అగ్ని దేవుడు చెప్పెను. ఇపుడు అత్యుత్తమము సర్వ కామ ప్రవమగు పుచాంగ రుద్ర విధానమును చెప్పెదను. దీనికి శివ సంకల్పము హృదయము. పురుష నూక్తము శిరస్సు. “ఆద్భ్యః సఁభూతః” (యుజు 31.17) ఇత్యాది సూక్తము “ఆశుః శిషానః" ఇత్యాది అధ్యాయము కవచము. శత రుద్రియము అను రుద్రమునకు ఈ యైదను అంగములు. రుద్ర దేవత ధ్యానము చేసి పంచాంగ భూత రుద్రుల జపము క్రమముగ చేయవలయును. “యజ్ఞాగ్రతో” మొదలగు ఆరు ఋక్కులు గల శివ సంకల్ప సూక్తము (యజు 34.1.6) దీని హృదయము. దీని ఋషి శివ సుకల్పుడు. ఛందస్సు త్రిష్టుప్ “సహస్రశీర్షా” యను ప్రారంభముగల పురుష సూక్తము దీనికి శీర్ష స్థానీయము. దీని ఋషి నారాయణుడు. పురుషుడు దేవత. అనుష్టుప్ త్రిష్టులు ఛందస్సులు. “ఆద్భ్యః సంభూతః” ఇత్యాది సూక్తి మువకు ఉత్తర గామి నరులు ఋషులు. వీటిలో క్రమముగా మొదటి మూడు మంత్రములకు త్రిష్టుప్ తరువాత రెండు ముత్రముల పై అనుష్టుప్ చివర మంత్రములకు త్రిష్టుప్ ఛందస్సులు. పురుషుడు డేవత “ఆశుః శిషానః” (యుజు 17 - 33-) ఇత్యాది సూక్తమున పన్నెండు మంత్రము లకు చంద్రుడు దేవత. చందస్సు త్రిష్టుప్. పదునేడు ఋక్కులుగల. ఈసూక్తముకకు ఋషి ప్రతిరథుడు. దేవతలు మాత్రము వేరువేరుగ నుందురు. కొన్ని మంత్రములకు పురువిత్ అంగ దేవత. మిగిలిన దేవతమంత్రములకు ఛందస్సు అనుష్టుప్. “ఆసౌమస్తామ్రః” (యజు - 16 - 6) మంత్రములకు పురులింగోక్త దేవత పంక్తి ఛందస్సు, " మర్మా ణితే" "(యజు 17 - 19) ముత్రమునకు త్రిష్టుప్ ఛందస్సు. దేవత లింగోక్తము రుద్రాధ్యాయము నంతకును ఋషి పరమేష్టి. దేవానామిత్యాది ముత్రములకు ఋషి ప్రజాపతి. మూడు ఋక్కులకు మాత్రము ఋషి కుత్సుడు. "మానో మహాంతం" (యజు 16 - 15) 'మాసిస్తోకే' (యజు 16 - 16) అను రెండు మంత్రములకు ఉమయు అన్యమంత్రములకు రుద్రుడును రుద్ర గణములును దేవతలు. పదునారు ఋక్కులు గల మొదటి అమ వాకమునకు దేవత రుద్రుడు. మొదటి మంత్రమునకు ఛందస్సు గాయత్రి. మూడు ఋక్కులకు అనుష్టుప్. మూడు ఋక్కులకు పుక్తి.. ఏడు ఋక్కు లకు అనష్టప్. రెండు ముత్రములకు జగతి. “న మోహిరణ్య బాహవే” (యుజు 18 - 17) మొదలు "నమోవః కిరి కేభ్యః" వరకు రుద్రగణము యొక్క మూడు అశీతులు పున్నవి. రుద్రాను వాకము నందలి ఐదు ఋక్కులకు రుద్రుడు దేవత. ఇరువదవ ఋక్కునకు కూడ దేవత రుద్రుడు. మొదట ఋక్కు యొక్క ఛందస్సు బృహతి. రెండవదాని ఛందస్సు త్రిజగతి. మూడవదాని ఛందస్సు త్రిష్టుప్. మిగిలిన మూడును ఆనుష్టుప్. వీటి జ్ఞానము కలవాడు మంచి సిద్ధిని పొందును. త్రైలోక్య, - మోహన మంత్రము కూడ విషమును తొలగించును. "ఇంశ్రీం, హీం హ్రూం త్రైలోక్య మోహనాయ విష్ణవే నమః” యనునది మంత్రము. "ఓ హం మొదలు నచూమ్యహమ్ చరకును వున్న మూలోక అనుష్టుభనృసింహ మంత్రముచేత కూడ విషవ్యాధి తొలగును, ఈ పంచాంగ మంత్రము సర్వార్థ సాధకిము. ద్వాదశాక్షరి, ఆష్టాక్షరిలు కూడ విషవ్యాధిని తొలగించును. “కుబ్జికా, త్రిపురా, గౌరి, చంద్రికా విషహారిణీ” యను ప్రసాద మంత్రము విషమును తొలగించి ఆయురారోగ్యమును వృద్ధి పొందించును, సూర్య వినాయక మంత్రములు రుద్రమంత్రములన్నియు కూడ విషము తొలగించును.
అగ్నిమహాపురాణమన పంచాంగ రుద్రేణదష్ట చికిత్సయను రెండువందల తొంబది ఆరవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 296 of the Agni Purāṇa is as follows:
Treatment of snakebite through the Pañcāṅga-Rudra — the five-limbed worship of Rudra — is presented. The five aṅgas of the Rudra mantra-system are: the Śiva-saṃkalpa Sūkta as the hṛdaya, the Puruṣa Sūkta as the śiras, "Ādbhyaḥ Saṃbhūtaḥ" as the śikhā, "Āśuḥ Śiṣānaḥ" as the kavacha, and the Śata-Rudrīya as the astra. The Veda citations for each aṅga — their ṛṣi, chandas, and devatā — are detailed. Additional mantras such as the Trailokya-mohana mantra "Iṃ Śrīṃ Hrīṃ Hrūṃ Trailokya-mohanāya Viṣṇave namaḥ" and the Narasiṃha-anūṣṭubh are also prescribed for neutralizing venom. The dvādaśākṣara and aṣṭākṣara mantras of Viṣṇu are declared equally effective.