లోమహర్షణుడు:
ఉత్తరేణ సముద్రస్య హిమాద్రేశ్చైవ దక్షిణే
వర్షం తద్భారతం నామ భారతీ యత్ర సంతతిః
నవయోజనసాహస్రో విస్తారశ్చ ద్విజో త్తమాః!
కర్మభూమిరియం స్వర్గ మపవర్గం గంతు మిచ్ఛతామ్
లోమహర్షణుడు:
సముద్రమున కుత్తరమున హిమాలయమునకు దక్షిణమున భారత వర్షము గలదు. అందలి సంతతి “భారతి” యన బడును. ఇతి తొమ్మిది వేల యోజనముల వైశాల్యము గలది. కర్మ భూమియని దీనికి పేరు. కోరిన వారికి స్వర్గము, మోక్షమును గూడ నిందే యున్నవి.
మహేంద్రో మలయః సహ్యః శు క్తిమా న్నృక్ష పర్వతః
వింధ్యశ్చ పారియాత్రశ్ఛ సప్తాత్ర కులపర్వతాః
అతః సంప్రాప్యతే స్వర్గో ముక్తి మస్మా త్ర్పయాతి వై
తిర్యక్త్వం నరకం చాపి యాం త్యతః పురుషాః ద్విజాః
ఇతః స్వర్గంచ మోక్షంచ మధ్యే చాంతే చ గచ్ఛతి
న ఖల్వన్యత్ర మార్త్యానాం కర్మభూమౌ విదీయతే
ఇందు మహేంద్రము, మలయము, సహ్యము, శుక్తిమంతము, ఋక్షము, వింధ్యము, పారియాత్రము లను సప్తకుల పర్వతము లున్నవి. భారత వర్షము నుండియే స్వర్గ మోక్షముల జీవులు పొందుదురు. పశు పక్ష్యాది జన్మములను నరకమును గూడ నిట నుండియే పొందుదురు. ఆవాంతర కర్మఫలము స్వర్గము పర్యవసాన మందాత్యంతిక ఫలమైన మోక్షము గూడ ఇట నుండియే మానవుడు పొందును. ఈ భూ మండల మందిక్కడనే కర్మానుష్ఠానము విధింప బడినది. అందు చేతనే దీనికి కర్మ భూమియను పేరు సార్ధకము.
భారతస్యాస్య వర్షస్య నవభేదా న్నిశామయ
ఇంద్రద్వీపః క సేరుశ్చ తామ్రపర్ణో గభస్తిమాన్
నాగద్వీప స్తథా సౌమ్యో గంధర్వ స్త్వథ వారుణః
అయం తు సవమస్తేషాం ద్వీపః సాగరసంవృతః
యోజనానాం సహస్రం చ ద్వీపోయం దక్షిణో త్తరాత్
పూర్వే కిరాతా స్తిష్ఠంతి పశ్చిమే యవనాః స్ధతాః
బ్రహ్మణాః క్షత్రియా వైశ్యా మధ్యే శూద్రాశ్చ భాగశః
ఇజ్యాయుద్ధ వణిజ్యాది వృత్తిమంతో వ్యవస్థతాః
భారత వర్షమున తొమ్మిది ద్వీప విభాగము లున్నవి. ఇంద్ర ద్వీపము, కశేరువు (కశేతు మంతమని కూడ యందురు) తామ్రపర్ణము, గభస్తి మంతయు, నాగ ద్వీపము, సౌమ్యము, గాంధర్వము, వారుణము. ఈ భారత ఖండ మందు తొమ్మిదవది. సముద్ర సంవృతము ఇది దక్షిణ దిశ నుండి యుత్తర దిక్కుకు వేయి యోజనములు. తూర్పున కిరాతులు, పడమట యవనులు, నడుమ బ్రహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు నుందురు. యజన యాజనములు. యుద్ధము వాణిజ్యము కృష్యాదులు వృత్తులు క్రమముగా వీరికి విహితములు,
శతద్రు చంద్ర భాగాద్యా హిమవత్పాదనిస్పృతాః
వేదస్మృతిముఖాశ్చాన్యాః పారియాత్రోద్భవా మునే
