పుష్కరుడు పలికెను. వినాయకులచే పీడితులకు సర్వమనోరథములు ఇచ్చుస్నానమును చేప్పెదను, కర్మ లకు విన్న ముకళించుటకు బ్రహ్మ విష్ణు, మహేశ్వరులు వినాయకుని నిర్మించి ఆతనికి గణాధి పత్యమును కూడ ఇచ్చిరి వినాయక పీడితుడు స్వప్నములో లోతైన నీటిలో మునిగిపోవును. ముండిత శిరస్కు: ను చూచును. మాంస మాను తీను మృగములను ఎక్కును ఎచట కేని నడచివెళ్లినపుడు తనవేనుక ఎవరోవచ్చుచున్నట్లు అనుకొనును. కారణము లేకుండగనే మనస్సు డి వ్యర్థ ప్రయత్నములు కలవాడగును. కన్యకు వరుడు లభించడు, శ్రీక సంతానము లభించదు. శ్రోత్రి యునకు ఆచార్యత్వము శిష్యునకు ఆధ్యయనము, ధనికునకు లాభము, కృషి వలునకు కృషి, రాజు నకు రాజ్యము లభింపవు. అట్టి వారికి స్నానము చేయించవలేను. హస్త , పుష్యమి, అశ్విని, మృగశిర శ్రవణనక్షత్రము లందు కదపీఠముపై కూర్చుండబెట్టి పచ్చటి ఆవాలు నూరి నేతితో తడపి వాని శరీరమునందంతటను నలిచి, వాని శిరస్సుపై సర్వౌషద సహితములగు, అన్ని విధముల సుగంధ ద్రవ్యములను లేపనమునుచేసి సర్వౌషధులు వుంచిన నాలుగు కలశ లజముతో ఆతనికి స్నానము చేయించవలెను. అశ్వశాల, గజశాల, పుట్ట, నదీసంగమము, జలా శయము, వీటినుండి తీసుకొనివచ్చిన ఐదు విధములగు నట్టియు, గోరోచనము, గంధము, గుగ్గులు, ఆ కలశ జలము «ందు ఉంచవలెను. ఆచార్యుడు తూర్పుననున్న కలశ తీసుకోని సహస్రనేత్రములు కలదియు, మహర్షులచే పవిత్రీ కృతమును, ఆగుజలముతో నీకు స్నా నముచేయించుచున్నాను. ఈ పవిత్రజలము నిన్ను పవిత్రుని చేయుగాక అని చెప్పుచు స్నానము చేయించవలయును. రాజీవ వర్ణుడు సూర్యుడు, బృహస్పతి, ఇంద్రుడు, వాయువు, సప్త రులు , నీకు కల్యాణమును చేసిరి. అనియు, “నీ కేశములందును, సీమంతమునందును, శిరస్సుయందును, లలాట, కర్ల, నేత్రములందున్న దౌర్భాగ్యమును ఈజలము పూర్తిగా తొలగించుగాక." యనియు చెప్పుచు స్నానముచేయించవలెను. గురువు తవఎడమచేతిలో గ్రహించిన కుశలను ఆస్నానము చేసినవాని శిరస్సుపై ఉంచి, ఉడుంబస్రువతో ఆవ నూనెను హోమము చేయవలెను. ఆసమయమున చివర స్వాహాయను పదము చేర్చిన చతుర్థ్యంతములగా వితసమ్మిత. శాలకకంటక-కూష్మాండ .రాజపుత్ర.ఆనుపదములను చెప్పవలెను. హోమము చేయగా మిగిలిన చరువుతోనమః ఆమ పదము చేరిన జలమంత్రములను ఉచ్చరించుచు వారికి బలిఇవ్వవలెను. పిమ్మట చేటలో అంతట కుశములు పరచి తడిపొడిగా వున్న బియ్యము నూరిన తిలలంక లిపిన ఆన్న ము, వివిధసుష్పములు మాంసాన్నము, మత్స్యములు, త్రివిధసుర, మూలి, పూరి, అపూపములు ఏండవిక మాలలు, దధ్యన్నము, పాయసము, పిష్టము, లడ్డులు, బెల్లము వీటిని ఒక చోట చతుష్పథమునందు చేర్చి వాటిని దేవతా సువర్ణ-సర్ప- గృహ- అసుర యాతుధాన-పిశాచ-నాగ మాతృ-శాకినీ-యక్ష-వేతాళ యోగినీ-పతనాదులకు ఆర్పించవలేను. పిదప వినాయకుని తల్లియైన ఆంబికకు దూర్వాదళ ములు తెల్ల ఆవాలు, పుష్పములు, వీటితో నిండిన అంజలినిసమర్పించి, సౌభాగ్యవతియైన ఓ దేవి! నాకురూపమును, యశస్సును, సౌభాగ్యమును, పుత్రుని, ధనమును, సర్వకామములను ఇమ్ము అని ప్రార్థించవలెను. బ్రాహ్మణులకు భోజనము పెట్టి ఆచార్యునకు రెండు వస్త్రములు ఇవ్వవలెను. ఈ విధముగ వినాయకుని గ్రహములను పూజించుటచే ఐశ్వర్యమును, కర్మఫలమును పొందును.
అగ్ని మహాపురాణమున వినాయక స్నాతమను రెండువందల ఆరువదియారవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 266 of the Agni Purāṇa is as follows:
The science of temple architecture (Prāsāda-lakṣaṇa) is presented. Agni describes the three main styles of Hindu temple architecture: Nāgara (northern), Drāviḍa (southern), and Vesara (mixed). The proportional measurements of the vimāna (tower), the garbhagṛha (sanctum), the maṇḍapa (hall), and the ardha-maṇḍapa (antechamber) are given according to the Vāstu-śāstra principles. The chapter stresses that a temple built according to these divine proportions becomes a living cosmic diagram that radiates the deity's energy throughout the surrounding region.