సరోమాహాత్మ్యమ్

కురుజాంగల క్షేత్రంలో సరస్వతీ దృషద్వతీ నదులమధ్య ఆసీనుడైన రోమహర్షణ మునిని బ్రాహ్మణులా పవిత్ర సరోవర ప్రభావం తెలుపవలసినదిగా అర్థించారు. మహర్షీ! ఆ సరోవర ప్రమాణం, అందలి తీర్థాలు, వాటి ప్రమాణం, అందలి దేవతల వివరంతో బాటు వామనుని జనన వృత్తాంతం కూడ తెలియజేయ ప్రార్థన అని విన్నవించారు. బ్రాహ్మణులకోరికను విని ఆనందంతో దేహం గగుర్పాటు చెందిన రోమహర్షణుడు ప్రణమిల్లి ఇట్లనెను.