బ్రహ్మ మహా పురాణము
246 - అస్య శ్రవణ పఠన కర్తౄణాం ఫలప్రాప్తి కథనమ్
లోమహర్షణుడు:
ఏవం పురా మునీన్వ్యాసః పురాణం శ్లక్ష్న గిరా
దశాష్టదోష రహితై ర్వాక్యైః నారతెరై ర్ద్విజాః
పూర్ణమస్తమలైః శుద్ధై ర్నానాశాస్త్ర సముచ్చయైః
జాతి శుద్ధ సమాయుక్తం సాధు శబ్దోపశోభితమ్
పూర్వపక్షో క్తి సిద్ధాంత పరినిష్ఠా సమన్వితమ్
శ్రావయిత్వా యథాన్యాయం విరరామ మహామతిః
తేపి శ్రుత్వా మునిశ్రేష్ఠాః పురాణం వేద సంమితమ్
అద్యం బ్రహ్మాభిధానం చ సర్వవాంఛా ఫలప్రదమ
హృష్టా బభూవుః సుప్రీతా విస్మితాశ్చ పునః పునః
ప్రశశంసుస్తదా వ్యాసం కృష్ణద్వైపాయనం మునిమ్
బ్రహ్మ పురాణ ప్రశంస -ఫలశ్రుతి
లోమహర్షణుడు:
ఓ బ్రాహ్మణులారా! పూర్వము మహామతి యగు వ్యాస మహాముని శాస్త్రము నందు చెప్పబడి నవియు ఉచ్చారణమునకు సంబంధించి నవియు అగు పదు నెనిమిది దోషముమలు (ఇవి వ్యాకరణ భాష్యము నందు చెప్పబడి యున్నవి.) లేనివియు మిగుల సార భూతములును దోషములు లేనివియు శుద్ధములును అనేక శాస్త్ర సముదాయ రూపములును అయిన వాక్యములతో నిండి నదియు స్వభావము చేతనే శుద్ధమగు విషయ సమాయోజనముతో కూడినదియు సాధువు లగు వ్యాకరణ విరుద్ధము లను శిష్టులకు అసమ్మతము లును కాని శబ్దములతో ఉప శోభితమును పూర్వపక్ష వచనములతో సిద్ధాంత వ్యవస్థాపనముతో కూడినది అగు ఈ బ్రహ్మ పురాణమును శాస్త్ర న్యాయా నుసారముగ నుండు నట్లు మృదువగు వాక్కుతో వినిపించి మగించెను. (పూర్వ పక్ష వచనముల తోను సిద్ధాంత వ్యవస్థాపనము తోను కూడి శాస్త్ర న్యాయా నుసారముగ నున్నది. అనుట చేత మీ మాంసా శాస్త్ర సిద్ధమగు లక్షణము ననుసరించిన విషయ విభాగ క్రమము కూడ ఈ పురాణ విషయ ప్రతిపాదనములో పాటింప బడినదని తెలియ వలెను. అధికరణము అనగా విషయో విషయశ్చైవ పూర్వ పక్షస్తథోత్తరమ్, ప్రయోజనం సంగతిశ్చ ప్రాంచోధికరణంవిదుః అని చెప్ప బడినది. దీని వివరణము పెద్దల వలన తెలియ దగినది, అనువాదకుడు.) అ ముని శ్రేష్ఠులును వేదములతో సమానమును నర్వవాంఛా ఫలప్రద మును ఆధ్యమును అగు బ్రహ్మ పురాణమును విని హర్షమును ప్రీతిని ఆశ్చర్యము పొందిన వారై కృష్ణద్వైపాయన వ్యాస మహామునిని మరల మరల ప్రశంసించిరి.
