బ్రహ్మ మహా పురాణము

15 - వృష్ణి వంశ వర్ణనమ్‌

లోమహర్షణుడు:

క్రోష్టో రథాభవ త్పుత్రో వృజనీవా న్మహాయశాః

వార్జినీవత మిచ్ఛంతి స్వాహిం స్వాహాకృతాం వరమ్‌

స్వాహిపుత్రోభవద్రాజా ఉషద్గు ర్వదతాం వరః

మహాక్ర తుభి రీజే యో వివిథై ర్భూరి దక్షిణైః

తతః ప్రసూతిమిచ్చన్‌ వై ఉషద్గుః సో గ్ర్యమాత్మజమ్‌

జజ్ఞే చిత్రరథస్తస్య పుత్రః కర్మభి రన్వితః

ఆసీ చ్ఛైత్రరథి ర్వీరో యజ్వా విపులదక్షిణః శశబిందుః

పరం వృత్తం రాజర్షీణా మనుష్ఠితః

పృథుశ్రవాః పృధుయశా రాజాసీ చ్ఛాశబిందవః

శంసంతి చ పురాణజ్ఞాః పార్ధశ్రవస మంతరమ్‌

లోమహర్షణుడు:

క్రోష్టునికి వృజినీవంతుడు పుట్టెను. వానికి స్వాహి. యజ్ఞ కర్తలలో శ్రేష్ఠుడు. స్వాహి కుమారుడు ఉషద్గువు. అతడు సంతతి కొఱకు భూరి దక్షిణము లైన యజ్ఞములు సేసి చిత్రరథుడను కుమారునిం బడసెను. అతడు మంచి కర్మిష్ఠి. వాని కుమారుడు శశబిందువు యజ్వ. విపుల దక్షిణుడు. రాజర్షుల వర్తనము నను ష్ఠించిన వాడు. శశిబిందుని నందనుడు పృధుశ్రవుడు యశస్వి రాజయ్యెను. పురాణ విదు లాతని కుమారుని అంతరుడని చెప్పుదురు.

