వామన మహా పురాణము
వామనుని మూడడుగుల కోరిక
అందుల కా బలితో వామనుడు ఇలా అన్నాడు: “గజాశ్వ భూ రధ సువర్ణాదులు, అవి కావలసినవారికివ్వుము. నాకు కావలసినది మూడడుగుల నేలయే కనుక ఓ రాజా కాదనక దీని నొసంగుము.’ వామనుడిలా అనగానే ఆ మహాదైత్యుడు జలపాత్ర తీసికొని మూడడుగుల నేల విష్ణువునకు దానంచేశాడు.