అగ్ని మహా పురాణము

110 - అథ గజ్గామాహాత్మ్యమ్

అగ్ని దేవుడు పలికెను : ఇపుడు గంగామాహాత్మ్యమును చెప్పెదను. సర్వదా గంగను సేవించవలెను. గంగ భుక్తిముక్తిప్రదాయిని. ఏ దేశ ములందు గంగ ప్రవహించునో ఆ దేశ ములు పవిత్రములు. ఉత్తమగతిని ఆవ్వేషించువారికి గంగ ఒక్కటియే సర్వోత్తమగతి. గంగను సేవించినచో మాతృపితృవంశములు రెండును ఉద్దరింపబడును. వేయి చాంద్రా యణవ్రతములు చేయుటకంటె గంగాజలపాసవడం ఉత్తమము. ఒక మాసము గంగా సేవ చేసినవాడు సకలయజ్ఞముల కల ములు పొందును. గంగాదేవి సకల పాపములను తొలగించును, స్వర్గము నిచ్చుమ. గంగాజలములో ఎముక పడి యున్నంత కాలము, ఆ జీవుడు స్వర్గములో నివసించును. అంధాదులు గంగా సేవ చేసి దేవలాతుల్యు లగుదురు. గంగాతీర్థమునుండి మట్టి తీపి ధరించువాడు సూర్యుడు వలె సకలపాపములను నశింపచేయును. గంగాదర్శనస్పర్శ.జలపానములు చేయువాడును, గంగావామ సంకీర్తన చేయువాడును తన వంశము నందలి ఎన్నో వేల తరముల వారిని పవిత్రము చేయును,

అగ్ని మహాపురాణమునందు గంగామహిమవర్ణవ మను నూటపదవ అధ్యాయo సమాప్తము.