అంతరస్య సుయజ్ఞస్తు సుయజ్ఞతనయోభవత్‌

 ఉషతో యజ్ఞమకరోత్‌ స్వధర్మే చ కృతాదరః

సినేయు రభవ త్పుత్రః ఉషతః శత్రుతాపనః

మరుత స్తస్య తనయో రాజర్షి రభవ న్నృపః

మరుతోలభత జ్యేష్ఠం సుతం కంబలబర్హిషమ్‌

చచార విపులం ధర్మ మమర్షాత్ర్పత్యభాగపి

స సత్ర్పసూతిమిచ్చన్‌ వైసుతం కంబలబర్హిషః

బభూవ రుక్మకవచః శతప్రసవతః సుతః

నిహత్య రుక్మకవచః శతం కవచినాం రణే

 ధన్వినాం నిశితైర్బాణైరవాప ప శ్రియ ముత్తమామ్‌

జజ్ఞే చ రుక్మకవచా త్పరజిత్పర వీరహా

జజ్ఞిరే పంచపుత్రాస్తు మహావీర్యాపఠాజితాః

రుక్మేషుః పృధురుక్మశ్చ జ్యామఘః పాలితో హరిః

పాలితంచ హరిం చైవ విదేహేభ్యః పితా దదౌ

రుక్మేషు రభవ ద్రాజాపృధురుక్మస్య సంశ్రయాత్‌

 తాభ్యాం ప్రవ్రాజతో రాజా జ్యామఘో వసదాశ్రమే

ప్రశాంతశ్చ తదా రాజా బ్రాహ్మణై శ్చావబోధితః

 జగామ ధనురాదాయ దేశమస్యం ధ్వజీ రథీ

నర్మదాకూలమేకాకి మేకలాం మృత్తి కావతీమ్‌

 ఋక్షవంతం గిరిం జిత్వాశుక్తి మత్యామువాస సః

జ్యామఘస్యా భవద్భార్యా శైబ్యా బలవతీ సతీ

 అపుత్రోపి స రాజా వై నాన్యాం భార్యామవిందత

ఈతనికి నుయజ్ఞు డుదయించెను. వానికి ఉషతుడు గల్గె. అతడు స్వధర్మా దరుడు. వానికి కొడుకు శినేయుడు. శత్రు తావనుడతడు. వాని తనూజుడు మరుతుడు. అతడు రాజర్షి. వాని జ్యేష్ట సుతుడు కంబలబర్హిషుడు. అతడు ప్రేత్య భాక్కయ్యు మరణో న్ముఖుడై గూడ ఉత్తమ సంతతి గల కుమారుడు గావలె నని గొప్పధర్మా నుష్ఠానమును కోపముతో గావించెను. నూర్గురు పుట్టిన తరువాత నతనికి యుత్తముడగు కుమారు డొక్కడు దయించెను. అతడు రుక్మకవచుడు. అతడు కవచ ధారులైన నూర్గరుత్తమ ధానుష్కులను రణము నందు వాడియైన బాణములతో చంపి అత్యుత్తమ శ్రీ లాభ మందెను. వానికి శత్రు సంహారకుడగు పరాజిత్తు వానికి రుక్మేషువు పృధురుక్ముడు జ్యామఘుడు పాలితుడు హరియను మహా వీరుల పరాజితులు సుతు లైదుగురు దయించిరి. తండ్రి పాలితుని హరిని విదేహ రాజుల కిచ్చెను. ఫృథురుక్ముని యాశ్రయమున రుక్మేషుడు రాజయ్యె. వారిద్దరిచే పంప బడిన జ్యామఘుడు. అశ్రమ మందుండెను, అతడు బ్రాహ్మణులచే లెస్సగ బోధింప బడి ఏకాకియై ధనుస్సు పట్టి ధ్వజము రథముం గొని మరియొక దేశమునకు ఏగెను. నర్మదా తీరమున నొంటరిగా తిరుగుచు మేకల మృత్తికావతి ఋక్ష వంతమను గిరిని గెలిచి శుక్తిమతీ నగరము నందు వసించెను. వాని భార్య శైబ్య. బలశాలిని, పతివ్రత, సంతానము లేకున్నను నాతడు మఱియెక భార్యను జేసి కొనలేదు.

తస్యాసీద్విజయో యుద్ధే తత్ర కన్యా మవాప సః

భార్యా మువాచ సంత్రస్తః ఘ్నషేతి స జనేశ్వరః

ఏతచ్ఛృత్వా బ్రవీద్దేవీ కస్య దేవ! స్నుషేతివై

ఆబ్ర వీత్తదుపశ్రుత్య జ్యామఘో రాజసత్తమః

అతని కొకానొక యద్ధ మందు జయము, గల్గెను. అందొక కన్యం గానుకగ బడసెను. ఆమెం గొని భార్య దరికేగి భయముతో కోడలి దిగోయని చూపెను. ఆమె యవరి కోడలు? యని ప్రశ్నించెను, దానిని విని జ్యామ ఘుడిట్లనెను.

రాజు:

యస్తేజనిష్యతే పుత్రస్తస్య భార్యోపపాదితా

రాజు:

నీకు పుట్టబోవు కుమారుని కిది భార్య యనెను.

లోమహర్షణుడు:

