పుష్కరుడు చెప్పెను. ఇపుడు భుక్తి ముక్తి ప్రద మగు శ్రాద్ధ కల్పమును గూర్చి చెప్పెదను. సావధానముగా వినుము. శ్రాద్ధకర్త మనస్సును, ఇంద్రియములను వశమునం దుంచుకొని పవిత్రుడై ఒక రోజు ముందుగా బ్రాహ్మణులను నిమంత్రించ వలెను. శ్రాద్ధదివసమున, అపరాష్ట్రకాలమునందు వచ్చిన ఆ బ్రాహ్మణులను స్వాగతాదులచే పూజించవలేను. వారిని పీఠముపై కూర్చుండ బెట్టవలెను. దైవస్థానమున సరిసంఖ్య కలవారిని, పితృస్థానమునందు బేసి సంఖ్యకలవారిని కూర్చుండ బెట్టవలెను. దైవస్థానమున ప్రాజ్ముఖముగ కూర్చుండబెట్టవలెను. పితృస్థానమునందు ఒకరిని లేదా ముగ్గురిని కూర్చుండ బెట్టవలెను. లేదా రెండింటియందును ఒక్కరొక్కరే ఉండవచ్చును. మాతామహశ్రాద్ధమునందు గూడ ఇడ్లీ పాణిప్రక్షాళనోదకమును, ఆసనముకొరకై కుశ లను ఇచ్చి, ఆనుజ్ఞ పొంది “విశ్వేదేవాసః” ఇత్యాదిమంత్రముచే ఆవాహనము చేసి, సపవిత్ర మగు పాత్రయందు యవలు చల్లి శం నో దేవీ, అను మంత్రముచే నీళ్ళు పోసి, 'యనోసి' అను మంత్రముచే యవలు చల్లి, 'యా దివ్యా ఆపః” అను మంత్రముచే హస్తమునందు ఆర్ఘ్యము ఇవ్వవలెను. పిదప ఉదక మును, గంధ మాల్యములను, ధూపదీపములను ఇవ్వవలెను. పిదప అపసవ్యము చేసుకొని పితృదేవతలకు ఆప్రదక్షిణముగా ద్విగుణము లగు కుశలను ఆసనముగా ఇచ్చి, “ఉశవ స్వా” అను మంత్రముచే ఆ పితృదేవతల ఆవావానము చేసి, అనుజ్ఞ పొందినవాడై, “ఆ యాస్తు నః' అను మంత్రము జపించవలెను. ఇచట యవలకు బదులు తిలలు వాడవలెను. అర్ఘ్యజికమును వెనుక టివలెనే ఇచ్చి, సంస్రవమును (కారిన జలమును) పితృపాత్రమునందు గ్రహించి దానిని 'పితృభ్యః స్థానమసి' అని చెప్పుచు ఆధోముఖము చేయవలెను. “ఆగ్నౌ కరిష్యే” అని చెప్పి కురుష్వ అని అనుజ్ఞ పొంది, మృతమిశ్రిత మగు అన్నము గ్రహించి, పితృయజ్ఞమునందు వలె అగ్నిలో హోమము చేసి, హోమము చేయగా మిగిలిన అన్నమును పాత్రలలో ఉంచవలెను. లభ్య మగు పాత్రలలో. విశేషించి రజత పాత్రలలో -అన్న ముంచి, “పృథివీ తే పాత్రమ్”ఇత్యాదిమంత్రముచే పాత్రాభిమంత్రణ చేయవలెను.
