పుష్కరుడు చెప్పెను : ప్రతిదినము ప్రాతఃకాలమునందు బ్రాహ్మముహూర్తమునందే విష్ణ్వాది దేవతలను స్మరించ వలెను. పగలు మలమూత్రత్యాగి ము ఉత్తరాభిముఖుడై చేయవలెను. రాత్రియందు దక్షిణాభిముఖుడై, సంధ్యలందు పగటి యందు వలె చేయవలెను. మార్గాదులందును, జలములందును, సందులు మొదలగువాటియందును ఎన్నడును మలత్యాగము చేయగూడదు. తృణముచే భూమి కప్పి దాని పై మలబ్యాగము చేయవలెను. మట్టితో హస్తపాదాది శుద్ధి చేయవలెను, స్నానము-నిత్యము, నైమిత్తిక ము, కామ్యము, క్రీయాంగము, మలకర్షణము, క్రియాన్ని నము అని ఆరు విధములు. స్నానముచేయనివాని కర్మ లన్నియునిష్ఫలములు. ఆందుచే ప్రతిదినము ప్రాతఃకాలమున స్నానము చేయవలెను. కూపము నుండి తోడిన జలముకంటె భూమిస్థజలము పవిత్రము, దానికంటే సెలయేటిలోని నీరు, దానికంటె తటాకోడక ము, దాని కంటే నదీజలము, దానికంటే తీర్ధోదకము పవిత్రము. గంగాజలము అన్నిటికంటెను పవిత్రము. నీటిలో మునిగి శరీరము నందలి మలమును కడిగివేసుకొని, ఆచమనము చేసి, “హిరణ్యవర్ణా' ఇత్యాదిఋ క్షయముతోను, “శం నో దేవీర భిష్టయే” అను మంత్రముతోను, “ఆపోహిష్ణా', ఇత్యాదిమంత్రములు మూడింటితోను, “ఇదమామ” ఇత్యాదిమంత్రముతోను మార్జనము చేసికొనవలెను. పిదప జలాశయమునందు మునిగి, లోపలనే, అఘమర్షణసూక్తము గాని ద్రుపదాదివ” అను మంత్రముగాని, 'యుజ్ఞతేమనః' ఇత్యాదిసూక్తమును గాని సహస్రశీర్షా' ఇత్యాది సూక్తమును గాని జపించవలెను. విశేషించి గాయత్రీ జపము ఉచితము. అఘమర్షణసూక్తమునందు దేవత భావవృత్తము, ఋషి ఆమమర్షణుడు. ఛందస్సు అనుష్టుప్. తద్ద్వారా భావవృత్తు డగు హరిని స్మరించవలెను. బట్టలు పిండుచు దేవతాపితృతర్పణము చేయవలెను. పిదప పురుష సూక్తముతో జలాంజలి సమర్పించి, పిదప ఆగ్ని హోత్రము చేసి, యథాశక్తి దానము నిచ్చి, యోగ క్షేమార్థమై పర మేశ్వ రుని శరణమందవలెను. ఆసనము, శయ్య, వాహనము, స్త్రీ, సంతానము, కమండలము ఇవి తన వై నపుడే పవిత్రములు. ఇతరుల వైనచో తనకు ఆది అపవిత్రములు.
