వామన మహా పురాణము
బ్రహ్మ ఉత్పత్తి
ఇక పరమాత్మయగు బ్రహ్మ ఉత్పత్తి వినండి. నారాయణుని విషయంలో ఈ శ్లోకాన్ని సాధారణంగా చెబుతూ ఉంటారు. నీళ్ళు “నార” శరీరం కలవి. (నీటికి నారమని పేరు) వానిమీద శయనించినందున నారాయణుడని భగవంతునకు పేరు. జగత్తంతా నీటిలో మునిగి ఉన్నదని తెలిసికొన్న అ ప్రభువు అ పెద్దగ్రుడ్డును బ్రద్దలుచేయగా అందులోనుంచి ఓంకారం బయలు దేరింది. అందులో నుంచి భూః, భువః స్వః అనే మూడు భూర్భువస్వః లోకాలు వచ్చినవి. వాని నుంచి తేజస్సు, తత్సవితుర్వరేణ్యం బయటకు వచ్చింది. ఆ తేజస్సానీళ్ళన్నింటిని ఎండింపజేసింది. మిగిలినది పిండం (కలలం)గా మారింది. దానినుంచి బుడ గేర్పడి అది గట్టిపడింది. ఆ గట్టితనంవల్ల దానిని ధరణి అన్నారు. ఆమెయే సకల జీవులను ధరిస్తుంది. ఆ అండం నిలచిన ప్రదేశమే సన్నిహిత సరస్సు. ఆదిలో వచ్చిన తేజస్సును ఆదిత్యుడన్నారు. లోక పితామహుడైన విరించి గ్రుడ్డుమధ్యలో ఉద్భవించాడు. ఆయనకు పిండంమేరువు, యోని పర్వతాలు, సప్త సముద్రాలు వేలాది నదులూ గర్భోదకం (ఉమ్మనీరు) బ్రహ్మనాభి ప్రదేశాన ఉన్న నిర్మలమైన ఉత్తమజలమే ఆ మహత్సరోవరంలో నిండినది. దానికి మధ్యలో స్థాణురూపమైన వటవృక్షం వెలిసింది. ఆ స్థాణువటం నుండి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య, శూద్రులు ఉద్భవించారు. కార్యసాధనకు శూద్రులు వెలశారు.