ఇంద్రుని తపస్సు - గదాధరదేవుని ప్రత్యక్షం

ఆ ప్రదేశానికి వెళ్లి ఇంద్రుడు మహానది అద్భుత తీరాన గదాధరుని ఆరాధించుటకై ఆశ్రమ మేర్పరచుకుని నిలచిపోయాడు. ప్రతిదినం ఉదయాన్నే నదిలో స్నానం చేసి నేల మీద శయనిస్తూ అయాచితంగా లభించినది ఏదైనా ఉంటే రోజుకొక పర్యాయం భుజిస్తూ ఆ సహస్రాక్షుడు, గదాధరుని ఆరాధనలో తపించాడు. ఇంద్రియాలను అన్నింటిని అదుపులో ఉంచుకొని, కామక్రోధాలు విడచి అలా ఒక సంవత్సరకాలం తపస్సు చేయగా ఓ నారదా! గదాధరదేవుడు సంతోషించి వాసవునితో ఇలా అన్నాడు - ఇంద్రా! నేను ప్రీతుడనైనాను. నీ పాపాలన్నీ యిప్పటికీ తొలగిపోయాయి. వెళ్లుము. త్వరలోనే పొగొట్టుకొన్న రాజ్యాన్ని తిరిగి పొందగలవు. నీకు శ్రేయస్సు కలుగునట్లుగా ప్రయత్నం చేస్తాను.” ఇలా వరమిచ్చి గదాధరుడు వెళ్లిన తర్వాత ఇంద్రుడు ఆ మనోహరమైన నదిలో స్నానం చేసిన తర్వాత, ఆయన పాపాలతో పుట్టిన మానవులలో కొండరాయనను సమీపించి, మాకు హితోపదేశం చేయుమని అర్ధించారు. అలా వచ్చిన క్రూర కర్ములైన పుళిందులనే ఆ కిరాతులను చూచి శక్రుడిలా అన్నాడు. “మీరు నా పాపఫలంగా జన్మించారు. ఓ పులిందులారా! ఈ హిమాద్రి కాళింజరాలనే ప్రముఖ పర్వతాల మధ్య దేశాన్ని నివాసంగా చేసుకుని జీవించండి! అలా పులిందుల నాదేశించి పాపముక్తుడైన ఆ వాసవుడు సుర సిద్ధ యక్షాదుల పూజలు అందుకుని ధర్మభూమి అయిన తన తల్లి ఆశ్రమానికి వెళ్లాడు. తల్లి అయిన అదితిని చూచి శిరసా ప్రణామం చేసి తామర పూలలో భాగానికి వలె మృదువుగా ఎర్రగా ఉన్న ఆమె పాదాలను కన్నులకద్దుకుని తన తపస్సు విషయాన్ని నివేదించాడు. ఆమె అశ్రుపూరిత నయనాలతో కుమారుని కౌగలించుకుని శిరస్సు మూర్కాని తపస్సుకు కారణమేమని ప్రశ్నించగా నాశక్రుడు బలి దైత్యునితో యుద్ధంలో ఓడిపోయి రాజ్యం కోలుపోవడం అంతా వివరించాడు. దితి కుమారులచేత పరాభవించబడిన తన దుర్దశకు ఆసాధ్వి దుఃఖంతో క్రుంగిపోయి ఆద్యంత రహితుడు, వరేణ్యుడునైన ఆ విష్ణుని ఆశ్రయించి శరణు పొందింది. అది విని నారదుడు ఓ మహర్షీ! ఆదేవమాత ఏప్రదేశంలో చరాచర సృష్టికర్తా, పురాణ పురుషుడూ, అనంతుడునైన ఆ హృషీకేశుని ఆరాధించినది చెప్పండని అర్ధించాడు. అందుకు పులస్త్యుడు ఇలాచెప్పాడు. నారదా! తన పుత్రుడావిధంగా బలిచేతిలో ఓడిపోయి దీనుడై యుండుట చూచి ఆ అదితి మాఘ శుద్ధ సప్తమీ పవిత్ర దినాన తూర్పున ఉదయించిన త్రిదశాధిపతిని దర్శించి మౌనం పాటించి నిరాహారయై తపో దీక్షవహించింది. ఆ జగచ్చక్షువును ప్రసన్నురాలై