బ్రహ్మ:
ఏవం వో నంత మహాత్మ్యం క్షేత్రం చ పురుషోత్తమమ్
భుక్తిముక్తి ప్రదంనృణాంమయాప్రోక్తంసుదుర్లభమ్
యత్రా స్తే పుండరీకాక్ష శ్శంఖ చక్రగదాధరః
పీతాంబరధరః కృష్ణః కంసకేశినిషూదనః
యేతత్ర కృష్ణం పశ్యంతి సురాసుర నమస్కృతమ్
సంకర్షణం సుభద్రాం చ ధన్యాస్తే నాత్ర సంశయః
త్రైలోక్యాధిపతిం దేవం సర్వకామఫలపన్రదమ్
యే ధ్యాయంతి సదా కృష్ణం ముక్తాస్తే నాత్ర సంసయః
కృష్ణేరతాః కృష్ణమను స్మరంతి
రాత్రౌ చ కృష్ణం పునరుత్థితా యే
తే భిన్నదేహాః ప్రవిశంతి కృష్ణం
హవిర్యథా మంత్ర హృతం హుతాశసమ్
తస్మాత్పదా మునిశ్రేష్ఠాః కృష్ణః కమలలోచనః
తస్మిన్ క్షేత్రే ప్రయత్నేన ద్రష్టవ్యో మోక్షకాంక్షిభిః
శయనో త్థాపనే కృష్ణం యే పశ్యంతి మనీషిణః
హలాయుధం సుభద్రాం చ హరేః స్థానం వ్రజంతితే
సర్వ కాలే పి యే భక్త్వా పశ్యంతి పురుషోత్తమమ్
రౌహిణేయం సుభద్రాంచ విష్ణులోకం వ్రజంతితే
ఆస్తే యశ్చతురో మాసాన్ వార్షి కాన్ పురుషోత్తమే
ప్రథివ్యా స్తీర్థ యాత్రాయాః ఫలంప్రాప్నోతి చాధికమ్
యే సర్వకాలం తత్రైవ నివసంతి మనీషిణః
జితేంద్రియా జితక్రోథా లభంతే తపసః ఫలమ్
బ్రహ్మ:
ఇట్లేను అనంత మహిమ పురుషోత్తమ క్షేత్ర మహిమయు భుక్తి ముక్తుల నిచ్చునని తెల్పితిని. అచ్చట గృష్ణుని సంకర్షణుని సుభద్రను దర్శించిన వారు ధన్యులు ముక్తులును సమంత్రకముగా నొనంగిన హవిస్సు అగ్నిం బొంది నట్లు కృష్ణుని రాత్రు లందు నుషః కాలము నందు జేయు ధ్యానము వలన భక్తులు దేహము విడిచి కృష్ణుని బొందుదురు. శయనము నుండి లేవగానే కమలాక్షుని హరిని బలరాముని సుభధ్రను దలచు కొనువారు హరి సాలోక్య మందుదురు. వర్ష ఋతువు నాల్గు మాసములా పురుషోత్తమ క్షేత్ర నివాసము చేయువారు భూమిం గల సర్వ తీర్థములు సేవించిన ఫలము గాంతురు. ఇంద్రియ నిగ్రహము సేసి కోపము జయించి యెల్లపుడు నచట వసించి వారు తపః ఫలముము నొందుదురు.
తప స్తప్త్వా న్యతీర్థేషు వర్షాణామ యుతం సరః
యదాప్నోతి తదాప్నోతి మాసేన పురుషోత్తమే
తపసా బ్రహ్మచర్యేణ సంగత్యాగేన యత్ఫలమ్
తత్ఫలం సతతం తత్ర ప్రాప్నువంతి మనీషిణః
సర్వతీర్థేషు యత్పుణ్యం స్నానదానేన కీర్తితమ్
తత్ఫలం సతతం తత్ర ప్రాప్నువంతి మనీషిణః
సమ్యక్తీర్థేన యత్ ప్రోక్తం వ్రతేన నియమేనచ
తత్ఫలం లభతే తత్ర ప్రత్యహం ప్రయతః శుచిః
యస్తు నానా విధై ర్యజ్ఞై ర్యత్ఫలం లభేతే నరః
తత్ఫలం లభతే తత్ర ప్రత్యహం సంయతేంద్రియః
దేహం త్యజంతి పురుషా స్తత్ర యే పురుషోత్తమే
కల్పవృక్షం సమాసాధ్య ముక్తాస్తే నాత్ర సంశయః
వటసాగరయోర్మధ్యే యే త్యజంతి కలేబరమ్
తే దుర్లభం పరం మోక్షం ప్రాప్నువంతి నసంశయః
అనిచ్ఛన్నపి యస్తత్ర ప్రాణాం స్త్యజతి మానవః
సో పి దుఃఖవినిర్ముక్తో ముక్తిం ప్రాప్నోతి దుర్లభామ్
కృమికీట పతంగాద్యా స్తిర్యగ్యోనిగతాశ్చ యే
తత్ర దేహం పరిత్యజ్య తే యాంతి పరమాం గతీమ్
భ్రాంతిం లోకస్య పశ్యధ్వ మన్యతీర్థం ప్రతిద్విజాః
పురుషాఖ్యేన యత్ర్పాప్త మన్యతీర్థ ఫలాదికమ్
సకృత్పశ్యతి యో మర్త్యః శ్రద్ధయా పురుషోత్తమమ్
