బ్రహ్మ:
తతో గజకులప్రఖ్యా స్తడిన్మాలా విభూషితాః
సముత్తస్థు ర్మహామేఘా నభ న్యద్భుతదర్శనాః
కేచి న్నీలోత్పలశ్యామాః కేచి త్కు ముదసన్నిభాః
కేచి త్కింజల్కసంకాశాః కేచిత్పీతాః పయోధరాః
కేచి ద్ధరితసంకాశాః కాకాండసదృశాస్తథా
కేచి త్కమలపత్రాభాః కేచి ద్ధింగుల సన్నిభాః
కేచి త్పురవరాకారాః కేచి ద్గిరివరోపమాః
కేచి దంజనసంకాశాః కేచి స్మరకతప్రభాః
విద్యున్మాలాపినద్ధాంగా స్సముత్తస్థు ర్మహాఘనాః
ఘోరరూపా మహాభాగా ఘోరస్వననినాదితాః
తతో జలధరా న్సర్వే సమావృణ్వ స్నభస్థలమ్
తై రియం పృథివీ సర్వా సపర్వతవనాకరా
ఆపూరితా దిశః సర్వాః సలిలౌఘపరిప్లుతాః
తత స్తే జలదా ఘోరా వారిణా మునిసత్తమాః
సర్వతః ప్లావయామాసు శ్చోదితాః పరమేష్ఠినా
వర్షమాణా మహోతోయం పూరయంతో వసుంధరామ్
సుఘోరమశివం రౌద్రం నాశయంతి స్మ పావకమ్
తతో ద్వాదశవర్షాణి పయోదా స్సముపప్లనే
ధారాభిఃపూరయంతో వైచోద్యమానామహాత్మనా
తత స్సముద్రాస్స్వాంవేలా మతిక్రామింతి భోద్విజాః
పర్వతాశ్చ వ్యశీర్యంత మహీ చాప్సు విమజ్జతి
సర్వత స్సుమహాబ్రాంతా స్తే పయోదా న భస్తలమ్
సంవేష్టయిత్వా నశ్యంతి వాయువేగసమాహతాః
తతస్తం మారుతం ఘోరం సవిష్ణు ర్ముని సత్తమాః
ఆదిపద్మాలయో దేవః పీత్వా న్వపితి భోద్విజాః
తస్మి న్నేకార్ణవే ఘోరే నష్టే స్థావర జంగమే
మార్కండేయ ప్రళయదర్శనము
బ్రహ్మ:
అంతట నేన్గులట్లు మెఱుపు దీవల మెఱయు మేఘములు వింతగా నింగి నలము కొనియె. అవి కొన్ని నల్ల కలువల వలె నల్లనివి కొన్ని తెల్ల కలువల వలె తెల్లనివి కొన్ని పద్మ కింజల్కము లట్లు ఎర్రనివి. కొన్ని పసుపు పచ్చనివి కొన్ని యాకు పచ్చనివి కొన్ని కాకిగ్రుడ వంటివి. కొన్ని తామర రేకు లట్టివి కొన్ని యింగువ ఛాయ గలవి అయి యుండెను. కొన్ని పెద్ద నగరములు గను కొన్ని పర్వతము లట్లు కొన్ని కాటుక కొండలట్లు, మరకత వరములునై మెఱుపు దీవల నలుము కొని మహా మేఘములు క్రమ్ము కొనెను. అవి కుండపోతగా వర్షించు వర్షధారలచే నీ మేధిని నలు దెసల బెందడి యయ్యెను. ఆ వర్షపాతముచే నింతకు మున్నేర్పడి యగ్ని యుత్పాతము వశమించెను. పరమేశ్వర ప్రేరణచే మేఘము లవిరామముగా పంద్రెండేండ్లు వర్షింప సముద్రములు పొంగి చెలియల కట్టులు దాటి జగమ్మును ముంచెత్తెను. పర్వతములు పిండిగుండ యయ్యె. ఆ భూమి నీటిలో మునిగి పోయినది. అట్లువ్వెత్తుగ గ్రమ్మిన కారు మబ్బులెల్ల నల్లంతలో వీచిన పెను గాలులకు పింజపింజలై విడిపోగియెను. ఆ తొలి తామర గద్దియపై నున్న విష్ణువు ప్రళయ కాల మారుతమును త్రోసివైచి యా ప్రళయ పయోధిపై హాయిగ నిద్రవోయెను. అపుడు సర్వ జీవకోటి వినష్ట మయ్యెను.