నర్మదాసురసాద్యాశ్చ వింధ్య పాదవిని స్తృతాః
తాపీ పయోష్ణీ నిర్వింధ్యా కావేరీ ప్రముఖా స్తథా
ఋక్షపాదోద్భవా హ్యేతాః శ్రుతాః పాపం హరంతి యాః
గోదావరీ భీమరధీ కృష్ణవే ణ్యాదికా శ్చయా
సహ్యపాదోద్భవా నద్యః స్మృతాః పాపభయాపహాః
కృతమాలా తామ్రపర్ణీప్రముఖా మలయోదభవాః
త్రిసాంధ్య ఋషికుల్యాద్యాః మహేంద్రప్రభవాః స్మృతాః
ఋషికుల్యాకుమార్యాద్యాః శుక్తిమత్పాద సంభవాః
హిమవత్పర్వత ప్రత్యంత పర్వతము నుండి శతద్రు (సట్లజ్) చంద్రభాగ వేదము, స్మృతి మొదలయిన నదులు ప్రవహించు చున్నవి. నర్మద, సురస మొద లయినవి వింధ్య గిరి నుండి వెడలు చున్నవి. తాపి, పయోష్ణి నిర్వింధ్య, కావేరి మొద లయినవి ఋక్ష పర్వత పాద మందు జనించి నవి, గోదావరి, ఖీమరధి, కృష్ణవేణి మొదలగునవి సహ్యగిరి పాద మందు బుట్టినవి. కృతమాలా, తామ్రపర్ణీ ప్రముఖములు మలయాద్రి సంభవములు. త్రిసాంధ్య, ఋషికుల్య మొదలయినవి మహేంద్ర గిరి జన్యములు. ఋషికుల్యా, కుమారి మొదలైనవి శుక్తి మత్పర్వత పాద మందు బుట్టినవి. వీని యుప నదులు వేల కొలదియు గలవు.
ఆసాం నద్యుపనద్యశ్చసం త్యన్యాస్తు సహస్రశః
తా స్విమే కురుపాంచాల మధ్యదేశాదయో జనాః
పూర్వదేశాదికాశ్చైవ కామరూప నివాసిసః
పౌండ్రాః కళింగా మగధా దాక్షిణాత్యాశ్చ సర్వశ
తథాపరాంత్యాః సౌరాష్ట్రాః శూద్రాభీరా స్తథార్బుదాః
మారుకా మాళవా శ్చైవ పారియాత్రనివాసినః
సౌవీరాః సైంధవాపన్నాః శాల్వాః శాకలవాసినః
మద్రారామా స్తథాంబష్ఠాః పారశీకాదయ స్తథా
ఆసాం పిబంతి సలిలం వసంతి సరితాం సదా
సమోపేతా మహాభాగా హృష్టపుష్టజనాకులాః
వాని యందు కురు పాంచాల దేశ ప్రజ నివసించు చున్నది. తూర్పన కామరూప దేశ వాసులు, కళింగులు మగధులు నున్నారు. దాక్షిణాత్యులు, దక్షిణము నందుండు వారు. పశ్చిమమున సౌరాష్ట్రులు శూద్రులు ఆభీరులు, అర్బుదులు, మారుకులు, మాళవులు, పారియాత్ర నివాసులు, మద్రులు, రాములు, అంబష్ఠులు, పారసీ కాదులు వీరందరు నీయీ నదుల జలములం ద్రావుదురు. ఈ దేశమలు కలిసి మెలసి ఆనంద భరితులై పుష్టి వంతులు నైన జనులతో నిండి యుండును.
వసంతి భారతే వర్షే యుగాన్యత్రమహామునే
కృతం త్రేతా ద్వాపరం చ కలి శ్చాన్యత్ర న క్వచిత్ః
తపస్తప్యంతి యతయో జుహ్వతే చాత్ర యజ్వనః
దానాని చాత్ర దీయంతే పరలోకార్థ మాదరాత్ః
కృత త్రేతా ద్వాపర కలియుగ విభాగ మిక్కడనే కలదు. అన్యత్ర లేదు, ఇందు యతులు తపస్సు చేయుదురు. యజ్వలు హోమములు (యాగములు) సేయుదురు. పరలోకము గోరి యిచట దానము లాచరింప బడును.
