పరమేశ్వరుడు పలికెను : ఇపుడు సేవాచక్రమును గూర్చి చెప్పెదను. దీని వలన సేవకునకు సేవ్యుని వలన కలుగు లాభనష్టములు తెలియును. తండ్రి, తల్లి, సోదరులు, స్త్రీపురుషులు వీరి విషయమున దీనిని బాగుగా పరిశీలించి వలెను. ఎవ్వ డైనను పైన చెప్పిన వారినుండి లాభము పొందగల్గునా లేదా అను విషయమును సేవాచక్రము ద్వారా తెలిసికొనవచ్చును. తూర్పు నుండి పడమటకు ఆరు రేఖలను, ఉత్తరమునుండి దక్షిణమునకు ఆరు అడ్డు రేఖలనుగీయ వలెను. ఇట్లు గీయగా ముప్పది యైదు గళ్ళ సేవాచక్రము ఏర్పడును. దాని పై కోష్టములందు ఐదు స్వరములను వ్రాసి పిదప స్పర్శవర్ణములను వ్రాయవలెను. వీటిలో ఙ, ఞ, ణ లను విడచివేయవలెను. క్రింది కోష్టములలో (క నుండి హ వరకు) వరుసగ సిద్ద, సాధ్య, సుసిద్ధ, శత్రు, మృత్యువులు వ్రాయవలెను. ఈ విధముగ వ్రాయగా సేవాచక్రము సర్వాంగసంపన్న మగును. ఈ చక్రము నందలి ‘శత్రు’ ‘మృత్యు’ అను కోష్టములలో నున్న స్వర-వ్యంజనములను అన్ని కార్యములందు పరిత్యజించవలెను. కాని సిద్ద - సాధ్య - సుసిద్ధ - శత్రు - మృత్యు - అను కోష్టములందు ఏదైన ఒక కోష్టమునందు సేవ్య - సేవకుల నామముల ప్రథమాక్షరములు వచ్చినచో అది సర్వథా శుభము. దీనిలో ద్వితీయకోష్టము పోషకము; తృతీయము ధనదాయకము, నాల్గవది ఆత్మనాశకము; ఐదవది మృత్యుప్రదము. మిత్ర-భృత్య బాంధవాదుల విషయమున పరిశీలించు నపుడు (వారి పేర్లున్న) స్థానములు సిద్ధ-సాధ్య-సుసిద్ధము లైనచో ఉత్త మఫలదాయక ములు. అన్ని కర్మలందును అరి - మృత్యువులను విడవవలెను. ఆ ఇ ఉ ఏ ఓ లను ఆకారాంతమును వలె భావింతురు. ఇపుడు వర్గాష్టకసంస్కృతము లగు అంశకములను గూర్చి చెప్పెదను. అవర్గమునకు (అ ఇ ఉ ఏ ఓ) ఆధిపతులు దేవతలు. కవర్గుకు దైత్యులు, చవర్గుకు పన్న గులు, టవర్గుకు గంధర్వులు, తవర్గుకు ఋషులు, పవర్గుకు రాక్షసులు, యవర్గుకు (య ర ల వ) పిశాచమలు, శవర్గుకు (శ ష స హ) మనుష్యులు అధిపతులు. వీరిలో దేవతలకంటె దైత్యులు వారికంటె పన్న గులు, వారికంటె గంధర్వులు, వారికంటె రాక్షసులు, వారికంటె పిశాచములు పిశాచములకంటె మనుష్యులు అధికబలవంతులు. బలవంతుడు దుర్బలుని విడువవలెను. సేవ్య సేవకుల నామాద్యక్షరములు ఒకే వర్గమునకు చెందినచో ఉత్తమము.
మైత్రీ విభాగమునకు సంబంధించిన తారాచక్రమును గూర్చి వినుము. మొదట నామప్రథమాక్షరమును బట్టి నక్షత్రము తెలిసికొని తొమ్మిది తారలను మూడు పర్యాయములు ఆవృత్తిచేయగా ఇరువదియేడు నక్షత్రముల తారలు తెలియును. ఈ విధముగ తన నామనక్షత్రమునకు సంబంధించిన తారను తెలుసుకోనవలెను. జన్మ - సంపత్ - విపత్ క్షేమ - ప్రత్యరి - సాధన - వధ - మైత్ర - ఆతిమైత్రము లని తొమ్మిది తారలు. వీటిలో జన్మ తార అశుభము. సంపత్తార ఆత్యుత్తమము. విపత్తార నిష్ఫలము. క్షేమతార అన్ని కార్యములందును గ్రాహ్యము. ప్రత్యరితారచే ధననాశము కలుగును. సాధకతారచే రాజ్యలాభము కలుగును. వధఠార కార్యవినాశనము. మైత్రతార మైత్రీకార కము. ఆతి మైత్రము హితకారోకము.
ప్రియురాలా నామాక్షరమునందలి స్వరముల సంఖ్యను కూడి ఇరువదిచే భాగించి, శేషముచే ఫలము తెలియవలెను. (అనగా స్వల్పశేషము కలవాడు అధిక శేషము కలవానినుండి లాభము పొందును.) సేవ్యసేవకుల నామాక్షరములలో ఎవనికి అధిక స్వరములుండునో అతడు ధని; అల్పస్వరములు కలవాడు ఋణి. ధనస్వరములు మైత్రికిని, ఋణస్వరములు దాసత్వ మునకును మంచివి. ఈ విధముగ లాభనష్టముల జ్ఞానమునకై సేవాచక్రము చెప్పబడినది. మేష - మిథున - రాశులవారి మధ్య ప్రీతి, మిథున-సింహములవారి మధ్య మైత్రి, తుల-సింహరాశులవారిమధ్య మహామైత్రి ఉండును. కాని ధనుః కుంభరాశులవారి మధ్య మైత్రి ఉండదు. అందుచే వీరు పరస్పర సేవ చేయరాదు. మీన - వృషభ; వృషభ-కర్కట; కర్కట - కుంభ; మకర-వృశ్చిక; మీన-మకరముల వారి మధ్య మైత్రియు, మిథున-కుంభ; తులా-మేషముల వారి మధ్య మహామైత్రి ఉండును. వృషభ - వృశ్చికములవారి మధ్య పరస్పరము వైరముండును, మిథున-ధనుస్; కర్కట - మకర, మకర - కుంభ, కన్యా - మీన రాశులవారి మధ్య ప్రీతి ఉండును.
అగ్ని హపురాణమునందు యుద్ధజయార్ణవమున సేవాచక్ర మను నూటముప్పది రెండవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 132 of the Agni Purāṇa is as follows:
A chapter on the cakra of ritual service (sevā-cakra) elaborates the hierarchical structure of divine attendants and their worship during elaborate pūjā sequences. Agni maps the inner and outer circuits of the sevā-cakra to specific classes of devatās, devī-śaktis, and kṣetrapālas who protect and serve the central deity. The worshipper circumambulates the cakra in the correct pradakṣiṇa order while reciting the names of each āvaraṇa-devatā. The chapter connects this practice with the broader Āgama teaching that complete worship requires the propitiation of the full retinue surrounding the mūla-mūrti.