అగ్ని దేవుడు పలికెను వాంత (శ్) వహ్ని (ర్) వామనేత్ర (ఈ) దండ (0) ముల యోగముచే ఏర్పడిన శ్రీం ఆను బీజము శ్రీ దేవీ మంత్రము. సర్వసిద్ది ప్రదము. మహాశ్రయే మహాసిద్దే మహావిద్యుత్ర్పభే శ్రియేదేవి విజయ్ గౌరి మహాబలే బంధ నమః హం మహాకాయే పద్మ హస్తేహుంఫట్ శ్రీయై నమః హ్రూం శ్రియై ఫట్ శ్రీయైనమః శ్రీయే శ్రీద నమః స్వాహా శ్రీఫట్" ఇవి శ్రీ మంత్రమునకు తొమ్మిది అంగ న్యాసములు చెప్పబడినవి. వీటిలో ఒక దానిని గ్రహించవలెను. పద్మాక్షమాలతో ఈ మంత్రమును మూడు లక్షలుగాని, ఒక లక్ష గాని జపించినచో ఐశ్వర్యము లభించును. లక్ష్మీ ఆలయము నందుగాని విష్ణ్వాలయము నందుగాని శ్రీదేవిని పూజించినచో ధనము లభించును. ఖదిర కాష్ఠమతో ప్రజ్వలించుచున్న అగ్నిలో మృత మిశ్రతండులములతో నూరు హోమములు చేసినచో రాజువకుడగును. లక్ష్మికి ఉత్తరోత్తర వృద్ధి కలుగును . శ్రీ మంత్రముతో అభిమంత్రించిన సర్షప జలముతో స్నానము చేయగ సకల విధ గ్రహ బాధలు నశి చును. ఒక లక్ష బిల్వ వలములు హోమము చేసిన లక్ష్మి లభించును. ధన వృద్ధి కలుగును. నాలుగు ద్వార ములు గల ఒక శక్ర వేశ్మన భావనచేయవలయును. పూక్వ ద్వారము పై క్రీడించుచున్నదియు, రెండు భుజములు పైకి ఎత్తి వున్న దియు, శ్వేతకమలమును ధరించినదియు, శ్యామ వర్జయు వామనాకృతి కలదియు ఆగు బరాకీని ధ్యానము చేయవల యును. దక్షిణ ద్వారమున పైకి ఎత్తిన ఒక హస్తమున రక్త కమలము ధరించి (యున్న శ్వేత శరీరయగు వనమాలీని ధ్యానించవలెను. పశ్చిమ ద్వారమున పైకి ఎత్తిన రెండు చేతులలో శ్వేత పుండరీక మును ధరించినదియు, హరిత వర్ణయు. విభీషిక యను పేరు కలది యగు శ్రీ దూతిని ధ్యానించవలెను. ఉత్తర ద్వారమున శాంకరిని ధ్యానించవలెను. శక్ర వేశ్మ మధ్యమున అష్టదళ కమలము నిర్మించి దాని దళములపై వరుసగా శంఖ చక్ర గదా పద్మ ములను ధరించిన వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్ను ని అనిరుద్ధులను ధ్యానించవలేను. వారి శరీర కాంతి వర సగా ఆంజన దుగ్గ కేసర సువర్ణములతో సమా నము. వీరు సుందర వస్త్రాలంకృతులు, ఆగ్నేయాది దళము లందు గుగ్గులు కురంటజ గమక, సలిలలు యను దిగ్గజము లను భావన చేయవలెను. ఈ దిగ్గజములు స్వర్ణ కలశములను ధరించి యుండ ను. కమల కర్ణి క యందు శ్రీ దేవిని స్మరించ వలెను. చతుర్భుజ యగు ఆమె శరీరము సువర్ణ కాంతి కల5. పైకి ఏత్తిన రెండు హస్తము లందును కమలములును దక్షిణ హస్తమున అభయ ముద్రయు వామ హస్తమున వరముద్రయు యుండును. శుభ్రమైన సుగంధములైన వస్త్రములను తెల్ల ని మాలను ధరించి యుండును. అట్టి శ్రీదేవిని ధ్యానించి సపరివారముగా ఆమెను పూజించినవాడు సకల ఫలములను పొందును.
