వామన మహా పురాణము
ప్రహ్లాదుని పశ్చాత్తాపం
అంతట ప్రహ్లాదుడిలా అన్నాడు. వత్సా! కోపం నన్ను మూర్ఖుణ్ణి చేసింది. అంచేత వివేకం నశించి నిన్ను శపించాను. మోహంవల్ల నావివేకం నశింపకపోతే శ్రీహరి సర్వజ్ఞుడని తెలిసియూ నేనెందుకు శపించాలి? నేనిచ్చిన శాపం నీవనుభవింపక తప్పదు. అయితే విచారించ వద్దు. ఈ క్షణాన్నుంచీ నా దేవదేవుని నిరంతరస్మరణ నీకు లభించినది. నీ భావి శ్రేయస్సుకు తగిన ఉపాయాలు నేను చెబుతూ ఉంటాను భయపడకు. అని పలికి అతడిని ఓదార్చెను.