పుష్కరుడు పలికెను : ఇపుడు యుద్ధయాత్రావిధానమును, యుద్ధ సమయమున చేయదగిన పనులను చెప్పెదను. ఏడు రోజులలో యుద్ధయాత్ర చేయవలెననగా మొదటి రోజున శ్రీమహావిష్ణువును, మహేశ్వరుని పూజించవలెను. మోద కాదు లతో గణాధిపతిని పూజించవలెను. రెండవరోజున దిక్పాలకుల పూజచేసి, శయ్య పై కూర్చుండిగాని, అంతకుపూర్వమేగాని ఈ ఆర్థము గల మంత్రము జపించ వలెను. "త్రినేత్రా! రుద్రా! వర దాయకా! వామనా! వికటరూపధరా! శివా! నీవు స్వప్నా దిష్టాన దేవతవు నీకు మాటి మాటికి నమస్కరించుచున్నాను. నీవు దేవాధి దేవతలకు కూడ అధిపతివి. త్రిశూల ధారివి. వృషభారూఢుడవు. సనాతనా ! పర మేశ్వరా ! నాకీ యుద్దమునందు ఇష్టము కలుగునో అనిష్టము వాటిల్లుతో స్వప్నమునందు చెప్పుము. ఆ సమయమునందు పురోహితుడు "యజ్ఞాగ్రతో దూరము పైతి" (యజు. 31.1) అను మంత్రము పఠించవలెను. మూడవ రోజున దిక్కులను రక్షించు రుద్రులను దిక్పాలకులను పూజించవలేను. నాల్గవ రోజున గ్రహములను, ఐదవ రోజున అశ్వినీ కుమారులను, మార్గ మొన వచ్చు దేవీ - దేవతా నవ్యాదులను పూజించి, ద్యులోకాంత రిక్ష భూలోక ములందుండు దేవతలకు బలి సమర్పించ వలెను. రాత్రి భూత గణములకు బలి ఇవ్వవలెను. వాసుదేవ - భద్రకాళీ లక్ష్యాదుల పూజచేసి సకల దేవతలను ప్రార్థించవలెను. "వాసుదేవ - సంకర్షణ - ప్రద్యుమ్న - అనిరుద్ధ - నారాయణ - బ్రహ్మ - విష్ణ - నరసింహ - వరాహ - శివ - ఈశాన - తత్పురుష - అఘోర - వామ దేవ - సద్యోజాత - సూర్య - సోమ - భౌమ - బుధ - బృహస్పతి - శుక్ర - శనైశ్చర - రాహు - కేతు - గణేశ - కార్తి కేయ - చండికా - ఉమా - లక్ష్మీ సరస్వతీ - దుర్గా - బ్రహ్మణ్యాదిగణ - రుద్ర - ఇంద్రాది దేవ - అగ్ని నాగ గరుడులును, ద్యులోకాంతరిక్ష భూములపై నివసించు ఇతర దేవతలును వాకు విజయమును ఇచ్చెదరుగాక. నేనిచ్చిన ఈ బలిని, పూజను స్వీకరించి దేవతలందరును యుద్ధమునందు నా శత్రువులను నశింప చేయుదురుగాక. దేవతలారా ! నేను మాతృ - పుత్ర - భృత్య సహితుడనై మిమ్మును శరణు జొచ్చుచున్నాను. మీరు శత్రుసేన వెనకనుండి దానిని సశింప చేయుడు. నేను నమస్కరించుచున్నాను. యుద్ధము నుండి విజయవంతుడనై తిరిగి వచ్చినచో ఇపుడు చేసిన ఐలి పూజాదుల కంటే అధికముగ సమర్పించెదను.
ఆరవరోజువ రాజ్యాభి షేకము చేసికొనివట్లు విజయస్నానము చేసి ఏడవరోజున త్రివిక్రమని పూజించవలేను. నీరాజశ మంత్రములతో ఆయుధ - వాహన పూజ చేయవలెను. "పుణ్యాహ" "జయ" శబ్దములతో బ్రాహ్మణముఖము నుండి ఈ మంత్రములను వినవలెను - "రాజా ! ద్యులోక - ఆంతరిక్ష - భూములపై నివసించు దేవతలు నాకు దీర్ఘాయువు నిచ్చెదరు గాక. దేవతలవలె నీవు సిద్ధిని పొందెదవుగాక. ఈ నీ యాత్ర దేవతా యాత్రయగునుగాక. దేవతలు నిన్ను రక్షింతురుగాక.” ఈ ఆశీర్వాదము విని రాజు ముందుకు సాగవలెను. "ధన్వనాగా" (యజు.2.39) ఇత్యాది మంత్రముతో ధనుర్బాణములు చేత ధరించి, “తద్విష్ణోః" (యజు. 6.5) ఇత్యాది మంత్రము జపించుచు శత్రువు వైపు ఎడమకాలు ఉంచి ముప్పది రెండు అడుగులు ముందుకు వేయవలెను. పిదప పూర్వ - దక్షిణ - పశ్చిమ - ఉత్తరముల వైపు వెళ్ళుటకు వరుసగ ఏనుగులు, రథములు, గుఱ్ఱములు, భార మును మోయు జంతువులు - వీటిపై ఎక్కి యుద్ధ వాద్య ఘోషములతో ముందుకు సాగవలెను. వెనుకకు తిరిగి చూడగూడదు.
