అగ్ని మహా పురాణము

303 - అథాంగాక్షరార్చనమ్

అగ్ని దేవుడు చెప్పెను. చంద్రుడు జన్మ నక్షత్రము నందును సూర్యుడు సప్తమ రాశి యందున వున్న చో యది పౌష్ణ కాలము. అపుడు శ్వాసను పరీక్షించ వలయును. ఎవని కంఠము ఓష్ఠములు స్థానము నుండి చలించినవో నాసిక వక్ర మైనదో జిహ్వ నల్ల పడినదో అతడు ఏడు దినములకు మించి జీవించడు. తార (ఓం) మేష (న) విష (మ) దంతీ (ఓ) దీర్ఘ స్వర యుక్త (న, ర, లు) య నాలు రసము (య) ఇది మహావిష్ణువు యొక్క అష్టాక్షర మంత్రము (ఓం నమో నారాయణాయ "క్రుద్ధోల్కాయ" మహోల్కాయ “వీరోల్కాయ" "ద్యుల్కాయ" సహస్రోల్కాయ" అను మంత్రములతో హృదయ శిరః శిఖా భుజద్వయ సకల దిగ్భాగము లందు న్యా సము చేయవలయును. కనిష్ఠ మొదలు కనిష్ఠ వరకు ఎనిమిది వ్రేళ్ళ పర్వము లందును అష్టాక్షర మంత్రము యొక్క ఎనిమిది ఆక్షరమును ఒక్కొక్క దానిని ప్రణవము "నమః"తో సంపుటితము చేసి అంగుష్టాగ్ర భాగముచే క్రమముగ న్యాసము చేయవలయును. తర్జని యందు మధ్యమాయుక్త మగు ఆగష్టము నందు కరతలము నందు మరల అంగుష్ఠము నందు ప్రణవ న్యాసమునకు ఉత్తార మని పేరు. అందుచే వెనుక చెప్పిన న్యాసము చేసిన పిమ్మట బీజోత్తర న్యాసము చేయవలయును. ఈ ముత్రము నందలి మొదటి ఐదు అక్షరముల వర్ణ ములు వర సగ రక్త గౌర, ధూమ హరిత, సువర్ణ రూపములు. చివరి మూడు వర్ణముల రంగు శ్వేతము. వర్ణములను ఈ రూపములలో భావన చేసి క్రమముగా హృదయము ముఖ నేత్ర శీర్ష చరణములు, గుహ్య హస్తాదు లందు వ్యాసము చేయ వలయును. హ సము లందును, దేహము నందును బీజ న్యాసము చేసి మరల అంగన్యాసము చేయవలయును. తన శరీ రము నందు చేసినట్లే దేవ విగ్రహము నందు కూడ కరన్యాసము తప్ప ఇతర వ్యాసము చేయవలయును. దేవతా విగ్ర హము యొక్క హృదయాద్యంగము లందు న్యాసము చేసిన వర్ణములను గంధ పుష్పములతో పూజించవలయును. దేవ పీక ముపై ధర్మాలను అగ్న్యాదులను. ఆధర్మాదులను వాటి వాటి స్థానమున న్యాసము చేయవలయును. పిదప దానిపై కమ లము కూడ న్యాసము చేయవలయును. ఆ పీకము పై ననే కమల దళములు, కేసరము కింజల్కన్యాపి, సూర్య మండల చంద్ర మండల, ఆగ్ని ముడలములు వేరువేరుగ, క్రమముగా న్యాసము చేయవలయును. అచట సత్త్వాది గుణత్రయమును కేసరముల పై నున్న విమలా - ఉత్కరిణీ - జ్ఞాన - క్రియా - యోగ - బ్రహ్వి - సత్యా - ఈశాన - యను ఎనీ మిది శక్తులను భావన చేయవలయును. ఈ ఎనిమిది శక్తును ఎనిమిది దిక్కులం నుండును. తొమ్మిదవదగు అనుగ్రహ శక్తి మధ్య యందు ఎడును. పాద ఆర్ఘ; ఆనమయ బర ఆకారము 2 అనునవి ఐదు ఉపచారములు. వీటిని నన్నింటిని మూల మంత్రముతో సమర్పించవలెను. పీకము యొక్క పూర్వాది దిక్కుల యందు వాసుదేవాది మూర్తి చతు షయమును ఆగ్నేయం విదిక్కుల యందు క్రమముగా శ్రీ సరస్వతీ రతి, కాంతులను పూజించవలెను.ఇట్లే దిక్కు లందు శంఖ చక్ర గదా పద్మములను విదిక్కు లందు ముసల ఖడ్గ కార్జ్గ వనమాలలను పూజించవలెను. మండలము వెలుపల గరుత్మంతుని పూజించి నారాయణుని ఎదుట నున్న విష్వక్సేనుని మధ్య భాగమున సోమేశని, ఆవరణము వెలుపల ఇంద్రాది పరిచారక వర్గముతో శ్రీ మహా విష్ణువును పూజించిన సాధకునకు సర్వ ఫలములు సిద్ధించును.

ఆగ్ని మహా పురాణమున ఆఁగాక్షర పూజా విధి యను మూడు వందల మూడవ అధ్యాయము సమాప్తము.