179 - ఋషిప్రశ్న నిరూపణమ్‌

లోమహర్షణుడు:

వ్యాసస్య వచనం శ్రుత్వా మునయః సంయతేంద్రియాః

ప్రీతా బభూవు స్సంహృష్టా విస్మితాశ్చ పునః పునః

లోమహర్షణుడు:

వ్యాస వచనము విని జితేంద్రియు లగు మునులు సంప్రీతులై సంతసించి యచ్చెరు వంది మఱిమఱి యిట్లనిరి.

మునులు:

అహో భారతవర్షస్య త్వయా సంకీర్తితా గుణాః

తద్వచ్ఛ్రీపురుషాఖ్యస్య క్షేత్రస్య పురుషోత్తమ

విస్మయో హి నచైకస్య శ్రుత్వా మాహాత్మ్యముత్తమమ్‌

పురుపాఖ్యస్య క్షేత్రస్య ప్రీతిశ్చ వదతాంవర

చిరాత్ర్పభృతి చాస్మాకం సంశయోహృది వర్తతే

త్వద్దృతే సంశయస్యాస్య చ్ఛేత్తా నాన్యోస్తి భూతలే

ఉత్పత్తిం బలదేవస్య కృష్ణస్య చ మహీతలే

భద్రాయాశ్చైవ కార్త్య్సేన వృచ్ఛామస్త్వాం మహామునే

కిమర్థం తౌ సముపత్పన్నౌ కృష్ణసంకర్షణావుభౌ

వసుదేవసుతౌ వీరౌ స్థితౌ నందగృహే మునే

నిఃసారే మృత్యులోకేస్మిన్దుఃఖ ప్రాయేతి చంచలే

జల బుద్బుద సంకాశే భైరవే లోమహర్షణే

విణ్మూత్రపిఛ్ఛలం కష్టం సంకటం దుఃఖదాయకమ్‌

కథం ఘోరతరం తేషాం గర్భవాస మరోచత

యాని కర్మాణి చక్రుస్తే సముత్పన్నా మహితలే

విస్తరేణ మునే తాని బ్రూహి నో వదతాం వర

సమగ్రం చరితం తేషామద్భుతం చాతిమానుషమ్‌

కథం స భగవాన్దేవః సురేశః సురసత్తమః

వసుదేవకులే ధీమాన్వాసు దేవత్వమాగతః

అమరైళ్చావృతం పుణ్యం పుణ్యకృద్భిరలంకృతమ్‌

దేవలోకం కిముత్సృజ్య మర్త్యలోక ఇహాగతః

దేవమానుషయోర్నేతా ద్యోర్భువః ప్రభవోవ్యయః

కిమర్ఠం దివ్యమాత్మానం మానుషేషు న్యయోజయత్‌

యశ్చ క్రం వర్తయత్యేకో మానుషాణామనామయమ్‌

న మానుష్యే కథం బుద్దిం చక్రే చక్రగదాధరః

గోపాయనం యః కురుతే జగతః సార్వభౌతికమ్‌

స కథం గాం గతో విష్ణుర్గోపత్వమకరోత్ర్పభుః

మహాభూతాని భూతాత్మా యో దధార చకార చ

శ్రీగర్భ స్స కథం గర్బేస్త్రియా భూచరయా దృతః

యేన లోకాన్ర్క మైర్జిత్వా త్రిభిర్వై త్రిదశేప్సయా

స్థాపితా జగతో మార్గాస్త్రివర్గాశ్చాభవంస్త్రయః

యోన్తకాలే జగత్పీత్వా కృత్వా తోయమయంవపుః

లోకమేకార్ణవం చక్రే దృశ్యాదృశ్యేన చాత్మనా

యఃపురాణః పురాణాత్మా వారాహం రూపమాస్థితః

విషాణాగ్రేణ వసుధాముజ్జహారారిసూదనః

యఃపురాణః పురుహూతార్థే త్రైలోక్యమిద మవ్యయం

దదౌజిత్వా వసుమతీం సురాణాం సురసత్తమః

యేన సింహవపుః కృత్వా ద్విధా కృత్వా చ తత్పునః

పూర్వం దైత్యో మహావీర్యో హిరణ్యకశిపుర్హతః

యఃపురా హ్యనలో భూత్వా ఔర్వః సంవర్తకోవిభుః

పాతాలస్థోర్ణవరసం పపౌ తోయమయంహరిః

సహస్రచరణం బ్రహ్మ సహస్రాంశు సహస్రదమ్‌

సహస్రశిరసం దేవం యమాహుర్వై యుగేయుగే

నాభ్యాం పద్మం సముద్భూతం యస్యపై తామహంగృహమ్‌

ఏకార్ణవే నాగలోకే సద్ధిరణ్మయ పంకజమ్‌

యేనతే నిహతాదైత్యాః సంగ్రామే తారకామయే

యేనదేవమయం కృత్వా సర్వాయుధ ధరం వపుః

గుహాసంస్థేనచోత్సిక్తః కాలనేమిర్నిపాతితః