పురుషై ర్యజ్ఞ పురుషో ఙంబూద్వీపే స దేజ్యతే
యజ్ఞైర్యజ్ఞ మయో విష్ణు రన్యద్వీ పేషుచాన్యథా
అత్రాపి భారతం శ్రేష్ఠం జంబూద్వీపే మహామునే
యతోహి కర్మభూ రేషా యతోన్యా భోగభూమయః
అత్ర జన్మసహస్రాణాం సహస్రైరపి సత్తమ
కదాచి ల్లభతే జంతు ర్మానుష్యం పుణ్యసంచయాత్
జంబూ ద్వీప మందు యజ్ఞ పురుషుడుపాసింప బడును. విష్ణువు యజ్ఞ రూపుడుగ యజ్ఞే శ్వరుడుగ నిచట నుపాసింప బడును. ఇతర ద్వీపము లందు మఱియొక పేరున గొల్వ బడును. ఈ జంబూ ద్వీపమున భారత వర్షము శ్రేష్ఠము. ఇది కర్మభూమి. తక్కినవి భోగ భూములు, బహుజన్మ ఫల భోగముగ నిందెంతో కాలమునకు మనుష్య జన్మము గల్గును.
గాయంతి దేవాః కిల గీతకాని ధన్యాస్తుయే భారత భూమిభాగే స్వర్గాపవర్గాస్పదహేతుభూతే భవంతి భూయః పురుషా మనుష్యా
కర్మాణ్య సంకల్పితతత్ఫలాని నంన్యస్య విష్ణౌ పరమాత్మరూపే
అవాప్య తాం కర్మమహీ మనంతే తసిలయం యే త్వమలాః ప్రయాంతి
జానీమ నో తత్క్వవయం విలీనే స్వర్గప్రదే కర్మణి దేహబంధమ్
ప్రాప్నువంతి ధన్యాః ఖలు తే మనుష్యా యే భారతే నేంద్రియవిప్రహీనాః
నవర్షం చ భో విప్రా జంబూద్వీపమిదం మయా
లక్షయోజన విస్తారం సంక్షేపా త్కథితం ద్విజాః
జంబూద్వీపం సమావృత్య లక్షయోజన విస్తరః
భో ద్విజా వలయాకారః స్థితః క్షీరోదధి ర్బహిః
దేవతలీ భారత భూమిని గూర్చి యిట్లు గానము సేయు చుందురు. స్వర్గాప వర్గము లొసంగు భారత భూమి యందు మనుష్యులయి, వారిలో పురుషులయి పుట్టి, అట్టి కర్మ భూమి యందు జన్మము వడసియు ఫలాభి సంధి లేక సర్వ కర్మ ఫలమును పరమేశ్వరా ర్పణమని పరమాత్మ యగు విష్ణువు నందర్పించి పాపదూరులై యా పరబ్రహ్మ మందు లీనమగు వారు ధన్యులు. అనగా పరమేశ్వరార్పణముగ నాచరించిన స్వర్గప్రద మగు కర్మ లీనమై పోయిన తర్వాత దేహ బంథమును మఱి యెందు పొందుదురో యెఱుగము. ఇంద్రియ వంతులై భారత వర్షమున పుట్టిన వారు ధన్యులు. తొమ్మిది వర్షములు గల్గి లక్ష యోజనముల విరివి గల యీ జంబూ ద్వీపమును గూర్చి సంక్షేపముగా దెల్పితిని. ఈ ద్వీపము నావరించి లక్ష యోజనములు విస్తారము గల క్షీర సముద్రము వలయా కారముగ నున్నది.
Summary of chapter 19 of the బ్రహ్మ మహా పురాణము is as follows:
The seven netherworlds (Pātālas) situated beneath the earth — Atala, Vitala, Sutala, Talātala, Mahātala, Rasātala, and Pātāla — are described in detail. Each world is inhabited by different classes of beings: Daityas, Dānavas, Nāgas, and others. Their extraordinary beauty, wealth, and pleasures are described, along with the divine serpent Śeṣa who supports the entire earth from below.