ఉగ్రేణ తపసా తస్యాః కన్యాయాః సా వ్యజాయత

పుత్రం విదర్భం సుభగా శైబ్యా పరిణతా సతీ

రాజపుత్ర్యాం తు విద్వాంసౌ స్నుషాయాం క్రథ కైశికౌ

పశ్చా ద్విదర్భోజనయ చ్ఛూరౌ రణవిశారదౌ

భీమో విదర్భస్య సుతః కుంతి స్తస్యాత్మజోభవత్‌

కుంతేర్ధృష్టః సుతో జజ్ఞేరణధృష్ణః ప్రతాపవాన్‌

ధృష్టస్య జజ్ఞిరే శూరాస్త్రయః పరమధార్మికాః

అవంతశ్చ దశార్హశ్చ బలీ విషహరళ్చ సః

దశార్హస్య సుతో వ్యోమా. వోమ్నో జీమూత ఉచ్యతే

జీమూతపుత్రో వికృతి స్తస్య భీమరథః స్మృతః

ఆథ భీమరథస్యాసీత్రుత్రో నవరథస్తధా

తస్య చాసీద్దశరథః శకుని స్తస్య చాత్మజః

తస్మాత్కరంభః కారంభిర్దేవరాతోభవన్నృపః

దేవక్షత్రోభవత్తస్య వృధ్ధక్షత్రో మహాయశాః

దేవగర్భనమో జజ్ఞే దేవక్షత్రస్య నందనః

మధూనాం వంశకృద్రాజా మధు ర్మధురవాగపి

మథోర్టజ్ఞేథ వైదర్భ్యాం పురుద్వా న్పురుషోత్తమః

 ఐక్ష్వాకీ చాభవద్భార్యా మధోస్తస్యాం వ్యజాయత

సత్వా న్సర్వగుణోపేతః సాత్వతాం కీర్తివర్ధనః

 ఇమాం విసృష్టిం విజ్ఞాయ జ్యామఘస్య మహాత్మనః

యుజ్యతే పరమప్రీత్యా ప్రజావాంశ్చ భవేత్సదా

లోమహర్షణుడు:

ఆ కన్య ఉగ్రమైన తపస్సు చేసెను. ఆ తపః ఫలముగా శైబ్య వృద్ధయై విదర్భుడను కుమారుం గనెను, విదర్భుడా రాజ పుత్రిక యందు క్రధ కైశికులను శూరులు విద్వాంసులు నగు నిద్దరు కుమారులుం గాంచెను, వారు రణ విశారదులు. విదర్భుని కుమారుడు భీముడు, వాని తనయుడు కుంతి. వాని కొడుకు దృష్టుడు, అతడు రణ ధృష్టుడు, ప్రతాపశాలి, వాని కొడుకులు ముగ్గురు. శూరులు, పరమ ధార్మికులు, అవంతుడు, దశార్హుడు, విషహరుడు దశార్హ సుతుడు వ్యోముడు, వాని కొడుకు జీమూతుడు, వాని తనయుడు వికృతి వాని వాడు భీమరథుడు. నవరథుడు నవరథుని పుత్రుడు దళరథుడు, వాని కుమారుడు శకుని. శకుని సుతుడు కరంభుడు, కరంభుని తనయుడు దేవరాతుడు, వాని పుత్రుడు దేవక్షత్రుడు. వాని సుతుడు వృద్ధక్షత్రుడు. వృద్ధక్షత్ర నందనుడు, దేవపుత్రనముడు మధువుల వంశమునకు కర్త మధురవక్త యగు మధువను వాడు, మధువునకు వైదర్భి యందు పురుషోత్తము డగు పురుద్వంతుడను వాడు దయించెను. మధుని కైక్ష్వాకి (ఇక్ష్వాకు వంశజాత) యను భార్య యందు సర్వ గుణోపేతుడు సాత్వత కీర్తి వర్ధనుడగు సత్త్వంతుడు అను వాడు పుట్టెను. అతడు సాత్త్వతులను పేరు తెచ్చిన వాడు. మహాత్ముడగు జ్యామఘుని విసృష్టిని విన్న వాడెప్పుడు పరమ ప్రీతి నందును ప్రజావంతుడు నగును.

