అగ్ని దేవుడు పలికెను: చైత్రకృష్ణపక్షమున అష్టమీ వ్రత మాచరించి ఆ దినమున బ్రహ్మాదిదేవతలను, మాతృగణమును పూజించవలెను. ఒక సంవత్సరము పాలు కృష్ణపష్టములందు. శ్రీకృష్ణపూజ చేయు వాడు సంతాన మను పొందును. ఇపుడు కాలాష్టమీవ్రతము చేప్పెదను. ఈ వ్రతము మార్గశీర్షకృష్ణాష్టమినాడు చేయవలెను. రాత్రి మైనపిదప వ్రతము చేయు వాడు స్నానాదులచే పవిత్రుడై శివుని పూజించి, గోమూ తముచే వ్రతఫారణము చేయవలెను. రాత్రియందు భూమిపై శయనించవలెను. పుష్యమాసమునందు శివుని పూజించి మృతాహారమును, మాఘమున మహేశ్వ రని పూజించి దుర్ఖాహారమును తీసికొనవలెను. ఫాల్గునమునందు మహాదేవుని పూజించి, ఉపవాసము చేసి తిలలు ఆహారముగా గ్రహించవలెను. చైత్రమునందు ‘స్థాణువును’ పూజించి యవలు భుజించవలెను. వైశాఖమున ‘శివుని’ పూజించి కుశ జల ముతో పారణ చేయవలెను. జ్యేష్ఠమున పశుపతిని పూజించి నదీజలము త్రాగవలెను. ఆషాఢమున ఉగ్రుని పూజించి గోమయమును భక్షించవలెను. శ్రావణమున శర్వుని పూజించి ముదారపుష్పము భుజించవలెను. భాద్రపదమునందు రాత్ర్యంబకుని పూజించి బిల్వపత్రమును భుజించవలెను. ఆశ్వయుజమున ఈశుని పూజించి బియ్యమును, కార్తికము నందు రుద్రుని పూజించి పెరుగు భుజించవలేను, సంవత్సరాంతమున హోమము చేసి, సర్వతోభద్రలింగమును నిర్మించి శంకరుని పూజించవలెను. పిదప ఆచార్యునకు గో-వస్త్ర-సువర్ణదానము చేయవలెను. ఇతరులకు గూడ ఆది దానము చేయవలెను. పిదప బ్రాహ్మణులకు భోజనము పెట్టినవాడు భుక్తిముక్తులను పొందును. ప్రతిమాసమునందును, అష్టమీ తిథులందు రాత్రిమాత్రమే భోజనము చేసి సంవత్సరాంతమునందు గోదానము చేయవలెను. ఇట్లు చేసినవాడు ఇంద్రపద మును చెందును. దీనికి స్వర్గతివ్రత మని పేరు. శుక్ల పక్షమునందు గాని, కృష్ణపక్షమునందు గాని అష్టమీబుధవార యోగము కలిగినపుడు వ్రతమాచరించి ఒక మారు భోజనము చేయవలెను. అష్టమీ వ్రతము చేయువావికి గృహైశ్వర్యాదు లకు లోప ముండదు.
