వామన మహా పురాణము
వామనపురాణ రచనా కాలం
వామన పురాణ రచనా కాలం గురించి డాక్టర్ హరప్రసాద్ శాస్త్రి, హెచ్.హెచ్. విల్సన్, ఆర్.సి. హజ్రా అనే ముగ్గురు పండితులు, దానిలో చెప్పబడిన విషయాలను అనుసరించి (ఆంతరంగిక సాక్ష్యాలు) ఇతర గ్రంథాలలో చెప్పబడిన సమాన విషయాలను అనుసరించి (బాహిరక సాక్ష్యాలు) ఆధారంగా రచనా కాలనిర్ణయం చేయటానికి ప్రయత్నించారు హరప్రసాద్ శాస్త్రి. “ప్రస్తుతం లభ్యం అవుతున్న వామన పురాణం
1. ఇందులో విష్ణువు అవతారాలు పది అనే అంశాన్ని చెప్పనందు చేత, వామనావతారం తరువాత అవతారాలను పేర్కొన నందుచేత, మూడవ అవతారంగా హరశీర్షునిని పేర్కొనటంచేత
2. ఈ పురాణంలో మత శాఖల ప్రసక్తి లేనందువలన, వైష్ణవ, శైవ, పాంచరాత్రపాశుపత మొదలైనవి) బ్రహ్మ, విష్ణు, శివులకు సమాన స్థానం ఈయబడినందుచేత,
3. హిందూ మహాసముద్రంలో కొన్ని దీవులను పేర్కొనడంచేత, ఉదాహరణకు ఇంద్ర ద్వీపం, నాగద్వీపం, కటాహద్వీపం, సింహళద్వీపం, వరుణద్వీపం మొదలైనవి.
4. భారతదేశానికి సరిహద్దులుగా పేర్కొనబడిన ప్రాంతాలు రెండవ శతాబ్దానికి తరువాత కావటానికి అవకాశం లేనందువలన (ఇందులో పేర్కొన్న ఆ సరిహద్దులు తూర్పున కిరాటదేశం, పశ్చిమంలో యవనులు, దక్షిణంలో ఆంధ్రులు, ఉత్తరంలో తురుష్కులు).
5. విష్ణ్వారాధనలో తులసి మొక్క పవిత్ర వృక్షంగా ఈ పురాణం పేర్కొనటం లేదు. అది నేడు అతి పవిత్రమైన మొక్కగా అందరూ ఆరాధిస్తున్నారు. ఈ విషయం క్రీ.శ. రెండవ శతాబ్దం తరువాతే జరిగింది.
అందువలన వామన పురాణ రచన క్రీ.శ. రెండవ శతాబ్దానికి ముందే జరిగి ఉంటుందనే భావన చేయబడింది.
అయితే ప్రొఫెసర్ హెచ్. హెచ్. విల్సన్ పండితుడు ఈ వాదాన్ని అంగీకరించక వామన పురాణం కేవలం అప్పటికి అంటే 19వ శతాబ్దానికి 4,5 శతాబ్దాల ముందు జరిగిందని వ్రాశాడు. అంటే క్రీ.శ. 14వ శతాబ్దమో లేక 15వ శతాబ్దమో కావాలి.
కానీ ఆర్.సి. హజ్రా ఈ విషయంపై చాలా వివరంగా చర్చించి మధ్య యుగంలోని ధర్మశాస్త్ర రచయితలు అనేకులు ఈ పురాణాన్నుంచి వందల కొలది శ్లోకాలను ఉద్ధరించినందున, నారద పురాణం, ఈ పురాణాన్ని పేర్కొని అందులో చెప్పబడిన విషయాలను విపులగా పేర్కొన్నందున, నారదపురాణం క్రీ.శ. 600-700 మధ్య కాలానికి చెందినదని పండితులు నిర్ణయిస్తున్నందున, ఇందులో ప్రస్తుతం లభ్యం అవుతున్న వామన పురాణ విషయాలు నారద పురాణంలో చెప్పబడనందున 600-700 తరువాతనే ప్రస్తుతం లభ్యం అవుతున్న వామనపురాణ రచన జరిగి ఉండాలని అందువలన ఈ పురాణం క్రీ.శ. 600-900 మధ్య కాలంలో ప్రస్తుత రూపాన్ని ధరించి ఉంటుందని తెలుపుతున్నారు. ఇప్పటి ఈ రూపం వామనపురాణం క్రీ.శ. 1000 నాటికే ఉన్నదని ఆయన నిశ్చిత అభిప్రాయం.