లోమహర్షణుడు:

సత్త్వతః నత్త్వనంపన్నాన్కౌశల్యా సుషువే సుతాన్‌

 భాగినం భజమానం చ దివ్యం దేవవృధం నృపమ్‌

అంధకం చ మహాబాహూం వృష్టించ యదునందనమ్‌

 తేషాం విసర్గా శ్చత్వారో విస్తరే ణేహ కీర్తితాః

భజమానన్య సృంజయ్యౌ బాహ్యకాథోపబాహ్యకా

అస్తాం భార్యే తయో స్తస్మా జ్జజ్ఞిరే బహవః సుతాః

క్రిమిశ్చ క్రమణశ్చైవ ధృష్టః శూరః పురంజయః

 ఏతే బాహ్యకసృంజయ్యాం భజమానా ద్విజజ్ఞిరే

అయుతాజిత్సహస్రాజి చ్ఛతాజిత్త్వథ దాసకః

ఉపబాహ్యకసృంజయ్యాం భజమానా ద్విజజ్ఞిరే

లోమహర్షణుడు:

సత్త్వతుని వలన కౌసల్యయను నామె బలశాలురగు భాగి, భజమానుడు, దివ్యుడు దేవావృథుడు, అంథకుడు యదు నందను డగు వృష్టి అనువారల గనెను. వారి విశేష సృష్టుల నాల్గింటిని విస్తరించి వర్ణించితిమి. భజమానునికి సృంజయ కుమారైలు బాహ్యక ఉపబాహ్యక అను భార్య లుండిరి. వారికి బెక్కురు పుత్రులు కల్గిరి. క్రిమి, క్రమణుడు, ధృష్టుడు, శూరుడు, పురంజయుడు, వీరు బాహ్యక సృంజయి యందు భజమానునకు జన్మించిరి. అయుతాజిత్తు, సహస్రజిత్తు, శతాజిత్తు దాసకుడు అనువారు ఉపబాహ్యక సృంజయి యందు గల్గిన వారు.

యజ్వా దేవావృథో రాజా చచార విపులం తపః

 పుత్రః సర్వగుణోటేతో మమ స్యాదితి నిశ్చితః

సంయుజ్యమాన స్తపసా పర్ణాశాయా జలం స్పృశన్‌

సదోప స్పృశత స్తస్య చకార ప్రియ మాపగా

చింతయాభివరీతా సా న జగామైవ నిశ్చయమ్‌

 కల్యాణత్వా న్నరపతే స్తస్య సా నిమ్నగోత్తమా

నాధ్యగచ్ఛత్తు తాం నారీం యస్యా మేవంవిధః సుతః

భవే త్తస్మా త్స్వయం గత్వా భవా మ్యస్య సహానుగా

అథ భూత్వా కుమారీ సా బిభ్రతో పరమం వపుః

 వరయామాస నృపతిం తా మియేష చ స ప్రభుః

దేవవృథుడు యజ్వ, తపస్వి. నాకు గుణశాలి కుమారుడు గావలెనని తపో నిష్ఠగొని పర్ణాశా నదీ జల మాచమించి, తపమా చరించు చుండెను. ఆ నదికి సదా తన యందు స్నానము చేయు నాతనిపై ప్రేమ కలిగెను. కాని యేలాటిప్రియ మాచరించుట యను నాలోచనలో నొక నిశ్చయ మునకు రాజాల దయ్యెను. ఈరాజు కల్యాణ గుణుడు. ఈతని కీడైన కల్యాణి యెవ్వతె? ఇతడు కోరిన గుణశాలి కుమారు డుదయింప వతెనన్న నేలాటి యుత్తమ కన్యయి తనికి పత్ని కావలెను? అని యేమేమో తనలో దాను గుణించుకొని తుదకు నేనే యేగి యీతని కింతి నగదునని పరమ సుందర రూపము ధరించి యా నృపతిని వరించెను. ఆమె నాప్రభు విచ్చగించెను.

