బ్రహ్మ మహా పురాణము

186 - ధేనుకవధాఖ్యానమ్‌

వ్యాసులు:

గాఃపాలయంతౌ చపునః సహితౌ రామకేశవౌ

భ్రమమాణౌ వనేతత్ర రమ్యంతాలవనం గతౌ

తచ్చ తాలవనం నిత్యం ధేనుకో నామ దానవః

నృగోమాంసకృతాహారః సదాధ్యాస్తే ఖరాకృతిః

తత్ర తాలవనం రమ్యం ఫలసంపత్సమన్వితమ్‌

దృష్వా స్పృహాన్వితా గోపాః ఫలదానేబ్రువన్వచః

వ్యాసులు:

బలరామ కృష్ణులు గలసి యావులను గాచుచు నావనములం దిరుగుచు జక్కని తాల వనమునకు వెళ్ళిరి. ఆ వనమందు నర గో మాంసము లను దినుచు గాడిద రూపమమున ధేనుకుడను దానవుడు వసించు చుండెను. ఆ వనములో దాటి పండ్లు సమృద్ధిగా నుండుట జూచి గోపకులు కుతూహలములో

గోపాలురు:

హే రామ హే కృష్ణ సదా ధేనుకేనైన రక్ష్యతే

భూప్రదేశో యత స్తస్మా త్త్యక్తా నీమాని సంతివై

ఫలాని పశ్య తాలానాం గంధామోదయుతాని వై

వయ మోతా న్యభీప్సామః పాత్యంతాం యది రోచతే

ఇతి గోపకుమారాణాం శ్రుత్వా సంకర్షణో వచః

కృష్ణశ్చ పాతయామాప భువి తాలఫలాని వై

నో రామ కృష్ణ! ఈ ప్రాంతము ధేనుకుని గాపుదలలో యున్నందున సువాసన గల యీ పండ్లు వదల బడి యున్నవి. వీనిని మేము గోరు చున్నాము. మీకది సమ్మత మైనచో వీనిని రాల గొట్టుదము అన బలరాముడు, కృష్ణుడును వానిని బడగొట్టిరి.

తాలానాం పతతాం శబ్ద మాకర్ణ్యాసురరాట్తతః

ఆజగామ సదుష్టాత్మా కోపాద్దైతేయగర్దభః

పద్భ్యాముభాభ్యాం స తదా పశ్చిమాభ్యాం చ తం బలీ

జఘా నోరసి తాభ్యాం చ స చ తే నాప్యగృహ్యత

గృహీత్వా భ్రామణేనై వ చాంబరే గతజీవితమ్‌

తస్మి న్నేవ ప్రచిక్షేప వేగేన తృణ రాజని

తతః ఫలా న్యనేకాని తా లాగ్రా న్నిపత స్ఖరః

పృతివ్యాం పాతయామాస మహావాతోంబుదా నివ

అన్యా న ప్యస్య వై జ్ఞాతీ నాగతా న్దైత్యగర్దభాన్‌

కృష్ణ శ్చిక్షేప తాలాగ్రే బలభద్ర శ్చ లీలయా

క్షణే నాలంకృతా పృథ్వీ పక్వై స్తాలఫలై స్తదా

దైత్య గర్దభదేహై శ్చ మునయః! శుశుభేధికమ్‌

తతో గావో నిరాబాధా స్తస్మిం స్తాలవనే ద్విజాః

నవశష్పం మఖం చేరు ర్యత్ర భుక్త మభూత్పురా

ఆ చప్పుడు విని రాక్షసుడు గర్దభాకారుడు కోపము గొనివచ్చి వెనుక కాళ్ళతో వాని యెదురు రొమ్ముపై గొట్టగా నా కాళ్ళను పట్టుకొని గిరగిర ద్రిప్పి ఆకసమున కెగురు వేసెను. వాడు ప్రాణములను బాసెను. అట్లు పడుచున్న వాని తాకిడికి పండ్లు గుట్టలుగ బడినవి. వాని జ్ఞాతులు ఖరాసురు లెందరో యెదిరింప వాయువు మోఘములను జెదరి గొట్టినట్లు వారి నందరను బలరామ కృష్ణులు ఆ చెట్ల మీదకు విసరిరి. దాన దాటి పండ్లన్నియు నేలపై బడి చూడనిం పుగ దోచెను. క్రూరులగు నా గర్దభా కారులు మడసి పడినంత నయ్యడవి నిరాబాధమై గోపకులు గోవులు హాయిగ సంచరింప మిగుల రమణీయమై యొప్పెను. అందలి పచ్చని లేబచ్చికల యందు నాగొల్ల పిల్లలు తాళ ఫలముల నారంగించిరి.