స్వాయంభువమనువు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అను కుమారులను, తపఃశాలిని యగు శతరూప యను సుందరి యగు కుమార్తెను జనింపచే నెను
ఉత్తానపాదుని వలన సురుచియందు ఉత్తము డను పుత్రుడును, సునీతయందు ధ్రువుడను పుత్రుడును జనించిరి. ఓ మునీ ధ్రువుడు, కీర్తి కొరకై, మూడు వేల దివ్య వర్షములపాటు తపస్సు చేసెను.
ఆతని విషయమున సంతసించిన విష్ణువు ఆతనికి సపరులకంటే ముందు స్థిర మైన స్థానము నిచ్చెను. ఆతని అభివృద్ధిని చూచి ఉశనుడు ఒక శ్లోకమును (ప్రశంసావాక్యమును) చదివేను. “ఈతని తపస్సు యొక్క ప్రభావము ఎంత గొప్పది! ఈతని శాస్త్రజ్ఞానమెంత అద్భుత మైనది: సప్తర్షులు కూడ ఈతని తమ ఎదుట నిలుపుకొని యున్నారు కదా!
ద్రుపునకు శిష్టి, భవ్యుడు, శంభువు అను కుమారులు జనించిరి. శిషికి సుచ్చాయవలన, రిపువు, రిపుంజయుడు, రిప్రుడు, వృకలుడు, వృక తేజసుడు అను పుణ్యాత్ములైన కుమారులు జనించి. రిపువుకు బృహతియందు చాక్షుషుడు, నర్వతేజసుడు అను పుత్రులు జనించిరి.
దాశుషుడు పుష్కరిణిలో, వీరణియందు మనువును జనింపచేసెను. మనువునకు, నడ్వలయందు ఊరుడు, పూరుడు, తపస్వి, సత్యవాక్కు, కవి, అగ్నిష్టుడు, అతిరాత్రుడు, సుద్యుమ్నుడు, అతిమన్యుకుడు - అను పదిమంది సుతో త్తములు జనించిరి.
ఊరునివలన ఆగ్నేయ ఆంగుడు, సుమనసుడు, స్వాతి, క్రతువు, అంగిరసుడు, గయుడు అను కాంతిమంతు లగు ఆరుగురు కుమారులను కనెను.
అంగునకు సునీథుని కుమార్తెయందు రేను డను ఒక కుమారుడు జనించెను. పాపాసకుడై ప్రజారక్షణము చేయని ఆ వేనుని మునులు కుళములను ప్రయోగించి సంహరించిరి.
పిమ్మట మునులు సంతానము కొరకై వేనుని కుడి చేతిని మధించగా దానినుండి పృథుచక్రవర్తి జనించెను
మునులందరును ఆతనిని చూచి – “మహాతేజశ్శాలి యైన ఇతడు ప్రజలను రంజింపచేయగలడు. గొప్ప కీర్తిని కూడ పొందగలడు” అని పలికిరి.
క్షత్రియుల పూర్వపురుషుడును, వైన్యుని కుమారుడును, తేజస్సుచే దహింపచేయుచున్నట్లు కనబడుచున్న వాడును ఆగు ఆ పృథువు ధనస్సును, కవచమును ధరించి ప్రజ లందరిని రక్షించెను.
ఆ రాజు రాజసూయ యాగము చేసి అభి షేకము పొందిన వారిలో మెదటివాడు. అతని నుండి పుట్టిన నేర్పరు లైన వీరులైన సూత మాగధులు ఆతనిని స్తుతించిరి. ఆతడు ప్రజల జీవనమున కుపయోగించు సస్యములను సంపా దించుట కై భూమిని పిదికెను.
దేవతలును మునిగణములును, గంధర్వులును, ఆరోగణములును. పితృదేవతలును, దానవులును, సర్పములును, లతలును, పర్వతములును, జనులును ఆ యా పాత్రలలో పిదుకగా భూమి వారివారికి కావలసిన క్షీరము నిచ్చెను. దానిచే వారందరును ప్రాణధారణము చేసిరి.
పృథుచక్రవర్తికి అంతర్గ, పాలితుడు ఆను ధర్మవేత్త లైన ఇరువురు కుమారులు జనించిరి. శిఖండిని ఆంతర్గ నుండి హవిర్గాను దనేడు కుమారుని క నేను. అగ్ని పుత్రి యగు ధీషణ హవిర్గానుని వలన ప్రాచీన శిస్సు, శుక్రుడు, గయుడు. కృష్ణుడు. ప్రజుడు, అజినుడు అను ఆరుగురు కుమారులను క నేను.
యజ్ఞము చేయుచున్నప్పుడు కుశలు, వాటి ఆగ్రములు తూర్పు వైపున కుండునట్లు భూమి పై వరవబడెను. అందుచే పూజ్యు డైన ఆ ప్రజావతికి “ప్రాచీన బరిస్సు” అను పేరు వచ్చెను.
సముద్రుని కుమార్తె యైన సవర్ణ ప్రాచీనబరి స్సువలన పదిమంది కుమారులను క నేను వారందరికిని ప్రచేతసు. లనీయే పేరు. వారందరును ధను ర్వేదమునందు పరిపూర్ణప్రజ్ఞ కలవారు.
ఒకే విధముగా ధర్మము నాచరి. చుచున్న వారందరును సముద్ర జలమున నివసించి పది వేల సంవత్సరములు గొప్ప తపస్సు చేసిరి.
