హయగ్రీవుడు చెప్పెను : ఇపుడు చక్రాంకిత కాలగ్రామముల పూజావిధానమును చెప్పుచున్నాను. ఇది సిద్దిప్రద మైనది. శ్రీహరి పూజ కామ్య, అకామ్య, కామ్యాకామ్య అని మూడు విధములు. మత్స్యాది పంచ విగ్రహముల పూజ కామ్యముగాని, ఉథయాత్మికగాని కావచ్చును, వెనుక చెప్పిన చక్రములతో ప్రకాశించు వారాహ వామన - నృసింహుల హజను ముక్తి కొరకు చేయవలెను, ఇపుడు మూడు విధములైన శాలగ్రామ పూజను గూర్చి వినుము. వీటిలో నిష్ఫల పూజ ఉత్తమము: సవలపూజ కనిష్ఠము; మూర్తిపూజ మధ్యమము, చతురస్ర మండపము పైనున్న కమలమునందు పూజా విధి ఈ విధముగ ఉండును– హృదయమునందు ప్రణవన్యాసము చేయుచు షడంగన్యాసము చేయవలెను. పిమ్మట కరన్యాసము, వ్యాపకన్యాసము చేసి మూడు ముద్రలను చూపవలెను. పిమ్మట చక్రమునకు. బేట, తూర్పున గురువును పూజించవలేమ. పశ్చిమమున గణమును, వాయవ్యమున ధాతను, నైరృతి యందు - విధాతను పూజింపవలెను. దక్షిణోత్తరములయందు వరుసగా కర్తను, హర్తను పూజింపవలెను. ఈశాన్యమున విష్వక్సేనుని, ఆగ్నేయమున క్షేత్రపాలుని పూజింపవలెను. పిమ్మట, పూర్వాది దిక్కులందు ఋగ్వేదాది - వేదచతుష్టయమును పూజించి, ఆధారశక్తిని, అనంతున్ని, పృథివిని, యోగపీఠమును, పద్మమును, సూర్యమండలమును, చంద్రమండలమును, బ్రహ్మాత్మక వహ్ని మండలమును పూజించి, ద్వాదశాక్షరిచే ఆసనముపై శిలాస్తాపనముచేసి పూజింపవలెను. పిదప - మూల మంత్రమును, విభజించియు, సంపూర్ణ మంత్రముచేతను క్రమపూర్వకముగా పూజింపవలెను. పిదప- ప్రణవముచే పూజించి మూడు - ముద్రలు చూపవలెను:- కష్వక్సేన - చక్ర - క్షేత్రపాలుల ముద్రలు చూపవలెను.
ఇంతవరకును చెప్పినది శాలగ్రామ మధ్యమ పూజ. ఇపుడు నిష్ఫలపూజ చెప్పబడుచున్నది. వెనకటి వలెనే షోడశదలకమలముతో కూడిన మండలము చేయవలెను. దాని పై శంఖ - చక్ర - గదా - ఖడ్గములను, గురువు మొదలగువారిని వెనుక చెప్పినట్లుగనే పూజింపవలెను. పూర్వోత్తర దిశలయందు. వరుసగా ధనుర్బాణములను పూజింపవలెను. ప్రణవముచే ఆసనము సమర్పించి, ద్వాదశాక్షరిచే శిలాన్యాసము చేయవలెను. ఇపుడు మూడవదైన కనిష్ఠ పూజను (సఫల పూజను) చెప్పుచున్నాను, వినుము. అష్టదల కమలముపై వెనుక టివలే గుర్వాదిపూజ చేయవలెను - పిదప అష్టాక్షర మంత్రముచే ఆసనము సమర్పించి, ఆ మంత్రముచేతను, శిలను స్థాపించవలెను.
ఆగ్ని మహాపురాణమునందు శాలగ్రామ పూజాకథనమను నలుబది ఏడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 47 of the Agni Purāṇa is as follows:
This chapter describes the construction and consecration of the maṇḍapa — the pillared pavilion or hall attached to the temple. The dimensions of the maṇḍapa and its relationship to the main shrine, the number and arrangement of pillars, and the height of the roof are specified according to the proportional canon. Different types of maṇḍapa — the ranga-maṇḍapa for festivals, the snāna-maṇḍapa for ritual bathing, the yajña-maṇḍapa for fire sacrifices, and the sabhā-maṇḍapa for assemblies — and their specific dimensional requirements are distinguished. The ritual consecration of the maṇḍapa, including the installation of Vāstu-puruṣa in the foundation, the placement of pots in the eight directions, and the final recitation of Vedic mantras, are described. The maṇḍapa is understood as the sacred space where devotees assemble in the presence of Bhagavān.