బ్రహ్మ మహా పురాణము
10 - సోమ వంశ వర్ణనమ్
లోమహర్షణుడు:
బుధస్య తు మునిశ్రేష్ఠా విద్వా స్పుత్రః పురూరవాః
తేజస్వీ దానశీలశ్చ యజ్వా విపుల దక్షిణః
బ్రహ్మవాదీ పరాక్రాంతః శత్రుభి ర్యుధి దుర్ధమః
ఆహర్తా చాగ్నిహోత్రస్య యజ్ఞానాంచ మహీపతిః
సత్యవాదీ పుణ్యమతిః సమ్య క్సంవృతమైథునః
అతీవ త్రిషు లోకేషు యశసా ప్రతిమ స్సదా
తం బ్రహ్మవాదినం శాంతం ధర్మజ్ఞం సత్యవాదినం
ఉర్వశీ వరయామాస హిత్వా మనాం యశస్వినీ
లోమహర్షణుడు:
ఓ ముని శ్రేష్ఠులారా! బుధుని కుమారుడు పురూరవుడు. విద్వాంసుడు, తేజశ్శాలి, దాత, విపుల దక్షిణ లిచ్చిన యజ్వ. బ్రహ్మవాదీ యుద్ధము నందు శత్రువుల కందని వాడు. నిత్యాగ్నిహోత్రి, యజ్ఞకర్త. మహీపతి సత్యవాది, పుణ్యమతి, నిగూఢ మైథనుడు, ముల్లోకము లందు అనుపమ కీర్తిశాలి. అట్టి వానిని బ్రహ్మ వాదిని (వేదాధ్యయన రతుని) శాంతుని ధర్మజ్ఞుని సత్య వచనుని యశస్విని యగు ఊర్వశి అభిమానము (గుట్టు) విడిచి వరించెను.
తయా సహావస ద్రాజా దశ వర్షాణి పంచచ
షట్పంచ సప్త చాష్టా చ దశ చాష్టౌచ భోద్విజాః
వనే చైత్రరథే రమ్యే తథా మందాకినీ తటే
అలకాయాం విశాలాయాం నందనేచ వనోత్తమే
ఉత్తరాన్స కురూ న్ప్రాప్య మనోరమ ఫలద్రుమాన్
గంధమాదనపాదేషు మేరుశృంగే తథోత్తరే
ఏ తేషు వనముఖ్యేషు సురై రాచరితేషు చ
ఉర్వస్యా సహితో రాజా రేమే పరమయా ముదా
దేశే పుణ్యతమే చైవ మహర్షిభిరభిష్టుతే
రాజ్యం స కారయామాస ప్రయాగే పృథివీపతిః
ఏవం ప్రభావో రాజాసీ దైలస్తు నరసత్తమః
(ఉత్తరే జాహ్నవీ తీరే ప్రతిష్ఠానే మహాయశాః)
బ్రాహ్మణులారా! ఆ రాజు ఊర్వశితో గూడి చైత్ర రథమను సుందర వనమందు పది సంవత్సరములు, మందాకినీ నదీ తీరమున నైదు సంవత్సరములు, అలకాపుర మందు ఆరు సంవత్సరములు, బదరీ పురము నందు అయిదు సంవత్సరములు, నందన వనమునం దేడు సంవ్సతరములు, మనోహర ఫల వృక్షములతో గూడిన ఉత్తర కురు దేశము నందెనిమిది సంవత్సరములు, గంధమాదన పర్వతముపై పది సంవత్సరములు సుమేరు పర్వతోత్తర భాగమున నెనిమిది సంవత్సరములు నివసించెను. ఈ ప్రధాన వనము లందును, దేవతల క్రీడా స్థానము లందును, ఊర్వశితో గూడ నారాజు పరమ హర్షమున క్రీడించెను. ఇలా పుత్రుడగు పురూరవుడు పవిత్ర తమము మహర్షులచే స్తుతింప బడినదియు నగు ప్రయాగ క్షేత్రము నందు రాజ్యము నేలుచు మహా ప్రభావశాలి యగు నరశ్రేష్ఠుడై యొప్పెను.
లోమహర్షణుడు:
ఐలపుత్రా బభూవు స్తే సప్త దేవసుతోపమాః
గంధర్వలోకే విదితా ఆయు ర్దీమా నమావసుః
విశ్వాయు శ్చైవ ధర్మాత్మా శుత్రాయుశ్చ తథాపరః
ధృఢాయుశ్చ వనాయుశ్చ బహ్వాయు శ్చోర్వశీ సుతాః
అమావసోస్తుదాయాదో భీమోరాజాథ రాజరాట్
శ్రీమాన్భీమస్య దాయాదో రాజాసీ త్కాంచన ప్రభః
విద్వాంస్తు కాంచనస్యాపి సుహోత్రోభూ న్మహాబలః
నుహోత్రస్యాభవ జ్జహ్నుః కేసిన్యా గర్భసంభవః
లోమహర్షణుడు:
ఆ ఇలుని (పురూరవుని) కుమారు లేడుగురు. దేవ కుమా రోపములు, గంధర్వ లోక ప్రసిద్దులు. ఆయువు ధీమంతుగు అమావసువు ధర్మాత్ముడగు విశ్వాయివు, శ్రుతాయివు, దృఢాయువు, వనాయువు, బహ్వాయువు నను వారూర్వశికి జనించినారు. అమావసు పుత్రుడు రాజరాజగు ఖీముడు. వాని కొడుకు శ్రీమంతుడగు కాంచనప్రభ నామ ధేయుడు. వాని తనయుడగు సుహోత్రుడు బలశాలి, విద్వాంసుడు. వాని తనయుడు. జహ్నువు కేశిని కుమారుడు.
అజహ్రే యో మహాసత్రం సర్పమేధం మహామఖమ్
పతిలోభేన గంగా పతిత్వేన ససారహ
నేచ్ఛతః ప్లావయామాస తస్య గంగా తదా సదః
సతయా ప్లావితం దృష్ట్వా యజ్ఞవాటం సమంతతః
సౌహోత్రి రశపద్గంగాం క్రుద్దో రాజా ద్విజోత్తమాః
ఏష తే విఫలం యత్నం పిబ న్నంభః కరోమ్యహమ్
అస్య గంగేవలేపస్య సద్యః ఫల మవాప్నుహి
జహ్ను రాజర్షిణా పీతాం గంగాం దృష్ట్వా మహర్షయః
ఉపనిన్యు ర్మహాభాగాం దుహితృత్వేన జాహ్నవీమ్
అతడు సర్ప మేధమను మహా యాగమను, అచరించెను. గంగ వతి లోభముచే నతని బతిగ వరించి యభి సరించెను. అతని యంగీకారము లభింప యజ్ఞ సదస్సును ముంచెత్తెను. యజ్ఞ వాటము నట్లు ముంచుట జూచి సుహోత్రుని కుమారుడు ఆ జహ్నువు క్రుద్ధుడై “నీ జతనమిది విఫల మొనరింప నిదిగో నీ నీటినెల్ల ద్రావెదను. నీ గర్వమునకు ఫలమిపుడే యను భవింపు మని శపించి అతడెల్ల గంగను ద్రావి వైచెను. అవ్వింతగని మహర్షు లాతనికి అభ్రాపగను గన్న కూతురి గావించిరి. దాన నామె జాహ్నవి యయ్యె.
యువనాశ్వస్య పుత్రీం తు కావేరీం జహ్ను రావహత్
యువనాశ్వస్య శాపేన గంగార్ధేన వివిర్గతా
కావేరీం సరితాం శ్రేష్ఠాం జహ్నోర్భార్యామనిందితామ్
జహ్నుస్తు దయితం పుత్రం సునద్యం నామ ధార్మికమ్
కావేర్యాం జనయామాస అజక స్తస్య చాత్మజః
అబకస్యతు దాయాదో బలాకాశ్వీ మహీపతిః
బభూవ మృగయాశీలః కుశ స్తస్యాత్మజోభవత్
కుశపుత్రా బభూవుర్హి చత్వారో దేవవర్చనః
కుశికః కుశనాభశ్చ కుశాంభో మూర్తిమాంస్తథా
వల్లవైః! సహ సంవృద్దో రాజా వనచరః సదా
కుశికస్తు తపస్తేపె పుత్ర మింద్రసమం ప్రభుః
యువనాశ్వుని పుత్రి యగు కావేరిని జహ్ను మహర్షి పరిణయ మాడెను. యువనాశ్వు డిచ్చిన శాపముచే గంగలో నర్దాంశ మయి ఏతెంచి జహ్ను భార్య, సరిద్వర యగు కావేరిలో కలసెను. జహ్నుడు ధర్మ పరుడయిన సునద్యుడను కుమారుని కావేరి యందు బడెసెను. వాని కుమారుడు అజకుడు. వాని బిడ్డడు బలాకాశ్వుడను రాజు. మృగయా భిరక్తుడగు కుశుడు వాని కొడుకు. వాని కుమారులు దేవ వర్చస్కులు నల్వురు. 1) కుశికుడు, 2) కుశనాభుడు, 3) కుశాంబుడు, 4) మూర్తిమంతుడను వారు. పల్లవులతో నిరంతరము పెంపు వడసి వనచరుడై కుశికుడు ఇంద్ర తుల్యుడైన కొమరునిం గోరి తప మెనరించెను.