రెండు వేళ్ళు విడచిన పిడికిలితో ఎనిమిది పిడికిళ్ళ బియ్యముతో అన్నము వండి దీనిని కుశయుక్త మైన మామిడాకుల దొన్నెలో ఉంచవలెను. కులాంబి కాసమేతు డగు బుధుని పూజించి, బుధాష్టమీవ్రతకథ విని భోజనము చేయ వలెను. పిదప బ్రాహ్మణులకు తండులసహిత మగు కర్కటి దానము చేసి, యథాశక్తిగా దక్షిణ ఇవ్వవలెను. (బుధాష్టమీవ్రత కథ): ధీరు డను ఒక బ్రాహ్మణు డుండెను. అతని భార్య పేరు రంభ; పుత్రుని పేరు కౌశికుడు. అతనికి విజయ అను ఒక పుత్రిక కూడ ఉండెను. అతనికి ధనదము అను ఒక ఎద్దు ఉండెను. కౌశికుడు ఆ ఎద్దును మేపుటకై గోపాలకులతో కలసి వెళ్లాను. కౌశికుడు గంగలో స్నా నాది కార్యములు చేసికొనుచుండగా ఒక దొంగ ఆ ఎద్దును అపహరించెను. స్నానము చేసి వచ్చిన కౌశికుడు ఎద్దును కానక దానిని వెదకుటకై సోదరి యగు విజయతో కలిసి బయలుదేరెను. ఇత డొక సరోవరము నందు కొందరు దేవతాశ్రీలసు జూచి భోజనము పెట్టమని అడిగెను. అపుడా దేవతాస్త్రీలు ఇట్లు పలికిరి- “నీవు మాకు ఆతిథిగా వచ్చినావు; అందుచే వ్రతము చేసి భోజనము చేయుము”. అపుడు కౌశికుడు బుధాష్టమీవ్రతము చేసి భోజనము చేసెను. వనరక్షకునివద్దకు వెళ్ళి తన ఎద్దును తీసికొని విజయతో తిరిగి వచ్చేను అతడు యథాకాలమున విజయకు వివాహము చేసి మరణానంతరము యమలోకమునకు పోయేను. వ్రతప్రభావముచే కౌశికుడు అయోధ్యకు రాజుఆయెను. తన తలిదండ్రులు నరకయాతన అనుభవించు చూచి, విజయ యముని శరణుజూచ్చెను. కౌశికుడు వేటకొరకై వనమునకు వెళ్ళి నపుడు నా తలిదండ్రులు నరకమునుండి విముక్తు లేట్లగుదురు” అని ప్రశ్నించెను. అపుడు యముడు ప్రత్యక్షమై “రెండు బుధాష్టమీవ్రతముని సలముచే విముక్తు లగుదురు” అని చెప్పగా కౌశికుడు రెండు బుధాష్ట్ర వ్రతముల ఫలములను తలిదండ్రులకు ధారపోసెను వారు స్వర్గమునకు వెళ్ళిరి. విజయకూడ సంతసించి భోగమోతాదిసిద్దికై ఈ వ్రతము వాచరించెను. చైత శుక్లాష్టమి పునర్వసునక్షత్రయుక్త మైనపుడు ఎనిమిది ఆశోకపుష్పముల మొగ్గల రసము త్రాగినవాడు ఎన్నడును శోకము పొందడు. చైత్రమునందు వికసించు ఓఆశోకమా! నీవు శంకరునకు చాల ఇషమైనదానవు. నేను శోకసంతప్తుడ నై నీ కలికల రసమును త్రాగుచున్నాను. నీ వలెనే నన్ను కూడ శోకరహితుని చేయుము” అను ఆర్థము గల ‘త్వామశోక’ ఇత్యాదిమంత్రము చెప్పుచు కలికార సపానము చేయవలెను, చైత్రాద్యష్టములందు మాతృగణ పూజ చేయువాడు శత్రువులపై విజయమును సాధించుము.
ఆగ్ని మహాపురాణమునందు వివిధాష్టమీవ్రతవర్ణన మను నూట ఎనుబదినాల్గవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 184 of the Agni Purāṇa is as follows:
Various other aṣṭamī vratas beyond Janmāṣṭamī are described. The Kālāṣṭamī vrata on Mārgaśīrṣa-kṛṣṇa-aṣṭamī worships Śiva with a monthly rotating diet—mṛta, dugdha, tila, yava, kuśodaka, nādīja, gomaya, śarva-karma, bilva-patra—over twelve months. The chapter narrates the story of Dhīra the brāhmaṇa whose son Kauśika, daughter Vijayā, and the bull Dhaṃda are all rescued from naraka through the Budhāṣṭamī vrata: on the Wednesday-aṣṭamī combination, Kauśika's performance of this vrata liberates his parents and the bull from their respective hells. The Aśoka-aṣṭamī vrata on Caitra-śukla-aṣṭamī with Punarvasu-nakṣatra involves drinking the juice of eight aśoka-buds to gain health and beauty.