ఈశ్వరుడు పలికెను– కుమారస్వామీ! ఇపుడు సంస్కార దీక్షావిధిని గూర్చి చెప్పెదను. అగ్నియందున్న శివుని అర్ధనారీశ్వరరూపమును తన హృదయమునందు ఆవాహన చేయవలెను. శివుడును, పార్వతియు ఒకే శరీర మున కలిసియున్నారు. ఆని భావన చేసి పూజించి, హృదయమంతముచే, తర్పింపచేయవలెను. వారి సాంనిధ్యమును కోరుచు హృదయమంతముతో ఐదు హోమములు చేయవలెను. అస్త్రమంతముచే పుష్పమును అభిమంత్రించి, దానితో శిష్యుని హృదయమున తాడవము చేయవలెను. వానిలో నక్షత్రాకారమున ప్రకాశించున్న జీవుని భావించవలెను. హుంకారయుక్త రేచక పాణాయామముతో శిష్య హృదయమునందు ప్రవేశించి నట్లు భావన చేసి, సంహారిణీ ముదతో ఆ జీవుని అచటినుండి లాగి, పూరక పాణాయాయముచే తన హృదయమున-స్థాపించుకొనవలెను. ఉద్భవముదను ప్రదర్శించుచు, హృత్సం పుటితమగు ఆత్మముద్రను ఉచ్చరించుచు, రేచక పాణాయామ సాహాయ్యముచే దానిని వాగీశ్వరీదేవి యోనియం దుంచి నట్లు భావన చేయవలెను. “హాం హాం హామాత్మనే నమః” అనునది ఆత్మమంత్రము. బాగుగా ప్రజ్వలించుచున్న, ధూమ రహిత మైన అగ్నిలో అభీష్టసిద్ది కొరకై హోమము చేయవలెను. ధూమయుక్తమై, ప్రజ్వలించని అగ్నిలో చేసిన హోమము సఫలము కాజాలదు. అగ్ని జ్వాలలు దక్షిణావర్తములై ప్రసరించినను ఉత్తమ మగు గంధము వచ్చుచున్నను, అగ్ని చాల తేజోవంతముగ కనబడినను, ఆది శ్రేష్టము. ఇందుకు విపరీతముగ, ఆగ్నినుండి నిప్పునేరసులు ఎగురుచున్నను, అగ్ని జ్వాల భూమిని స్పృశించుచున్నను ఉత్తమముకాదు. ఈ గుర్తులచే శిష్యుని పాపమును గుర్తించి అగ్నిలో హోమము చేయ వలెను. లేదా పాపభక్షణహోమములచే ఆ పాపమును భస్మము చేయవలెను. శిష్యునకు నూతన విధమున ద్విజత్వము సిద్దించుటకుమ, రుధాంశభావనకును, ఆహార బీజశుద్ధి నిమిత్తమును, గర్భాదాన - గర్భస్థితి - శీమంతోన్నయన - జాతకర్మ - నామకరణములకొరకును, వేరు వేరుగా, మూల మంత్రముతో, ఐదేసి వందల ఆహుతుల నీయవలెను. చూడా కర్మాదులకొరకే దశమాంశ హోమములు చేయవలెను.
