మహేశ్వరుడు పలికెను : పూజానంతరము, ఉపాసకుడు శరీరమును వస్త్రాదులతో ఆచ్ఛాదించుకొని, అర్ఘ్య పాత్రను చేత ధరించి, ఆగ్ని శాలలోనికి వెళ్ళి దివ్యదృష్టిచే యజ్ఞమున కావశ్యకము లగు సమస్త ఉపకరణములను సమ కూర్చుకొనవలెను. ఉత్తరాభిముఖుడై అగ్ని కుండమును చూచి కుశలతో దానిని ప్రోక్షించి మార్జనము చేయవలెను. తాడనము (మార్జనము) అస్త్రమంత్రముతో (ఫట్) చేయవలెను. అభ్యు క్షణము కవచ ముత్రముతో (హం) చేయవలెను. కవచమంత్రముచే (హుం) దానికి అభిషేకము, శరమంత్రముచే (ఫట్) భూకుట్టనము చేయవలెను. నంమార్జనము, ఉప లేపనము, కలాత్మ కరూపకల్పన త్రిసూత్రీపరిధానము, అర్చనము ఇవన్నియు కవచమంత్రముతోడనే చేయవలెను. కుండము
సూత్రము) కట్టినట్లు భావన చేయవలెను. సద్యోజాతమంత్రముతో, గర్భాధానముకొరకై, అగ్ని పూజనము చేసి, హృదయ మంత్రముతో మూడు ఆహుతు లివ్వవలెను. మూడవమాసమున జరుగు పుంసవనసంస్కారమును భావన చేసి, ఆది సిద్దం చుటకై వామదేవమంత్రముతో అగ్ని ని పూజించి “శిర సే స్వాహా” అని పలుకుచు, మూడు హోమములు చేయవలెను, పిమ్మట ఆ అగ్ని పై జలబిందువును చల్లవలెను. పిమ్మట ఆరవ మాసమున జరుగు సీమంతోన్నయమును భావనచేసి అఘోర మంత్రముతో అగ్నిని పూజించి, “శిఖాయై వషట్” అని ఉచ్చరించుచు మూడు హోమములు చేసి, ఆ మంత్రముతోడనే ముఖాద్యంగ కల్పన చేయవలెను. ముఖోదాటనమును ప్రకటికరణమును చేయవలెను. పిమ్మట వెనుకటి వలెనే పదవ మాస మున జయగు జాతకర్మ-నరకర్మలను భావించుచు తత్పురుషమంత్రముతో దర్భాదులతో అగ్ని ని పూజించి, జ్వలింపచేసి, గర్భమలమును తొలగించుటకై స్నానము చేయించి, దేవి హస్తమునందు సువర్ల బంధనము చేసి నట్లు భావన చేసి, హృదయ మంత్రముతో పూజించవలెను. సూతకము వెంటనే నివర్తించుటకై అస్త్రమంత్రముతో ఆభిమంత్రించిన జలముతో అభిషేకము చేయవలెను. చేయవలెను.
కుండమును, బైటనుండి, అస్త్రమంత్రము చదువుచు కుశ లతో మార్జనము చేయవలెను. “హుం” అని ఉచ్చరించుచు. ఉదకముతో తడపవలెను. కుండము వెలుపల నున్న మేఖలలపై, అస్త్రమంత్రముతో, ఉత్తర-దక్షిణదిక్కులందు పూర్వా గ్రముగాను, పూర్వపశ్చిమములందు ఉత్తరాగ్రముగాను కుశ లు పరవవలెను. వాటిపై హృదయమంత్రముతో పరిధివిష్టరము స్థాపింపపలెను. సిమ్మట సద్యోజాతాది ముఖపంచకమునకు సంబంధించిన మంత్రములు చదువుచు, ఆశ్రమంత్ర ముచ్చరిం చుచు, నాలచ్చేదనము కొరకై, ఐదు సమిధల మూలములను ఆజ్యమునందు మంచి హోమము చేయవలెను. పిమ్మట సర్వాక్ష లాదులతో బ్రహ్మ-శివ– విష్ణు అనంతులను వారి నామములకు “నము” చేర్చుచు పూజించవలెను. కుండమునకు నాలు వై పులందును పరచిన ఎనిమిది ఆసనములపై పూర్వాదిదిక్కులందు వరుసగ ఇంద్రాది దిక్పాలకులను ఆవాహన చేసి, స్థాపన
