శంకరకృత చక్రపాణి స్తుతి

ఓ దేవేశ్వరా! గరుడధ్వజా! నీకు నమస్కారము. శంఖ చక్ర గదాధరా! వాసుదేవా నీకు వందనము! నిర్గుణా! అనంతా! అప్రతర్క్యా! సృష్టికర్తా! జ్ఞానాజ్ఞాన స్వరూపా! సర్వాధారా! నిరాధారా! నీకు నమోవాకములు! రజోగుణీవైన సనాతన బ్రహ్మమూర్తీ! చరాచరాత్మకమైన నీ జగత్తు అంతయు నీ సృష్టియే. నీకు కై మోడ్పులు, షడంగాలతో కూడిన నాలుగు వేదాలు నీవే! వాటిని ఎరిగినవాడవు. వాని ద్వారా తెలియదగిన పరతత్వము నీవే! ఉపవేదాలూ నీవే! సమస్తమూ నీవే! నీకు నమస్సులు. ఓ అచ్యుతా! చక్రపాణీ! మాధవా! మత్స్య మూర్తీ! నీకు నమస్కారము. ఈ పాపబంధాల నుండి నన్ను రక్షించుము. నా దేహగతమైన అశుభాన్ని హరించుము. బ్రహ్మ హత్యా సంభవమైన ఆ జ్వాలలో నేను దగ్ధమగుచున్నాను. వివేకహీనుడను. ఓ తీర్థ స్వరూపా! నన్నీ జ్వాలల నుండి కాపాడుము. పవిత్రుని గావింపుము. నీకు నమస్కారము! అని శంకరుడు చేసిన ఈ స్తోత్రమునువిని ఆయనను ఆవహించిన బ్రహ్మహత్యా నివారణార్థమై చక్రపాణి విష్ణువు ఇట్లనెను: