అగ్ని మహా పురాణము

346 - అథ కావ్యగుణవివేకః

అగ్ని దేవుడు పలికెను. గుణరహితమగు కావ్యము ఆలంకార సహితమైనను ప్రీతి జనకము కాదు. లలితము కాని స్త్రీ శరీరముపై హారము బరువుకు చేటు. దోషాభావమే గుణము కదా ! గుణములను ఇక చెప్పుట ఎందుకు యని అవ కూడదు. ఏలనన ! శ్లేషాది గుణములు, గూడార్థత్వాది దోషములు వేర్వేరుగా చెప్పబడినవి. కావ్యమునందు శోభాతిశయ మును కల్గించునవి గుణములు. సామాన్యములు వై శేషికములు అని ఇవి రెండు విధములు. సర్వ సాధారణమాలు సామాన్యములు. ఇవి శబ్ద - అర్ధ - శబ్దార్ధ ములతో సంబంధించి మూడు విధములగును. కావ్య శరీరమగు శబ్దమును ఆశ్రయించినది శబ్దగుణము. శ్లేష లాలిత్యము, గాంభీర్యము, సౌకుమార్యము. ఉదారగా ఓజస్సు, యౌగికీ యని శబ్ద గుణములు ఏడు విధములు. శబ్దముల చిక్కదనము శ్లేష. గుణ వృద్ధ్యాదుల ద్వార అక్షరమాలకు సంధిలేనిచో అది లాలిత్య గుణము. ఉత్తమ భావవ్యంజకములగు శబ్ద సమూహము విశిష్ట లక్షణ యుక్తమైనచో ఆది గాంభీర్యము. దానికే శబ్దత అని పేరు. నిష్ఠు రాక్షరములు లేని శబ్దములు అధిక ముగనున్న చో అది సౌకుమార్యము. శ్లాఘ్య విశేషణములతో కూడిన ఉత్కృష్టవదముల ప్రయోగము ఔదార్యము. దీనికే ఉత్తాన పడతాయని పేరు. సమాస బాహుల్యము ఓజస్సు; ఇది పద్యాదులకు జీవితము. బ్రహ్మ మొదలు స్తంభము వరకు వున్న జీవుల పౌరుషమున ఓజోగుణ విశిష్ట శబ్దములతోడనే వర్ణింప వీలగును. ఏశబ్దము లై నను ప్రయోగించి వర్ణింపబడు వస్తువుల ఉత్కర్షను సూచించునది ఆర్ద గుణము. మాధుర్యము సంవిధానమ, కోమలత్వము. ఉదారత, ప్రౌఢి, సామైక తా, అని ఆర్డ గుణములు ఆరు. క్రోధ ఈర్ష్యాదులందు కూడ ఆకార గాంభీర్యము ధైర్యము ఉండుట మాధుర్యము. కార్యసిద్ధికై ప్రయత్నము సంవిధానము. కాఠివ్యాది దోషవర్ణిత మగు మృదు సన్నివేశము కోమలత. ఔదార్యమును సూచించుచు ఆశయమును అతి సుందరముగ ప్రకటించినచో ఆది ఉదార లో. అభీష్టమగు విషయ మును గూర్చి తన్నిర్వాహమును సమర్థించు హేతుగర్భ యుక్తులకు ప్రౌఢ యని పేరు. స్వతంత్రము గానీ పరతంత్రము గాని యగు కార్యము యొక్క బాహాంతర సంయోగముచే కలుగు ఆర్థవ్యుత్పత్తి కి సామెకతయని పేరు.

శబ్దార్థములు రెండింటికీని ఉపకారక ముగా మండునది ఉభయ గుణము. ప్రసాదము సౌభాగ్యము యథాసలఖము ప్రశ స్తత పాకము రాగము అని ఆరువిధములు. ప్రసిద్ధార్థములగు పదముల ప్రయోగము ప్రసాదము; దేనిని వర్ణించగ ఉత్కర్ష సూచితమగునో అట్టి వర్ణనము సౌభాగ్యము; దీనికే ఉదారత్వమని పేరు. తుల్యవస్తువులను క్రమముగ చెప్పుట యథాసంఖ్యము; వర్ణనీయమగు దారుణ వస్తువును సమయాను సారముగ అదారణ శబ్దములచే వర్ణించుట ప్రాశస్త్యము. పదార్థము యొక్క ఉన్నత పరిణితి పాకము; మృద్వికాపాకము నారికేళాంబు పాకమని ఆవిరెండు విధములు. ఆదినుండి అంతమువరకుర సభరిత మేనది మృద్వికాపాకము; కావ్యము నందలి ఛాయ విశేషమునకు రాగమని పేరు. అభ్యాసవశముచే ఇవి సహజ కాంతిని కూడ అతిశయించి పుండును. ఒకానొక విశేష లక్షణముచే అనుభవమానకు వచ్చుదానిని వైశేషిక గుణమందురు. హరిద్రారాగము కౌసుంబరాగము నీలిరాగము అని రాగము మూడు విధములు. స్వలక్షణగోచరమైనది అనగా ఆవస్య సాధారణమైన ధర్మము వైశేషికము.

అగ్ని మహాపురాణమున కావ్య గుణ వివేక కథనమను మూడు వందల నలుబది ఆరవ అధ్యాయము సమాప్తము.