ఈ విధముగ శిధిల మైన బంధనము గల జీవాత్మలో కలుగు శక్యుత్కరమే రుద్రపుత్రుడు ఆగుటకు నిమత్త మగుటచే గర్భాధాన మని చెప్పబడును. వానిలో స్వతంత్రముగ ఆత్మ గుణములు ఆవిర్భవించుటయే పుంసవనము. మాయ వేరు, ఆత్మ వేరు అను జ్ఞానము కలుగుటయే సీమంతోన్నయనము. శివాదశుద్ద సద్వస్తుస్వీకారమే జన్మ. ‘నేను శివుడను’ అను జ్ఞాన ముదయించుటయే శివత్వయోగ్యు డగు శిష్యునకు నామకరణము ప్రకాశించుచున్న అగ్నికణము వలె ఉన్న జీవాత్మను, సంహారముద్రచే తీసి తన హృదయ కమలమునం దుంచుకొనవలెను. పిమ్మట కుంభక ప్రాణాయామముతో మూలమంత్రోచ్చారణము చేయుచు హృదయమునందు శివశక్తులను కలుపవలెను. క్రమముగా బ్రహ్మాదికారణములను పరిత్యజించుచు, రేచకముచే జీవాత్మను శివుని దగ్గరకు తీసికొనిపోయి, మరల ఉద్భవ ముద్రచే వెనుకకు తీసికొనివచ్చి, వెనుక చెప్పిన హృత్సంపుటిలాత్మమంత్రముతో, రేచకప్రాణాయామము చేయుచు, విధానము నెరిగిన గురువు శిష్యుని హృదయకమల కర్ణి కయందు ఆ జీవాత్మను స్థాపించవలెను. పిమ్మట గురువు తల్కాలోచితముగ శివాగ్నుల పూజ చేసి, శిష్యునిచే తనకు నమస్కారము చేయించుకొని, ఆతనికి సమయాచారోపదేశము చేయవలెను. “నీవేన్నడును ఇష్టదేవతా (శివ) నిందగాని, శైవశాస్త్రనిందగాని చేయరాదు. శివనిత్మాల్యాదులను దాటకూడదు. జీవితాం తము వరకును శివ-అగ్ని గురువుల పూజ చేయవలెను. బాలకులకు, మూడులకు, వృద్ధులకు, స్త్రీలకు, గమున కోరు వారికని (అన్నార్డులకును), రోగులకును యథాశక్తి ధనాదిదానము చేయవలెను. సమర్థులైనవారు సర్వమును దానము చేయ వలె నని నియమము చెప్పబడినది.
వ్రతాంగము లైన ఆటా-భస్మ-దండ-కౌపీనాదులను, సంయమపోషకమ లను అత్యవస్తువులను, ఈశానాది నామములచే గాని, లేదా వాటి ప్రారంభమున “నము' చేర్చి నామమంత్రములచే గానీ ఆభిమంత్రించి, స్వాహాంతము లగు సంహితామంతములను పఠించుచు పాత్రలలో ఉంచి, వేమకటి వలెనే సంపాతాభిహతమలు (సంస్కార విశేషసంస్కృత ములు) చేసి, స్థండిలీశుడగు శివుని ఎదుట ఉంచవలేను. వీటి రవణము కొరకై క్షణకాలము పాలు కలశము క్రింద ఉంచవలెను. పిమ్మట శివుని ఆజ్ఞ గై కొని వాటిని శిష్యున కీయవలెను. ఈ విధముగ విశిష్టసమయదీవా సంపన్ను డగు శిష్యుడు అగ్నిహోమఆగమజ్ఞానాది యోగ్యత కలవా డగును.
ఆగ్ని మహాపురాణమున సంస్కార దీక్షా విధి యను ఎనుబది రెండవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 82 of the Agni Purāṇa is as follows:
This chapter describes the saṃskāra-dīkṣā — a purificatory initiation that grants the śiṣya a "new birth" within the Śaiva community, analogous to the dvija (twice-born) initiation of upanayana in the Vedic system. The ritual symbolically re-enacts all the ten saṃskāra-s — from garbhādhāna to nāmakaraṇa — within the initiation ceremony, as the guru "gives birth" to the śiṣya as a child of Śiva rather than of biological parents. The central act is the mala-dagdhana — the "burning" of the śiṣya's three bonds (āṇava, māyīya, and kārma mala-s) in the fire of Śiva's grace, transmitted through the guru's initiation. The ten saṃskāra-s also performed for the fire itself (agni-saṃskāra) — establishing the fire as a fully consecrated ritual entity — are described. The chapter affirms that after saṃskāra-dīkṣā, the śiṣya's past accumulated karma-s are burned at their root.