హయగ్రీవుడు చెప్పెను:- బ్రహ్మదేవా! దేవాలయములో స్థాపింపదగిన దేవతలను గూర్చి చెప్పెదను; వినుము; పంచాయ తన దేవాలయమునందు, మధ్యనున్న ప్రధానాలయమున వాసుదేవుని స్థాపింపవలెను. మిగిలిన నాలుగు ఆలయములలో ఆగ్నేయయాలయమునందు వామనుని, నైరృతాలయమునందు నరసింహుని, వాయవ్యాలయమునందు హయగ్రీవుని, ఈశాన్యా లయమునందు వరాహమూర్తి ని స్థాపింపవలెను లేదా మధ్యయుదు నారాయణుని స్థాపించినచో ఆగ్నేయమున దుర్గాదేవిని, నైరృతియందు సూర్యుని, వాయవ్యమున బ్రహ్మను, ఈశాన్యమున లింగరూపుడుగా శివుని స్థాపింపవలెను లేదా ఈశాన్యమున రుద్రమూర్తిని స్థాపింపవలెను. లేదా ఎనిమిది దిక్కులందును ఎనిమిది ఆలయములను, మధ్యయందు ఒక ఆలయమును నిర్మించి, వాటిలో మధ్యనున్న ఆలయమునందు వాసుదేవుని స్థాపించి, తూర్పు మొదలగు దిక్కులందు పరశు రాముడు మొదలగు ముఖ్యమైన తొమ్మిది అవతారములను, ఇంద్రాదిలోకపాలులను స్థాపింపవలెను. లేదా మొత్తము తొమ్మిది స్థానములందు ఐదు ప్రధానాంయములను కట్టించి మధ్యాలయమునందు పురుషోత్తముని స్థాపింపవలెను,
తూర్పున లక్ష్మిని, కుబేరుని, దక్షిణమున మాతృకాగణ కుమారస్వామి, గణపతి, శివులను, పశ్చిమమున సూర్యాది నవగ్రహములను, ఉత్తరమున మత్స్యాది దశావతారములను స్థాపింపపలెను. అట్లే ఆగ్నేయమున చండీదేవిని, నేరృతిదిక్కున అంబికను, వాయన్యమున సరన్వతిని, ఈశాన్యము లక్ష్మిని స్థాపింపవలెను మధ్యభాగమునందు వాసుదేవుని లేదా నారాయణుని స్థాపింపవలేను లేదా పదమూడు గదులుగల దేవాలయమున మధ్యభాగమునందు విశ్వరూపుడగు మహా విష్ణువును స్థాపింపవలెను.
లేదా తూర్పు మొదలగు దిక్కులలో కేశవాది ద్వాదశ విగ్రహములను స్థాపించి మిగిలిన గృహమునందు సాక్షాత్తు శ్రీహరిని స్థాపించవలెను. భగవత్ప్రతిమను మట్టి, కట్టి, లోహము, రత్నములు, జాయి, చందనము, పుష్పము అను ఏడువస్తువులతో నిర్మింపబడి ఏడువిధములుగ నుండును. వుష్పములతోమట్టితో, చందనముతో నిర్మించిన ప్రతిమను వెంటనే పూజింపవలెను. చాల సమయము ఉంచకూడదు. పూజింపబడిన ఈ ప్రతిమలు సమస్త కామములను శీఘ్రముగ ఫలింపజేయును.
ఇప్పుడు శిలానిర్మిత ప్రతిమను గూర్చి చెప్పెదను. పర్వతమునుండి తీసికొనివచ్చిన జాయితో చేసిన ప్రతిమ ఉత్తమమైనది. పర్వతములు లేని పక్షమున భూమిలో లభించిన జాయి ఉపయోగింపవచ్చును. బ్రాహ్మణాదివర్ణముల వారికి వరుసగ తెల్లని, ఎఱ్ఱని, పచ్చని, నల్లని ఱాళ్ళు ఉత్తమమైనవి. తగిన వర్ణముగల శిల లభించనిచో ఆలోపమును తీర్చుటకై నరసింహ మంత్రముతో హోమము చేయవలెను. శిలపై తెల్లని రేఖఉన్నచో ఆది చాలా ఉత్తమమైనది. నల్లరేఖ ఉన్నచో నరసింహ హోమము చేసిన పిమ్మట అది ఉత్తమముగాను కంచుమంటవంటి ధ్వని వచ్చుచు, భేదించినపుడు అగ్నికణములు వచ్చు శిల “పుంలింగము” ఆ చిహ్నహములు తక్కువగా ఉన్న శిల “స్త్రీ లింగము” ఈ రెండు చిహ్నములను తేనిది “నపుంసకలింగము’’ ఏదైన మండలము వంటి గుర్తు ఉన్న శిల ‘సగర్భ’; దానిని పరిత్యజింపపలెను.