“ఇదం విష్ణుః” అను మంత్రముచేత ద్విజుని అంగుష్ఠము అన్న ముందు ఉంచవలెను. వ్యాహృతులతో గూడిన గాయత్రిని, మధువాత్కా ఇత్యాది ఋక్రయమును జపిచి “సుఖముగా భుజించండి” అని చెప్పవలెను. వారు కూడ మౌనముతో భుజింపవలెను. వారికి ఇష్టము, హవిర్యోగ్యము ఆయిన ఆన్నము వడ్డించపలేను. పవిత్ర మంత్రము జపించి అన్నమును గ్రహించి, “తృప్తి చెందినారా?' అని ప్రశ్నించి తృప్తి చెందితిమి' అని వారు సమాధానము చెప్పిన తరువాత “శేషాన్న మును ఏమి చేయవలెను” అని ప్రశ్నించగా “వారు ఇష్టులతో కూడి భుజించండి” అని సమాధానము చెప్పవలెను. వారు తినగా మిగిలిన అన్న మును భూమి పై చల్లి ఒక్కొక పర్యాయము ఉదకము ఇవ్వవలెను. ఆ అన్నము నంతను గ్రహించి, దక్షిణాభిముఖుడై , ఉచ్ఛిష్ట సమీపమున పితృయజ్ఞమునందు వలె పిండ ప్రదానము చేయవలెను. మాతామ హులకు కూడ ఇట్లే చేయవలెను. పిదపఆచమనము ఇచ్చి, స్వస్తివాచనము చేయవలెను. అక్షయ్యోదకము ఇవ్వవలేను. యథాశక్తి గా దక్షిణ సమర్పించి ‘వాచ్యతామ్' అని అనుజ్ఞపొంది స్వధా అని పలుక వలెను. ‘ఆస్తు స్వధా’ అని చెప్పగా పిదప జలమును భూమి పై విడువవలేను. 'ప్రేయస్తాంవిశ్వేదేవా!” అనీ అనుచుదేవస్థానమున ఉదకము ఇవ్వవలెను. “మాలో దాతలు వృద్ది పొందుదురుగాక. వేదములు, సంతానము కూడ వృద్ధిపొందుగాక! మాశ్రద్ద కూడ తగ్గకుండుగాక. మావద్ద ఇతరులకు ఇచ్చుటకు అధికధనాదికము ఉండుగాక! ఈ విధముగ ప్రియవాక్కులు పలుకుచు నమస్కరించి విసర్జించవలెను. ముందుగా “వాజే వాజే” ఇత్యాది మంత్రముతో పితృ దేవతావిసర్జనము చేయవలెను పూర్వము సంస్రవములు పడిన ఆర్ఘ్యపాత్రలను ఉత్తానము చేసి బ్రాహ్మణులను పంపి వేయవలెను.
బ్రాహ్మణులను ప్రదక్షిణక్రమమున కొంతదూరము అనుసరించి వెళ్ళి మర లవచ్చి పితృదేవభుక్త శేషమును భుజించి, ఆ రాత్రి తాను, బ్రాహ్మణులతో గూడ బ్రహ్మచారిగా ఉండవలెను. ఇదేవిధముగ పుత్రజన్మాది వృద్ధిసమయము లందు ప్రదక్షిణావృత్తిచే వాందీముఖపితృదేవతలను పూజించవలెను. పెరుగు కర్కంధూఫలము కలిసిన అన్నముతో పిండ దానము చేసి, తిస్థానమున యవలను ఉపయోగించవలెను. ఏకోద్దిష్ట శ్రాద్ధమున విశ్వేదేవపూజ ఉండదు. ఒకే అర్ఘ్యపాత్ర, ఒకే పవిత్రము ఉండును. ఆవాహనము, అగ్నౌ కరణము ఉండదు. యజ్ఞోపవీతమును అపసవ్యముగా చేసికొని అన్ని కార్య ములు చేయబడును. ‘అక్షయ్యమస్తు’ అనుటకు బదులు “ఉపశిష్టతామ్” అని చెప్పవలెను. “వాజే వాజే” ఇత్యామత్ర ముతో బ్రాహ్మణవిసర్జన చేయునపుడు 'అభిరమ్యతామ్' అని చెప్పగా, వారు “అభిరతాః స్మః” అని పలుకుదురు. సపిండి కరణ శ్రాద్ధమునందు వెనుక చేప్పిన విధముగ అర్ఘ్యసిద్దికొరకై గంధ-జల.