుపల ఉంచవలెను. వేదికి తూర్పుమొదలైన నాలుగు దిక్కులందును, కోణములందును గూడ కలశములు స్థాపింపవలెను. మొదట నాలుగు కలశమును పూర్వాది దిక్కులు- నాల్గింటియందు “ఆణిమ కలశమ్” ఇత్యాది మంత్రము చదువుచు స్థాపింపవలెను. ఆ కలశలపై, పూర్వాది దిక్కులందు దిక్పాలకులను ఆవాహనచేసి పూజింపవలెను. “ఐరావతము పై వక్కి, హస్తమున వజము ధరించిన దేవరాజువైన ఇంద్రా! ఇతర దేవతలతో కూడ ఇచటికి రమ్ము; ఈ తూర్పు ద్వేరమునుశ్రీమదగ్ని మహాపురాణము రక్షింపుము. దేవతాసమేతుడవైన నీకు నమస్కారము అని ప్రార్థించుచు ఇంద్రుని ఆవాహనచేసి, “త్రాతారమిస్త్రమ్” ఇత్యాదిమంత్రము పఠించుచు పూజింపవలెను. ఆమేషమునెక్కి, శ క్తిని ధరించియున్న బలిశాలివైన ఓ ఆగ్న దేవా! దేవతలతో కూడవచ్చి, 'ఈ' ఆగ్నేయదిక్కును రక్షింపుమా. పా పూజ గ్రహింపుము; నీకు నమస్కారము అని ప్రార్థించుచు ఆగ్ని ని ఆవాహనముచేసి, “అగ్నిర్మూరా” లేదా “అగ్ని యే నమః” అను మంత్రముచే పూజింపవలెను. “మహిషారూఢుడవై దండము ధరించియున్న, మహాబలశాలియైన సూర్యపుత్రా! యమదేవా! నీవు వచ్చి దక్షిణద్వారమును రక్షింపుము; నీకు నమస్కారము అని ప్రార్థించి యముని ఆవాహనముచేసి, వైవస్వతం సంగమనమ్, ఇత్యాది మంత్రముచే పూజింపవలెను. “భలపాహన సంపన్నుడవైన, ఖడ్గధారియైన ఓ నిరృతీ! రమ్ము. ఈ అర్ఘ్యపాద్యములను గ్రహింపుము; నైరృతిదిక్కును రక్షించుము” అని ప్రార్థించువనిరృతిని ఆవాహనము చేసి ఊపషతే నిరృతే ఇత్యాది మంత్రముచే ఆర్యాద్యుపచారములనిచ్చి, పూజింపవలెను.. “మకరమును” ఎక్కినవాడా! పాకధారీ! మహాబలశాలియైనఓ వరుణదేవా! రమ్ము! పశ్చిమద్వారమును రక్షింపుము; నీకు నమస్కారము అని ప్రార్థించుచు వరుణుని ఆవాహనముచేసి ఉరుంహి రాజావరుణః ఇత్యాది మంత్రమంతో ఆచార్యుడు వరుణదేవతకు ఆర్ఘ్యము సమర్పించి పూజింపవలెను.
ధ్వజము ధరించిన, మహాబలశాలివైన వాయుదేవా, నీ వాహనమునెక్కి, దేవతలతోను, మరుత్తులతోడనువచ్చి వాయవ్యదిక్కును రక్షించుము; నీకు నమస్కారము”, అని ప్రార్ధించుచు వాయువును ఆవాహనచేసి “వాత ఆవా తు” ఇత్యాది మంత్రముచేతగాని, “ఓం నమో వాయవే - అను మంత్రముచేత గాని 'వాయుదేవుని పూజింపవలేను. “బలవాహనసంపన్నుడవు గదాధారివి ఆగు సోమా! నీవు వచ్చి ఉత్తరద్వారమును రక్షింపుము. కుబేర సహితుడివగు నీకు నమస్కారము” ఆని ప్రార్థించుచు సోమని ఆవాహనముచేసి, సోమం రాజానమ్” ఇత్యాది మంత్రముచేతగాని, 'ఈసోమాయనమః’ ఇత్యాది మంత్రముచేతగాని పూజింపవలెను, వృషభారూఢుడవును, మహాబలశాలివి, శూలధారివి అగు ఈశానా! - నీవు వచ్చి యజ్ఞమండపముయొక్క ఈశాన్యదిక్కును రక్షింపుము; నీకు నమస్కారము అని ప్రార్థించి, ఈశానుని ఆవాహనముచేసి “ఈశానమస్య ఇత్యాదిమంత్రమచేతగాని, “ఈశానాయ నమః” అను మత్రమచేతగాని పూజింపవలేను. “హస్తాగ్రములందు స్రుక్ స్రువములను ధరించిన వాడవున, హంసారూఢుడవుమ, జన్మరహితుడవును ఆగు ఓ బ్రహ్మ ఊర్ధ్వ దిక్కును రక్షించుము; నీకు నమస్కారము” అని ప్రార్థించి, బ్రహ్మ దేవుని ఆవాహనముచేసి. “హిరణ్యగరు” ఇడి మంత్రము , చేతగాని “నమస్తే బ్రహ్మణే” ఇత్యాది మంత్రమచేతగాని పూజింపవలెను. “తాబేలు వీపుపై కూర్చున్న వాడా! నాగ గణముల ఆధిపతీ! చక్రధారీ! అనంతా! రమ్ము; అధర దిశను రక్షింపుము అనంతేశ్వరా! నీకు నమస్కారము” ఆని ప్రార్థించుచు” అనంతుని ఆవాహనముచేసి “నమోస్తు సర్వేభ్యః” అను మంత్రముచేగాని, “అనస్తాయనమః” అను మంత్రముచేత గాని పూజింపవలెను.
అగ్ని మహాపురాణమునందు దశ దీక్పతియాగమను ఏబదియారవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 56 of the Agni Mahā Purana is as follows:
This chapter addresses the examination, purification, and ritual qualification of a newly made divine image before its consecration. The śilpin (sculptor) and the ācārya must together examine the image for defects — incorrect proportions, cracks, improper posture, missing attributes, asymmetrical limbs — and only a flawless image may proceed to installation. Specific tests are described: an image placed in water must float with its face upward; one buried in grain overnight must show auspicious signs upon exhumation. The purification of the image through successive baths in sacred waters, application of herbal pastes, fumigation with specific resins, and the recitation of mantras over it are detailed. The chapter affirms that the purification of the image is simultaneously the purification of the space it will inhabit, and that a properly examined and purified image truly becomes a dwelling of the divine.