ఒక క్రోసుదూరము వెళ్లిన పిదప ఆగి దేవతా బ్రాహ్మణుల పూజ చేయవలెను. రాజు తనవెనుక వచ్చుచున్న సైన్యమును రక్షించుకొనుచు ఇతరదేశ మునకు యాత్ర చేయవలెను. విదేశ మునకు వెళ్లిన ను తనదేశాచారమును పాలించుట రాజునకు కర్తవ్యము. ప్రతిదినమునందును దేవతాపూజ చేయవలెను. ఎవ్వని ఆదాయమునకును నష్టము కలిగించగూడదు. ఆదేశమునందలి మనుష్యులను ఎన్నడును అవమానించరాదు. విజయము పొంది తిరిగి తన దేశమునకు తిరిగి వచ్చిన పిమ్మట దేవతలకు పూజలు చేసి, దానమునీయవలెను. మరునాడు యుద్ధప్రారంభమగునన్నచో తొలిరోజున గజ్వాది వాహనములకు స్నానము చేయించి, నృసింహస్వామిని పూజించవలెను. ఛత్రాది రాజచిహ్నములకును, అస్త్ర శస్త్రములకును, భూతగణములకును రాత్రి పూజలు చేసి ప్రాతఃకాలమున మరల నృసింహస్వామికిని, సకల వాహనాదులకును పూజచేయవలెను. వురోహితుడు హోమము చేసిన అగ్నిని చూచి, తాను కూడ హోమము చేసి, బ్రాహ్మణులసన్మానము చేసి, ధనుర్బాణములు ధరించి, గజారూఢుడై యుద్ధమునకు వెళ్లవలెను. శత్రుదేశమునందు ఆదృశ్యుడుగా ఉండి ప్రకృతి కల్పన సేనానివేశము చేయవలెను. సైనికులసంఖ్య తక్కువగా ఉన్నచో వారినందరిని ఒకచోట చేర్చి యుద్ధము చేయవలెను; అధికముగా ఉన్న వాళ్లను ఇచ్చానుసారముగ విస్తరింపచేయవలెను.
అల్పసంఖ్యాకులగు సైనికులతో అధిక సంఖ్యాకులగువారిని ఎదుర్కొనుటకు సూచీముఖమను వ్యూహము మంచిది. ప్రాణిశరీర సదృశములు, ద్రవ్యరూపములు అని వ్యూహములు రెండు విధములు. గరుడ - మకర - చక్ర - శ్యేన - అర్ధచంద్ర - వజ్ర - శకట - సర్వతోభద్రమండల - సూచీవ్యూహములను తొమ్మిది వ్యూహములు ప్రసిద్ధములు. ఆన్ని వ్యూహములందును సైనికులను ఐదు భాగములుగా విభజించి, రెండుపక్షములు, రెండు అనుపక్షములు ఏర్పరచి ఒక పంచమభాగమును గూడ ఉంచుకొనవలెను. యోధులలో ఒక భాగముతో గాని, రెండు భాగములతో గాని యుద్ధము చేయుచు మిగిలిన మూడుభాగములను వారి రక్షణకై ఉపయోగించవలెను. రాజును ఎన్నడును వ్యూహమునందు నిలుపగూడదు. రాజే మూలము. ఆమూలము ఏనష్టమేనచో రాజ్యమే నశించును. అందుచే రాజు యుద్ధములో పాల్గొనగూడదు. అతడు సైన్యమునకు వెనుక ఒక క్రోసుదూరము నందుండవలెను. అచటఉండి రాజు యుద్దమ నుండి పారిపోవుచున్న యోధులకు ధైర్యము చెప్పి ప్రోత్సహించవలేను సేనాపతి పారిపోయినను, మరణించినను సైన్యము నిలువజాలను. ప్యూహమునందలి యోధులు ఒకరికొకరు చాలదగ్గరగా గాని దూర ముగాగాని నిలువకూడదు. ఒకరి ఆయుధములు ఒకరికి తగులకుండునంత దూరమున నిలువవలెను.