ప్రతిమలను నిర్మించుటకై అడవిలోనికి వెళ్ళి వనయాగము ప్రారంభింపవలెను. అచట ఒక కుండము త్రవ్వి, దానిని ఆలికి, మండపముపై విష్ణుమూర్తి ని పూజింపవలెను. విష్ణువునకు బలి సమర్పించి ప్రతిమా నిర్మాణకర్మ యందు పయోగించు టంకము మొదలగు. శస్త్రములను పూజించవలెను. హోమము చేసిన పిమ్మ బియ్యపు నీళ్ళతో అస్త్ర మంత్రమును. (ఆస్తాయఫట్) ఉచ్చరించుచు ఆ శిలను తడుపవలెను. నరసింహమంత్రముతో దానికి రక్ష చేసి మూలమంత్రముతో (ఓం నమోనారాయణాయ) పూజచేయవలెను. పూర్ణాహుతి హోమము చేసిన పిమ్మట ఆచార్యుడు. భూతములకు బలి సమర్పింప వలెను. అచట కనబడకుండ నివసించు జంతువులు, రాక్షసులు, యక్షులు, సిద్దులు మొదలగు వారికందరకు పూజలు చేసి, కేశవుని ఆజ్ఞచే మేము ప్రతిమల కొరకై ఈయాత్రపై వచ్చితిమి. శ్రీమహావిష్ణుని కార్యము మీ కార్యముకూడ అగును అందుచే మేమిచ్చిత్త. ఈ బలిచే తృప్తులై మీరు వెంటనే ఈ స్థానమును విడచి, కుశల పూర్వకముగ మరొక చోటికి వెళ్ళుడు అని చెప్పుచు క్షమా ప్రార్థన చేయవలెను. ఈ విధముగ ప్రార్థింపబడిన వారందరును ప్రసన్నులై సుఖముగ ఆ స్థానమును , విడచి మరొక ప్రదేశమునకు వెళ్ళి ఫోవుదారు. పిమ్మట శిల్పులతో కలసి యజ్ఞ చరువును భక్షించి రాత్రి నిద్రించు సమయ మున స్వప్న మంత్రమును ఈ విధముగ జపించవలెను “సమస్త ప్రాణులకును వాసస్థానమైన వాడును, సర్వవ్యాపకుడును సర్వసష్టయు, విశ్వరూపుడును, స్వప్నాధిపతియు అగు శ్రీహరికి నమస్కారము దేవా! దేవేశ్వరా! నేను నీసమీపమున నిద్రించుచున్నాను. నా మనస్సులో ఏకార్యములను సంకల్పించితినో వాటి విషయమున నాకంతయు తెలుపుము” ఇట్లు ప్రార్థించి “ఓం ఓం హ్రూంవట్ విష్ణవే స్వాహా” అను మంత్రమును జపించి నిద్రించగా శుభస్వప్నము వచ్చినచో శుభము కలుగును. చేడు స్వప్నము వచ్చినచో నరసింహమంత్రముచే హోమము చేయగా శుభమే కలుగును. ఉదయమున లేచి, అస్త్ర మంత్రముతో శిల పై ఆర్ఘ్యమీయవలెను. పిమ్మట అస్త్రపూజ చేయవలెను, గునపము, టంకము మొదలగు అస్త్రముల ముఖమును అతనికి చూపవలెను.
శిల్పి ఇంద్రియ నిగ్రహవంతుడై, టంకము చేతగై కొని ఆ శిలను చతురస్రముగా నుండునట్లు చేయవలెను. పిమ్మట పిండిని చేయుటకై దానిని కొంచెము చిన్నది చేయవలెను. పిమ్మట ఆ శిలకు వస్త్రము చుట్టి, రథము పై ఉంచి, శిల్ప శాలకు తీసికొని వచ్చి, మరల దానికి పూజ చేయవలెను. పిమ్మట ప్రతిమ నిర్మింపవలెను.
ఆగ్ని మహాపురాణమునందు ప్రాసాద దేవతాస్థాపన శాంత్యాది వర్ణనమను నలుబదిమూడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 43 of the Agni Mahā Purana is as follows:
The forty-third chapter presents the iconographic canon (pratimā-lakṣaṇa) for the image of Bhagavān. The proportional system (tāla-māna) governing the measurement of divine images — using the face-length as the base unit — is described for images of nine, eight, or seven tāla-s in height, each appropriate to a different class of deity or a different spiritual purpose. The thirty-two auspicious characteristics (lakṣaṇa-s) of a well-formed divine image — symmetry, the serene expression (prasanna), the long eyes, the lotus-like hands, the proportionate limbs — are enumerated. Specific iconographic descriptions for Viṣṇu's four-armed form, Śiva's ten-armed dance form, and Devī's forms are given. The chapter affirms that a properly formed image that conforms to the prescribed canon truly channels the presence of the deity and is worthy of worship.