ఆగ్ని పలికేను ఐశ్వర్యము, శాంతి, విజయము మొదలగునవి లభించుటకై గ్రహయజ్ఞమును గూర్చి మరల చేప్పెదను. పదివేల హోమములు, లక్షహోమములు, కోటి హోమములు అని గ్రహయజ్ఞము మూడు విధములు. అగ్ని కుండవేదికి ఈశాన్యమునందు మండలమున గ్రహములను ఆవాహన చేయవలెను. ఉత్తరమున గురువును, ఈశాన్యమునందు బుధుని, పూర్వదళమునందు శుక్రుని, ఆగ్నేయమున చంద్రుని, దక్షిణమున కుజుని. మధ్యభాగమున సూర్యుని, పశ్చిమము నందు శనిని, నైరృతియందు రాహువును, వాయవ్యమునందు కేతువును, ఆవాహన చేయవలెను. శివ-పార్వతీ_కార్తికేయవిష్ణు-బ్రహ్మ-ఇంద్ర.యమ-కాలwచిత్రగుప్తులు అధిదేవతలు. అగ్ని-వరుణ-భూమి–విష్ణు-ఇంద్ర.శచీ-ప్రజాపతి సర్పబ్రహ్మలు ప్రత్యధిదేవతలు. గణే-చుర్గా- వాయు – ఆకాశ - అశ్వినీకుమారులు కర్మసాద్గుణ్యదేవతలు ఈ దేవతల నందరిని వైదిక బీజాక్షరములతో పూజించవలెను. అర్క-పగ ఖదిర ఆపామార్గ - పిప్పల ఉదుంబర శమీ.దూర్వాకుశలు-వరుసగ రవ్యాదులకు సమిధలు. వీటిని మధువు, ఆజ్యము, పెరుగు.వీటితో సూరు చొప్పున ఎనిమిది పర్యాయములు హోమములు చేయ వలెను. నూట ఎనిమిది మరియు నాలుగు పూర్ణకుంభము ఉంచి, పూర్ణాహుతి, వసుధార ఇవ్వవలెను. పిదప బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వవలెను. నాలుగు కలశ బలోని జలముతో యజమానులకు అభిషేకము చేయవలెను. “బ్రహ్మ విష్ణు మహేశ్వరాది దేవతలు మీకు అభి షేకము చేయుదురు గాక. వాసుదేపుడు, జగన్నాథు డైన సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు నీకు విజయము నిచ్చుగాక. దేవరాజైన ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయుపు, ధనాధ్యక్షు డైవ కబేరుడు, శివుడు, బ్రహ్మ, ఆది శేషుడు, సకలక్పాలకులు, సర్వదా నిన్ను రక్షింతురుగాక. కీర్తి, లక్ష్మీ, ధృతి, మేధ, పుష్టి, శ్రద్ధ, క్రియ, మతి, బుద్ధి, లజ్జ, వపుష్, శాంతి, తుష్టి, కాంతి, రోక జనను లైన ఈ ధర్మపత్నులు నీకు అభి షేకము చేయుదురు గాక. ఆదిత్య-చంద్ర-కుజబుధ-గురు శుక్ర-శని, రాహు కేతువులు పుతృప్తు లే నీకు అభిషేకము చేయు దురుగాక దేవత, దానవు , గంధర్వులు, యక్షులు, రాక్షసులు, సర్పములు, ఋషులు, మునులు, గోవులు, దేవతలు, దేవాం•నలు, వృక్షము, నాగులు, దైత్యులు, ఆప్సర స్సమూహము, అస్త్రశస్త్రములు, రాజులు, వాహనములు, ఓషధులు, రత్నములు, కాలవిభాగములు, నదీనగర ములు, సముద్రములు, పర్వతము, తీర్థములు, మేఘము నీ సకలాభీష్టసిద్ధికై నీకు అభి షేకము చేయుదురు గాక.”
యజమానుడు పిదప అలంకృతుడై ఈ క్రింది మంత్రములు చదువుచు సువర్ణ-గో-భూదానాదులు చేయవలెను “ఓ కపిలధేనువా! రోహిణీ! నీవు సర్వదేవతలచే పూజించదగినదానవు. నీవు సకలతీర్థ దేవతాస్వరూపిణివి. అందుచే నాకు శాంతి నిమ్ము. ధర్మమా! నీవు వృషభరూపమున జగదానందకారకుడవు. శివునకు వాహన మైనదానవు. అందువలన వాకు శాంతి నిమ్ము.” “హిరణ్యగర్భుని సర్భమునం దున్న సూర్యుని హేమబీజము ఆగంతపుణ్యఫలము. నిచ్చును. అందు వలన నాకు శాంతినిమ్ము.” “పీతవస్త్రద్వయము విష్ణువునకు చాల ఇష్టమైనది. దానిని సమ స్పంచుటచే విష్ణువు సంతసించును. అందుచే నాకు శాంతినిమ్ము” “విష్ణ వైస నీవు మత్స్యరూపముతో ఆమృతమునకు కారణభూతుడవు. చంద్రార్కవాహను డవు. అందుచే నాకు శాంతి నొసగుము.” “పృథివి యైన నీవు ధేనువుగా నుండి కేశవునితో ససూనురాలవు, సర్వపాపములను-వంపచేయడానవు. అందువలన నాకు శాంతి నిమ్ము.” “ఓ, ఆయా వికార మైనదానా ఎల్లపుడును అన్ని పనులు నీ ఆధీనములో నుండును. లాంగ లాదులు ఆయుధాదులు కూడ నీ ఆధీనము. అందుచే నాకు శాంతి నొసగుము.” “నీవు సర్వయజ్ఞములకును అంగముగా నున్నావు. అగ్నికి కారణ మైనదానవు. ఆందుచే నాకు శాంతి నిమ్ము.”
