అగ్ని దేవుడు పలికెను: వసిష్ఠా! ఇపుడు నాలుగు పాదములుగ9 ధనుర్వేదమును గూర్చి చెప్పెదన. ధనుర్వేదము నాలుగు విధములు. రథములు, గజములు, అశ్వములు, పదాతులు_ఈ యోధులను బట్టి దీనిని వర్ణించ వచ్చును. యంత్రముక్తము, పాణిముక్తము, ముక్త సంధారితము, అముక్తము, బాహుయుద్దము అనునవి ధనుర్వేదము నందలి ఐదు ప్రకారములు. అందుకు శస్త్ర సపత్తి-ఆస్త్ర సంపత్తులచే యుద్దము రెండు విధములు. ఋజుయుద్దము, మాయాసుద్దము అని మరల రెండు భేదములు. క్షేపణి (విసరునది) ధనస్సు, యంత్రము మొదలగు వాటిచే విడువబడునది “యంత్రము క్తము”. శిలాఖండము, తోమరము మొదలగునవి "పాణిముక్తములు". శత్రువుమీద విసరి మరల గ్రహింపబడు బల్లెము మొదలగునవి “ముక్తసంధారితము". ఖడ్గాములు “ఆముక్తములు". ఆస్తప్రయోగములేకుండ ఈయబడిచేయు యుద్ధము నియుధ్ధము” లేదా “బాహు యుద్ధము ". యుద్ధము చేయగోరు వాడు శ్రమను జయించి, యోగ్యము"గు శస్త్రములను సంగ్రహించుకొనవలెను. ధనుర్బాణముల ప్రయోగ మున యుద్ధము సర్వ శ్రేష్టము. బల్లెముల యుద్దము మధ్యమము. ఖడ్గయుద్దము అధమము. బాహుయుద్దము అత్యంత నికృష్టము. ధనుర్వేదమున క్షత్రియవైశ్యుల కరువురికిని బ్రాహ్మణుడే గురువు. ఆపత్సమయమున శూద్రుడు కూడ యుద్ధాభ్యాసముచేసి యుద్ధము చేయవలెను. దేశములో నున్న వర్ణసంకరులుకూడ యుద్ధ సమయమున రాజునకు సాహాయ్యము చేయవలెను.
అంగుష్ఠములు, మణవలు, గలవులు, పాదములు ఒకే వైపు-కుందీ పరస్పరము దూరముగానున్నచో అది “సమపద స్థానము”. రెండు పాములును వ్రేళ్ళ బ: ముపై నిచి, మోకాళ్ళు బిగించబెట్టి ఉండగా రెండు పాదముల మధ్యభాగము మూడు జానలున్న చో ఆ “వై శాఖస్థానము”. రెండు మోకాళ్లు హంస పంక్త్యాకారమున కనబడుచు నాలుగు జాను ఎడముననున్నచో ఆది “మండల స్థానము". కుడికాలు మోకాలముందుకు చాపగా రెండు పాదముల మధ్య ఐదు జానలున్నచో ఆది “ఆలీఢము". దీనికి విపరీతముగా ఎడమకాలు చాపినపుడు “ప్రత్యాలీడము". కుడికాలు వంకరగను, ఎడమకాల అవక్రముగను రెండు పాముల గర్ఫ పార్షిభాగముల ఎడము ఐ.డు ఆంగుళములున్నచో ఇది పండ్రెండు అంగుళము: “పెద్ద స్థానకము". ఎడమ మోకాలు అవక్రముగానుండి, కుడి కాలు బాగుగా చాపినను, లేదా, కుడి మోకాలు వంగి నిశ్చలముగానున్నను, లేదా మోకాలితోపాటు కుడి కాలు దండా కారమున విశాలముగ కనబడినను 'వికటము' అను స్థాన కము. దీనితో రెండు పాపముల నడుమ రెండు హస్తములు ఏవముండును. రెండు మోకాళ్ళుక లిసి, ఉత్తానములైనచో ఆడి ‘సంపుట’ స్థానము. కొంచెము తిరిగిన రెండు పాదములు సమభావముతో దండమువలే విశాలముగను, స్థిరముగాను కనబడినచో ఆ రెండు పాదము సమభావముతో దండమువలె విశాలముగను, స్థిరముగ ను కనబడినచో ఆ రెండింటిమధ్య పొడవు పదునారు అంగుళములుండును. ఇది స్థానముల యధోచిత స్వరూపము.