బరువు మోయు చున్న నానికిని, గర్భిణీ స్త్రీకిని, పెద్దలకును మార్గము యవలెను. ఉదయించుచున్న సూర్యుని, అస్తమించుచున్న సూర్యుని చూడరాదు. జలమునందు సూర్యప్రతిబింబమును చూడకూడదు. నగ్న స్త్రీని, కూపములోనికిని హత్యాస్థానమును, పాపాత్ములను చూడకూడదు. దూది, ఎముకలు, భస్మము, జుగుప్సాకరములగు వస్తువులు దాటకూడదు. ఇతరుల అంతఃపురములోనికి, కోశాగారములోనికిని ప్రవేశింపరాదు. ఇతరులకు దూతగా పని చేయరారు. విరిగిన నావ, చెట్టు, పర్వతము ఎక్కరాదు. ధనము, గృహము, శాస్త్రములు వీటి విషయమున కుతూహలముతో నుండవలెను. (ప్రేళ్లతో) మట్టిబెడ్డలు నలగకొట్టువాడు, తృణములు త్రుంచువాడు, గోళ్లు కొరుకువాడు నశింతురు. ముఖాదుల ద్వారా వాద్య శబ్దము పుట్టించరాదు. రాత్రి దీపము లేకుండ ఎచటికి పోరాదు. ద్వారము తప్ప మరొక మార్గమున ఇంట ప్రవేశింపరాదు. ముఖము రంగు మార్చుకొనగూడదు. సంభాషణమున ఎవరికిని బాధ కలిగించరాదు. తన వస్త్రమును ఇతరుల వస్త్రముతో మార్పు చేసికొనరాదు. ఎల్లపుడు భద్రము, భద్రము అని అనుచుండవలెను. ఇతరులకు నష్టము కలిగించు మాట ఎన్నడును పలకరాదు. పలాశాసనమును ఉపయోగించరాదు. దేవతాదుల నీడనుండి దూరముగ ఉండవలెమ. ఇద్దరు పూజ్యు లగువారి మధ్యనుండి వెళ్లకూడదు. ఎంగిలివాడుగా ఉండి నక్షత్రాదులను చూడరాదు. ఒక నదిలో నున్నపుడు మరొక నది పేరుపలుకరాదు. రెండు చేతులతో గోకుకొనరాదు. ఏదైన నదిని సమీపించునపుడు దేవతాపితృతర్పణము చేయకుండ దానిని దాటరాదు. మలాదులను జలములో పడవేయరాదు. నగ్నుడై స్నానము చేయగూడదు. యోగ క్షేమముల కొరకై పరమాత్ముని శరణుపొందవలెను. శరీరము పైనున్న మాలను తన చేతులతో తీసివేయగూడదు. గాడిద దుమ్ము నండి దూరముగా ఉండవలెను. తనకంటే తక్కువ స్థితిలో నున్న వారిని చూచి నవ్వకూడదు. వారితో కలసి ఒక స్టామున నివసింప గూడడు. వైద్యుడు, రాజు, నతి లేని దేశమునందు నివసించగూడదు. ప్లేచ్చులు, స్త్రీలు, ఆనేకులు అతిపరులుగా ఉన్న ఉక ముందు నివసించరాద. రజస్వలలతోను, పతితాతలతోను సంభాషణ చేయకూడదు. సతా విష్ణుస్మరణము చేయవలెను. ముఖమును అచ్చాదించుకొనకుండ సవ్వుట, ఆవలించుట, తుమ్ముట చేయరాదు. తెలివైనవాడు స్వామియొక్క అవమానమును, తన అవమానమును రహస్యముగా ఉంచుకొనవలెను. ఇంద్రియములు చెప్పి నట్లు చేయరాదు. మలమూత్రముల వేగము ఆపుకొనరాదు. పరశూమా! చిన్న రోగమును, చిన్న శత్రువును గూడ ఉపేక్షించరాదు. మార్గము దాటి వచ్చినపిమ్మట తప్పక ఆచమనము చేయవలెను. జలాగ్నులను ఒకేసారి ధరింపదు. కల్యాణమయు డగు పూజ్యుని విషయమున ఎన్నడును కోపముతో హుంకరింపగూడదు. పాదమును పాదముతో నొక్కకూడదు. ప్రత్యక్ష ముగా గాని, పరోక్షముగా గాని ఎవ్వరిని నిందింపరాదు. వేద . శాస్త్ర - రాజ - ఋషి - దేవతలను నిందింపరాదు. శ్రీల:షయమున ఈర్ష్య యుండకూడదు. ఎన్నడ ను వారిని విశ్వసింపగూడదు. ధర్మమును వినవలెను. దేవతల పై భక్తి చూపవలెను. ప్రతిదినము ధర్మాద్యనుష్ఠానము చేయవలెను. జన్మనక్షత్రదివసమున చంద్రుని, బ్రాహ్మణులను, దేవతాదులను పూజించవలెను. షష్టి - ఆష్టమీ చతుర్ధ శిదివసములందు తైలాభ్యంగస్నానము చేయగూడదు. ఇంటినుంచి దూరముగ పోయి మలమూత్రవిసర్జన చేయవలెను ఉత్తమపురుఘలతో ఎన్నడును విరోధము చేయగూడదు.
అగ్ని మహాపురాణము నందు ఆచారవర్ణన మను నూటఏబదియైదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 155 of the Agni Purāṇa is as follows:
The rules of right conduct (ācāra) governing the daily life of a dvija are described as the foundation of all other dharma. Agni lists the marks of sadācāra: predawn rising (brāhma-muhūrta), ritual bath, sandhyā-vandana, Vedic recitation, pūjā, and avoidance of the ten forbidden acts of mind, speech, and body. The chapter specifies conduct at meals—not eating facing south, not eating alone without offering to deities and guests, and maintaining silence during the meal itself. The statement is made that dharma is established by ācāra, and its destruction begins with the erosion of ācāra.