హయగ్రీవుడు చెప్పెను - బ్రహ్మ దేవా! పిండి కాస్థాపనము కొరకై, విద్వాంసుడు దేవాలయములోని గర్భగృహ మును ఏడు భాగములుగా విభజింపవలెను. ప్రతిమను బ్రహ్మ భాగము నందు స్థాపింపవలెను. దేవ - మనుష్య - పిశాచ భాగములయందెన్నడును స్థాపింపగూడదు. బ్రహ్మభాగములో కొంతభాగము విడచి, దేవ భాగమనుష్య భాగములలో కొన్ని భాగములు గ్రహించి, ఆ భూమి పై ప్రయత్న పూర్వకముగ పిండిక ను స్థాపింపవలెను. నపుంసక శిలపై - రత్న న్యాసము చేయవలెను. నృసింహమంత్రముతో హోమము చేసి, ఆ మంత్రముతోనే రత్న న్యాసము కూడ చేయవలెను. ద్రోహులు, రత్నములు, లోహము మొదలగు ధాతువులు, చుదనము మొదలగు పదార్థములను పూర్వాది దిశలందును. మధ్యభాగము నందును ఉంచిన కుండములలో, తన అభిరుచి ననుసరించి ఉంచవలెను. పిమ్మట ఇంద్రాది మంత్రములతో పూర్వాది దిశ లలో నున్న గుంటలను గుగ్గులముచే కప్పి, రత్నన్యాస విధి పూర్తి యైన పిదప గురుశ లోకలతో కూడిన కుశ సమూహముల చేతను, సహదేవమను ఓషధి చేతను ప్రతిమను బాగుగా రాయవలెను. బైటను, లోపలను తగు సంస్కారములు చేసి పంచగవ్యములతో శుద్ధి చేయవలెను. పిమ్మట కుశోదకము, నదీజలము, తీర్థ జలము ఆ ప్రతిమపై ప్రోక్షించవలెను.
హోమము కొరకు ఇసుక తో ఒకటిన్నర హస్తముల విస్తారము గల, చతురస్రము, సుందరము ఆగు వేదిని ఏర్పరుపవలేను. ఎనిమిది దిక్కులందును. యథాస్థానమున కలశము లుంచవలెను. ఆ పూర్వాది కలశలకు ఎనిమిది రంగులు వేయవలెను, పిమ్మట అగ్ని ని వేది పై స్థాపించి, కుశలతో సంస్కారము చేసి “త్వమగ్నే ద్యుభిః” అను మంత్రము తోను, గాయత్రీ మంత్రముతోను సమిధలను హోమము చేయవలెను. అష్టాక్షర మంత్రముతో నూట ఎనిమిది ఆజ్యాహుతులు చేసి, పూర్ణాహుతి ఇవ్వవలెను. పిమ్మట నూరు పర్యాయములు మూలమత్రము జపించి అభిమంత్రించిన శాంత్యుగకమును మామిడి చిగుళ్ళతో ఇష్టదేవత శిరస్సు పై చల్లవలెను. ఆ సమయమున “శ్రీశ్చ లక్ష్మీశ్చ” ఇత్యాది మంత్రము పఠింప వలెను. “ఉత్తిష్ట బ్రహ్మణస్పతే” అను మంత్రముతో ప్రతిమను పైకి ఎత్తి, బ్రహ్మ రథముపై నుంచి, “తద్విష్ణోః” ఇత్యాదిమంత్రము పఠించుచు దేవాలయము వైపు తీసికొని వెళ్ళవలెను. ఆక్కడ శ్రీహరి ప్రతిమను పల్లకీ పై ఎక్కించి నగరమునందు, గీత వాస్య వేదమంత్రా ధ్వనులతో ఊరేగించి, తిరిగి దేవాలయద్వారమువద్దకు తీసికొనిరావలెను.
