దేవతలు చేసిన కాత్యాయనీ స్తుతి

“దేవతలచేత పూజింపబడు దేవీ! నీకు నమస్కారము! పృథివి యందలి సకల జీవులలో నిద్రారూపాన తృష్ణగా, లజ్జగా, ఆకలిగా, భయంగా, కాంతిగా, శ్రద్ధగా, స్మృతి, పుష్టి, క్షమ, ఛాయ, శక్తి, లక్ష్మి, వృత్తి, దయా, భ్రాంతి, కోరిక, మాయ, ఇత్యాది రూపాల్లో నిండి సంసార రూపాన ఉండే పరమేశ్వరీ! నీకు నమస్కారము; తల్లీ నీకు నమస్సులు!” ఆ విధంగా దేవతలంతా స్తోత్రం చేసిన వెంటనే ఆ దేవి సింహం మీద స్వారిచేస్తూ, ఎత్తైన శిఖరాలతో ఉంటూ, అగస్త్యముని వల్ల అనంతరం తగ్గి కుంచించుకుపోయిన వింధ్య పర్వతానికి వెడలిపోయెను. అని వివరించగా