లభేయమితి తం శక్ర స్త్రాసా దభ్యేత్య జజ్ఞివాన్
పూర్ణే వర్షసహస్రే వై తతః శక్రో హ్యపశ్యత
అత్యుగ్రతపసం దృష్ట్వా సహస్రాక్షః పురందరః
సమర్థః పుత్రజననే స్వయమే వాస్య శాశ్వతః
పుత్రార్థం కల్పయామాస దేవేంద్రః సురసత్తమః
స గాధి రభవ ద్రాజా మఘవా న్కౌశికః స్వయమ్
అతనికి బెదరి వేయేండ్లు ముగియగా నుగ్ర తపమ్మున యాఱేనింగని పుత్రునీయ సమర్థుండయ్యు తాన యాతనికి పుత్రు డాయెను. కుశికు పుత్రుడగు ఇంద్రుడే గాధియను రాజాయెను.
పౌరా యస్యాభవ ర్భార్యా గాధిస్త్యస్యా మజాయత
గాధెః కన్యామహాభాగా నామ్నా సత్యవతీ శుభా
తాం గాధిఃకావ్య పుత్రాయ ఋచీకాయ దదౌ ప్రభుః
తస్యాః ప్రీతః సవై భర్తా భార్గవో భృగునందనః
పుత్రార్థం సాధయామాస చరుం గాధే స్తథైవచ
ఉవాచాహూయ తాం భార్యామృచీకో భార్గవస్తదా
ఆజయ్యః క్షత్రియై ర్లోకే క్షత్రియర్షభసూదనః
తవాపి పుత్రం కల్యాణి ధృతిమంతం తపోధనమ్
ళమాత్మకం ద్విజశ్రేష్టం చరు రేష విదాస్యతి
ఏవ ముక్తా తు తాం భార్యా మృచీకో భృగునందనః
తపప్యభిరతో నిత్య మరణ్యం ప్రవివేశ హ
కుశికుని భార్య యగు పౌర యందు గాధి పుట్టెను. గాధి కుమార్తె సత్యవతి. మహానుభావు రాలు. గాధి రాజామెను సక్రుని పుత్రుడగు ఋచీకుని కిచ్చెను. అమె యెడగల ప్రీతిచే భార్గవుడు (ఋచీకుడు) గాథికి (మామ గారికి) కుమారుడు గలుగ వలెనని యజ్ఞమున చరువును సాధించి యిచ్చెను. ఋచీకుడు తాన భార్య సత్యవతి బిల్చి ఈ చరువుగు నీవును మీ అమ్మయి స్వీకరింపుడు అమె యందు దీప్తిగల క్షత్రి యోత్తము డుదయించును. క్షత్రియుల కతడ జయ్యుడు క్షత్రి యాంతకుడును కాగలడు. కల్యాణీ! నీవీ రెండవ చరువు సేవించి నంతట ధృతి మంతుడు తపో ధనుడు శాంతడు నైన ద్విజ శ్రేష్ఠుడు దయించును. అని పలికి దపో నిరతుడై యరణ్యముం బ్రవేశించెను.