నష్టే దేవాసురవరే యక్షరాక్షస వర్జితే
తతో ముని స్స విశ్రాంతి ధ్యాత్వా చ పురుషోత్తమమ్
దదర్శ చక్షు రున్మీల్య జలపూర్ణాం వసుంధరాం
నాపశ్యత్తం వటం నోర్వీం నదిశాది నభాస్కరమ్
న చంద్రార్కాగ్ని పవనం న దేవాసుర పన్పగల
తస్మిన్నేకార్జవే ఘోరే తమోభూతే నిరాశ్రయే
నిమజ్జన్ప తదావిప్రాః సంతర్తు ముపచక్రమే
బభ్రామాసౌ మునిశ్చార్య ఇతశ్చేతశ్చ సంప్లనన్
నిమమజ్జతదా విప్రా స్త్రాతారం నాధి గచ్ఛతి
ఏవం తం విహ్వలం దృష్ట్వా కృపయాపురుషోత్తమమః
ప్రోవాచ మునిశార్దూలా స్తదా ధ్యానేనతోషితః
అంత మార్కండేయ మహర్షి విశ్రమించి పురుషోత్తముని ధ్యానించి కనుదెఱచి యివ్వసుంధర యెల్ల నీట మునిగి నట్లు గమనించెను. అంత మున్నుగల యా పెనుమర్రి లేదు. భూమి లేదు. దిక్కులు లేవు. భాస్కరుడు లేడు. చంద్రుడు లేడు. అగ్ని లేడు గాలి లేదు. సురాసురులు లేరు. ఏకార్ణవమై కేవలము కారు చీకటి క్రమ్మిన యత్తరి నిరాశ్రయమైన యా నీట మునిగి యీద యత్నించెను. అట్టిటు నీత కొట్టుచు నాయాస పడజొచ్చెను. తుదకందు మునిగెను. కాని రక్షకుని కానలేడయ్యె. ఆయన ధ్యానమునకు తనివి చెంది పురుషోత్తము డపుడదరి చెదరి పోవుచున్న మునిని గని యిట్లనియె.
శ్రీభగవానుడు:
వత్ప శ్రాన్తోసి బాలస్త్వం భక్తస్త్వం మమ సువ్రత
ఆ గచ్ఛా గచ్ఛ శీఘ్రం త్వం మార్కండేయ మమాంతికమ్
మా త్వ యైవచ భేతవ్యం సంప్రాప్తోసి మమాగ్రతః
మార్కండేయ మునే ధీర బాలస్త్వం శ్రమపీడితః
శ్రీభగవానుడు:
వత్స! ఆలసి పోయితివి. పిల్ల వాడవు. నాకు భక్తుడవు. వ్రత నిష్ఠుడవు. ఇటు రారమ్ము. మార్కండేయ! నాదరికి రమ్ము. భయపడకు. నా ముందున్నావు.
బ్రహ్మ:
తస్యతద్వచనం శ్రుత్వా మునిః పరమకోపితః
ఉవాచచ తదా విప్రా విస్మితశ్చాభవ న్ముహుః
బ్రహ్మ:
అన్న నమ్ముని మిగుల కుపితుడై మరిమరి వెఱగు పడుచు న్నిట్లనియె.