తస్యా మాధత్త గర్భం స తేజస్విన ముదారధీః

ఆథ సా దశమే మాసి సుషువే సరితాం వరా

పుత్రం సర్వగుణోపేతం బభ్రుం దేవావృధం ద్విజాః

అత్ర వంశే పురాణజ్ఞా గాయంతీతి పరిశ్రుతమ్‌

గుణా న్దేవావృధస్యాపి కీర్తయంతో మహాత్మనః

యథై వాగ్రే తథా దూరా త్పశ్యామ స్తావ దంతికాత్‌

బభ్రుః శ్రేష్ఠో మునుష్యాణాం దేవై ర్దేవావృధః సమః

 షష్టిశ్చ షట్చ పురుషాః సహస్రాణి చ స ప్త చ

ఏతే మృతత్వం ప్రాప్తా వైబభ్రో ర్దేవావృధా దపి

 యజ్వా దానపతి ర్దీమా న్బ్రహ్మణ్యః సుదృఢాయుధః

తస్యాన్వవాయః సుమహా న్బోజా యే సార్తికావతాః

 అంధకా త్కాశ్యదుహితా చతురో లభతాత్మజాన్‌

కుకురం భజమానం చ ససకం బలబర్హిషమ్‌

 కుకురస్య సుతో వృష్టి ర్వృష్టేస్తు తనయ స్తథాః

కపోతరోమా తస్యాథ తివిరిస్తసయో భవత్‌

 జజ్ఞె పునర్వసు సస్మా దభిజిచ్ఛ పునర్వసోః

తధా వై పుత్రమిథునం బభూవాభిజితః కిల

ఆహుకః శ్రాహుకశ్చైవ ఖ్యాతౌ ఖ్యాతిమతాం వరౌ

ఇమాం చోదాహరంత్యత్ర గాథాం ప్రతీత మహూకమ్‌

 శ్వేతేన పరివారేణ కిశోర ప్రతిమో మహాన్‌

ఉదారమతి యగు నా నృపతి యా సతి యందు తేజస్వి యైన గర్భ ముంచెను. పదియవ నెలలో నామె సర్వ కల్యాణ గుణనిధి యగు బభ్రుదేవావృథుడను కుమారుని గాంచెను. ఈతడు యేడు వేల యరువది యాఱుగురు పురుషుల సమృతత్వ మొందించెను. యజ్వ, దానవతి, ధీమంతుడు, బ్రహ్మణ్యుడు, దృఢాయుధుడు నైన యీ బభ్రుని (దేవావృధుని) వంశమున భోజులు సార్తికావతులని బ్రసిద్ధు లైరి. కాశ్యపదుహిత అంధకుని వలని నల్వురం గనెను. కుకురుడు, భజమానుడు, సనకుడు, బలబర్హిషుడు అనువారు వారు. కుకురుని తనయుడు వృష్టి. వాని కొడుకు కపోతరోముడు. వాని వాడు తివిరి. కాని సుతుడు పుశర్వసువు వానికి అభిజిత్తు వానికి పుత్ర ద్వంద్వము ఆహుకుడు, శ్రాహుకుఢను బేర ప్రసిద్ది చెందిన వారు ఆహుకుని గూర్చి పూర్వులు ఈ క్రింది గాధ నుదహరింతురు.