గాధిః సదారస్తు తదా ఋచీకాశ్రమ మభ్యగాత్
తీర్థయాత్రాప్రసంగేన సుతాం ద్రష్టుం సరేశ్వరః
చరుద్వయం గృహీత్వా సా ఋషేః సత్యవతీ తదా
చరు మాదాయ యత్నేన సాతు మాత్రే న్యవేదయత్
మాతా తు తుస్యా దైవేన దుహిత్రే స్వం చరుం దదౌ
తస్యాశ్చరు మధాజ్ఞానా దాత్మసంస్థం చకార హ
అథ సత్యవతీ సర్వక్షత్రియాంతకరం తదా
ధారయామస దీప్తేన వవుషా ఘోరదర్శవా
తా మృచీక స్తతో దృష్ట్వా యోగే నాభ్యుపసృత్యచ
తతోబ్రవీ ద్ద్విజ శ్రేష్ఠః స్వాం భార్యాం వరవర్ధినీమ్
మాత్రాసి వంచితా భద్రే చరువ్యత్యాస హేతునా
జనిష్యతి హి పుత్రస్తే క్రూర కర్మాతిదారుణః
భ్రాతా జనిష్యతే చాపి బ్రహ్మభూత స్తపోధనః
విశ్వం హి బ్రహ్మ తపసా మయా తస్మిన్స మర్పితమ్
ఏవముక్తా మహాభాగా భర్త్రా సత్యవతీ తదా
ప్రసాదయామాస పతిం పుత్రో మే నేదృశో భవేత్
బ్రాహ్మణాపసదస్త్వత్త్వ ఇత్యుక్తో మునిరబ్రవీత్
గాథియు నింతితో నప్పుడు ఋచీకు నాశ్రమమున కేగెను. తీర్థయాత్రా ప్రసంగమున కూతుం జూడ ఆ రాజు జామాతృన గృహంబున కేతెంచెను. సత్యవతి యా రెండు చరువులను గైకొని తల్లికి నివేదించెను అ తల్లి దైవ వశమున తాను దై కొన వలసిన చరువును కూతురున కిచ్చి అమెకీయ దగిన దానిని తాను గైకొనెను. అటుపై సత్యవతి సర్వక్షత్రి యాంతక తేజముం గర్భమున దాల్చిన కతన ఘోరమైన యాకారముతో గన నయ్యెను. ఋచీకు డా యింతింగాని యోగ దృష్టిచే గ్రహించి ద్విజ శ్రేష్ఠుండాతడు భార్యంగని కల్యాణీ! చరు వ్యత్యాసము చే మీ అమ్మచే నీవు వంచింప బడితివి. నీకు క్రూర వర్తనుడు అతి దారుణుడునగు తనయుడు దయించు వానికి భ్రాత బ్రహ్మణ్యుడు తపోధనుడు గల్గును. తపస్సుచే నేనీ యెల్ల బ్రహ్మమును వాని యందర్పించితిని. అన విని సత్యవతి నీ వలన నాకిట్టి క్రూర కర్ముడు బ్రాహ్మణా వసదుడు కొడుకుగా వలదనిన ఋచీక ముని యిట్లనియె.
ఋచీకుడు:
నైష సంకల్పితః కామో మయా భద్రే తథాస్త్వితి
ఉగ్రకర్మా భవేత్పుత్రః పితుర్మాతుశ్చ కారణాత్
పునః సత్యవతీ వాక్య మేవ ముక్త్వాబ్రవీదిదమ్
ఇచ్ఛల్లోకానపి మునే సృజెథాః కిం పునస్సుతమ్
శమాత్మక మృజుం త్వంమే పుత్రం దాతు మిహార్హసి
కామమేవం విథః పౌత్రో మమ స్యాత్తవచ ప్రభో
యద్యన్యధా న శక్యం వైకర్తు మేతద్ద్విజోత్తమ!
