బ్రహ్మ మహా పురాణము
12 - సోమోత్పత్తి వర్ణనమ్
లోమ హర్షణుడు:
ఉత్పన్నాః పితృకన్యాయాం విరజాయాం మహౌజసః సహుషస్య తు దాయాదాః ష డింద్రోపమతేజసః యతి ర్యయాతిః సంయాతి రాయాతిర్యాతిరేవచ సుయాతిః షష్ఠస్తేషాం వై యయాతిః పార్థివోభవత్ కకుత్థ్సకన్యాం గాం నామ లేభే పరమధార్మికః యతిస్తు మోక్ష మాస్థాయ బ్రహ్మభూతోభవ న్మునిః
లోమ హర్షణుడు:
పితృ కన్యయగు విరజ యందు మహాతపస్వి యగు సహుషుని కింద్ర తుల్యులైన యార్వురు కుమారు లుదయించిరి. వారు యతి, యయాతి, సంయాతి, ఆయాతి, యాతి, నుమాతి అనువారు. అందు యయాతి రాజయ్యెను. అప్పరమ ధార్మికుడు కకుత్ద్స కన్యను గోవు యనునామెను వివాహ మాడెను. యతి మునియై మోక్ష మార్గ మందుండి బ్రహ్మీ భావ మందెను.
తేషాం యయాతిః పంచానాం విజిత్య వసుధా మిమామ్ దేవయానీ ముశనసః సుతాం భార్యా మవాప సః శర్మిష్ఠా మాసురీం చైవ తనయాం వృషపర్వణః యదుం చ తుర్వసుం చైవ దేవయానీ వ్యజాయత ద్రుహ్యం చానుంచ పురుం చ శర్మిష్ఠావార్షపర్వణీ తస్మై శక్రో దదౌ ప్రీతో రథం పరమభాస్వరమ్ అంగదం కాంచనం దివ్యం దివ్యైః పరమవాజిభిః యుక్తం మనోజవైః శుభ్రై ర్యేన కార్యం సముద్వహన్
యయాతి సోదరు లైదుగురు రాజ్యముం గెల్చుకొని ఉశనసుని (శుక్రుని) తనయను దేవయానిని భార్యగ గైకొనెను. మఱియు వృషపర్వుడను నసురుని కుమార్తె శర్మిష్ఠం గూడ పత్నిగ గైకొనెను. దేవయాని యదువును తుర్వసుని గనెను. శర్మిష్ఠ ద్రుహ్యుని అనువును-పురపును గాంచెను. దేవేంద్రు డాతనికి (యయాతికి) ప్రీతుడై, దివ్యమైన, భుజకీర్తిని దివ్యములు మనోజవము లైన తెల్లని యశ్వముల బూన్చిన స్వర్ణమయ మైన రథము నొసంగెను.
న తేన రథముఖ్యేన షడ్రాత్రే ణాజయ న్మహీమ్ యయాతి ర్యుధి దుర్ధర్ష స్తథా దేవా న్స దానవాన్ సరథః కౌరవాణాం తు సర్వేషా మభవ త్తదా
సంవర్తమసునామ్నస్తు కౌరవా జ్జనమేజయాత్ కురోః పుత్రస్య రాజేంద్రజ్ఞః పారీక్షితస్యహ జగామ సరధో నాశం శాపా ద్గర్గస్య ధీమతః
ఆ రథముతో విజయ యాత్ర సేసి యుద్ధము నందజేయుడై యయాతి ఆరు దినములలో మహీమండల మెల్ల జయించెను. దేవ దానవుల నిగ్రహించెను. సంవర్తవసు నామక మైన ఆ రథము కౌరవుల దాయెను. కురు వంశీయుడును. కురు వంశీయుడును పరీక్షుతుని కుమారుడును నగు జనమేజయుని నుండి గర్గ శాపమున నారథ మంతరించెను.