పురుషాణాం సహస్రేషు స భవేదు త్తమః పుమాన్
ప్రకృతే స్సపరో యస్మా త్పురుషాదపి చోత్తమః
తస్మాద్వేదే పురాణే చలోకేస్మిన్ పురుషోత్తమః
యో సౌపురాణేవేదాంతే పరమాత్మే త్యుదాహృతః
ఆస్తే విళ్వోపకారాయ తేనానౌ పురుషోత్తమః
పథి శ్మశానే గృహమండపే వా
రథ్యాప్రదేశే ష్వపియత్ర కుత్ర
ఇచ్ఛన్ననిచ్ఛపి తత్రదేహం
సంత్యజ్య మోక్షం లభతే మనుష్యః
అన్య తీర్థము లందు పది వేలేండ్లు సేసిన తపస్సు ఫలము పురుషోత్తమ క్షేత్రమున నొక్క మాస మాచరించిన లభించును. బ్రహ్మ చర్యాదులచే నిస్సంగులై చేయు పుణ్య మిచ్చట సేవించిన గల్గును. ఇది సర్వ యజ్ఞ ఫల ప్రదము. ఇచట దేహము విడిచిన ముక్తి కల్గును. మఱ్ఱి వృక్షమునకు సాగరమునకును నడుమ మేను విడిచిన ముక్తి సిద్ధము. కృమి కీటకాదులు పశు పక్షులు నిక్కడ శరీరము వాసిన బరమ గతినందను. అన్య తీర్థముల వెంట దిరుగవలె ననుకొనుట వట్టి భ్రాంతి పురుషోత్తమ దర్శన మొనరించిన వాడు పురుషోత్తము డగును. ప్రకృతి కతీతు డాతడు. వేద పురాణము లందుచేతనే హరి పురుషోత్తము డని కీర్తించెను. దారిలో స్మశానములో గృహమున మఱియొటనేని శ్రీపురుషోత్తమ క్షేత్రమున నిష్టమున్నను లేకున్నను దేహము లంబాసిన మనుజుడు మోక్షమంది తీరును.
తస్మాత్పర్వ ప్రయత్నేన తస్మిన్ క్షేత్రే ద్విజోత్తమాః
దేహత్యాగో సరైః కార్యః సమ్యజ్ మోక్షాభి కాంక్షిభిః
పురుషాఖ్యస్య మాహాత్మ్యం న భూతం న భవిష్యతి
త్యక్త్వా యత్రనరో దేహం ముక్తిం ప్రాప్నోతి దుర్లభామ్
గుణానామేకదేశోయం మయాక్షేత్రస్య కీర్తితః
క స్సమస్తాన్ గుణా న్వక్తుం శక్తోవర్షశతైరపి
యది యూయం మునిశ్రేష్ఠా మోక్షమిచ్ఛథ శాశ్వతమ్
తస్మిన్ క్షేత్రవరే పుణ్యే వివసధ్వ మతంద్రితాః
అందు వలన మోక్ష కాంక్షులు పురుషోత్తమ క్షేత్రమున దేహము త్యాగము చేయ యత్నింప వలెను. పురుషోత్తమ మాహాత్మ్యమును మించినది కలుగదు కలుగ బోదు. క్షేత్ర గుణ సంపదలో గొంత మాత్రమే నేను చెప్పితిని. సమగ్రముగా తెలుప సాధ్య పడదు. ఓ మునులారా! మీరు మోక్షార్థుడేని యా పుణ్యక్షేత్ర మందు వసింపుడు.
వ్యాసుడు:
తే తస్య వచనం శ్రుత్వా బ్రహ్మణో వ్యక్త జన్మనః
నివాసం చక్రిరే తత్ర ఆవాపుఃపరమం పదమ్
తస్మాద్యూయం ప్రయత్నేన నివసధ్వం ద్విజోత్తమాః
పురుషాఖ్యే వరేక్షేత్రేయది ముక్తి మభీప్సధ
వ్యాసుడు:
బ్రహ్మ వచన మాలించి యా మునులా క్షేత్ర మందు వసించి పరమపద మందిరి. కావున బ్రహ్మాదు లారా! మీరునట్లు గావింపుడు.
Summary of chapter 70 of the బ్రహ్మ మహా పురాణము is as follows:
The sages assembled at Naimiṣāraṇya raise profound philosophical doubts about the nature of the divine, the relationship between the unmanifest Brahman and its manifest forms, and how the supreme reality takes on embodied form for the world's benefit. These questions provide the occasion for the extended theological discourse on Viṣṇu's incarnations (avatāras) and their cosmic purpose that occupies the following chapters.