ఆగ్నిదేవుడు పలికెను, సమ, అర్ధసమ, విషయములను, మూడు విధములగు వృత్తములను చెప్పెను. సమ వృత్త సంఖ్యలో అదే సంఖ్యతో గుణించవలెను. దాని గుణన ఫలము అర్థ సమవృత్త సంఖ్యయగును. ఆర్ధ సమవృత్త సంఖ్యలో కూడ ఆసంఖ్యతో గుణించగా ఎంత వచ్చునో యన్ని విషమ వృత్తములగును. విషమ వృత్త ఆర్ధ సమవృత్త సంఖ్యలలో మూలరాశిని తీసివేయగా శుద్ధ విశమ, శుద్ధ అర్ధ సమ, వృత్తముల సంద్య తెలియును. ఒక్కొక్క పాదము నందు గురు లఘువులతో సమాప్తిని పొంది అనుష్టుప్ కు “సమాని” యని పేరు. అంతిమ వర్ణములు వరుసగా లఘువు గురువుయైనచో యది ప్రమాణీ ఈ రెండింటి కంటే భిన్నమైనది వితానము ఇటు పైన మూడు అధ్యాయముల వరకు పాద స్యయను పదము, పడ చతురూర్ధ్వ ఛందస్సు వరకు అనుష్టుప్ వక్త్రము యనునదియు, అధికార పదములు వక్త జాతి ఛందస్సులో పాద ప్రథమాక్షరము తరువాత సగణన గణములను ప్రయోగించరాదు. చతుర్ధాక్షరము తరువాత భగణము ప్రయోగించవలెను. ద్వితీయ, చతుర్థ పాదముల నాల్గవ అక్షరముల తరువాత జగణము వచ్చినది పథ్యా వక్త్ర. కొందరి మతము ప్రకారము ఇందుకు విపరీతముగ చేసినచో ఆది పథ్యా. విషమ పొద చతుర్ధాక్షరానంతరము, నగణము సమపాద చతుర్ణాక్షరానంతరము యగణము వున్నది చపలా సమ పాదములలో యేడవ అక్షరము లఘువు అయినచో యది విపులా ప్రథమ తృతీయ పాదముల, చతుర్థాక్షరము తరువాత, యగణమునకు బదులు థగణాదులన్న చో యది విపులా ఈ విధముగ విపుల యనేక విధములుగా వుండును. ఇంతవరకు వక్త్ర జాతి ఛందస్సులు చెప్పబడినవి. అనుష్టుప్ ప్రథమ పాదము తరువాత పాదము లందు క్రమముగా నాల్గేసి అక్షరమున్న చో దానికి పాద చతురూర్వము యని పేరు. దీనిలో చివరి రెండు అక్షరములు గురువు లైనచో ఆపీడము మొదటి రెండు అక్షరములు, గురువు, మిగిలినవన్ని లఘువు లైనచో ప్రత్యాపీడము పదచతురూర్ధ్వ ఛందస్సులో, ప్రథమ పాదమునకు ఇతర పాదమునకును పరివర్తన మున్నచో వరుసగా మంజరి, లవలి, అమృతధార, యన ఛందస్సులు ఏర్పడును. ఇపుడు ఉద్దల ఛందస్సు చెప్పబడుచున్నది. ప్రథమ పాదమున స, జ, స, లఘువులు, ద్వితీయ పాదమున న, న, జ, గురువులు, తృతీయ పాకము ధ, న, జ, లఘు గురువులు, చతుర్థ పాదము స, జ, సజ, గురువులు వున్నచో యది ఉద్దలా ఛందస్సు దీని తృతీయ చరణమున రా, న, థ, గురువులు వున్న చో యది సౌరభము. ఉద్ధత తృతీయ పాదమున న, మ, స, స లు వున్నచో యది లలిత, ప్రథమ పాదమున య, స, జ, భ, గురుద్వయములును, ద్వితీయ పాదమున స, న, జ, ర, గురువులు, తృతీయ పాదమున న, న, స ములును, చతుర్థ పాదము న, న, న, జ, భగణములును వున్నచో యది ప్రచుపిత ఛందస్సు. దీని తృతీయ పాదమున న, స, న, న, స, గుణములున్నచో వర్ధమాన ఛందస్సు తృతీయ పాదమున త, జ, ర ములు వున్నచో యది శుద్ద విరాడర్షభము. ఇపుడు అర్ధ సమ వృత్తములు చెప్పెదను.
అగ్ని మహా పురాణమున ఛందస్సార మను మూడు వందల ముప్పది రెండవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 333 of the Agni Mahā Purana is as follows:
The observances (vratas) performed on sacred days of the lunar calendar are described for the purpose of earning merit, curing illness, winning boons, and purifying the mind. Agni enumerates the vratas associated with each tithi — from the Ekādaśī fasts dedicated to Viṣṇu through the Pradoṣa vratas on the thirteenth tithi dedicated to Śiva, and the Saṃkaṣṭacatuṛthī associated with Gaṇeśa. The seasonal vratas — Navarātra in Āśvina and Caitra, Śivarātri in Māgha, Janmāṣṭamī in Śrāvaṇa — are detailed with their complete procedures. Each vrata includes the deity to be worshipped, the mantra to be chanted, the food to be consumed or avoided, and the narrative (kathā) to be heard.