తిలయుక్తము లగు నాలుగు అర్ఘ్యపాత్రలు చేసి కొనవలెను. (పేత పాత్రజలములు పితృపాత్రమునందు పోయవలెను. ఆ సమయమునందు “యే సమానా ఇత్యాది మంత్ర ద్వయమును పఠించవలేను. మిగిలిన క్రియాకలాపము వెనుకటివలెనే. ఈ సపిండికరణ ఏకోద్దిష్ట, శ్రాద్ధములు తల్లికి గూడ చేయవలెను. సపిండికరణము సంవత్సరమునకు ముందుగానే చేసివేసినవాని నిమిత్తమై సంవత్సరము పాలు, ఉదకుంభ సహిత అన్నమును ఇవ్వవలెను. ఒక సంవత్సరముపాటు ప్రతిమాసమునందును ఒక పర్యాయము క్షయాహతిథియందు ఏకోద్దిష్టముచేయుట ఉచితము. మొదటి ఏకోద్దిష్టము పదకొండవదినమునందు చేయబడును. శ్రాద్ధమునందు హవిష్యాన్ని మును ఇచ్చుటచే ఒక మాసము వరకును, పాయసము నిచ్చుటచే సంవత్సరమువరకును పితృదేవతలకు తృప్తి కలుగును. మత్స్య-హరిణ-ఉరక్ర_శకుని-ఛాగ-పృషత ఐణ-రురు. వరాహ.శశమాంసములు ఇచ్చినచో పితామహులకు వరుసగా ఒక్కొక్కమాసము అధికముగ తృప్తి కలుగును. ఖడ్గమృగమాంసము, మహాకర్కిమాంసము, వధుయు కొన్నము, లోహ మాసము, కొలతాకము, వార్ధిజసమాంసము, గయాదత్తము ఇవి అన్నియు అనంత తృప్తిని ఇచ్చును. భాద్రపద కృష్ణ త్రయోదశియందు- విశ్లేషించి మఘానక్షతయోగమున పితృదేవతల కిచ్చినది అక్షయ మగును. శ్రాద్ధము చేసినవాడు సర్వదా రూపశీలవతి యైన కన్యను, సంతానమును, స్తోత్రపాఠకులను, ముచి పశువులను, సుతులను, నెయ్యి, కృషి, వాణిజ్యము, రెండు డెక్కల జంతువులను, ఒక శఫము గల జంతువులను, బ్రహ్మ వర్చస్సు గల పుత్రులను, స్వర్గమును, వెండిని, కుప్యమును, జ్ఞాతులలో శ్రేష్ఠత్వమును, సర్వకామములను పొందును.
చతుర్ధశితప్ప, ప్రతిపత్తు మొదలు పదునైదు తిథులందు, శస్త్రహతులకు శ్రాద్ధము చేయబడును. కృత్తిక మొదల భరణివరకును యథాశాస్త్రముగ తార్థము నిచ్చువాడు స్వర్గమును, సంతానమును, తేజస్సును శౌర్యమును, సుతులను, ఆధీ కారమును, పుత్రులను, వాణిజ్యమును, ప్రభుత్వమును, ఆరోగ్యమును, యశస్సును, శోక వినాశనమును, పరమగతిని, ధన మును, విద్యను, వైద్యసిద్ధిని, వెండి, గోవులను, గొట్టెలను అశ్వములను, ఆయుస్సును పొందును. శ్రాద్ధముచేత తర్పితులైశ్రాద్ధకలనిరూపణమ్ వసురు ద్రాదిత్యరూపు లైన శ్రాద్ధదేవత లైన పితృదేవతలు, మనుష్యుల పితర్వును సంతోషింపచేయుదురు. సుశసించిన పితామహులు మనుష్యులకు ఆయుః ప్రజా ధన–విద్యలను, స్వర్గ-మోక్ష -సుఖములను రాజ్యమును ఇత్తురు.
ఆగ్నేయమహాపురాణమునందు శ్రాద్ధకర్పవర్ణన మను నూటఆరవది మూడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 163 of the Agni Purāṇa is as follows:
The specific procedural text (kalpa) for śrāddha is laid out in greater ritual detail than the earlier general description. Agni describes the exact procedure for the Mahāśrāddha—the annual piṇḍa-pitṛ-yajña—including the preparation of the sacred square (catur-hasta-bhūmi), the installation of kuśa-seats for the invited brāhmaṇas (who embody the pitṛs), and the precise mantras for each oblation sequence. The piṇḍa-pāta (placing of rice-balls) to the pitāmaha, pitā, and prapitāmaha is described with the corresponding sapiṇḍa mantras. A list of the twelve months' śrāddha-nāmas and their specific phala for the departed is appended.