పరమేశ్వరుడు చెప్పెను : కార్తికేయా! రాజ్యాదుల అభివృద్ధికొరకై ఇపుడు నగరవాస్తువును వర్ణించి చేప్పెదను, నగర నిర్మాణముకొరకు, ఒక యోజనము లేదా అర్ధయోజనము, విస్తారము గల భూమిని గ్రహించవలెను. ఈశాదీపదములు. ముప్పదింట సూర్యసం ముఖముగ పూర్వద్వారము, గంధర్వసమీపమున దక్షిణద్వారము, వరుణునిదగ్గర పశ్చిమద్వారము సోముని దగ్గర ఉత్తరద్వారము నిర్మించవలెను, వగరమున వీథులు వెడల్పుగా ఉండవలెను. నగరద్వారము ఆరు హస్తముని వెడల్పు, ఉండి ఏనుగులు మొదలగునవి సుఖముగా ప్రవేశించుటకు నిర్గమించుటకు వీలుగా ఉండవలెను. నగరము ఛిన్నకర్ణము గాని, భగ్నముగాని, ఆర్ధచంద్రాకారము గాని కాహడదు. వజ్రసూచీముఖనగరము కూడ హితకరము కాదు. ఒకటి రెండు లేదా మూడు. ద్వారములు గల, ధనుస్సు. ఆకారములో ఉన్న వజవాగాభనగర నిర్మించినచో ఆది శాంతిప్రదము. వగరమునకు అగ్నేయమున స్వర్ణకారులును, దక్షిణమున నృత్యోపజీవు లగువారాంగనలును. నైరృతి యందు నట-కుంభకార-కై వస్తాదులును, పశ్చిమమున రథకార-ఆయుధకార ఖడ్గకారులను, వాయువ్యమున మద్యవిక్రేతలు కర్మకారులు, భృత్యులును, ఉత్తరమున బ్రాహ్మణ-యతి-సిద్ధాదిపుణ్యపురుషులును, ఈశాన్యమున ఫలాదులను విక్రయించు. వారును నివసించవలేను. సేనాధ్యక్షుడు తూర్పున ఉండవలెను. వివిధ సైన్యములు ఆగ్నేయమునందును, స్త్రీలకు వివిధ కళలను బోధించు ఆచార్యులు దక్షిణమునందును, ధనుర్ధర సైనికులు నైరృతియందును, పశ్చిమమున మహామాత్యుడు, తోక పాలకులు, కార్మికులును, ఉత్తరమున దండాధికారులు నాయక ద్విజులును నివసించవలేను.
తూర్పున క్షత్రియులను, దతిణమున వైశ్యులను, పశ్చిమమున శూద్రాదులను, విభిన్న దిశలయందు వైద్యులను, అశ్వములను, సైన్యమును నాల్గు దిక్కులందును ఉంచవలెను. తూర్పునందు గూఢచారులను, దక్షిణమున శ్మశానమును, పశ్చిమమున గోధనమును, ఉత్తరమున కర్షకులను ఉంచవలెను. మ్లేచ్చులకు విదిక్కులందు స్థానము ఏర్పరుపవలెను, లేదా గ్రామములలో నివసింపజేయవలెను, పూర్వద్వారమునందు లక్ష్మీకుబేరుల స్థాపన చేయవలెను. ఆ ఇరువురిని చూచువారికి లక్ష్మీసంవత్తి కలుగును. పశ్చిమమున నిర్మించిన దేవాలయము పూర్వాభిముఖము గాను తూర్పున నిర్మించినది. పశ్చిమాభి ముఖముగాను, దక్షిణమున నిర్మించినది ఉత్తరాభిముఖముగాను ఉండపలెను. నగర రక్షణ కొరకు ఇంద్ర విష్ణ్వాదిదేవతా మందిరములను నిర్మించవలెను. దేవతలు లేని నగర-గ్రామ-దుర్గ.గృహాదులను పిశాచములు అనుభవించును. అవి అనేక రోగములచే పీడింపబడును. పైన చెప్పిన విధమున నిర్మించిన నగరాదికము సదా జయప్రద మై భోగ.మోక్షముల నీచ్చును. వాస్తుభూమికి తూర్పున శృంగారగృహము, ఆగ్నేయమున పాకగృహము, దక్షిణమున శయనగృహము, నైరృతియందు శస్త్రగృహమును, పశ్చిమమునందు భోజనగృహము, వాయవ్యమునందు ధాన్యసంగ్రహము, ఉత్తరమునందు ధనాగారము, ఈశాన్యమునందు దేవతాగృహము నిర్మింపవలెను. నగరమునందు ఏకకాలా-ద్విశాలా-త్రిశాలా.చతుః కాలా గృహములను నిర్మించవలెను. లాభేదమును, ఆలింద (ముంగిలి) భేదమును బట్టి చతుఃకాలాగృహమున రెండు వందల ఏబదియైదు భేదము లుండును. శ్రీలాగృహమునకు నాలుగు, ద్విశాలకు ఐదు, ఏకశాలకు, వాలుగు భేదము లండును. ఇపుడు ఆలిందయుక్తగృహమును గూర్చి చెప్పెడను వినుము: గృహవాస్తువునందును, వగరహస్తువునందును, ఇరువది యెనిమిది ఆలిందము లుండును. నాలుగు అలిందములతోడను, ఏడు ఆలిందములతోడను ఏబదియైదు భేదములును, ఆరు అలీందములతో ఇరువది భేదములును, ఎనిమిది ఆలిందములతోగూడ ఇరువది భేదములును ఏర్పడును. ఈ విధముగ నగ -ఈదులలో ఎనిమిది ఆలిందములు గల వాస్తుపు కూడ ఉండవచ్చును.
ఆగ్ని మహాపురాణమునందు వగరాదివాస్తు వను నూట ఆరవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 106 of the Agni Purāṇa is as follows:
The principles and procedures of mantra-japa are systematically expounded. Agni prescribes the correct posture (āsana), direction, count (saṃkhyā), and use of the mālā; different counts apply to kāmya-japa, śānti-japa, and mokṣa-japa. The distinction between vācika, upāṃśu, and mānasa japa is explained, with mānasa ranked highest. Specific puraścaraṇa regulations—number of repetitions by the thousands, associated homa, tarpaṇa, and brāhmaṇa-bhojana—complete the chapter.