పిమ్మట గురువు సువాసినీగ్రోల చేతను, బ్రాహ్మణుల చేతను, ఎనిమిది మంగళ కలశ ముల ఉదకముతో శ్రీహరికి స్నానము చేయించి, మూలమంత్రోచ్చారణ, పూర్వకముగ గంధాద్యుపచారములు సమర్పించి పూజచేసి “ఆతో దేవాః” ఇత్యాది ఋక్కు చదువుచు వస్త్ర్యా ష్టా: గార్ఘ్యము ఇవ్వవలెను. పిమ్మట స్థిరలగ్నమున “దేవస్యత్వా ఇత్యాదిమంత్రము చదువుచు ఆ అర్చావిగ్రహమును ప్రతిష్ఠ చేయవలెను. “సచ్చిదానంద స్వరూపా! త్రివిక్రమా! నీవు మూడు పాదములతో ముల్లోకములను ఆక్రమించితివి. నీకు నమస్కాతము” అని ప్రార్థింపవలెను. ఈ విధముగ పండితుడు ప్రతిమను పిండిక మీద స్థాపించి, “ధ్రువాద్యౌః” “విశ్వతశ్చక్షుః” ఇత్యాదిమంత్రములు చదువుచు స్థిరము చేయవలెను. పంచగవ్యము లతో స్నానము చేయించి, గంధోదక ముదో ప్రతిమా ప్రక్షాళనము చేసి, సకలీకరణానంతరము, శ్రీహరికి సాంగోపాంగ సాధారణపూజ చేయవలెను.
ఈ విధముగ ధ్యానించవలేను – “ఆకాశము శ్రీ మహా విష్ణువు యొక్క విగ్రహము; పృథివి ఆతని పీఠము (సింహాసనము). పిమ్మట పరమాత్ము ని శరీరము తై జసపరమాణువులతో ఏర్పడి నట్లు భావన చేయుచు ఇట్లు చెప్పవలెనుఇరువదియైదు తత్వములలో వ్యాపించి యున్న జీవుని ఆవాహన చేయుచున్నాను. ఆ జీవుడు చైతన్య స్వరూపుడు. పరమానందరూపుడు; జాగ్రత్స్వప్న సుషు ప్వవస్థాశూన్యుడు. దేహేంద్రియ - మనో - బుద్ది - ప్రాణ - ఆహంకార రహితుడు. బ్రహ్మ మొదలు కీటకము వరకును ఉన్న సకలజగత్తునందును వ్యాపించి, అందరి హృదయములలో ఉన్న వాడు. పరమేశ్వరా! నీవే ఆ జీవచైతన్యము. నీవు హృదయమునుండి ప్రతిమలో ప్రవేశించి స్థిర ముగా నుండుము. ఈ ప్రతిమను సజీవము చేయుము. అన్ని దేహములందును అంగుష్ఠమాత్రపురుషు డున్నాడు. అతడు జ్యోతిస్వరూపుడు. జ్ఞానస్వరూపుడు; ఏకమాత్ర ఆద్వితీయపర బ్రహ్మ. ఈ విధముగ ప్రతిమను సజీవము చేసి ప్రణపముతో భగవంతుని మేల్కొల్పవలెను. పిదప భగవంతుని హృదయము స్పృశించి పురుషసూక్తమును జపించవలెను. దీనికి సానిధ్యకరణకర్మ” యని పేరు. భగవద్ధ్యానము చేయుచు ఈ రహస్యమంత్రమును పఠింపవలెను.
