అగ్ని మహా పురాణము

264 - పునరుత్పాత శాంతయః

పుష్కరుడు పలికెను. ఇపుడు ఉత్పాతములను తొలగించు దేవ పూజాది కర్మను గూర్చి చెప్పెదను. స్నానము చేసి “ఆపోహిషా” మొదలగు (యజు 36-14,16) మూడు మంతనలతో మహావిష్ణువునకు అర్ఘ్యము సమర్పించి, “హిరణ్యవర్ణాః” (ఋక్ 11-11-1,3) మొదలగు మూడు మంతమంతో పాద్యము “శంనో ఆపః” ఆను మంత్రముతో ఆచమనము, “ఇచమాపః” (యజు-6-17) ఆనుమంత్రమతో అభిషేకమును సమర్పించవలెను. “రథే” “ఆక్షేమ,” “చతస్రః” అను మూడు మంత్రములతో గంధమును, “యువాసువాసాః” (ఋ 3-8-4) అనుమంత్రముతో వస్త్రమును “పుష్పవతి” (ఆథర్వ 8-7-27) అనుమంత్రముతో పుష్పమును, “ధూరసి” (యుజు 1-8) ఆది మంతముతో ధూప మును, “తేజోఽసి” “శుకమసి” (యజు 1-36) అనుమంత్రముతో దీపమును “దధిక్రావ్ణో” (యజు 23-28) అను మంత్రముచే మధుపర్కమును సమర్పించి “హిరణ్యగర్భః” మొదలగు ఎనిమిది ఋక్కులను పఠించి ఆన్నమును సుగంధ మగు పానీయమును సమర్పించవలెను. మిగిలిన చామర, వ్యజన, పాదుకా, ఛత, యాన, ఆసనాదులన సావిత మంత్రముతో సమర్పించవలెను. పురుషసూక్తముతో జపహోమము చేయవలయును. భగవద్విగహము లేనిచో వేదిక పై స్థాపించిన జలపూర్ణకలశము నందుకాని నదీ తటమునందగాని, కమలమునందుగాని, విష్ణువును పూజించినచో ఉత్పాతములు శమించును.

భూమిపైనున్న వేదిక పై మార్జన ప్రోక్షణములు చేసి దాని నలువైపుల కుశలు పరచి అగ్నిని ప్రదీప్తము చేసి దానిలో హోమము చేయవలెను. పరశురామా! మనస్సును, ఇంద్రియములను నిగ్రహించుకొని అన్ని అన్నములనుండియు మొదటి భాగమును గ్రహించి వాసుదేవాదులకు హోమము చేయవలెను. వాసుదేవ, దేవ, ప్రభు, ఆద్యయ, ఆగ్ని, సోమ, మిత్ర, వరుణ, ఇంద్ర, మహాభాగ, ఇంద్రాగ్ని, విశ్వదేవ, ప్రజాపతి, ఆనుమతి, ధన్వంతరి, వాస్తోష్పం , దేవి, స్విష్ట కృదగ్ని అను దేవతానామములను చతుర్థ్యంతముచేసి, వీటికి హోమముచేసి, క్రిందచెప్పువిధముగజలి సమర్పించవలెను. ఓ ధర్మజ్ఞ! ముందు ఆగ్నేయ దిక్కునందు ప్రారంభించి, తడా, ఉపతక్షా, అశ్వా, ఊర్జ, నిరుంధీ, ధూమ్రిణీకా, ఆస్వపంతీ, మేధపత్నీ, అనువారికి బలి అర్పింపవలెను. ఓ భృగునుద! ఇవి బలిని స్వీకరించు దేవతల పేర్లు, పిదప నంది న్యాది భక్తులకు బలి అర్పింపవలెను. నందినీ, సుభాగ్యా, సుమంగళీ భద్రకాళీ యను నలుగురు శక్తులకు పూర్వాది దిక్కులు నాల్గింటి యందును బలి యిచ్చి ఒక శంఖువుపైగాని స్తంభముపైగాని, “శ్రీహిరణ్యకేశీ” వనస్పతులకు బిల్ యివ్వవలెను. ద్వారము రెండుప్రక్కల ధర్మ మయ, అధర్మమయులకు గృహమధ్యమమున ధౄవునకు ఇంటి వెలుపల మృత్యువునకు జలాశయమున వరుణునకు బలిసమర్పించి ఇంటివెలుపల భూతబలిని ఇవ్వవలెను. ఇంటిలోపల కుబేరునకు తూర్పున ఇంద్రునకు ఇంద్రపురుషులకు, దక్షిణమున, యమునకు, యమపురుషులకు, పశ్చిమమున, వరుణునకు వరుణపురుషులకు ఉత్తరమున, సోమమునకు సోమపురుషునకు గృహమధ్యమున బ్రహ్మకు బ్రహ్మ పురుషులకు ఆకాశమున విశ్వేదేవతలకు పృథివీపై సంల దేవతలకు బలియిచ్చి పిదప పగలు దివాచర ములకు రాత్రి రాత్రిచరములకు బలియివ్వవలెను. ప్రతిదినము సాయంకాలమందును ప్రాతఃకాలమునందును ఇంటివెలుపల బలి యివ్వవలెను. ఒక దినమున శ్రాద్దమునకు సంబంధించిన పిండ ప్రదానము జరిగినచో ఆనాడు సాయంకాల బలి యివ్వకూడదు.

