వామన కథా ఫలశ్రుతి

ఇలాంటి వామనరూపియగు విష్ణుదేవుని మాహాత్మ్య గాథ విన్నవారల పాపములు తొలగిపోవును. బలి ప్రహ్లాదుల సంవాదం, బలి శుక్రాచార్యుల మంత్రాలోచనము, బలివామన దేవుల చరిత్రము స్మరించిన వారల కెటువంటి ఆధులు, వ్యాధులు, మనో వ్యథలు కలుగజాలవు. అధికారం, రాజ్యం కోలుపోయినవారలకు తత్ప్రాప్తి, వియోగి జనులకు ఇష్టజనుల సమాగమము ఈకథా శ్రవణంచేయు మానవులకు లభించగలవు; బ్రాహ్మణులకు వేద విద్య, క్షత్రియులకు భూమివిజయం వైశ్యులకు ధనసమృద్ధి, శూద్రులకు సుఖప్రాప్తి కలుగును. శ్రీవామన దేవుని మాహాత్మ్యశ్రవణంవల్ల సర్వపాపాలు నశించును.