ఓ పద్మయోనిపాలితాత్మ తత్వ్వేరాయ ప్రకృతిలయాయ ఓం నమః శివాయ” అను మంత్ర ముచ్చరించి పవిత్ర కముతో శివుని పూజించవలెను. “విష్ణుకారణ పాలితవిద్యాత త్వేశ్వరాయ ఓం నమః శివాయ” అను మంత్రముచ్చరించి పవిత్రకమును సమర్పించవలెను. “రుద్రకరణపాలిత శివత త్వేశ్వరాయ ఓం నమః శివాయ” అను మంత్ర ముచ్చరించుచు శివునకు పవిత్రకమును నివేదించవలెను. సువ్రతుడైన ఉపాసకుడు సర్వకారణపొలాయ శివాలయ లయాయ ఓం నమః శివాయ.” అను మంత్రముచ్చరించుచు శివునకు గంగావతార మను సూత్రమును సమర్పింపవలెను, ముముక్షువులు ఆత్మతత్త్వ-విద్యాతత్వ-శివతత్వముల క్రమమున మంత్రోచ్చారణము చేయుచు పవిత్రకములను సమర్పించవలెను. బుభుక్షువులు (భోగేచ్చకలవారు) వరుసగ శివతత్వ-విద్యాతత్త్వ-ఆత్మతత్త్వములకు అధిపతియగు శివునకు మంత్రోచ్ఛారణ పూర్వకముగ పవిత్రకమును సమర్పించవలెను. ముముక్షువు స్వాహాంతమంత్రమును, భోగేచ్చగలవాడు నమోంతమంత్ర మును ఉచ్చరించవలెను. “ఓం హాం ఆత్మతత్త్వాధిపతయే శివాయ స్వాహా “ఓం హాం, విద్యాతత్త్వాధిపతయే శివాయ స్వాహా” ఓం హోం శివతత్త్వాధిపతయే శివాయస్వాహా” అనునవి స్వాహాంతమంత్రములు (''స్వాహా”కు బదులు “నమః” చేర్చినచో నమోంతమంత్రములు). గంగావతారకమును సమర్పించిన పిదప శివునకు నమస్కరించి ఈ విధముగ ప్రార్థింపవలెను.
త్వం గతిః సర్వభూతానాం సంస్థితి స్త్వం చరాచరే.
“పరమేశ్వరా! నీవే సమ స్త్రప్రాణులకును గతివి. చరాచర జగత్తునకు ఆశ్రయమైన వాడవు నీవే. నీవు సమస్త ప్రాణులలోపల సంచరించుచు వారికి సాక్షిగా ఉన్నావు. మనోవాక్కాయములచే నీవు తప్ప నాకు వేరొక గతి లేదు. నీకు నేను ప్రతి దినము చేయు పూజలో మంత్ర - ప్రియా - ద్రవ్య - జప - హోమ - ఆర్చనాదులలో ఏ లోపము జరిగినవో శుద్దము లగు వాక్యములు లేని ఏ కర్మ చేసితినో ఆ లోపముల నన్నింటిని మన్నించి, నే చేసిన కర్మను పరిపూర్ణము చేయుము. పరమేశ్వరా! నీవు పరమ పవిత్రుడవు, నీకు సమర్పించిన ఈ పవిత్రకము సమ స్తపాపములను నశింపచేయు నది. నీవు ఆంతటను వ్యాపించి ఈ సకల చరాచర జగత్తును పవిత్రము చేసితివి. వ్యాకులత్వముచేత గాని, అంగ వైకల్యముచే, గాని నేను ఏ వ్రతమును ఖండితము చేసితినో, ఆది నీ ఆజ్ఞయనెడు సూత్రముచే గ్రుచ్చబడి ఆఖండము గాక.
ఎవని విషయమున గురువు పూర్తిగా సంతోషించునో ఆతని కాండ మంతయు సఫలమగును అనే పరమేశ్వరుడు చెప్పి యున్నాడు. ఈ విధముగ గురువును పూజించి ఆయనకు హృదయమువరకును వ్రేలాడు పవిత్రక ము సమర్పించి, బ్రాహ్మ ణాదులకు భోజనము పెట్టి, వస్తాదు లిచ్చి “దేవేశ్వరుడైన సదాశివుడు నేను చేసిన ఈ దానాదులచే సంతసించును గాక” అని ప్రార్థించవలెను.
ప్రాతఃకాలమున భక్తి పూర్వకముగ స్నానాదికము చేసి శివుని విగ్రహమునుండి పవిత్రకములను ప్రోగుచేసి, శివునకు ఆష్టపుష్పపూజ చేసి విసర్జన చేయవలెను. పిదప వెనుకటివలెనే సవిస్తరముగ నిత్యనై మిత్తి క పూజ చేసి పవిత్రక ములు సమర్పిలచి, నమస్కరించి, ఆగ్నిలో శివపూజ చేయవలెను. పిమ్మట అస్త్రమంత్రముతో ప్రాయశ్చిత్త హోమము చేసి పూర్ణాహుతి ఈయవలెను. భోగేచ్చ కలవాడు తాను చేసిన కర్మ నంతను శివునకు సమర్పించి “ప్రభో! నీ అను గ్రహముచే ఈ కర్మవలన నాకు మనోవాంచిత ఫలములు లభించుగాక” అని ప్రార్ధించవలేను మోక్షకాముడు – “ఓనాధా నా కర్మ బంధ హేతువు కాకుండుగాక” అని పార్ధించవలేను. పిదప అగ్నిలో నున్న శివునకు నాడీయోగముచే అంత రాత్మల నున్న శివునితో ఐక్యమును కల్పింపవలెను, ఆణుసముదాయమును హృదయముగ న్యసించి ఆగ్నిని విసర్జించి, ఆచమనము చేసి, పూజామండపమును ప్రవేశించి, కలశములోని జలమును నలుమూలల చల్లుచు, శివునితో సంయుక్త మగు నట్లు చేసి - ప్రభూ! నా లోపములను క్షమించుము అని ప్రార్ధించి విసర్జించవలెను. పిమ్మట లోకపాలాదులను విసర్జించి, శివుని విగ్రహమునుండి పవిత్రకములను తీసి, చండేశ్వర పూజానంతరము, వాటిని శివనిర్మాల్యాదులతో పాటు ఆయనకు సమర్పించవలెను. లేదా వీరి మీద, వెనుకటి వలే, చండేశ్వరుని పూజ చేసి - “చండనాథా! నేను చేసిన వార్షిక కర్మయందు న్యూనత్వరూప దోషము గాని ఆధిక త్వరూపదోషముగాని ఉన్న చో దానిని తొలగించి, ఆకర్మ సాంగో పాంగముగ సంపూర్ణమగు నట్లు చేయుము” అని ప్రార్ధించవలెను. పిదప చండేశ్వరుని స్తుతించి, నమస్కరించి, విసర్జించ వలేను. నిర్మాల్యమును తొలగించిన పిమ్మట శుద్దుడై, శివునకు స్నానము చేయించి, పూజించవలెను. గురుపు ఐదు యోజనముల దూరమున నున్నను ఆయనవద్దకు వెళ్ళి పవిత్రారోహణకర్మ చేయవలెను.
ఆగ్ని మహాపురాణమునందు పవిత్రారోహణవిధి యను డెబ్బదితొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 79 of the Agni Purāṇa is as follows:
This chapter continues the Pavitrārohaṇa ritual, describing the offerings of the three types of pavitra with their respective tattva-mantras — ātma-tattva, vidyā-tattva, and śiva-tattva — as successive stages of purification from the grossest to the most subtle. The Gaṅgāvatāraka-sūtra (the thread that symbolizes the descent of the Gaṅgā) is offered as a special act of devotion, and the mantra for its offering is given. The concluding prayer for the completion of the vrata — acknowledging any inadvertent mistakes and requesting Śiva's gracious completion of what the devotee could not perfect — is given in full. The morning of the ceremony brings the removal of the old pavitra (placed in flowing water) and the installation of the new one on the deity, the guru, and the texts, symbolizing the annual renewal of the bond between the devotee and Śiva.