ఉత్తరాంతే సముద్రస్య క్షీరోదస్యామృతోదధౌ

యః శేతే శాశ్వతం యోగమాస్థాయ తిమిరంమహత్‌

భారత వర్ష ప్రభావమెంత జక్కగ నీవు వర్ణించితివి. అట్లే పురుషోత్తమ క్షేత్ర మహిమను తాము సెల విచ్చినది విని వింత సెందితిమి. చిరకాలము నుండి మా యెద నొక సందియము పాదుకొని యున్నది. దానిని వదలింప దమకంటె మఱి యొకడు భూతలమున లేడు. బలరామ కృష్ణు లవని నవతరించుటకు గారణమేమి? భద్రా దేవి యవతారము నెందులకు వచ్చినది? వసుదేవుని కుమారులై నంద గృహమం దయ్యన్న దమ్ము లెందుల కుండిరి? ఈ లోకము దుఃఖ ప్రాయము. మృత్యు రూపము. నీటి బుడగ వలె నస్థిరము. పరమ పురుషులు వారు ఈమల పూరితమైన గొందెలో నీ ఘోరమైన గర్భమున నెందులకు నివాసమును గోరిరి? అవని నవతరించి వారేమేమి పనులు చేసిరి? అవెల్ల సమగ్రముగ మాకానతిమ్ము. అతి మానుషమైన వాసుదేవ భగవానుని కథ పరమ పుణ్యము. పుణ్యాత్ముల చరిత్రలతో ముడిపడి యున్నది. దివి నుండి యవనికి స్వామి వచ్చుటకు గతమేమి? చక్రపాణి సర్వసృష్టి చక్రముద్రిప్పు ప్రభువు మనుష్య లోకము నెడల నెట్లు తలుపు గొనెను. సర్వ జగద్గోపకు డైన హరి సామాన్య గోపమూర్తి యెందుల కయ్యెను. మహా భూతములను భరించు సర్వ భూతాత్మకు డైన ప్రభువు శ్రీగర్భుడు (అణిమాద్యైర్వర్య సంపన్నుడు) అగు శ్రీపతి యొక మానవ స్త్రీ గర్భమున నెట్లు భరింప బడెను? దేవతల మేలు కొఱకు ముల్లోకములను మూడడుగులచే నాక్రమించిన త్రి విక్రమ మూర్తి భూర్భువ స్వర్లోకములను మూడు దారులను ధర్మార్థ కామములను మూడు పురుషార్థములను నొడుదుడుగు లేకుండ నిలుపు స్థితి కర్త యాతడు లయ కాలమున జలమయ మూర్తి దాల్చి లోక మేకార్ణవ మొనరించి దృశ్యాదృశ్య స్వరూపమున జగమెల్ల దిగద్రావి యుండు పురాణ పురుషుడు పురాణాత్మ రూపుడు వరాహ రూప ధారియై తన కొమ్ముతుద నివ్వ సుమతి నుద్ధరించిన మధుసూదనుడు వసుంధర నెల్లగెలిచి దేవతల కిచ్చిన దేవపతి నరాకృతి సింహాకృతి యునై హిరణ్యకశిపు సంహరించిన శ్రీహరి ఔర్వాగ్ని (బాడబాగ్ని) స్వరూపుడై ప్రలయ మూర్తియై పాతాళమున కేగి సముద్రము నెల్ల నాపోశనము పట్టిన నారాయణుడు ఈయవని నరాకృతియై యేల యవతరించెను. సహస్ర చరణుడు సహస్ర శీర్షుడు సహస్ర పాదుడు సహస్రాంశువు నని యేదేవుని (పురుష సూక్తమున) వేదజ్ఞులు స్తుతింతురో యుగ యుగమందు నెవ్వని నాభి నుండి పితామహుని పుట్టి నిల్లైన పద్మ ముద్భవించునో లోక మేకావర్ణవ మైనపుడు హిరణ్మయ మైన యా కమలము ఎవ్వని నుదడి పొడమెనో నెవ్వనిచే దారకాసుర సంగ్రామమున దైత్యులు హతులైరో యెవ్వడు సర్వదేవ తాత్మకమైన సర్వాయుధ ధరమైన మేనుగొని మద మెక్కిన కాలనేమిని గూల్చెనో తుట్ట తుదను క్షీర సముద్ర మందు అమృత నిధి యందు యోగ మూర్తియై జగత్తు అంధకార బంధుర మైనప్పుడు నెవ్వడు నిద్రించునో యాస్వామి యవనిపై నవతరించుటకు కారణమేమి!