ప్రాదేశ (చాపిన బొటనవేలు చివని నుంచి చూపుడు వేలు చివర వరకు ఉన్న పొడవు ప్రాదేశము) ప్రమాణము గల రెండు కుశలను అంగుష్ఠ-అనామికాంగుళులతో పట్టుకొని, వాటితో, అస్త్రమంత్రో (ఫట్) చ్ఛారణము చేయుచు, నేతిని, అగ్ని వైపు కదపవలెను. హృదయమంత్రము (నమః) ఉచ్చరించుచు, చేతిలోని దర్భను కాల్చి, దానిని ‘ఫట్'తో అగ్ని చే పవిత్రము చేయవలెను. మండుతున్న కుశ తో దానికి హారతి ఇచ్చి, మరొక కుశతో దానిని కాల్చవలెను. మండిన కుశను అస్త్రమంత్రముతో అగ్నిలో పడవేయవలెను. పిమ్మట, ముడి వేసిన, ప్రాదేశ ప్రమాణము గల కుశను చేతిలో ఉంచవలెను. ఘృతములో రెండు పక్షములు, ఇడాది నాడి త్రయము ఉన్నట్లు భావన చేయవలెను. ఇడ మొదలగు మూడు భాగి ముల నుండి క్రమముగ ధ్రువముతో ఘృతము గ్రహించి హోమము చేయవలెను. 'స్వా' అని ఉచ్చరించి సువములోని ఆజ్యము అగ్నిలో వేయవలెను. “హా' ఉచ్చరించుచు, హోమము చేయగా మిగిలిన ఘృతమును, వేరుగా ఉంచిన పాత్రలో ఉంచ వలెను. ఇడాథాగము నుండి ఆజ్యము గ్రహించి “ఓం హం ఆగ్నయే స్వాహా” అను మంత్రము నుచ్చరించుచు హోమము చేసి, హుత శేషమును ఒక పాత్రలో ఉంచవలెను. పింగలా భాగము నుండి ఆజ్యము గ్రహించి “ఓం హం సోమాయ స్వాహా” అని ఉచ్చరించుచు హోమము చేసి, హుత శేషమును ఒక పాత్రలో ఉంచవలెను. సుషుమ్లానాడి భాగము నుండి ఆజ్యము గ్రహించి “ఓం హాం అన్నీ షోమాభ్యాం స్వాహా” అని ఉచ్చరించుచు సువముతో హోమము చేసి, హుత శేషమును ఒక పాత్రలో ఉంచుకొనవలెను. పిమ్మట బాలకు డైన అగ్ని యొక్క ముఖమునం దున్న నేత్రత్రయస్థానమున మూడు నేత్రముల ఉద్ఘాటనము చేయుటకై, మృతపూర్ణ మగు స్రువముతో “ఓం హామగ్నయే స్విష్టకృతే స్వాహా” అను మంత్రము నుచ్చరించుచు నాల్గవ ఆహుతి ఇవ్వవలను. “ఓం హం హృదయాయ నమః” ఇత్యాద్యంగ మంత్రములు ఆరును ఉచ్చ రించుచు ఆజ్యమును అభిమంత్రించి, ధేనుముద్రతో మేల్కొల్పవలేను. కవచమంత్రముచే (హుం) ఆచ్ఛాదించి, శర మంత్రముచే ఘృతబిందూత్తేపణము చేసి, ఆభ్యుక్షణశోధనములు చేయవలెను. శివస్వరూపుడగు అగ్ని యొక్క ఐదు ముఖములకు అభిషరహోమము, అనుసంధానహోమము, ముఖముల ఏకీక రణమునకై చేయు హోమమును చేయవలెను. “ఓం హాం సద్యోజాతాయ స్వాహా, ఓం హాం వామదేవాయ స్వాహా, ఓం హాం అఘోరాయ స్వాహా, ఓం హాం తత్పురుషాయ స్వాహా, ఓం హాం ఈశానాయ స్వాహా” ఆమ ఐదు మంత్రములచే, ఐదు ముఖములకొరకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆజ్యాహుతి చేసి, ఆ ముఖములను అభిఘారము చేసిన ఆజ్యముతో ఆప్లావితము చేయవలెను. ఇది ముఖాభిషరహోమము. పిమ్మట రెండేసి ముఖములకు ఒక ఆహుతి ఇవ్వవలెను. ఇది ముఖానుసంధానహోమము. దానిని “ఓం హాం సద్యోజాత వామదేవాభ్యాం స్వాహా, ఓం హాం వామదేవా ఘోరాభ్యాం స్వాహా, ఓం హాం అఘోరతత్పురుషాభ్యాం స్వాహా, ఓం హాం తత్పురుషేశానాభ్యాం స్వాహా” అను మంత్రములతో చేయవలెను.