మునులు:
ఆహో త్వయా మునిశ్రేష్ఠ పురాణం శ్రుతి సంమితమ్
సర్వాభి ప్రేత ఫలదం సర్వపాప హరం పరమ్
ప్రోక్తం శ్రుతం తథాస్మాభి ర్విచిత్ర పదమక్షరమ్
నతేస్త్యవిదితం కించి త్త్రిషులోకేషువై ప్రభో
సర్వజ్ఞస్త్వం మహాభాగ దేవేష్విన బృహస్పతిః
సమస్యామో మహాప్రాజ్ఞం బ్రహ్మిష్ఠం త్వాం మహామునిమ్
యన త్వయా తు వేదార్థా భారతే ప్రకటీ కృతాః
కః శక్నోతి గుణాన్వక్తుం తవ సర్వాన్మహామునే
ఆధీత్య చతురో వేదా న్సాంగాన్వ్యాకరణానిచ
కృతవాన్భారతం శాస్త్రం తన్మై జ్ఞానాత్మనే నమః
నమోస్తుతే వ్యాస విపశాలబుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్ర
యేన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః
ఆజ్ఞాన తిమిరాంధానాం భ్రామితానాం కుదృష్టిభిః
జ్ఞానాంజన శలాకేన త్వయా చోన్మీలాతా దృశః
ఏవముక్త్వా సమభ్యర్చ్య వ్యాసం తేచైవ పూజితాః
జగ్ముర్యథాగతం సర్వే కృతకృత్యాః స్వమాశ్రమమ్
మునులు:
ఎంత ఆశ్చర్యమిది! ఓముని శ్రేష్ఠా! మీరు వేదములతో సమానమును సర్వాభీష్ట ఫల ప్రదమును సర్వ పాపహరమును ఉత్తమమును విచిత్ర పదములతో అక్షరములతో కూర్చబడి నదియు అగు
(-----------------------missing pg#714 --------------------------)
పురాణం వైష్ణవం త్వేత త్సర్వ కిల్బిషనాశనమ్
విశిష్టం సర్వాశాస్త్రేభ్యః పురుషార్థోపపాదకమ్
ఏతద్వో యన్మయాఖ్యాతం పురాణం వేదసంమితమ్
శ్రుతేస్మిన్సర్వదోషోత్థః పాపరాశిః ప్రణశ్యతి
ప్రయాగే పుష్కరే చైవ కురుక్షేత్రే తథార్బుదే
ఉపోష్య యదవాప్నోతి తదస్య శ్రవణాన్నరః
యదగ్నిహోత్రే సుహుతే వర్షేనాప్నోతి వైఫలమ్
మహాపుణ్యమయం విప్రా స్తదస్య శ్రవణాత్సకృత్
యజ్జ్యేష్ఠ శుక్లద్వాదశ్యాం స్నాత్వా వై యమునాజలే
మధురాయాం హరిం దృష్ట్వా ప్రాప్నోతి పురుషః ఫలమ్
తదాప్నోతి ఫలం సమ్యక్సమాధానేన కీర్తానత్
పురాణేస్య హితో విప్రాః కేశవార్పితమానసః
యత్ఫలం శ్రియమాలోక్య పురుషోథ లభేన్నరః
తత్ఫలం సమవాప్నోతియః పఠేచ్ఛృణుయాదపి
ఇదం యః శ్రద్ధయా నిత్యం పురాణం వేదసంమితమ్
యః పఠేచ్ఛృణుయాన్మర్త్యః స యాతి భువనం హరేః
శ్రావయే ద్రాహ్మణో యస్తు సదా పర్వసు సంయతః
ఏకాదశ్యాం ద్వాదశ్యాం చ విష్ణులోకం స గచ్ఛతి.
ఇదం యశస్యమాయుష్యం సుఖదం కీర్తివర్ధనమ్
బలపుష్టిప్రదం నౄణాం ధన్యం దుఃస్వప్ననాశనమ్
త్రిసంధ్యం యః పఠేద్విద్వాన్ శ్రద్ధయా మసమాహితః
ఇదం వరిష్ఠ మాఖ్యానం స సర్వమీప్పితం లభేత్
రోగార్తో ముచ్యతే రోగా ద్బద్ధో ముచ్యేత బంధనాత్
భయాద్విముచ్యతే భీత ఆపదాపన్న ఆపదః
జాతిస్మరత్వం విద్యాం చ పుత్రాన్మేదాం పశూన్ధృతిమ్
ధర్మం చార్థం చా కామం చ మోక్షం తు లభతే నరః
యాన్యాన్కామానభిప్రేత్య పఠేత్ర్పయతమానసః
తాంస్తాన్నర్వానవాప్నోతి పురుషో నాత్ర సంశయః
యశ్చేదం సతతం శృణోతి మనుజః స్వర్గాపవర్గప్రదమ్
విష్ణుం లోకగురుం ప్రణమ్య వరదం భక్త్యేక చిత్తః శుచిః
భుక్త్వా చాత్ర సుఖం విముక్త కలుషః స్వర్గే చ దివ్యం సుఖమ్
పశ్చాద్యాతి హరేః పదం సువిమలం ముక్తో గుణైః ప్రాకృతైః
