అగ్ని మహా పురాణము

67 - అథ జీర్ణోద్ధార విధానమ్.

హయగ్రీవుడు చెప్పెను - ఇప్పుడు జీర్ణోద్ధార విధిని చేప్పెదను. ఆచార్యుడు మూర్తి కి అలంకరించి స్నానము చేయించవలెను. అత్యంతము జీర్ణమైనది, అంగ విహీనము, భగ్నమైనది, శిలామాతావశిష్టమైనది, అగు పతిమను పరిత్యజించవలెను. దీని స్థానమునందు వెనుకటి వలెనే నవీనమైన స్థిరమూర్తి ని స్థాపింపవలేను. ఆచార్యుడు భూతశుద్ధిక రణములో చెప్పిన విధమున, సంహారవిధిచే సకల తత్త్వముల సంహారము చేయవలెను, నృసింహ మంతముతో వేయి హోమములు చేసి మూర్తి ని పెకిలించవలెను. దారుమయ మూర్తియైనచో అగ్నిచే దహింపచేయవలెను. శిలా నిర్మితమూర్తి నచో జలములో విడువలెను. ధాతుమయమూర్తి గాని, రత్న మయమూర్తి గాని ఐనచో సముదములో అగాధ జలములో పడవేయవలెను. జీర్ణపతిమను వాహనముపై ఎక్కించి, వస్త్రాదులచే కప్పి, వాద్యములతో తీసికొని వెళ్ళి నీటిలో విడువ వలెను పిమ్మట ఆచార్యునకు దక్షిణ ఈయవలెను. ఆదివసమునందే వెనుకటి ప్రతిమ దేనిచేత నిర్మింపబడినచో, ఎంత ప్రమాణము కలదో అదే దవ్యముతో, అంతే ప్రమాణము గల మూర్తి ని స్థాపించవలెను. ఈ విధముగనే జీర్ణ కూప - వాపీ - తడాగాదుల ఉద్గారము చేయుటచే గొప్ప ఫలము లభించును.

శ్రీ అగ్ని మహాపురాణమునందు జీర్ణోద్ధార విధి కథనమను అరువది యేడవ అధ్యాయము సమాప్తము.