ఫలశ్రుతి

ఫలశ్రుతిలో ఈ పురాణ పఠనముచేత లేక వినటం చేత, సమస్త పాపాలూ సమూల క్షాళనం జరుగుతుందని, విష్ణు పదప్రాప్తి సిద్ధిస్తుందని చెప్పబడింది. విష్ణుపద ప్రాప్తికి ఏకాదశాక్షర మంత్రం ‘నమోనమః కారణ వామనాయ’ అనే జపం యొక్క మాహాత్మ్యం చెప్పబడింది. పాపం నశించటం, తద్విషోః పరమపద ప్రాప్తి ఈ పురాణ శ్రవణ ఫలాలు. చివరగా మోక్ష ప్రదాత అయిన నమోనమః వామన కారణాయ-అనే శ్రీ వామన ఏకాదశాక్షర మంత్రంతో గ్రంథం సంపూర్తి చేయబడింది.