తస్మాద్విప్రవరైః స్వధర్మనిరతై ర్ముక్త్యేకమార్గేప్సుభి
స్తద్వత్షత్రియ పుంగవైస్తు నియతైః శ్రేయోర్థిభిః సర్వదా
వైశ్యైశ్చానుదినం విశుద్ధకులజైః శూద్రై స్తథా ధార్మికైః
శ్రోతవ్యం త్విద ముత్తమం బహుఫలం ధర్మార్థమోక్షప్రదమ్
ధర్మే మతిర్భవతు వః పురుషో మానాం
సహ్యేక ఏవ పరలోకగతస్య బంధుః
అర్థాః స్త్రియశ్చ నిపుణైరపి సేవ్యమానా
నైవ ప్రభావమువయాంతి నచ స్థిరత్వమ్
ధర్మేణ రాజ్యం లభతే మనుష్యః స్వర్గం చ ధర్మేణ నరః ప్రయాతి
ఆయుశ్చ కీర్తిం చ తపశ్చ ధర్మం ధర్మేణ మోక్షం లభతే మనుష్యః
ధర్మోత్ర మాతాపితరౌ నరస్య ధర్మః సఖా చాత్ర పరే చ లోకే
త్రాతా చ ధర్మస్త్విహ మోక్షదశ్చ ధర్మాదృతే నాస్తి తు కించదేవ
ఇదం రహస్యం శ్రేష్ఠం చ పురాణం వేదసంమితమ్
న దేయం దుష్టమతయే నాస్తికాయ విశేషతః
ఇదం మయోక్తం ప్రవరం పురాణం పాపాపహం ధర్మవివర్ధనం చ
శ్రుతం భవద్భిః పరమం రహస్య మాజ్ఞాపయధ్వం మునయో వ్రజామి
ఇది బ్రహ్మచారులును గ్పహస్థులును యతులును కూడ శ్రవణము చేయ దగినది. పవిత్రము. నరులకు ధన సౌఖ్య ప్రదము, పాప నాశనము, బ్రహ్మ తత్త్వము నెరుగ గోరిన బ్రాహ్మణాది వర్ణముల వారందరును శ్రేయోభికాంక్షు లగు వారును ప్రయత్నముతో లెస్సగా దీనిని విన వలెను. అందు వలన బ్రాహ్మణుడు విద్యను క్షత్రియుడు రణమున విజయమును వైశ్యు డక్షయ ధనమును శూద్రుడు సుఖమును పొందును. పురుషుడు శుచి మనస్కుడై ఏఏ కోరికను అభిధ్యానించుచు ఈ పురాణమును వినునో ఆ కోరిక నెల్ల పొందును. అందు సందేహము లేదు. ఈ పురాణము విష్ణుని పరమ దైవతముగా ప్రతిపాదించు నది. సర్వపాప నాశనము. పురుషార్థము లన్నింటిని సంపాదింప జేయునది. అన్ని శాస్త్రముల కంటె విశిష్ట మయినది. నేను మీకు వినిపించిన వేద సంమితమగు ఈ పురాణము వినిన వారికి సర్వ దోషముల వలన కలిగిన పాప రాశియు నశించును. ప్రయాగ పుష్కర కురు క్షేత్రార్బుద క్షేత్రము లందు ఉపవసించుట వలన కలుగు పుణ్యము కలుగును. నరుడు సంవత్సరము పాటు అగ్ని హోత్రమును చక్కగ వేల్చుట వలన కలుగు సుమహా పుణ్యఫలము కలుగును. జ్యేష్ఠ శుక్లైకాదశి నాడు మధురలో యమునా జలమున స్నానము చేసి శ్రీకృష్ణుని దర్శించుటచే కలుగు ఫలము కలుగును. కేశవుని యందు మనస్సు అర్పించి, నిలిపి, సరియగు మనస్స మాధానముతో హరి కీర్తనము చేయుటచే కలుగు ఫలము ఈ పురాణ శ్రవణము నందు (ని) హితమై నిలుపబడి యున్నది. దీని శ్రవణము వలన యజ్ఞక్రియా దర్శనముచే కలుగు ఫలము కలుగును. వేద సదృశ మగు ఈ పురాణమును పఠించి నను విన్నను అతడు విష్ణు లోకమునకు ఏగును. ఏకాదశి ద్వాదశి వంటి పర్వ దినము లందు శుచియై బ్రాహ్మణులచే ఈ పురాణమును వినిపించిన, వినిపించు కొనిన వారు విష్ణు లోకమునకు పోవుదరు. ఇది యశమును ఆయువును సుఖమును కీర్తిని బలమును పుష్టిని కలిగించును. ధన్యునిగా చేయును. దుఃస్వప్నముల నశింప జేయును. చక్కని మన స్సమాధానముతో శ్రద్ధతో ఈ శ్రేష్ఠ మగు ఆఖ్యానమును వినిన వారు సర్వము లగు ఈప్సితము లను పొందుదురు. రోగార్తుడు రోగము నుండి బద్ధుడు బంధనము నుండి