ఇంతేగాకుండా వామన పురాణంలో శివపార్వతుల చరిత్ర విపులంగా వర్ణించ బడింది. పార్వతి తపస్సు, శివుని వటు రూప దర్శనం, శివపార్వతుల సంవాదం, శివ కళ్యాణం మొదలైన విషయాలు, అలంకారయుక్తంగా మంచి కావ్యశైలిలో ఉన్నాయని ఇంతకు ముందే చెప్పబడింది కదా. వామనపురాణంలో ఈ ఘట్టం మంచి అలంకార చమత్కార పూర్ణంగా ఉన్నాయి. కాళిదాసు ప్రభావం ముఖ్యంగా ఆయన రచనయైన కుమార సంభవ ప్రభావం ఈ పురాణం మీద బాగా ఉన్నదని పండితుడు చెప్పుతున్నారు.
అయితే ఈ అనుకరణ, ప్రభావవాదంపై ఆధారపడి కాల నిర్ణయం చేయడం చాలా ప్రమాదకరం. అసలు కాళిదాసు కాలం ఈ నాటికీ సర్వాంగీకారంగా నిర్ణయమైతేనే గదా. దీనిపై ఆధారపడవలసినది. అందువలన దీనిపై అంతగా, నమ్మకంగా ఆధారపడలేము.
ఇందులో వర్ణింపబడిన కొన్ని కథలలో వర్ణనాశైలిలో దండి దశ కుమార చరిత్ర ప్రభావం ఉన్నది. దండి ఆరవ శతాబ్దం మధ్య కాలంలో వాడు. అందుచేత ఆరవ శతాబ్దం తరువాత 10వ శతాబ్దంలోపుగా ప్రస్తుతం లభ్యం అవుతున్న వామన పురాణ రచన లేక పోతే సంస్కరణ జరిగి ఉండవచ్చనే విషయంలో సందేహం అక్కర లేదు.
ఆర్.సి. హజ్రా వివిధ కాలాలలో దీని సంస్కరణ జరిగిందని తెలుపుతూ ఆయా అధ్యాయాలను పేర్కొన్నారు. పరిశీలిద్దాం.
అధ్యాయం 11 నరకాల గురించి వర్ణనం
అధ్యాయం 12 పాపకార్య ఫలితాలు 9- 10 శతాబ్దాలు
అధ్యాయం 14 వివిధ వర్గాలు ఆచరించ
వలసిన సదాచార విధులు,
సంప్రదాయాలు, తినదగినవి, బహుశః 9వ శతాబ్దంలో
త్యజించవలసినవి, శరీర శుద్ధి
జాతాశౌచ మృతాశౌచ
ప్రాయశ్చిత్తాలు.
అధ్యాయం 80 ప్రతిజ్ఞలు క్రీ.శ. 1050కి ముందు, బహుశః 9 లేక 10వ
అధ్యాయం 95 విష్ణ్వారాధనం శతాబ్దం కావచ్చు.
1వ అధ్యాయం 25-28 లింగపూజ క్రీ.శ. 600-1000 మధ్య -
బహుశః క్రీ.శ. 600-800 కావచ్చు.
1వ అధ్యాయం 77-78 లింగప్రతిష్ఠ
1వ అధ్యాయం 81 పాశుపత వ్రతం లేక
శివలింగవ్రతం
1వ అధ్యాయం 83-84 శైవవ్రతాలు-వివిధ క్రీ.శ. 600-1000
మాసాలలో అనుసరిం బహుశః
చవలసినవి.
1వ అధ్యాయం 85,1-82 పంచాక్షరీ మంత్ర జపం క్రీ.శ. 800-1000
1వ అధ్యాయం 85,83-126 దీక్ష-పురశ్చరణము కావచ్చును
1వ అధ్యాయం 85-127 సామాన్య ఆచారము
నుంచి చివరకు
1వ అధ్యాయం 89
1వ అధ్యాయం 90 యతుల తపశ్చర్య
2వ అధ్యాయం 23-26 శివారాధన క్రీ.శ 600-1000
1వ అధ్యాయం 28-44 దానాలు బహుశః క్రీ.శ. 800-1000
2వ అధ్యాయం 45 బ్రతికి ఉన్నవారికి కావచ్చును.
ప్రాయశ్చిత్తాలు
2వ అధ్యాయం 46-49 లింగప్రతిష్ఠ
2వ అధ్యాయం 51 నుంచి యజ్ఞాలు-క్రతువులు
చివర వరకు
అయితే, సంప్రదాయవాదులు ఎవరూ ఈ కాలాలను కాని ఆధారాలనుకాని అంగీకరించరనేది యథార్థం.