తతః ప్రసాద మకరో త్స తస్వా స్తపసో బలాత్
పుత్రే నాస్తి విశేషోమే పౌత్రే వా వరపర్ణిని
త్వయా యధోక్తం వచనం తథా భద్రే భవిష్యతి
తత స్సత్యవతీ పుత్రం జనయామస భార్గవమ్
తపస్యభిరతం దాంతం జమదగ్నిం శమాత్మకమ్
భృగోర్జగత్యాం వంశే స్మిన్‌జమదగ్నిరజాయత
సా హి సత్యవతీ పుణ్యా సత్య ధర్మపరాయణా
కౌశికీతి సమాఖ్యాతా ప్రవృత్తేయం మహానదీ
ఋచీకుడు:
కల్యాణి! నేనిట్ల కావలయు నని సంకల్పింప లేదు. పితృ మాతృ నిమిత్త మున దనయు డుగ్ర మూర్తి కాగలడు. ఇది విని మరల సత్యవతి యిట్లనియె. నీవు, తలచిన లోకములను సృజింప గల వాడవు. కొడుకు నిచ్చు మాట తెక్కేమి శమాత్మకుని ఋజు స్వభావుని పుత్రుని నాకనుగ్రహింపుము. ఇది వేరొక విధముగ జేయ వలను పడటేని మనకు దయింప గల మనుమడు మీరన్నట్లు క్రూరమూర్తి యగునట్లను గ్రహింపుడని భర్తను వేడు కొనెను. అది విని యమ్ముని తపో బలమున నట్ల యగుగాక యని యనుగ్రహము సేసెను. మరియు సుందరి పుత్రు నందును పౌత్రు నందును నాకు భేదము లేదు. నీవెట్లంటి వట్టే యగుట నా యభిమత మని యామెనా తపస్వి లాలించెను. అవ్వల సత్యవతి భార్గవునిం గుమారునిం గనెను. అతడే తపో నిరతు డతిదాంతుడు శాంతుడు నగు జమదగ్ని ఈ భృగు వంశమంద వతరించెను. పుణ్యురాలు సత్యవతి సత్యధర్మ పరాయణ కౌశికియను బేర మహా నదియై ప్రవర్తిల్లె.
ఇక్ష్వాకువంశ ప్రభవో రేణుర్నాను నరాధిపః
తస్య కన్యా మహాభాగా కామలీనామ రేణుకా
రేణుకాయాంతు కామల్యాం తపోవిద్యాసమన్విత
ఆర్చీకో జనయామాస జామదగ్న్యం సుదారుణమ్
సర్వ విద్యాంతగం శ్రేష్ఠం ధనుర్వేదస్య పారగమ్
రామం క్షత్రియహంతారం ప్రదీప్త మివ పావకమ్
ఔర్వసైన మృచీకస్య సత్యపత్యాం మహాయశాః
జమదగ్నిస్తపో వీర్యా జ్జజ్ఞే బ్రహ్మవిదాం వరః
మధ్యమశ్చ శునశ్శేఫః శునః పుచ్చః కనిష్ఠకః
విశ్వామిత్రం తు దాయాదం గాధిః కుశికనందనః
జనయామాస పుత్రంతు తపోవిద్యాశమాత్మకమ్
ప్రాప్య బ్రహ్మర్షిసమతాం యోయం బ్రహ్మర్షితాం గతః
విశ్వామిత్రస్తు ధర్మాత్మా నామ్నా విశ్వరథః స్మృతాః
జజ్ఞే భృగు ప్రసాదేన కౌశికా ద్వంశవర్ధనః
విశ్వామిత్రస్య చ సుతా దేవరాతాదయః స్మతాః
ప్రఖ్యాతా స్త్రిషు లోకేషు తేషాం నామాన్యతః పరమ్
దేవరాతః కతిశ్చైవ యస్మాత్కాత్యాయనాః స్మృతాః
శాలావత్యాం హిరణ్యాక్షో రేణు ర్జజ్ఞేథ రేణుకః
సాంకృతి ర్గాలవశ్చైవ ముద్గలశ్చైవ విశ్రుతః
మధుచ్ఛందో జయశ్చైవ దేవలశ్చ తధాష్టమః
కచ్చపో హారిత శ్చైవ విశ్వామిత్రస్య తే సుతాః
తేషాం ఖ్యాతాని గోత్రని కౌశికానాం మహాత్మనామ్
పాణినో బభ్రవశ్చైవ ధ్యానజప్యాస్తధైవచ
పార్థివా దేవరాతాశ్చ శాలంకాయన బాష్కలాః
లోహితా యమదూతాశ్చ తధా కారూశకాః స్మృతాః
పౌరవస్య ముని శ్రేష్ఠా బ్రహ్మర్షేః కౌశికస్య చ
సంబంధ్దోప్యస్య వంశేస్మిన్ బ్రహ్మక్షత్రస్య విశ్రుతః
విశ్వామిత్రాత్మజానాం తు శునః శేఫోగ్రజః స్మృతః
భార్గవః కౌశికత్వం హి ప్రాప్తః స మునిసత్తమః