పితృశ్రాద్దమునందు దక్షిణాగ్ర కుశములపై మొదట తండ్రికి పిదప పితామహనకు పిండదానము చేయవలెను. ఇదే విధముగా మొదట తల్లికి, పిదప పితామహికి పిదప ప్రపితామహికి పిండ దానము చేయవలెను. ఈ విధముగ పితృయాగము చేయవలయును. వండిన వంటనుండి బలివే శ్వ దేవములు చేసిన పిమ్మట ఐదు బలులు ఇవ్వవలేమ. ఇంద్ర, వరుణ, వాయు యమ, నీఋతి దేవతల దిక్కులందు నివసించు కాకులు నేను ఇచ్చిన ఈ పిండమును గ్రహించుగాక! అను ఆర్డము గల మంత్రముతో కాక బలి ఇవ్వవలెను శ్యామ శబల, వర్ణములు గల రెండు శునకములు వివస్వంతుని కులమున జన్మించినవి. నేమ ఆరెండింటి పిండ ప్రదానము చేయుచున్నాను. అదినన్ను మార్గమునందు సర్వదా రక్షించుగాక! అను ఆర్థ ము గల మూలోకమంత్రము చదువుతూ కుక్కలకు బలిఇవ్వవలెను. త్రిలోకజననులు, కామధేను వుత్రికలు ఆయిన గోవులు ఆందరికీని పాతక రములు పవిత్రములు, పాపవినాశ కమలు. ఆవినేనిచ్చు ఈ గ్రాసమును గ్రహించుగాక! అను అర్థము గల మూలో క్తమంత్రముతో గోవునకు గ్రాసమును ఇచ్చిస్వ స్యయనము చేయవలయును. పిదప యాచకులకు భిక్షయిచ్చి దీనులగు ప్రాణులకును ఆతిథులకును అన్నము పెట్టి గృహస్థుడు తాను తినవలెను. “ఓం భూస్వాహా” మొదలు “ఓం ప్రజాపతయే స్వాహా” వరకును గల మూలోక్త మంత్రములు చదువుతు, అన్నాహుతులివ్వవలెను. ఈ విధముగా విష్ణుపూజా వైశ్యదేవ బలులను గూర్చి నీకు చెప్పితిని.

ఆగ్ని మహాపురాణమున ఉత్పాతశాంతి యను రెండువందలఆరువదినాల్గవ అధ్యాయము సమాప్తము.