వసిష్ఠా! యోధులు ముందుగా ఎడమ చేతధనస్సును, కుడి చేత గాణవులు ధరించి, విడచిన బాణములు స్వస్తి కాకార మున నుండునట్లు చేసి వాటితో గురు జనులకు నమస్కారము చేయవలెను. ధనుర్ధారియగు యోధుడు వై శాఖ స్థానమున స్థిరముగ నిలచి, స్థిత్యాయతులంద, (వర్త మాన భవిష్యత్తులందు) ఆవశ్యకత ఏర్పడినపుడు ధనస్సుపై నారిని విస్తరించి, ధనస్సు యొక్క క్రింది అగ్ర మును బాణఫలమును భూమిపై ఆన్చి మూర్లతోను, మణిబంధములతోను కొలవవలెను. ఓ ఉత్తమవ్రతపాలకా! ఆ యోధుని బాణము కంటే ధనస్సు సర్వదా పెద్దదిగా నుండవలెను. పిడికిలికి ఎదుట బాణపుంఖము నకును, ధనుర్దండమునకును మధ్య పండ్రెండు అంగుళముల దూర ముండవలెను. ఇట్లున్న పుడు ధనస్సుకు నారీ కట్ట వలెను. ఇంతకంటే ఎక్కువగాని తక్కువగానీ ఉండరాదు. ధనస్సును నాభిస్థానమునందును, బాణమును నితంబము నందును ఉంచి, ఎత్తిన హస్త మును కంటికి చెవికి మధ్య ఉంచి, ఆట్టి స్థితిలో బాణము విడువవలెను. మొదట బాణమును పిడికిలి యందు పట్టుకొని దానిని దక్షిణ స్తనాగ్రమునకు ఎదురుగా ఉంచవలెను. పిదప దానిని గౌరి పై ఉంచి, వారిని పూర్తిగా లాగి పూర్తిగ విస్త రింప చేయవలెను. నారి లోనికిగాని బైటకుగాని, ఎత్తుగా గానీ, క్రిందుగా గాని, బోర్లపడి గాని, ఉత్తానముగ గాని, చంకలముగాని, ఆత్యం:కావేష్టితము గాని కూడదు. ఆది సమముగను, స్థిరముగను, దండమువలె ఋజువుగ ను ఉండవలెను. ఈ విధముగ ముష్టితో లక్ష్యమును ఆచ్చాదంచి బాణమును విడువవలెను.
ధానుమడు ప్రయత్న పూర్వకముగ వక్షమును ఎత్తుగా నుంచి శరీరము త్రికోణాకారముగ నుండునట్లు వంగవలెను, భుజములు శిథిలముగ నుంది కంఠము నిశ్చలమై, శిరస్సు మయూర శిరస్సు వలె ప్రకాశించవలేను. లలాట - నాసికా - ముఖ - బాహు - మూల కూరగముయి సమావస్థలో నుండవలెను. గడ్డమును భుజమునకును మధ్య మూడు అంగుళముల వ్యవధానముండవలెను. ఈ వ్యవధానము మొదట మూడు అంగుళములు, తరువాత రెండు అంగుళ ములు తరువాత ఒక అంగుళము అని చెప్పబడినది. జాణవుంఖమును తర్జన్యంగుష్టములతో పట్టుకోనవలెను. పిదప మధ్యమా - ఆనామికతో కూడ పట్టుకొనవలెను. పూర్తి బాణమంత ను ధస్సు పైకి వచ్చు సంతవరకును వేగ పూర్వక ముగా రాగవలెను. ఈ విధముగ ఉపక్రమించి బాణమును విధి పూర్వకము విడువవలెను. ఓ సువ్రతా! దృష్టి చేతను ముష్టి చేతను ముందుగ ఆహతమగు లక్ష్యము నే బాణముచే భోంచవలెను. బాణము విడచిన హస్తమున శత్రువు భేదించ కుండుటకై వెంటనే దానిని వీపువే పునకు ఉంచుకొనవలెను. అందుచే ఫొనుముడు ధనస్సును లాగి మోచేతికి క్రిందుగా, నుంచి బాణము విడచు సమయమున దానిని పైకి తేవలెను. ధనుఃశాస్త్రజ్ఞులీ విషయమును బాగుగా గుర్తు ఉంచుకొనవలెను. మోచేతిని కనబడకుండ ఉంచుట మధ్యమరక్షణోపాయము. శత్రులక్ష్యముకాకుండ ఉంచుకొనుట ఉత్తమము, పండ్రెండు ముష్టుల పొడవుగల బాణము ఉత్తమము, పదునొకండు ముద్దుల పొడవు లది మధ్యమము, పదిముష్టులు ఆధమము, నాలుగు హస్తముల పొడవుగలధనస్సు ఉత్తమము, మూడున్నరహ స్తములు మధ్యమము, మూడు హస్తములు అధమము, పదాతులు సర్వదా మూడుహస్తముధనస్సును మాత్రమే ఉపయోగించవలెను. ఆశ్వము, రథము, గజము ఎక్కి యుద్ధము చేయువారు ఉత్తమధనస్సును మాత్రమే ఉపయోగించవలెను.
అగ్ని మహాపురాణమున ధనుర్వేదవర్ణనమను రెండువందల నలుబదితొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 249 of the Agni Mahā Purana is as follows:
The branch of surgery (Śalya-tantra) attributed to Suśruta is outlined. Agni describes the eight types of surgical operations — excision (chedana), incision (bhedana), scarification (lekhana), probing (eṣaṇa), extraction (āharaṇa), evacuation (visrāvaṇa), and suturing (sīvanā) — along with the ancient surgical instruments (śastra and yantra). The training of the surgical apprentice on vegetable and animal models before operating on a human body is prescribed. The chapter reflects the sophisticated surgical knowledge contained in the Suśruta Saṃhitā.