పూజా సమయమున ద్రోణపుష్పమును కమలమును బిల్వ పత్రమును శిరస్సున ధరించకూడదు. పంచమీ సప్తముల యందు వరుసగా లవణమును ఆ మలకమును త్యజించవలెను. పాయసమును మాత్రము భుజించుచు శ్రీ సూక్తము జపించి ఆ నూక్తముతోనే ఆభిషేకము చేయవలెను. ఆవాహనాది విసర్జన పర్యంతమ అన్ని ఉపచారములను శ్రీ సూక్త ఋక్కులతో చేసి ధ్యాన పూర్వకముగ శ్రీ దేవిని పూజించవలెను. బిల్వ మృత కమల పాయసములు కలిపి గాని వేర్వేరగా కాని లక్ష్మి నుద్దేశించి హోమమును చేయవచ్చును. ఈ హోమత లక్ష్మి ప్రాప్తికిని మంచిది. విష (మ) హి మజ్జా (ష) కాల (మ) అగ్నీ (ర) అతి (న) నిష్ఠ (ఇ) ని స్వాహా (మహిష మర్ధిని స్వాహా). ఇది మహిష మర్ధిని అష్టాక్షర మంత్రమా. “ఓం హ్రీం మహా మహిష మర్ధిని స్వాహా". ఇది మూల మంత్రము. మహిష మర్ధిని మహీష శత్రుం భ్రమ. “ఓం హ్రూం వట్ మహిషం పౌషయ పౌషయ మహిషం హ్రేషయ హేషయ హ్రూం మహిషం హనహన దేవి హ్రూం మహిషనిఘాదని వట్". ఇది అంగ సహితమగు దుర్గా హృదయము. సర్వకార్య సాధకమ. పీఠముపై ఆష్ట దళ కమలముపై దర్గాదేవిని ఈ క్రింది విధముగా పూజించవలెను. ఓం హ్రీం దుర్గే రక్షణే స్వాహా. ఇది దుర్గా మంత్రము. అష్ట దళ పద్మము పైదుర్గా వర వర్ణి నీ ఆర్యా, కనక ప్రభా, కృత్తికా, అభయప్రదా కవ్యకా. సురూప అను ళ క్తుల ఆద్యక్షరములకు బిందువు చేర్చి ఆ బీజ మంత్రములతో కూడి నామ మంత్రములతో పూజించవలెను. చక్ర శంఖ గదా ఖడ్గ బాణ ధనుష్, అంకుర భేట ములను కూడ పూజించవలెను. అష్టమ్యాది తిథులందు లోకేశ్వరీ దుర్గను పూజించవలెను. ఈ దుర్గోపాసన పూర్ణాయుర్దాయ మును లక్ష్మిని యుద్దము నందు జయమును ఇచ్చును. వశము చేసుకొనవలసిన వాని నామము చేర్చి ఈ మంత్రముతో తిల హోమము చేయువాడు వశము చేసుకొనును. కమల హోమముచే విజయము లభించును. శాంతి కోరువాడు దూర్వా హోమము చేయవలయును. పలాశ సమిధలచే పుష్టి కలుగును. కాక పక్షములు హోమము చేసినచో మారణ విద్వేషణ కర్మలు సిద్ధం చును. ఈ మంత్రము సకల గ్రహ ముద్ర థయ ఆపదలమా నశింప చేయును. “ఓం దుర్గే దుర్గే రక్షణ స్వాహా” ఇది అంగ సహిత మగు రక్షన ఇచ్చు జయ దుర్గా మంత్రమా. శ్యామాంగియు త్రినేత్రియు చతుర్భుజయు శంఖ, చక్ర, శూల, ఖడ్గ, ధారిణియు రౌద్ర రూపిణియు అగు రణ చండీ నేనే యని ధ్యానము చేయవలెను. యుద్ద ప్రారంభమున ఈ జయ దుర్గా మంత్రము జపించవలెను. ఖడ్గాదుల పై దుర్గా పూజను చేసినచో విజయము లభించును. యుద్ధము నందు ఓం నమో భగవతి జ్వాలామాలిని గృధ్ర గణ పరివృతే చరా చర రక్షిణి స్వాహా యను మంత్రమును జపించవలేమ. విజయము లభించును.
ఆగ్ని మహా పురాణమువ లక్ష్మ్యాది పూజా వర్ణన మను మూడు వందల యెనిమిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 308 of the Agni Purāṇa is as follows:
The science of toxicology (agadatantra) is presented, covering the sources and classification of poisons — sthāvara (plant-based), jaṅgama (animal-based), and kṛtrima (artificial). The signs and stages of poisoning and the proper emergency treatments — emesis, antidotes (agada), local applications, and fumigation — are described. Specific antidotes for snake-bite, scorpion-sting, spider-bite, and poisoned food are enumerated. The chapter also covers the neutralization of compound or successive poisoning, as well as the formulation of protective preparations (rakṣā) to be worn or consumed prophylactically.