గర్గస్య హి సుతం బాలం సరాజా జనమేజయః కాలేన హింసయామాస బ్రహ్మహత్యా మవాప సః స లోహగంధో రాజర్షిః పరిధావ న్నితస్తతః పౌరజానపదై స్త్యకో సలేభే శర్మ కర్హిచిత్ తతః స దుఃఖసంతప్తో నాలభ త్పంవిదం క్వచిత్ విప్రేంద్రం శౌనకం రాజా శరణం ప్రత్యపద్యత యాజయామాస చ జ్ఞానీ శౌనకో జనమేజయమ్ అశ్వమేధేన రాజానం పావనార్ధం ద్విచోత్తమాః సలోహగంధో వ్యనశ త్త స్యావ భృధమేత్య హ సచ దివ్యరధో రాజ్ఞో వశ శ్చేదిపతే స్తదా దత్తః శక్రేణ తుష్టేన లేభే తస్మా ద్బృహద్రధః బృహధ్రథా త్క్రమేణౖవ గతో బార్షద్రధం నృపమ్ తతో హత్వా జరాసంధం భీమస్తం రధముత్తమమ్ ప్రదదౌ వాసుదేవాయ పీత్యా కౌరవనందనః
బాలుడైన గర్గుని కుమారుని జనమేజయుడు కాల వశమున చంపి బ్రహ్మహత్యా పాపము నందెను. దానిచే లోహగంధియై (ఇనుప వాసన గొట్టు మేను గలవాడై) యా రాజర్షి యిందందు వెఱ్ఱిఫరుగులు పెట్టుచు పౌర జానపద పరిత్యక్తుడై దుఃఖ సంతప్తుడై శాంతి నెచటను పొంద డాయెను. ద్విజ శ్రేష్ఠుడగు శౌనకుని శరణ మందెను. జ్ఞానియైన శౌనకుడు పవిత్రతకై అతనిచే నశ్వమేధము జేయించెను. అవబృధ స్నానము కాగాసే యతని దుర్వాసన పోయెను. అయ్యయాతి దివ్య రథము చేది రాజునకు జిక్కగ నింద్రుడు తుష్టుడై దానిని కొనివచ్చి బృహద్రధున కిచ్చెను. బృహద్రధ నుండి యది యాతని కొడుకునకు జరాసంధునికి దక్కెను. భీముడు వానిని చంపి యాయ రథమును వాసు దేవున కర్పించెను.
సప్తద్వీషాం యయాతిస్తు జిత్వా పృధ్వీం ససాగరామ్ విభజ్య పంచధా రాజ్యం పుత్రాణాం నాహుషస్తదా యయాతి ర్దిశి పూర్వస్యాం యదుం జ్యేష్ఠం న్యయోజయత్ మధ్యే పూరుంచరాజాన మభ్యషించత్స నాహుషః దిశి దక్షిణ పూర్వపూర్వస్యాం తుర్వసుం మతి మాన్నృపః తై రియం పృథివీ సర్వా సప్తద్వీసా సపత్తనా యథప్రదేశ మద్వాపి ధర్మేణ ప్రతిపాల్యతే ప్రజా స్తేషాం పురష్తాత్తు వక్ష్యామి మునిసత్తమాః
సహుషి నూనుడగు యయాతి నసాగరము సప్త ద్వీపము నగు వసుంధర నెల్ల గెలిచి యైదు భాగముల సేసి పుత్రుల కొసంగెను. తూర్పు దిశను జ్యేష్టుడగు యదువును, నడుమ పూరుని నభిషేకించెను. అగ్నేయమున తుర్వసు నుంచెను. వారిచే నీ విశ్వంభర నేటికిని ధర్మముతో పరిపాలింప బడుచున్నది. బ్రాహ్మణులారా! ఆ దేశముల గూర్చి ముందు చెప్ప గలను.
