అగ్ని దేవుడు చెప్పెను : వసిష్ఠా! పూర్వము పరశురాముడు ప్రశ్నింపగా పుష్కరుడు చెప్పిన రాజధర్మములను చెప్పెదను. పుష్కరుడు పలికెను: రామా! నేనుసకలరాజధర్మములనుండి గ్రహించి రాజుయొక్కధర్మములను చెప్పెదను. రాజుదండమును ఉచితరీతిని ఉపయోగించుచు. శత్రువులనున శింపచేసి, ప్రజలనుర క్షించవలెను. “మీరందరును ధర్మమార్గమును అనుసరించి ఉండుడు. నేను మిమ్మలను రక్షించెదను” ఆని ప్రజలకు చెప్పి తనమాట నిలుపుకొనవలెను. రాజు సంవత్సర ఫలమును చెప్పు ఒక్క జ్యోతిక శాస్త్రవేత్త యగు బ్రాహ్మణుని, పురోహితుని వరణము చేయవలెను. సకలరాజకీయ శాస్త్ర నిపు ణులు, ఆత్మజ్ఞానవంతులు అగు మంత్రులను నియమించి సకలగుణసంపన్నరాలగు దేవిని పట్టమహిషినిగా చేయవలెను. రాజ్యభారము వహించిన రాజు ఒక సంవత్సరముగడచిన పిమ్మట ఆభిషేక సంభారములన్నియు సంపాదించి ఉత్సవ పూర్వకముగా రాజ్యాభిషేకము పొందవలెను. రాజ్యము చేయుచున్న రాజు మరణించిన వెంటనే వారసుడు వెంటనే ముహూర్తాది చింతఏమియు చేయక రాజ్యభారము వహించవలెను. రాజు జ్యోతిష్కపురోతాదులద్వారా తిలపర్షపాది సామగ్రిని ఉపయోగించుచు స్నానము చేసి భద్రాసనము ఆలంక రించి రాజ్యమునందుండును. తన విజయమును ఘోషించవలేను. అభయ ఘోషణ చేసి రాజ్యములో నున్న కై దీలను అందరిని బంధవిముక్తులను చేయవలెను. పురోహితునిచే, ఆభిషేకము పొందుటకు పూర్వము, ఇంద్రాదిదేవతా శాంతి చేయించపలెను. అభిషేక దివసమున ఉపవాసము చేసి వేదిపై స్థాపించబడిన అగ్నియందు మంత్రపాఠపూర్వకముగ హోమములు చేయవలెను. విష్ణు - ఇంద్ర - సవితృ - విశ్వదేవ - సోమ దేవతా ఋక్కులను, స్వస్త్యయన - శాంతి ఆయుష్య - అభయదములగు మంత్రములను పఠించవలెను. అగ్నికి దక్షిణమున అపరాజితాదేవిని, అనేక భద్రములు గల సువర్ణ కలశను స్థాపించి చందనపుష్పాదులతో పూజించవలెను. అగ్ని శిఖ కుడివైపు తిరుగుచు, తప్తసువర్ణ కాంతితో రథ - మేఘ ధ్వనులతో సమానమగు ధ్వనిని కలిగించుచు, ధూమ నహితమై, ఉన్నచో, ఆగ్ని దేవుడు అనుకూలుడై హవిస్సును గ్రహించినచో, హోమాగ్ని నుండి ఉత్తమగంధము బయల్వెడ లినచో, మంటలు స్వస్తికాకారమున పై కేగసినచో, అగ్ని స్వచ్చమై ఎత్తుగా లేచినచో, నిప్పునెలసులు లేవకున్నచో అది శుభప్రదము.
: రాజునకు ఆగ్ని కి మధ్యనుండి పిల్లికాని, మృగముకాని, పక్షికాని వెళ్లకూడదు. రాజు మొదట పర్వత శిఖర మృత్తిక తో శిరస్సుకు శుద్ధి చేసుకొనవలెను. పుట్ట మట్టితో చెవులను విష్ణ్వాలయ పరాగముతో ముఖ మును, ఇంద్ర దేవాలయ మృత్తుతో కంఠమును, రాజగృహము వాకిలి యందలి మట్టితో హృదయమును, ఏనుగు దంతములతో త్రవ్విన మట్టితో కుడి చేతిని, ఎద్దు కొమ్ముతో త్రవ్విన మట్టితో ఎడమభుజమును, సరస్సునందలి మృత్తికతో వీపును, నదీద్వయ సంగమ మృత్తికతో ఉదరమును, వది రెండు తటముల మృత్తికతో పార్శ్వములను, వేశ్యాద్వార మృత్తిక తో కటిభాగమును, యజ్ఞశాలా మృత్తికతో తొడలను, గోశాలా మృత్తిక తో మోకాళ్లను, ఆశ్వళలా మృత్తిక తో కళ్లను, రథచక్ర మృత్తికతో పాదములను శుద్ధము చేసికొనవలెను. పిదప పంచగవ్యముతో శిరస్సును శుద్ధి చేసికొనవలెను. పిదప నలుగురు అమాత్యులు భద్రాసనముపై కూర్చున్న రాజునకు కలశోదకముతో అభిషేకము చేయవలెను. బ్రాహ్మణుడైన సచివుడు, తూర్పునుండి మృతపూర్ణ సువర్ణ కలశముతో అభిషేకము ఆరంభింపవలెను. క్షత్రియసచివుడు దక్షిణమున నిలచి క్షీరపూర్ణమగు రజత కలశతోను, వైశ్యామాత్యుడు పశ్చిమమున