వారు విష్ణువునుండి ప్రజాపతిత్వమును పొంది, సంతసించినవారై నముద్రజలమునుండి లేచిరి. అపుడు భూ న్యూకాశములు వృక్షములచే వ్యాప్త ములై యుండెను. వారు తమ ముఖమునుండి పుట్టిన అగ్ని వాయువులచే ఆ వృక్షము లను దహింపచేయ మొదలిడిరి. అపుడు రాజైన సోముడు ప్రజావతుల దగ్గరికి వెళ్లి- “కోపమును ఉపసంహరింపుడు భవిష్యత్తును గూర్చి తెలిసిన నేను తపశ్శాలి యగు కండుముని కుమారే యేన ప్రమోచయందు ఉ తమురా లగు మారిష చుసు కన్యను జనింపచేసితిని ఆమెను మీకు ఇచ్చెదరు. ఆమె మీ వంశమును వృద్ధి పొందించు భార్య యగుగాక. ఆమెయందు పుటిన దక్షుడు ప్రజలను వృద్ధిపొందిoచును.
ప్రచేతసులు ఆమెను స్వీకరించిరి. ఆమెకు దకుడను కుమారుడు జనించెను. అతడు మనస్సుచే స్థావర జంగమము లకు,ద్విపాత్రులను (మసమ్యలు మొదలగువారిని) చతుష్పాత్తులను (నాలుగు కాళ్సుగల పశ్వాదులను.) సృజించి పిమ్మట స్త్రీలను సృజించెను. వారిలో పది మందిని యమధర్మరాజునకును, పదముగ్గురిని కశ్యపునకును, సోమునకు ఇరువది యేడు రిని, అరిష్టనేమికి నలుగురిని, బహుపుత్రునకు ఇద్దరిని, ఆంగిరసునకు ఇద్దరిని ఇచ్చెను. పూర్వము వారియందు మానస మైథునముచే దేవతలును, నాగాదులును జన్మించిరి.
యమధర్మరాజునకు తన పదిమంది భార్వలవలన కలిగిన సంతానమును గూర్చి చెప్పేదను. విశ్వకు విశ్వే దేవతలు, సాధ్యకు సాధ్యులు, మరుత్వతికి ఇద్దరు ముత్వంతులు, వస్తువునకు వసువులు భానువుకు భానులు, ముహూర్త కు ముహూర్తులు, లంబకు ఘోషుడు. యామికి నాగ వీధి, మరుత్వతికి వృథివీ సంబద్ధమగు సకల వస్తుజాతము, సంకల్పకు సంకల్పులు జనించిరి. చంద్రునకు నక్షత్రముల వలన ఆపుడు, ధవుడు, సోముడు, ధరుడు, అనిలుడు అనలుడు, ప్రత్యూషుడు. ప్రభాసుడు, ఎనమండుగురు వసువులును జన్మించిరి.
ఆపుని కుమారులు వైతండ్యుడు, శ్రీముడు, శాంతుడు, ముని అను వారు. లోకాంతుడైన కాలుడు ధ్రువుని కుమారుడు. వర్చసుడు సోముని కుమారుడు. ద్రవిణుడు, హుతహవ్యవహుడు శరుడు, ప్రాణుడు, రమణుడు అనువారు ధరు నికి మనోహరయ దు కుమారులుగా జనించిరి. అనిలుని కుమారుడు పురోజవుడు. ఆనలుని కుమారుడు ఆవిష్ణాతుడు.. కుమా రుడు అగ్ని పుత్రుడుగా శరస్తంబమునందు జనించెను. ఆతని తరువాత శాఖుడు, విశాఖుడు, నైగమేయుడును పుట్టిరి కృత్తిక నుండి కార్తి కేయుడును, యతియైన సనత్కుమారుడును పుగ్గిరి.
వేలకొలది శిల్పములను చేయువాడును, దేవతల వడ్రంగియు, కాంతిమంతుడును అగు విశ్వకర్మయను దేవలుడు ప్రత్యూషనుండి జనించెను. మనుష్యులు భూషణాది శిల్పములను జీవనాధారముగా చేసి కొనుచుందురు.
సురభి తపస్సుచే పవిత్రీకృతురాలై, మహాదేవుని ప్రసాదముచే ఏకాదశరుద్రులను కనెను. మేక పాదము వంటి ఒక పాదము గల ఆహిర్భుధ్యుడు, త్వషయను రుద్రుడు, బహురూపుడు, హరుడు, పరాజితుడు కాని త్ర్యంబకుడు, వృషాఢ మియు, కవర్ద (జటా) ధారియగు శంభువు, రేవతుడు, మృగవ్యాధుడు, సర్పుడు, పదకొండవవాడైన కపాలియు, చరాచర జగుత్తును వ్యాపించిన కోట్లకొలది రుద్రులు జనించిరి. శ్రీమంతుడును, మహా యక శాలియు ఆగు విశ్వరూపుడు త్వష్ట కుమారుడు.
అగ్ని మహాపురాణములో స్వాయంభువమనువంశ వర్ణనమను అష్టాదశాధ్యాయము సమాప్తము.
Summary of chapter 18 of the Agni Purāṇa is as follows:
Departing from genealogy, this chapter presents a theological celebration of Bhagavān Śiva. Śiva's supreme nature as the destroyer of the three cities (Tripurāntaka), his five divine acts (pañcakṛtya — sṛṣṭi, sthiti, saṃhāra, tirobhāva, anugraha), and his identity with the ultimate reality are expounded. The chapter includes a Śiva Gītā passage in which Śiva reveals to a devotee the non-dual truth that all deities are ultimately one supreme consciousness. Śiva's sacred forms — the liṅga, Ardhanārīśvara, Dakṣiṇāmūrti — and the significance of his attributes (triśūla, ḍamaru, jaṭā, bhasma) are explained. The chapter affirms that knowledge of Śiva is identical with liberation.