“ప్రభూ! నీవు సకలదేవాధీశుడవు. సంతోషపై భవస్వరూపుడవు. నీకు నమస్కారము. జ్ఞాన విజ్ఞానము నీ స్వరూపము. త్రిగూణాతీతము. నీవు అంతర్యామివి; పరమాత్మవు. నాశరహితు డగు పురాణపురుషుడవు. నీకు నమస్కారము. మహావిష్ణ! నీ విచట సంనిహితుడవు కమ్ము. నీ పరమతత్వము, జ్ఞానమయశరీరము ఒక సంఘాతముగ ఏర్పడి ఈ ఆర్చావిగ్రహమునందు ఆవిర్భూత మగు గాక”. ఈ విధముగ శ్రీహరి సాంనిధ్యకరణము చేసి ఆతని ఎదుట బ్రహ్మ దీపరివార దేవతలను స్థాపింపవలెను. వారి ఆయుధములను ముద్రలను కూడ స్థాపింపవలెను. శ్రీహరిదర్శనార్థమై వచ్చు వారియాత్రలను బట్టియు, వరాదులను బట్టియు శ్రీహరి అచట సన్నిహితుడై యున్నా డను విషయమును గ్రహింపవలెను. నమస్కరించి, స్తుతించి, స్తోత్రాదులు పఠించి, అష్టాక్షర్యాదిమంత్రములు జపించుచు భగవంతుడచట సన్నిహితుడై యున్నాడని గ్రహింపవలెను.
పిమ్మట ఆచార్యుడు దేవాలయమునుండి బైటకు వచ్చి ద్వారమువద్ద నున్న చండ - ప్రచండు లను ద్వారపాలకులకు పూజ చేయవలెను. మరల మండపములోనికి వెళ్ళి గరుత్మంతుని స్థాపింపవలెను. అన్ని దిక్కులందును ఆ యా దిక్పాలకులను, ఇతర దేవతలను స్థాపించి, శంఖచక్రాదులకు గూడ పూజ చేయవలెను. అందరు పార్షదులకును, భూతములకును బలి సమర్పింపవలెను. (యజమానుడు) ఆచార్యునకు గ్రామ-వస్త్ర-సువర్ణాదులను దక్షిణగా ఈయవలెను. యజ్ఞమునకు ఉపయోగించు ద్రవ్యములు కూడ ఆచార్యున కీయవలెను. ఋత్విక్కులకు ఆచార్యదక్షిణలో సగ మీయవలెను. పిమ్మట బ్రాహ్మణులకు గూడ దక్షిణ ఇచ్చి భోజనము పెట్టవలెను. ఆచటకు వచ్చు బ్రాహ్మణు నెవ్వనిని అడ్డు పెట్టరాదు. అందరిని సత్కరించవలెను. పిమ్మట గురువు యజమానునకు ఫల మీయవలెను. భగవద్విగ్రహప్రతిష్ట చేసిన పుణ్యాత్ముడు తన వంశీయు లందరిని తనతో పాటు శ్రీమహా విష్ణువు సమీపమునకు తీసికొని పోవును. ఇది అందరు దేవతలకును సాధారణ మైన విధానము. కానీ ఆ యా దేవతల మూ మంత్రములు మాత్రము వేరు వేరుగ నుండును. మిగిలిన కార్యము లన్నియు సమానమే.
అగ్ని మహాపురాణమునందు వాసుదేవ ప్రతిష్టాదివిధి యను ఆరువదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 60 of the Agni Mahā Purana is as follows:
The sixtieth chapter provides the complete ritual protocol for the installation (pratiṣṭhā) of Bhagavān Vāsudeva's image in the sanctum. The ratna-nyāsa in the piṇḍikā (placement of gems in the pedestal foundation), the sequence of abhiṣeka using the navakalaśa waters, the prāṇapratiṣṭhā mantras drawn from the Puruṣa-sūkta and Viṣṇu-sūkta, and the sānnidhi-karaṇa mantras that "call" the omnipresent Bhagavān to reside specifically in this image are described in detail. The installation of Garuḍa as Vāsudeva's vehicle before the main shrine, and the proper placement of Lakṣmī to Bhagavān's left, are specified. The chapter concludes with a celebration of the merit of installing a Vāsudeva image — the installer earns merit equivalent to gifting the entire earth, and all who view the consecrated image are freed from the cycle of rebirth.