విశ్వామిత్రస్య పుత్రస్తు శునశ్శేఫోభవత్కిల
హరిదశ్వస్య యజ్ఞేతు పశుత్వే వినియోజితః
దేవైర్దత్తః శున శ్శేఫో విశ్వామిత్రాయ వై పునః
దే వైర్దత్తః స వై యస్మా ద్దేవరాత స్తతోభవత్
దేవరాతాదయః సప్త విశ్వామిత్రస్య వై సుతాః
దృషద్వతీ సుతశ్చాపి వైశ్వామిత్ర స్తథాష్టకః
అష్టకస్య సుతో లౌహిః ప్రోక్తో జహ్నుగణో మయా
అత ఊర్ద్వం ప్రవక్ష్యామి వంశ మాయో ర్మహాత్మనః
ఇక్ష్వాకు వంశజుడు రేణువను రాజు కూతురు కామలి యను పేరుగలది (రేణుక) మహానుభావురాలు. అమె యందు తపోవిద్యా సమన్వితుడు ఆర్చీకుడు (జమదగ్ని) భయంకరుడైన జామదగ్న్యుని (పరుశు రాముని) గాంచెను. అతడు సర్వ విద్యా పారంగతుడు ధనుర్వేద విశారదుడు క్షత్రి యాంతకుడు ప్రజ్వలి తాగ్నివోలె నుండెను. పరశురాము డా జమదగ్ని తపో వీర్యమున జన్మించెను. మధ్యముడు శునశ్శేపుడు కనిష్టుడు శునఃపుచ్చుడు. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి సముడై బ్రహ్మయు నయ్యెను. విశ్వరథుడనియు నాయనకు బేరు. విశ్వామిత్రుని కుమారులు దేవరాతుడు మొధలయిన వారు. విఖ్యాతులు. దేవరాతుడు. కలి యాయన సంతతియే కాత్యాయనులు. శాలావతి యందు హిరణ్యాక్షుడు రేణువు. రేణుకుడు సాంకృతి గాలవుడు ముద్గలుడు. మధుచ్చందుడు జయుడు, దేవలుడు కచ్ఛపుడు, హారితుడు ననువారు జనించిరి. కౌశికుల గోత్రములు ప్రఖ్యాతి చెంది యున్నవి. పాణినులు, బభ్రవులు, ధ్యానజప్యులు, దేవరాతులు, శాలంకాయనులు, బాష్కలులు, లోహితులు, యమ దూతలు, కారూషకులు నను వారు కౌశికులు, పౌరవుడను బ్రహ్మర్షి యొక్కయు కౌశికుని యొక్కయు వంశ మందు బ్రహ్మక్షత్ర సంబంధము ప్రసిద్ద మయ్యెను. విశ్వామిత్రుని కొడుకులలో శునఃశేపుడు పెద్దవాడు. భార్గవుడు కొశికత్వముం బడసిన వాడు. శునఃశేవుడు హరిదశ్వుని యజ్ఞ మందు పశువుగా విని యుక్తుడయ్యె. దేవత లాతనిం దిరిగి విశ్వామిత్రునకు క్షేమముగ నిచ్చిరి. దేవతలచే నీయబడిన వాడగుటచే దేవరాతు డనియు పేరొందె. దేవరాతాదు లేడ్వురు విశ్వామిత్రుని కుమారులు. దృషద్వతి సుతుడు అష్టకుడును వైశ్వామిత్రుడే అష్టక కుమారుడు లౌహి. జహ్ను ముని గణము నాచే చెప్ప బడినది ఇటుపైని అయువు యొక్క వంశమును చెప్పెదను.
Summary of chapter 10 of the Brahma Mahā Purana is as follows:
The celebrated story of King Yayāti is narrated in full. Born in the Lunar Dynasty, Yayāti married both Devayānī (daughter of Śukrācārya) and Śarmiṣṭhā (daughter of the asura king Vṛṣaparvan). Śukrācārya's curse causes Yayāti to grow prematurely old; he asks his sons to exchange their youth with him. Only Pūru agrees, and Yayāti enjoys worldly pleasures for a thousand years before recognizing their futility, returning youth to Pūru, and renouncing the world.