ధను ర్న్యస్య పృషత్కాంశ్చ పంచభిః పురుషర్షభైః జరావానభవద్రాజా భారమావేశ్యబంధుఘ విక్షిప్తశస్త్రః పృదివీం చచార పృధివీపతిః ప్రీతిమానభవద్రాజా యయతిరపలాజితః ఏవం విభజ్య పృధివీం యయాతిర్యదుమబ్రవీత్ జరాం మో ప్రతిగృష్ణీ ష్వ పుత్ర కృత్యాంతరేణవై తరుణ స్తవ రూపేన చరేయం పృధివీమిమామ్ జరాం త్వయి సమాధాయు తం యదుః ప్రత్యువాచహ
యయాతి తన ఐదుగురు కుమారులు దురంధరులు రాజ్య భారము వహించగా వార్ధక దశలో ధనుర్భాణ సన్యాసము జేసి భూమి యందు సంచరించుచు సంప్రీత మనస్కు డయ్యెను. ఇట్లు భూవిభాగము చేసి యాతడు తన కుమారుని యదుపుం జూచి నా ముసలితన మీవు గ్రహించి నీ యౌవనము నాకిమ్ము నా ముసలి తనమును నీ యందుంచి నీ రూపములో యువకుడవై కార్యాంతరము వలన నీ భూమిపై నంచరింతును. ఆ యయాతితో యదువిట్లు బదులు పలికెను.
యదువు:
అనిర్దిష్టా మయా భిక్షా బ్రాహ్మణస్య ప్రతిశ్రుతా అనపాకృత్య తాం రాజ న్న గ్రహీష్యామి తే జరామ్ జరాయాం బహవో దోషాః పానభోజనకారితాః తస్మాజ్జతాం నతే రాజ న్గ్రహీతు మహ ముత్సాహే సంతి తే బహవః పుత్రా మత్తః ప్రియతరా నృప ప్రతిగ్రహీతుం ధర్మజ్ఞ పుత్ర మన్యం వృంశీష్వవై న ఏవముక్తి యదునా రాజా కోపసమన్వితః ఉవాచ వదతాం శ్రేష్టో యయాతి ర్గర్హయ స్సుతమ్
యదువు:
ఒక బ్రాహ్మణునికై నేనిత్తునని ప్రతిజ్ఞ జేసిన భిక్ష నింతదాక యీయ లేదు. అది చెల్లింపక నీ జరా భార మెట్లు స్వీకరింప గలను? అదిగాక ముదిమి యందన్నపాన నిమిత్త మయిన దోషము లనేకములు గలవు. కావున నీ ముసలి తనము నేను గ్రహింప నుత్సహింపను. రాజా! నా కంటెను ప్రియతములైన పుత్రులు నీకనేకులు గలరు. ధర్మజ్ఞా! నీ జరా భారము గ్రహింప మరొక్కని కోరుకొమ్ము. అనవిని వక్తలలో శ్రేష్ఠుండగు యయాతి కోపవశుడై తనయుని గర్హించుచు నిట్లనియె.
యయాతి:
క ఆశ్రమ స్తవాన్యోస్తి కో వాథర్మొ విధీయతే మా మనాదృత్య దుర్బుద్ధే యదహం తవదేశికః ఏవముక్త్వా యదుం విప్రాః శశా పైనం స మన్యుమాన్ ఆరాజ్యా తే ప్రజా మూఢ భవిత్రీతి న సంశయః ద్రుహ్యంచ తుర్వసుం చైవా ప్యనుం చ ద్విజసత్తమాః ఏవ మేవాబ్రవీ ద్రాజా ప్రత్యాఖ్యాతశ్చ తైరపి శశాప తా సతిక్రుద్ధో యయాతి రపరాజితః యధావ త్కధితం సర్వం మయాస్య ద్విజసత్తమాః ఏవం శప్త్వా సుతాన్సర్వాం శ్చతురః పురుపూర్వజాన్ తదేవ వచనం రాజా పూరు మప్యాహ భోద్విజాః తరుణస్తవ రూపేణ చరేయం పృథివీ మిమామ్ జరాం త్వయి నమాధాయ త్వంపురో యది మన్యసే
దుర్బుద్ధీ! నన్ను నిరాకరించిన, నీకు మరి యాశ్రమమేమి యున్నది? ధర్మమేమి యున్నదిరా! నేను నీకు దేశికుడను గద! నీ సంతతికి రాజ్య ముండదు సందేహము లేదని శపించెను. అట్లే కొడుకు లందరి నడిగెను. వారు నల్వురు కాదని నంత నిట్లే శపించెను ఐదవ వానిం బూరుని గూర్చి యదే మాట చెప్పెను.