మార్కండేయుడు:
కోయం! నామ్నా కీర్తయతి తపః పరిభవన్నివ
బహువర్ష సహస్రాఖ్యం ధర్షయన్నివ మే వపుః
న హ్యేష సముదాచారో దేవేష్వపి సమాహితః
మాం బ్రహ్మా సచ దేవేశో దీర్ఘాయురితి భాషతే
కస్తపో ఘోరశిరసో మమాద్య త్యక్త జీవితః
మార్కండేయేతి చోక్త్వా మన్మృత్యుం గంతుమిహేచ్ఛతి
మార్కండేయుడు:
ఎవడు వీడు? నా తపస్సును కించ పరచి మాటలాడు చున్నాడు. పెక్కు వేలేండ్లు యీదు గల నా శరీరమును బెదిరించు చున్నాడు. దేవతలలో కూడ నీలాగ నన్ను తేలిక జేసి మాటలాడు నాచారము లేదు. దేవేశుడు బ్రహ్మ కూడ నన్ను దీర్ఘా యుష్మంతుడ వని యనెనే ఎవడురా! జీవితము కడముట్టిన వాడు. తపముచే గట్టి వడిన తలకాయ గల నాకు నన్ను ఇట్లు మార్కండేయ! అని పేరెత్తి పిలిచి నావలన చావునొంద గోరు చున్నాడు.
బ్రహ్మ:
ఏవముక్త్వా తదా విప్రాశ్చింతావిష్టొభవమునిః
కిం స్వప్నోయం మయా దృష్టః కిం వా మోహోయమాగతః
ఇత్థం చింతయత స్తస్య ఉత్పన్నా దుఃఖహా మతిః
వ్రజామి శరణం దేవం భక్త్వాహం పురుషోత్తమమ్
బ్రహ్మ:
అని పలికి చింతంగొని “ఇది కలయా! మోహమా! ఈ వింత యేమను కొన్న యతనికి నంతలో నిశ్చల చిత్తంబున ధ్యానించుటయు నాతనికి సకల దుఃఖ విధ్వంసని యగు మనశ్శక్తి యార్భూతం బయ్యెను.
స గత్వా శరణం దేవం మునిస్తద్గత మానసః
దదర్మ తం వటం భూయో విశాలం సలిలోపరి
శాఖాయాం తస్య సౌవర్ణం విస్తీర్ణాయాం మహాద్భుతమ్
రుచిరం దివ్యపర్యంకరచితం విశ్వకర్మణా
వజ్ర వైడూర్యరచితం మఱివిద్రుమ శోభితమ్
పద్మరాగాదిభి ర్జుష్టం రత్నై రన్యైరలంకృతమ్
నానా స్తరణ సంవీతం నానారత్నోప శోభితమ్
నానాశ్చర్య సమాయుక్తం ప్రభామండలమండితమ్
తస్యోపరి స్థితం దేవం కృష్ణం బాలవపుర్ధరమ్
సూర్యకోటి ప్రతీకాశం దీప్యమానం సువర్చసమ్
చతుర్భుజం సుందరాంగం పద్మపత్రాయతేక్షణమ్
శ్రీవత్స వక్షసం దేవం శంఖ చక్ర గదాధరమ్
వనమాలా వృతోరస్కం దివ్యకుండలథారిణమ్
హారభారార్పితగ్రీవం దివ్యరత్న విభూషితమ్
దృష్ట్వా తదా మునిర్దేవం విస్మయోత్ఫుల్లలోచనః
రోమాంచిత తనుర్దేవం ప్రణిపత్యేద మబ్రవీత్
అపుడతడు పురుషోత్తముని భక్తితో శరణొందెద నని మనసు నిలిపి శరణంది యా వెంటనే యా నీటి మీద విశాలమైన వట వృక్షమును జూచెను. ఆచెట్టు పెను గొమ్మపై పరుచు కొని యున్న విశ్వకర్మ నిర్మిత మయిన చక్కని వింతయిన పర్యంకమును గాంచెను. అది వజ్ర వైడూర్య నిర్మితము. మణి విద్రుమ శోభితము. పద్మరాగాది మఱి గణాలంకృతము. నానావిధా స్తరణము. నానారత్న శోభితము. వింత లన్నిటికి నెలవు. విచిత్ర ప్రభామండల మండితము. అందు కోటి సూర్య పభాజిష్ణుని, తోజో మూర్తిని, చతుర్భుజుని, సుందరాంగుని, పద్మపత్ర నేత్రుని, శ్రీవత్స వక్షుని, శంఖ చక్ర గదా ధరుని, వన మాలాంకృతోరస్కుని, దివ్య కుండల మండితుని, హార భారావనమ్ర గ్రీవుని బాల కృష్ణుని దర్శించెను.
