దేవాలయాదులలో అర్చనాదులు చేయుటలో ఏ వేన లోపములు వచ్చినచో అట్టిలోపములు చేసినవాడు ప్రాయ శ్చిత్తము చేయవలెను. పూజాలోపము కలిగినచో నూట ఎనిమిది ప్యయములు జపము చేసి, రెట్టింపు పూజ చేయవలెమ. పంచోపనిషన్మంత్రములతో హోమము చేసి బ్రాహ్మణ భోజనము చేయించవలెను. సూతిక కలవారుగాని, అంత్యజులు గానీ రజస్వలగాని దేవుని స్పృశించినవో నూరు పర్యాయములు జపము చేసి పంచోపనిషత్మంత్రములతో పూజ రెట్టింపు అభిషేకము చేయవలెను. హోమమునందు లోపమున్న చో బ్రాహ్మణభోజనము. హోమస్నానము, అర్చనము చేయవలెను. హోమద్రవ్యము ఎలుకలు మొదలగు వాటిచే భక్షింపబడినను, కీటకములతో కూడినను ఆ భాగమును త్యజించి, మిగిలిన దానిని జలముతో ప్రోక్షించి దేవాదిపూజ చేయవలెను. అంకురార్పణము భ్నినైనను, ఛగ్నమైళను. దానిని పరిత్యజించ వలెను. ఆ అంకురార్పణ పొత అస్పృశ్యులచే స్పృశింపబడినచో దానిని మరొక పాత్రలో నుంచి సమర్పించవలేను. పూజాకాలమునందు, దేవమానుషవిఘ్నములను తొలగించుటకును, మంత్రద్ర వ్యాది వ్యత్యాసము కలిగినపుడును మూల మంత్రమును జపించి మరల జపము చేయవలెను. దేవాలయమునంపలి కుంభము నష్ట మైనపుడు శతవారజపము దేవతా ప్రతిమ చేతినుండి జారి పడి పోయిన ఉపవాసము చేసి నూరు హోమములు చేసినచో శుభసుగును. పాపము చేసి పశ్చా త్తాపము చెందువానికి హరిస్మరణమే పరమ ప్రాయశ్చిత్తము. చాంద్రాయణము, పరాకము, ప్రాజాపత్యము పాపములను తొల గించును. సూర్య- శివ-శక్తి -విష్ణు మంత్రముల జపము కూడ పాపములను నశింపచేయును. గాయత్రీ-పణవ-స్తోత. మంతముల జపము కూడ పాపవినాశ కము. సూర్య-శివ-శక్తి -విష్ణువుల క కారముతో ప్రారంభమై రా బీజముతో కూడి నవియు రాది-ఆది-రాంతమంతములును ఒక్కొకటి కోట్యధిక ఫలము నిచ్చును. ఓం హ్రీం లతో పారంభమైన నమః అంతమునందుండు చతుర్థ్యంత ముంతములు సర్వకామపదములు.
నృసింహద్వాడశాక్షరీ- అష్టాక్షరీ మంత్రముల జపము పాపసమూహమును నశింపచేయును. అగ్ని పురాణ మును చది వినను, విన్నను సకలపాపములు తొలగిపోవును. ద్వివిద్యారూపుడైన విష్ణువు అగ్ని రూపుడు గాను పరమాత్మ గాను, దేవతల ముఖముగను సర్వవేదములందును గానము చేయబడును. ప్రవృత్తి మార్గమునందును, నివృత్తి మార్గము నందును పూజించబడినవాడైన విష్ణువు యొక్క హవనము ధ్యానము ఆర్చనము జపము స్తుతి నమస్కారము శరీరము నందలి సకల పాపములను తొలగించును. పదిధములైన స్వర్ణదాకములు ద్వాదశ విధధాన దానములు తులా పురుష దానము మొదలైన షోడశ మహాదానములు అన్నదానములు ఇవి సర్వపాపములను తొలగించును. తిథివారనక్షత. సంకమణయోగ-మన్వంతరారంభాది కాలములందు సూర్య-శివ-శక్తి- శ్రీమహావిష్ణువంతాదులు పాపనాశ కములు. గంగ, గయ, ప్రయాగ కాశీ, అయోధ్య, అవంతి, కురుక్షేతము, పుష్కరము, నైమిషము, పురుషోత్తముడు, సాలగ్రామము ప్రభాసము, ఈ తీర్థములన్నియు సర్వపాప వినాశక ములు. నేనే జ్యోతిరూపమైన పరబ్రహ్మను అను ధ్యానము సకలపాప వినాశకము. బ్రహ్మ పురాణము ఆగ్ని పురాణము, బహ్మ-విష్ణుమహేశ్వరుల, అవతారము: పూజ దేవతా ప్రతిష్ట, ప్రతి మాదు, జ్యోతిక శాస్త్ర పురాణములు, స్మృతులు, తపస్సు, వతములు, అర్థశాస్త్రము, సృష్టితత్వము, ఆయుర్వేదధనుర్వేదములు, శిక్ష, ఛందస్సు, వ్యాకరణము, నిరుక్తము అభిధానము కల్పము, న్యాయుము, మీమాంస ఇంకా ఇతర మైన అన్ని విద్యలను హరియే ఒకే విష్ణువు వ్యక్తావ్యక్తరూపములలో నున్నాడు. అతనివలననే ఈ జగము జనించి, ఆతని యందే ఉన్నది అని తెలిసికొనిన దానిని చూడగ నే పాపములన్ని “ము నశించును. శ్రీమహావిష్ణువే అష్టాదశ విద్యారూపుడు, సూక్ష్మ-స్థూల స్వరూపుడు అపరుడు జ్యోతీరూపుడు అక్షర పర బ్రహ్మము, నిర్మలుడు.
అగ్ని మహాపురాణమునందు ప్రాయశ్చిత్త నిరూపణమను నూటడెబ్బది నాల్గవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 174 of the Agni Mahā Purana is as follows:
Agni describes expiations for specific lapses and accidents in temple worship and ritual performance. If the worshipper misses the daily pūjā of the installed deity, 108 repetitions of the mūla-mantra and a double pūjā the following day are required; if an impure person touches the sacred image, a purification homa of 100 āhutis with the pañcopaniṣad-mantra must follow. Should the deity's image fall from the worshipper's hands, an upavāsa combined with 100 fire oblations is prescribed; if a sacred kumbha breaks inside the temple, one hundred repetitions of the nāma-japa restore ritual integrity. The chapter concludes with praise of the Agni Purāṇa as the sovereign text for removing pāpa, and identifies Viṣṇu as the essence of all eighteen vidyās including jyotiṣa, purāṇas, smṛtis, dharmaśāstra, and the Vedāṅgas.