భీతుడు భయము నుండి ఆపన్నుడు ఆపదల నుండి విముక్తు డగును. నరుడు పూర్వ జన్మ స్మృతిని విద్యను పుత్రులను మేధను పశువులను ధైర్యమును ధర్మార్థ కామ మోక్షములను. ఇంతయే కాదు ప్రయత మగు, శుచి యగు, మనస్సుతో ఏ కోరికలను సంకల్పించి వినునో ఆ కోరికల నెల్ల పొందును. అందు సందేహమే లేదు. స్వర్గ మోక్ష ప్రదుడును లోకములకు గురుడును (తల్లి తండ్రి విద్య నుపదేశించిన వాడు హితము నుపదేశించు వాడు ఇట్టివారు గురువు లన బడుదురు.) వరముల నిచ్చువాడు నగు విష్ణుని నమస్కరించి భక్తియుక్త మగు ఏక చిత్తముతో శుచియై ఈ పురాణమును నిరతమును వినువారు సమస్త పాపములను నశింప జేసికొని ఇహ లోకమున సమస్త సుఖములను అనుభవించి స్వర్గమున దివ్య సుఖమును పొంది కడపట ఈ ప్రకృతి జన్యము లగు గుణముల నుండి విడుదలను పొంది ముక్తులై మిగుల విమల మగు శ్రీహరి స్థానమును చేరుదురు. అందు వలన స్వధర్మ నిరతులును ముక్తి మార్గమును మాత్రమే కోరు వారును అగు బ్రాహ్మణ శ్రేష్ఠులును నియమ పరులును శాశ్వత శ్రేయస్సును కోరువారు నగు క్షత్రియ పుంగవులును విశుద్ధ వంశమున జన్మించిన వైశ్యులును ధార్మికులగు శూద్రులును ఉత్తమమును బహు ఫల ప్రదమును ధర్మార్థ మోక్ష ప్రదము నగు ఈ పురాణము అనుదినమును విన వలయును. పురుషోత్తము లగు మీ కందరకును ధర్మము నందు బుద్ధి స్థిరమగు గాక! పరలోకము నకు మీరు ఏగి నప్పుడు మీకు బంధువు అది యొక్కటియే. అర్థ కామము లను రెండు పురుషార్థములను మీరు ఎంత జాగరూకులై సేవించినను అవి మీపై సత్ఫలమును చూప జాలవు. వాని ఫలములు స్థిరములై యుండవు. ధర్మముచే నరుడు రాజ్యమును స్వర్గమును ఆయువును కీర్తిని తపస్సును ధర్మమును దానిచే మోక్షమును పొందును. ఇహమునను పర లోకము నను ధర్మమే తల్లి దండ్రులును మిత్రుడును రక్షకుడును మోక్ష ప్రదమును. ధర్మము తప్ప మఱింకేదియు లేదు. ఈ పురాణము రహస్యమును శ్రేష్ఠమును వేదములతో సమానమును. బుద్ధి దోషము కల వానికిని. విశేషించి నాస్తికునకును, ఇంద్రియ గోచరము కాని దేదియు నమ్మ దగినది కాదను వానికిని దీనిని అందించ రాదు. శ్రేష్ఠమును పాప నాశకమును ధర్మమును వృద్ధి చేయు నదియు అగు ఈ పురాణమును నేను ప్రవచించితిని పరమ రహస్య మగు దీనిని మీరు వింటిరి. అయ్యా! పోయి వచ్చెదను. ఆజ్ఞ ఇండు.
శ్లోక సంఖ్య ఆరంభము నుండి - 13,783
బ్రహ్మ మహా పురాణము సర్వమూ సమాప్తము
* * * * *
Summary of chapter 1 of the Brahma Mahā Purana is as follows:
The Gautamī Māhātmya opens with a systematic classification of tīrthas into four types — Daiva (celestial), Āsura (demonic, i.e., obtained by tapas of asuras), Ārṣa (of ṛṣis), and Māṇuṣa (human). The twelve sacred rivers of Bhārata are enumerated. The tīrthas of mountains, sages, and kings are described, establishing the theological framework within which all subsequent tīrtha narratives of the Gautamī will be understood.