న జరాం ప్రతిజగ్రాహ పితుః పూరుః ప్రతాపవాన్ యయాతిరపి రూపేణ పూరోఃపర్యచరన్మహీమ్ న మార్గమాణః కామానా మంతం నృపతిసత్తమః విశ్వాచ్యా సహీతో రేమో వనే చైత్రరధే ప్రభుః యదా చ తృప్తః కామేషు భోగేషు చ నరాధిపః తదా పూరోః నకాశాద్వై స్వాం జరాం ప్రత్యపద్యత
ఆ పూరుడు తండ్రి ముదిమిని స్వీకరించి తండ్రికి దన యౌవన మొసంగెను. దాన యయాతి భూమి యందు తిరుగుచు, కామముల యంతయును వెనకుచు విశ్వాచితో గూడి చైత్ర రధోద్యాన మందు స్వేచ్చా విహారము లొనరించుచు పెక్కు కాలము క్రీడించెను. తృప్తుడైన తరువాత వచ్చి పూరున కాతని యౌవన మిచ్చి వేసి తన ముదిమిం దాను గ్రహించెను.
యత్రగాధా మునిశ్రేష్ఠా గీతాః కిల యయాతినా యాభిః ప్రత్యాహరే త్కామాన్సర్వశోంగాని కూర్మవత్ న జాతు కామః కామానా ముపభోగేన శామ్యతి హవిషా కృష్ణవర్త్మేవ భూయ ఏవాభివర్ధతే యత్పృధివ్యాం వ్రీహియవం హిరణ్యం పశవః స్త్రియః నాలమేకస్య తత్సర్వ మితి కృత్వా న ముహ్యతి యదా భావం న కురుతే సర్వభూతేషు పాపకమ్ కర్మణా మనసా వాచా బ్రహ్మసంపద్యతే తదా యదా తేభ్యో న బిభేతి యదా చాస్మా న్న బిభ్యతి యదా నేచ్చతి న ద్వేష్టి బ్రహ్మ సంపద్యతే తదా యా దుస్త్యజా దుర్మతిభి ర్యా న జీర్యతి జీర్యతః యోసౌ ప్రాణాంతకో రోగస్తాం తృష్ణాం త్యజతః సుఖమ్ జీర్యంతి జీర్యతః కేశా దంతా జీర్యంతి జీర్యతః ధనాశా జీవితాశా చ జీర్యతో పి న జీర్యతి యచ్య కామసుఖం లోకే యచ్చ దివ్యం మహత్సుఖమ్ తృష్ణాక్షయసుఖ స్యైతే కలాం నార్హంతి షోడశీం
మునిశ్రేష్టు లారా! ఆ సమయమున యయాతిచే గానము చేయబడిన గాధ (అనుభవము) ల విన్నవాడు, తాబేలు తన అవయవములను లోపలికి ముడుచు కొనిన విధముగ తనకు కలిగిన కామము (కోరిక) లను సంకోచింప చేసి కొనును. ఒకప్పుడును కోరికల యనుభవముచే కామము తీరదు. పైగా హవిస్సుచే అగ్ని పెంపొంది నట్లు పెంపొందును. భూమి యందు గల ధాన్య సంపద, బంగారము, పశువులు, స్త్రీలు ఇవన్నియు నొక్కనికి గూడ తృప్తి నీయ జాలవని తెలిసిన వాడు మోహ పడడు. ఎపుడు సర్వ భూతములపై త్రికరణము (మనస్సు, వాక్కు, శరీరము) లచే పాపాలోచన చేయడో; అపుడా జీవుడు బ్రహ్మయే యగును. ఎప్పుడెవ్వడెవ్వరి వల్ల గాని జడియడో, తన వలన నెవ్వరు గాని జడియ కుందురో, ఎప్పుడెవవ్వ డేదియు కావలయునని గాని యక్కర లేదని గాని యనడో యపుడాతడు బ్రహ్మ భావ మందును, దుర్మతులకేది వదిలించు కొన రానిదో, యేది నరునికి ముదిమి కదిపిన కొలది తాను ముదిమి గొనదో, ఏది ప్రాణాంతక మయిన రోగమో ఆ తృష్ణ (ఆశ) అను దానిని వదిలించు కొన్న వానికే సుఖము. జరితుడైన కొలది కేశములు జర్జిరితము లగును. జుట్టు నెఱియును దంతములు జరితము లగును కాని ధనాశ, జీవితాళ మాత్రము జరితములు గావు. లోకమున కామ సుఖము గాని దివ్య మయినది అనగా స్వర్గాది తేజోమయ లోకములలో గల్గు సుఖము గాని తృష్ణాక్షయము వలన గలుగు సుఖము యొక్క పదునారవ కళకేని సరి కాదు.
ఏవముక్త్వా స రాజర్షిః సదారః ప్రావిశ ద్వనమ్ కాలేని మహతా చాయం చచార విపులం తపః భృగుతుంగే గతిం ప్రాప తవసోంతే మహాయశాః అనశ్నన్‌దేహ ముత్సృజ్య సదారః స్వర్గ మాప్తవాన్ తస్య వంశే మునిశ్రేష్ఠాః పంచరాజర్షి సత్తమాః యైర్వ్యాప్తా పృధివీ సర్వా సూర్యస్యేవ గబస్తిభిః యదోస్తు వంశం వక్ష్యామి శృణుధ్వం రాజసత్కృతమ్ యత్రనారాయణో జజ్ఞే హరి ర్వృష్ణి కులోద్వహః సుస్థః ప్రజావా నాయుష్మా న్కీ ర్తిమాంశ్చ భవేన్నరః యయాతి చరితం నిత్యమిదం శృణ్వ స్ధ్విజో త్తమాః
అని చెప్పి రాజర్షి యైన యయాతి భార్యతో నడవి బ్రవేశించెను. (వాన ప్రస్థాశ్రమము స్వీకరించెను.) చాల కాలము విపుల తప మొనరించి అంత మందు భృగుతుంగ (పర్వత శిఖర) మందుండి నిరాహారియై మేను విడచి పత్నితో స్వర్గమున కేగెను. సూర్యుడు కిరణములచే నావరించి నట్లాతని వంశీయులు రాజర్షు లయిదుగు రఖిల భూమండల మావరించిరి. పృష్టి కుల వర్ధనుడై నారాయణుడు శ్రీకృష్ణుడుగ నవతరించిన, రాజన్యులచే పొగడ్త గాంచిన యదు వంశమున కీర్తించెదను. వినుడు! బ్రాహ్మణోత్తము లారా! ఈ యయాతి చరితము నిత్యము వినునతడు స్వస్థుడు, సంతానవంతుడు, ఆయుష్మంతుడు, కీర్తిమంతుడు కాగలడు.
Summary of chapter 12 of the Brahma Mahā Purana is as follows:
The miraculous birth of Bhagavān Śrī Kṛṣṇa in the Yādava lineage is narrated. Viṣṇu descends into the womb of Devakī at Brahmā's behest to relieve the earth of the burden of adharma. The fear and tyranny of Kaṃsa who imprisons Vasudeva and Devakī are described. Yogamāyā arranges the transfer of the divine child from Mathurā to Gokula in the dead of night, across the flooding Yamunā.