శత్రువ్యూహమును భేదించుటకు యోధులందరును సంటితులై ప్రయత్నించవలెను. శత్రువులు తమవ్యూహమును భేదించుటకై ప్రయత్నించు పుడుకూడ యోధుల సంమ బితులై ఎదిరించవలెను. శత్రుసైన్యములోనికి చొచ్చుకొని పోవుటకు వీలగునట్లుగ ఇచ్ఛానుసారముగ వ్యూహరచన చేయవలెను. ఏనుగుల కాళ్లను రక్షించుటకై నాలుగు రథములను నియమించ వలెను. రథమును రక్షించుటకు నలుగురు ఆశ్వికులను, వారి రక్షణకై నలుగురేసి ఖడ్గచర్మధారులగు పదాతులను నలుగురేసి ధనుర్ధారులను ఏర్పరుపవలేను యుద్ధమున అందరికంటే ముందు ఖడ్గధారులగు పదాతులుండవలెను. వారి వెనుక ధనుషులు, వారి వెనుక ఆశ్వీకులు, వారి వెనుక రథములు, వారి వెనుక గజ సేన ఉండు నట్లు ఏర్పరుపవలెను.
పదాతులు, హాస్తికులు, ఆశ్వికులు ప్రయత్నపూర్వకముగ ధర్మయుద్ధము చేయవలెను. యుద్ధభూమి ఆగ్రమున శూరులగు యోధులను ఉంచవలెను. పిరికి వారిని ఎన్నడును ఉంచరాదు. ఎదుట మంచిన శూరులకు శత్రువుల డమూహము మాత్రమే కనబడునట్లు ఏర్పరచవలెను. అప్పుడే వారు పౌరుషము చూపి శత్రువులను పారద్రోలగలరు. పిరికి వారిని సేనాగ్రము నందుంచినచో పారిపోయి స్వయముగనే వ్యూహమును భిన్నము చేయుదురు. అందుచే వారిని ముందుఉంచరాదు. శూరులు ముందున్నచో వెనుక నున్న భీరువులకు గూడ ఉత్సాహము కలిగింతురు. ఉన్నతులును, చిలుకముక్కుకలవారును, సౌమ్యమైన దృష్టి కలవారును, కలిసినక నుబొమ్మలు కలవారును, కోపశీలులును, కలహ ప్రియులును హర్షోత్సాహభరితులును, కామపరాయణులును అగువారు శూరులైన వీరులు.
గాయపడిన వారిని, మరణించినవారిని యుద్దభూమినుండి తొలగించుట, యుద్ధరంగమునందున్న ఏనుగులకు నీరు త్రాగించుట, ఆయుధములు అందించుట ఇది పదాతుల కర్తవ్యము. శత్రు సైనికులు తమ సైన్యమును భేద్విచకుండ రక్షించుచు శత్రువ్యూహమును భేదించుట ఖడ్గవీరుల కర్తవ్యము. శత్రువులను కొట్టి యుద్ధభూమి నుండి పారద్రోలుట ధనుర్ధరుల కర్తవ్యము. ఎక్కువగా గాయపడిన వారిని యుద్ధభూమినుండి తొలగించి, తిరిగి వచ్చి శత్రు సైన్యమునందు భయముత్పన్నము చేయుట రథికుల కర్తవ్యము. సంఘటిత వ్యూహమును భేదించుట, భిన్నమైనదానిని కలుపుట, ప్రాకార ద్వారాదులను, ఇంటి పైభాగములమ, వృక్షములను భగ్నము చేయుట గజముల కర్తవ్యము. పదాతులకు ఎగుడుదిగుడుగా నున్న భూమి, రథ-అశ్వములకు సమతలభూమి, ఏనుగులకు బురదనేల యుద్దమునకు అనుకూలములు.