“గోవుల అవయవములందు చతుర్దశ భువనములును ఉన్నవి. అందువలన నాకు ఇహపరలోక మందు వంగి మగుగాక.” “కేశవుని శయ్యయు, శివుని శయ్యయు ఎన్నడును శూన్యములు కావు. నేనిచ్చు వలయ్య కూత అన్ని జన్మలందును శూన్యము కాకుండ ఉండుగాక. సర్వదేవతలును సర్వరత్నములందు ప్రతిష్టితులై యున్నారు. అందుచేత ఈ రత్న దానముచే దేవతలు నాకు శాంతి నిత్తురుగాక. ఇతర దానము లేవియు భూదానము పదునారవ అంశమునకు సాటిరావు. అందుచే ఈ భూదానమువలన నాకు శాంతి కలుగుగాక. అయుతహోమములతో సదక్షిణముగా చేసిన గ్రహయజ్ఞము యుద్ధము నందు విజయము నిచ్చును. వివాహములు, ఉత్సవములు, యజ్ఞములు, ప్రతిష్టలు మొదలగు కర్మలలో ఈ గ్రహయజ్ఞము చేయవలెను. లక్ష హోమ-కోటిహోమములను సకల కామావా ప్తి కొరకు చేయవలెను. గృహమునందు మండపము ఏర్పరచి, అయుతహోమముల నిమిత్తము ఒక హస్తము ప్రమాణము గల కుండమును ఏర్పరుపవలెను. దానికి మేఖలలు, యోని ఉండవలెను. నలుగురు ఋత్విక్కులు, లేదా తానొక్కడే చేయవచ్చును. లక్షహోమములందు అన్నియు పది రెట్లు ఉండును. కుండము నాలుగు లేదా రెండు హస్తముల ప్రమాణమున ఉండవలెను. ఇందు అధికముగ కార్డు ని కూడ పూజించవలెను. “ఓ తార్ఘ్యా! నీశ రీరము సామధ్వనిరూపము. నీవు పరమాత్ముని వాహనము. విషమును నశింపచేయుదువు. అందుచే నాకు నిత్యము శాంతినిమ్ము.” వసోర్దారను పిమ్మట శయ్యాభూషణాంకములను దానము చేయవలెను. లక్షహోమమునందు పదిమంది లేదా ఎనమండుగురు ఋత్విక్కు లుందురు. దాని వలన పుత్రులను, అన్నమును, రాజ్యమును, విజయమును, భుక్తిము క్త్యాదు లను పొందును. కోటిహోమయజ్ఞము సదక్షిణాకముగా చేసినచో వెనుక చెప్పిన స్థలములే కాక శత్రు వినాశనమునుగూడ చేయును. నాలుగు లేదా ఎనిమిది హస్తముల కుండము, పన్నెండు ఋత్విక్కులు, పటమునందు ఇరువదియైదులేదపండ్రెండు కలశను ద్వారమునండు నాలుగు కలశంను ఉంచవలెను. కోటి హోమములు చేసినవాడు సర్వకామములను పొంది విష్ణులోకము చేరును. గ్రహమంత్రములతో గాని, గాయత్రితో గాని, వైష్ణవమతములతో గాని, జాతవేదోముఖమంత్రము లతో గాని, శైవమంత్రములతో గాని, ప్రసిద్ధములైన వైదికమంత్రములతో గాని, తిల.యవ.ధాన్య-మృతములతో హోమములు చేయవలెను. ఇట్లు చేసిన వాడు అశ్వమేధాది యాగఫలమును పొందును. ద్వేషముతో అభిచార హోమములు చేయునపుడు కుండము త్రికోణాకార ములో నుండును. డేగ ఎముక లతో అగ్ని తో కూడిన సమిధలను ఎడమచేతితో హోమము చేయవలెను. హోమము చేయువారు శత్రువునకు అమంగళమును కోరుచు, ఎఱ్ఱని అలంకరణములు ధరించి, జుట్టు విరబోసికొని “దుర్మిత్రా సస్మె సంతు యీ ద్వేషి హుం ఫట్” అను మంత్రము చదువుచు హోమము చేయవలెను. క్షరముతో ప్రతిమను ఛేదించవలెను. పిష్టముతో చేసిన శత్రువును చంపవలెను. దానిని అగ్నియందు హోమము చేయవలెను. ఈ విధముగా చేసినవాడు స్వర్గము పొందును.
అగ్నిమహాపురాణమునందు అయుతలక్షకోటిహోమ మను నూట అరువది ఏడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 167 of the Agni Purāṇa is as follows:
Agni describes three magnitudes of the graha-yajña: ayuta (10,000 oblations), lakṣa (100,000), and koṭi (10,000,000). The nine planets are installed in a maṇḍala with directional placement: Sūrya at centre, Candra to the northeast, Maṅgala to the south, and so forth; above and below each planet its adhideva and pratyādhideva are also invoked. Cow, gold, cloth, and śayyā are the principal dāna items graduated by the scale of the homa. Abhiṣeka-mantras invoking Brahma, Viṣṇu, Maheśvara, Vāsudeva, and Saṅkarṣaṇa consecrate the concluding ablution. Abhicāra variants of this homa employ a triangular kuṇḍa and left-handed samidhs.