కర్పూర-చందన-కేసర-కస్తూరీ-యక్షకర్దమములు కలయ ప్రమాణమున (శనగగింజంత) ఉండవలెను. గుగ్గులు రేగి గింజంత ఉంచడవలెను. కందముల ఎనిమిదవ వంతుతో ఒక ఆహుతి చేయవలెను. ఈ విధముగ ఆలోచించి, యథావిధిగ ఆహుతుల నీయవలెను. ఈ విధముగ ప్రణవముతోను, బీజాక్షరములతోను హోమము సుసంపన్న మగు నటుల చేయవలెను. పిమ్మట ఘృతముతో నింపిన సుక్కు పైన అధోముఖ మగు ధ్రువము ఉంచి, సుక్కునకు చివర పుష్పము లుంచవలెను. రెండు చేతులతోడను ఆ రెండింటిని, శంఖముద్రతో పట్టుకొనవలెను. శరీరము పై భాగము ఉన్నతమగు నట్లు చేసి లేచి పాదములు సమముగా ఉంచి నిలచి, సుక్సువముల మూలభాగములను నాభికి ఆన్చి, దృష్టిని స్థిరముగ నిలిపి, భావనచే బ్రహ్మాదికారణములను విడచుచు, సుషుమ్నా నాడీ మార్గమున బైటకు వచ్చి పైన నిలబడవలెను. సుక్ర్సువముల మూలధాగి ములను నాభినుండి పైకి లేపి ఎడమ స్తనమువైపు తీసికొని రావలెను. శరీరము చేతన, మనస్సు చేతను ఆలస్యమును రూపము చేసి, ల్ షట్ , వరకును మూలమంత్రములు (ఓం మః శివాయ వోషట్) మెల్లగ చదువుచు ఆ మృతమును యవ పలె సన్ననైన ధారతో హోమము చేయవలెను. పిదప, ఆచమన - చందన - తాంబూలాదులా సమర్పించి భక్తి భావముతో శివుని ఐశ్వర్యమునకు సాష్టాంగవందనము చేసి మరల అగ్నిపూజ చేపి, 'ఓం హ అస్త్రాయ ఫట్” అని ఉచ్చరించుచు సంహారముద్రచే శంబరాహరణము చేసి, భగవంతుడా? నా ఆపరాధములను క్షమింపుము, అని ఇష్టదేవతను ప్రార్థించి హృదయ మంత్ర ముచ్చరించుచు పూరక ప్రాణాయామముచే, శ్రద్దతో, తేజశాలు లగు ఆ సంధులను తన హృదయ కమలమునందు నిలుపవలెను. వండిన పదార్థములలోని అగ్రభాగము తీసి, కుండ సమీప మున అగ్ని కోణమునందు, రెండు మండలములు చేసి ఒక దానిలో అంతర్బలి ఈయవలెను. రెండవదానియందు బాహ్య. బలి ఈయవలెను. ప్రథమమండలమునందు, పూర్వదిక్కున, ఓం హం రుద్రేభ్యః స్వాహా” అను మంత్రముతో రుద్రు లకు బలి ఈయవలెను. రణమున “ఓం హాం మాతృభ్యః స్వాహా” అను మంత్రముతో మాతృక లకును, పశ్చిమ మున ఓం హం గణేభ్యః స్వాహా, తేభ్యోఒయం బలిరస్తు అను మంత్రముతో గణములకును, ఉత్తరమున ఓం హాం - యజేభ్యః స్వాహా, తేభ్యోయం బలిరస్తు అను మంత్రముతో యక్షులకును, ఈశాన్యమునందు ఓం హాం గ్ర హేభ్యః
Summary of chapter 75 of the Agni Purāṇa is as follows:
This chapter describes the installation of the sacred fire (agni-sthāpana) and the auxiliary fire offerings (pūjāṅga-homa) that form part of the complete Śaiva worship. The fire is consecrated through a visualization in which it is identified with Śiva's own five-faced form: the eastern face (Sadyojāta) is the fire's eastern face, and so on around the kuṇḍa. The kara-nyāsa and aṅga-nyāsa mantras specifically for the consecrated fire are given. The abhiṣara-homa (internal offering) and anusandhāna-homa (connecting offering) are described as internal ritual acts in which the ācārya mentally burns his own body of karma in the divine fire. The antarbali (inner offering to the interior deities) and the bāhya-bali (outer offering of food to the Rudras, Mātṛkā-s, Graha-s, and Yakṣa-s in all eight directions) complete the chapter.