ఈ విధముగ వ్యూహరచన చేసి, సూర్యుడు వెనుక వైపు ఉన్నపుడు, శుక్ర - శనైశ్చరులును, దిక్పాలకులును అనుకూలముగానుండగా, ఎదుటినుండి ముదవాయువు వీచుచుండగా, యుద్ధము చేయదు, నామగోత్రాదులను పేర్కొని యోధులందరికిని ఉత్సాహము కలిగించవలెను. “యుద్ధము నందు విజయము లభించినచో ఉత్త వభోగ ములు లభించును మరణించినచో స్వర్గసుఖము లభించును” అని కూడ చెప్పుచుండవలెను. వీరుడు శత్రువులను జయించినచో మనోవాంఛిత భోగములను పొందున. మరణించినచో ఉత్తమగతులను పొందును. స్వామి అన్నము తిన్నందులకు ఋణవిముక్తుడగును. అందుచే యుద్ధమువంటిది శ్రేష్టమైనది మరొకటి లేదు శరీరము నుండి రక్తము స్రవించినచో వీరుడు పాపవిముక్తుడగును. యుద్ధమునందు శస్త్రప్రహారాదికష్టములను సహించవలసియుండును. అది యొక గొప్ప తపస్సు. యుద్ధమునందు ప్రాణ త్యాగము చేయు వీరునివద్దకు వేలకొలది అప్సరసలు వత్తురు. హతోత్సాహ డై యుద్దభూమినుండి పారిపోవు యోధుని పుణ్యమంతయు ఆతని స్వామికి చేరును. అడుగడుగునను బ్రహ్మహల్యాపాపము వచ్చును. తన సహాయులను విడచి పారిపోవువానిని దేవతలు నశింపచేయుదురు. యుద్దమునుండి అడుగుక దపని వీరునకు ఆశ్వమేధయాగఫలము లభించును.
ధర్మమునందు దృఢముగా నిలచు రాజునకు విజయము లభించును. యోధులు తమతో సమానమైన యోధుల తోడనే యుద్దము చేయవలెను. హాస్తికాదులు హాస్తి కాదులతోడనే యుద్ధము చేయవలెను. పారిపోవుచున్నవారిని చంపకూడదు. యుద్దము చూచుటకై వచ్చినవారిని, శస్త్రహీనులను, నేలపైపడిపోయినవారిని, ఎన్నడును చంపగూడదు. అలసి పోయి నవానిని, నిద్రవచ్చినవానిని, నదీమధ్యయందుగాని, అడ వియందుగాని ఉన్న వానిని కొట్టగూడదు. దుర్దినమునందు శత్రువులను నశింపచేయుటకై కూటయుద్ధము చేయవలెను రెండు చేతులు పైకెత్తి - "చూడుడు! శత్రువులు పారిపోవు చున్నారు. మన మిత్రసేన వచ్చినది. శత్రుసేనా సంచాలకులు మరణించినారు. సేనాపతి కూడ మరణించినాడు. శత్రురాజు కూడ మరణించినాడు" అని గట్టిగా చెప్పవలెను.
పారిపోవుచున్న శత్రుయోధులను అనాయాసముగ చంపివేయవచ్చును. ఓ ధర్మజ్ఞా! శత్రువులను మోసగించుటకు కృత్రిమమగు సుగంధ ధూపమును ప్రసరింపచేయవలెను. విజయపతాకలు ఎగుర వేయవలెను. వాద్యములను భయంకర ముగ మ్రోగించవలెను. విజయము లభించినచో దేవతా-బ్రాహ్మణులను పూజించవలెను. అమాత్యుడు చేసిన యుద్ధము నందు లభించిన రత్నాదులను రాజునకే ఇవ్వవలెను. శత్రులపై ఎవ్వరికిని ఆధికారములేదు. వారికి తగు రక్షణను ఇవ్వవలెను. యుద్దమునందు సహాయకులు లేని శత్రువున పుత్రుని పాలించినట్లు పాలించవలెను. ఆతనితో మరల యుద్దము చేయరాదు. ఆతని విషయమున దేశాచితాచారాదుల పాలనము చేయవలెను. యుద్ధమునందు విజయము లభించిన పిమ్మట నగరమునకు తిరిగివెళ్ళి ధ్రువనక్షత్రములందు రాజభవనమును ప్రవేశించవలేను. దేవతలను పూజించి, సైనికుల కుటుంఖముల పోషణకు ఏర్పాట్లు చేయవలెను. శత్రువునుండి లభించిన ధనములో కొంతభాగము భృత్యులకు కూడ పంచి పెట్టవలెను. నేను చెప్పిన ఈ రణదీక్షానుసారము కార్యములు చేయు రాజుకు తప్పక విజయము లభించును.
అగ్ని మహాపురాణమునందు రణదీక్షావర్ణనమను రెండువందల ముప్పది యారవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 236 of the Agni Mahā Purana is as follows:
Agni introduces the Āyurveda section of the Purāṇa, framing it as divine knowledge flowing from Brahmā through Dhanvantari to Suśruta. The eight branches of Āyurveda — Kāyacikitsā, Śālyatantra, Śālākyatantra, Bhūtavidyā, Kaumārabhṛtya, Agadatantra, Rasāyanatantra, and Vājīkaraṇa — are enumerated. Agni explains that the ultimate goal of Āyurveda is not merely bodily health but the dhātu-sāmya (equilibrium of constituents) that enables the individual to pursue the four puruṣārthas.