ఆశీతివర్మణా యుక్త ఆహుకః ప్రధమం వ్రజేత్‌

నాపుత్రవా న్నాశతదో నాసహస్రశతాయుషః

నాశుద్ధకర్మా నాయజ్వా యో భోజ మభితో వ్రజేత్‌

 పూర్వస్యాం దిశి నాగానాం భోజస్య ప్రయయుః కిల

సోమా త్సంగానుకర్షాణాం ధ్వజినాం సవరూధినాం

రథానాం మేఘఘోషాణాం సహస్రాణి దశైవ తు

రౌప్యకాంచనకక్షాణాం సహస్రాణ్యేతివింశతిః

తావత్యేవ సహస్రాణి ఉత్తరస్యాం తథా దిశి

ఆభూమిపాలా భోజాస్తు సంతి జ్యాకింకిణీకినః

ఆహుః కించాప్యవంతిభ్యః స్వసారం దదు రంధకాః

శ్వేత పరివారముతో గూడి (తెల్ల వాళ్ళతో) వశివాని వలె ఆహుకు డెనుబది కవచముల దాల్చి మొదట నేగును. పుత్ర సంతానము లేనివాడు, నూరు వేలేండ్లాయుర్థాయము లేని వాడు ఆపవిత్ర కర్ముడు. యజ్వ కాని వాడు, భోజరాజు వెంట నుండ రాదు. భోజునికి యేనుగులు పదివేలు ధ్వజములు కవచము ధరించిన వారు పదివేల మంది. మేఘ ఘోషములు గల రధములు పదివేలు, బంగారు వెండి యెను బోతులు ఇరువది యొక్క తూర్పు దిక్కున నేగెడివి. ఉత్తరమున నటులనే నేగెడివి. భోజ వంశీయ రాజు లందరు వింటి నారియే చిరు గంటగ మ్రోగించి నట్టి వారు. మహా యోదులన్న మాట. మరియు అంధక వంశీయులు తమ తోబుట్టువును అవంతీయల కిత్తురు అని గాధ.

ఆహుకస్య తు కాశ్యాయాం ద్వౌ పుత్రౌ సంభభూవతుః

 దేవకశ్చోగ్రశేనశ్చ దేవగర్భసమావుభౌ

దేవక స్యాభవన్సుత్రా శ్చత్వార స్త్రిదశోపమాః

దేవవా నుపదేవశ్చ సందేవో దేవరక్షితః

కుమార్యః స ప్త చాస్యాథ వసుదేవాయ తా దదౌ

 దేవకీ శాంతిదేవా చ సుదేవా దేవరక్షితా

వృకదే వ్యుపదేవీ చ సునామ్నీ చైవ సప్తమీ

నవోగ్రసేనస్య సుతా స్తేషాం కంసస్తు పూర్వజః

న్యగ్రోధశ్చ సునామా చ తథా కంకః సుభూషణః

రాష్ట్రపాలో థ సుతను రనావృష్టిస్తు పుష్టిమాన్‌

తేషాం స్వసారః పంచాసన్‌ కంసా కంసవతీ తథా

 సుతనూ రాష్ట్రపాలీ చ కంకా చైవ వరాంగనా

ఉగ్రసేనః సహా పత్యో వ్యాఖ్యాతః కుకురోబ్భవః

 కుకురాణా మిమం వంశం ధారయన్నమితౌజసామ్‌

ఆత్మనో విపులం వంశం ప్రజావా నాప్నుయా న్నరః

ఆహుకునికి కాశ్యపియను నామె యందు దేవ కుమారులు బోలు దేవకుడు, ఉగ్రసేనుడ డను వారిద్దరు గుమారులు గల్గిరి. దేవకుని కుమారులు నల్గురు. దేవవంతుడు, ఉపదేవుడు, సందేవుడు, దేవరక్షితుడు, అనువారు. కుమార్తె లేడుగురు. అతడు వారిని వసుదేవుని కిచ్చి పెండ్లి సేసెను. వారు దేవకి, శాంతిదేవ, సుదేవ దేవరక్షిత, వృకదేవి, ఉపదేవి, సునామిన్ని, యనువారు. ఉగ్రిసేనుని కొడుకులు తొమండ్రు కంసుడు, న్యగ్రోధుడు, సునాముడు, కంకుడు, సుభూషణుండు, రాష్ట్రపాలుడు, సుతునువు, అనావృష్టి, పుష్టిమంతుడు, అనువారు. వారి చెల్లెండ్ర యిదుగురు. కంస, కంసవతీ, సుతనువు, రాష్ట్రపాలి, కంకయును వారు. కుకుర వంశీయుడైన ఉగ్రసేనుడు సంతతితో గూడ వర్ణింప బడెను. మిక్కిలి తేజ శ్శాలురైన కుకురుల వంశమును విని ధారణ సేయుట వలన వంశాభివృద్ధి నంది సుఖించును.