నిలిచి దధిపూర్ణ రామకలశతోను, శూద్రామాత్యుడు ఉత్తరముననుండి జంపూర్ణ మృతాత్రతోను రాజాభిషేకము చేయవలెను. పిదప ఋగ్వేదులలో ఓ శిష్టుడైన బ్రాహ్మణుడు తేనెతోను, సామవేదియైన విప్రుడు కుశ జలముతోను అభిషేకము చేయవలెను. పిదప పురోహితులు అనేకచ్చిద్రయు కమగు సువర్ణ కలశము వరకు వెళ్లి, సదస్యులమధ్య యథాశాస్త్రమగ ఆగ్నిరక్షాకార్యము నిర్వర్తించి ఆభిషేకమంత్రములు పఠించుచు అభిషేకము చేయ వలెను. ఆ సమయమున బ్రాహ్మణులు వేదమంత్రములను పఠించవలెను. పిదప పురోహితుడు వేదిని సమీపించి సువర్ణ మయమగు శతచ్చిద్రకలశ తో అభి షేకము ప్రారంభింపవలెను. ‘యా ఓషధీః’ ఇత్యాది మంత్రమును చదువుచు ఓషధుల తోను, “అథోత్యుక్వాః” ఇత్యాది మంత్రము చదువుచు గంధములతోను, “పుష్పవతీః” ఇత్యాదిమంత్రము చదువుచు పుష్ప ములతోను, “బ్రహ్మణః” ఇత్యాదిమంత్రము చదువుచు బీజములతోను, “ఆశుః- శిశానః” ఇత్యాదిమంత్రము చదువుచు రత్నములతోను, “యేదేవాః” ఇత్యాదిమంత్రమును చదువుచు కుళయుక్త జలముతోను అభిషేకము చేయవలెను. యజుర్వేది యగు బ్రాహ్మణుడును, అథర్వవేదియగు బ్రాహ్మణుడును “గన్దద్వారామ్” ఇత్యాదిమంత్రముతో శిరస్సు పైవను, కంఠము నందును గోరోచనముతో తిలకముంచవలెను.
కొందరు గీతవాద్యాది ధ్వనులు బయల్వెడలుచుండగా చామర్యవ్యజనమును గ్రహించి, సర్వౌషధియుక్త కలశముతో రాజు ఎదుట నిలబడవలేను. రాజు ముందుగా ఆకలశమును, పిదప అద్దమును, ఘృతాది మాంగళిక వస్తువులను చూడవలెను. పిదప విష్ణు - బ్రహ్మ - ఇంద్రాది దేవతలను, గ్రహములను పూజించి వ్యాఘ్రచర్మయు క్తాసనముపై కూర్చుం తవలెను. ఆసమయమున పురోహితుడు మధుపర్కాదులిచ్చి రాజు శిరస్సుపై కిరీటముంచవలెను. పంచచర్మాసనముల పై కూర్చుండి రాజుముకుట ధారణము చేయవలెను. “ధ్రువాద్యౌః” ఇత్యాదిమంత్రముతో ఆ ఆసనముపై కూర్చుండవలెను. ఆ సమయమున వృష - వృషదంశ - వృక - వ్యఘ్ర - సింహచర్మాసనములు ఉపయోగింపబడును. అభిషేకా నంతరము ప్రతిహార - అమాత్య - సచివాదులను చూపుచు ప్రజలకు పరిచయము చేయవలెను. పిదప రాజు, గోవు, మేక, గోఱ్ఱె, గృహము మొదలగు వాటిని దానము చేసి జ్యోతిషిక పురోహితులను పూజించవలెను. భూమి - గోవులు, అన్న ము మొదలగునవి ఇచ్చి ఇతర దాహ్మణులను కూడ పూజించవలెను. అగ్ని ప్రదక్షిణ చేసి గురువును పూజించవలెను. పిదప వృషభపీఠమును స్పృశించి, సవత్సయగు గోవును పూజించి, అభిమంత్రితమగు ఆశ్వమును ఎక్కవలెను. దాని నుంచిదిగి గ జమును పూజించి, దానిని అధిరోహించి, సేనాసహితుడై ప్రదక్షిణ క్రమమున మార్గముపై కొంచెము దూరము వెళ్ల వలెను. పిదప దానాదులచే అందరిని సత్కరించి, వీడ్కోలిచ్చి రాజధానిలో ప్రవేశించవలెను.
అగ్ని మహాపురాణమునందు రాజ్యాభిషేక కథనమను రెండువందలపదునెనిమిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 218 of the Agni Purāṇa is as follows:
The worship of Skanda, the commander of the divine armies (Devasenapati), is presented with his six faces (Ṣaṇmukha) corresponding to the six Kṛttikā mothers. The Ṣaḍakṣara mantra "Oṃ Śaravaṇabhava" and its significance are explained. Agni describes the peacock as Skanda's vāhana and the vel (śakti-āyudha) as his weapon against Tārakāsura. Pūjā on Kārtika śukla ṣaṣṭhī (Skanda Ṣaṣṭhī) is prescribed as the highest worship day.