పరమేశ్వరుడు చెప్పెను-స్కందా! వాస్తుమండలమునకు బైట. ఈశాన్యదిక్కులందు వెనుకటి వలె చరకి మొద లగు దేవతలను పూజించవలెను. ఒక్కోక్క దేవతకుమ మూడేసి హోమములు చేయవలెను. భూతబలి ఇచ్చి, నిశ్చిత మగు లగ్నమునందు శిలాన్యాసోపక్రమము చేయవలెను. ఖాతమధ్యభాగమున ఆధారళ క్తివ్యాసము చేయవలెను. అచట అనంతుని మంత్రముచే అభిమంత్రించిన ఉత్తమకలశము స్థాపింపవలెను. “లం పృథివ్యై నమః” అను మంత్రముతో ఆ కలశముపై పృథివీస్వరూప మగు శిలను ఉంచవలెను. దానికి పూర్వాదిదిక్కులందు క్రమముగ సుభద్రము మొదలగు ఎనిమిది కలశ లను స్థాపించవలేము. మొదటి వాటికొరకై గోతులు త్రవ్వి, వాటిలో ఆధారశక్తి న్యాసము చేసిన పిమ్మట ఆ కలశలను ఇంద్రాదిలోకపాలుల మంత్రములతో స్థాపించవలెను. పిదప ఆ కలశలపై నందాది శిలలను ఉంచవలెను. ఆ శిలలు తత్త్వ మూర్త్యధి దేవతావస్త్రములతో కూడి యుండవలెను. గోడలపై మూర్తులను, అస్త్రాదుల చిహ్న ములుంచినట్లు ఆ శిలలపై దిగ్విదిక్కులను చక్కగా విభజించి ధర్మాదిదేవతాష్టకమును స్థాపించవలెను. సుభద్ర మొదలగు నాలుగు కలశములపై వందాది శిలాచతుష్టయమును, నాలుగు కోణములందును స్థాపించవలెను. పిదప జయాది కలశచతుష్టయముపై అజితాది శిలా చతుష్టయమును, పూర్వాదిదిక్చతుష్టయమున స్థాపింపవలెను. వాటి అన్నింటి పైనను, బ్రహ్మను, న్యాపకు డగు మహేశ్వ రుని స్థాపించి మందిరమధ్యమునం దున్న ఆకాశ మను పేరు గల ఆధ్వను చింతించవలెను. ఈ అన్నింటికిని బలి సమ ర్పించి విఘ్న దోష నివారణార్థమై అస్త్రమంత్రమును జపించవలెను. పంచశిలాపక్షమున ఈ విధముగ చేయవలెను. మధ్య భాగమున సుభద్ర కలశముపై పూర్ణయను శిలను స్థాపించవలెను. ఆగ్నేయాది దిక్కులందు క్రమముగా, పద్మాది కలశము లపై, నందాది శిలలను స్థాపించవలెను. మధ్య శిల లేని పక్షమున నాలుగు శిలలనే మాతృభావముతో పూజించి స్థాపించి వలెను. ఆ శిలల వైదింటిని ఈ విధముగ ప్రార్థించవలెను.
సర్వసందోహస్వరూపిణివి, మహా విద్యను ఆయిన ఓ పూర్ణా నీవు అంగిరోఋషి పుత్రికవు. ఈ ప్రతిష్టాకర్మ యందు అంతయు చక్కగ పూర్ణ మగు నట్లు చేయుము. నందా! నీవు సమస్త పురుషులను ఆనందింపచేయుదానవు. నిన్ను ఇచట స్థాపించున్నాను. ఆగమునందు సూర్యచంద్ర నక్షత్రాదులు, ప్రకాశించుచున్నంత వరకును నీవు పూర్తి గా తృప్తరా లపై ఈ ప్రాసాడవన స్థిరముగా నుండుము, వసిష్ఠనందిని యైన ఓసందా! నీవు ప్రాణులకు ఆయువును, సంపూర్ణమనో, రథములను లక్ష్మిని ఇమ్మ. నీ వీ ప్రాసాదమునందు స్థిరముగా నుండి దీనిని యత్నముతో రక్షింపుము. కశ్యపనందిని యైన భద్రా నీవు సమ స్తలోకములకును సర్వదా కల్యాణము చేయుము. దేవీ! నీవు సర్వదా మాకు ఆయుర్మనోరథలము లను ఇచ్చుచుండుము. ఓ దేవీ! జయా నీవు సర్వదా మాకు లక్ష్మిని, ఆయువును ఇచ్చుచుండుము. భృగు, పుత్రియైన జయా! నీవు ఇచట స్థాపితురాలవై ఇచటనే ఉండి ఈ గృహస్వామినైన వారు నిత్యము విజయైశ్వర్యాదలు నిమ్ము. ఓ రిక్తా! నీవు అతిరిక్త దోషములను నశింపచేయుదానవు. . సిద్ధిమోక్షదాయినివి ఆగుము. ఓ శుభా సంపూర్ణదేశ కాలములందు నీ నివాసము. ఈశరూపిణీ నీవు సర్వదా ఈ ప్రాసాదమున. ఉండుము. ఈ విధముగ ప్రార్థించి ఆకాశరూపమగు గృహ మును ధ్యానించి, దాని యందు మూడు తత్త్వముల వ్యాసము చేయవలెను.యథా విధిగ ప్రాయశ్చిత్త హోమములు చేసి యజ్ఞ సమాప్తి చేయవలెను.
అగ్ని మహాపురాణమునందు శిలాన్యాస విధివర్జన మను తొంబది నాల్గవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 94 of the Agni Purāṇa is as follows:
The ninety-fourth chapter continues the foundation-laying sequence with the detailed rites for placing the foundation stones (śilā-nyāsa). After the vāstu-pūjā, the ācārya performs the bhūtabali (offering to the earth spirits) and then, at an auspicious lagna determined by the jyotiṣin, begins the stone-placement sequence. In the central pit, a kalaśa is placed on the ĀdhāraŚakti maṇḍala with the liṅga-stone above it; in the eight directional pits, eight kalaśa-s named Subbhadra and companions are installed with the eight lokapāla-s' mantras. Above each directional kalaśa, a named stone (Nandā and her seven companions) is placed. The mantras addressed to each stone — Pūrṇā, Nandā, Bhadrā, Jayā, Riktā — are given in full as prayers requesting the stone's permanent protective presence within the building. The three-tattva nyāsa on the ākāśa-maṇḍala above all the stones completes the foundation ritual.