మార్కండేయుడు:
అహో చై కార్ణవే ఘోరే వినష్టే స చరాచరే
కథమేకో హ్యయం బాలస్తష్ఠత్యత్ర సునిర్భయః
మార్కండేయుడు:
మార్కండేయ డచ్చెరువడి విచ్చిన కన్నులు పులకించిన మేనుంగొని వ్రాలి ఆహా! ఈ ఏకార్ణవ మందు చరాచర మడిగిన తఱి నీ బాలు డెవ్వడొ భయము లేక మసలు చున్నాడు అనుకొనెను.
బ్రహ్మ:
భూతం భవ్యం భవిష్యం చ జానన్నపి మహామునిః
న బుబోధ తదా దేవం మాయయా తస్య మోహితః
యదాన బుబుధే చైనం తదా ఖేదాదువాచ హ
బ్రహ్మ:
భూత భవ్య భవిష్యము నెఱింగియు నమ్మహా ముని మాయా మోహితుడై యాదేవు నెఱుంగ డయ్యెను.
మార్కండేయుడు:
వృథామే తపసో వీర్యం వృథా జ్ఞానం వృథా క్రియా
వృథా మే జీవితం దీర్ఘం వృథా మానుష్యమేవ చ
యోహం సుప్తం న జానామి పర్యంకే దివ్యబాలకమ్
మార్కండేయుడు:
మఱియు నా తప శ్శక్తి వ్యర్థము నా జ్ఞానము వృధా సుదీర్ఘ మయిన నా బ్రతుకు వ్యర్ధము. నామానుషముత్తది. ఈ పర్యకమున నిదురించు బాలుదెవ్వడో నెఱగనైతి.
బ్రహ్మ:
ఏవం సంచింతయన్విప్రః ప్లవమానో విచేతనః
త్రాణార్థం విహ్వలశ్చాసౌ నిర్వేదం గతవాం స్తదా
తతో బాలార్క సంకాశం స్వమహిమ్నా వ్యవ స్థితమ్
సర్వతేజోమయం విప్రా న శశాకాభివీక్షితుమ్
దృష్ట్వా తం ముని మాయాంతం స బాలః ప్రహసన్నివ
ప్రోవాచ మునిశార్దూ లాస్తదా మేఘౌఘనిస్వనః
బ్రహ్మ:
ఇట్లను కొనుచు నీదుచు మైమఱచి మార్కండేయుడు మిగుల వగచెంది రక్షణ కొఱకు తడుము లాడెను. కాని బాల సూర్యుడట్లు తన మహిమచే వెఱయుచు నున్న తేజోమయు నా బాలుని చూడ నేరడయ్యె. ఆ పిల్లవాడట్లు వచ్చు చున్న మునింగిని మేఘ గంభీరముగ నిట్లు పలికెను.
శ్రీ భగవానుడు:
వత్స జానామి శ్రాంతం త్వాం త్రాణార్థం మాముపస్థితమ్
శరీరం విశమే క్షిప్రం విశ్రామన్తే మయోచితః
శ్రీ భగవానుడు:
వత్సా! చాల అలసితివని యెఱుంగుదును. నన్ను శరణందిన నిన్ను గాపాడుటకే వచ్చితిని. నా శరీర మందిపుడ ప్రవేశింపుము. నీకు విశ్రాంతి కల్గును.
బ్రహ్మ:
శ్రుత్వా స వచనం తస్య కించిన్నోవాచ మోహితః
వివేశ వదనం తస్య వివృతం చావశో మునిః
బ్రహ్మ:
అనవిని వకాని యే భయము నెఱుగక యేమియు మాటలాడక యా బాలుడు మోము నందు వివశుడై ప్రవేశించెను.
Summary of chapter 53 of the బ్రహ్మ మహా పురాణము is as follows:
The Lord appears before Mārkaṇḍeya in his divine four-armed form bearing conch, discus, club, and lotus, adorned with the Śrīvatsa mark and Kaustubha jewel, attended by Śrī (Lakṣmī). He blesses Mārkaṇḍeya, explains the nature of his cosmic Māyā, and grants the sage the boon of immortality and unimpaired memory through all ages. Mārkaṇḍeya's vision becomes the paradigmatic experience of divine grace in this Purāṇa.