సురారణిర్గర్భమధత్త దివ్యం తపఃప్రకర్షాదదితిః పురాణమ్‌

శక్రంచయో దైత్య గణావరుద్ధం గర్భావధానేన కృతం చకార

పదాని యో యోగమయాని కృత్వా చకార దైత్యాన్సలిలేశయస్థాన్‌

కృత్వా చ దేవాంస్త్రిదశేశ్వరాంస్తు చక్రే సురేశం పురుహూతమేవ

గార్హపత్యేన విధినా అన్వాహార్యేణ కర్మణా

అగ్నిమాహవనీయం చ వేదం దీక్షాం సమిద్‌ ధ్రువమ్‌

ప్రోక్షణీయం స్రువం చైవ ఆవభృథ్యం తథైవచ

అవాక్పాణిస్తు యశ్చక్రే హవ్యభాగభుజ స్తథా

హవ్యాదాంశ్చ సురాంశ్చక్రే కవ్యాదాంశ్చ పితౄనధ

భోగార్థే యజ్ఞవిధినాయోజయద్యజ్ఞకర్మణి

పాత్రాణి దక్షిణాం దీక్షాం చరూంశ్చోలూఖలానిచ

యూపం సమిత్ర్సువం సోమం పవిత్రాన్పరిధీనపి

యజ్ఞియానిచ ద్రవ్యాణి చమసాంశ్చ తథాపరాన్‌

సదస్యాన్యజయానాంశ్చ మేధాదీంశ్చ క్రతూ త్తమాన్‌

విబజ పురాయస్తు పారమేష్ఠ్యనకర్మణా

యుగానురూపం యః కృత్వా లోకాననుపరాక్రమాత్‌

తపో బలమున దేవత లవతరించుటకు నరణియైన అదితి (అగ్ని పుట్టుటకు నాధార భూతమైన జమ్మి కర్ర యరణి యన బడును) గర్భ మందు ధరించిన దైత్య గణ బద్ధుడైన దేవేంద్రుని నెవడు జాగరూకతతో రక్షించెనో మూడ డుగులను యోగ మయములైన పదములనుగ చేసి దైత్యులను సముద్రము పాలొనరించి దేవతలను దేవేశ్వరులను దేవేంద్రుని కాపాడెనో గార్హపత్య విధానమున అన్వాహార్య కర్మచే అహవనీ యాగ్నిని వేదమును దీక్షను సమిధలను ధ్రువ పాత్రను బ్రోక్షణ పాత్రను న్రువమును అవబృధ్యమును నే మహానుభావుడు ముఖము చేయియు మఱి యే యవయవ స్ఫూర్తి లేని నిరాకారుడు దేవతలను గవ్యములను ఆరగించు పితృ దేవతలను గల్పించి భోగార్థము యజ్ఞాచరణ మందు యజ్ఞ విథిని సమ్మేశనము సేసెనో యజ్ఞ పాత్రలు దక్షిణ దీక్ష చెరువు సోమ సాధనము లైన యూపము సమిధ సోమము స్రువము పవిత్రములు పరిధులు మఱియు యజ్ఞార్హములైన ద్రవ్యములు చమసలు సదస్యులను యజమానులను మేధాదులను క్రతు శ్రేష్ఠములను నెవ్వడు పారమేష్ఠ్య మగు కర్మచేత (బ్రహ్మా చేయ వలసిన పనిగా) విభాగము చేసి యయ్యై యుగముల కనువుగా నొనరించెనో యయ్యజ్ఞ పురుషుడు విష్ణువే కృష్ణుడై యవతరించెను.

క్షణానిమేషాః కాష్ఠాశ్చ కలాస్రైకాల్యమేవచ

ముహూర్తాస్తిథయో మాసా దినం సంవత్సర స్తథా

ఋతవః కాలయోగాశ్చ ప్రమాణం త్రివిధంత్రిషు

ఆయుః క్షేత్రాణ్యుపచయో లక్షణం రూపసౌష్ఠవమ్‌

త్రయోలోకాస్త్రయో దేవా స్త్రైవిధ్యం పావకాస్త్రయః

త్రైకాల్యంత్రీణికర్మాణిత్రయో వర్ణాస్త్రయోగుణాః

సృష్టాలోకాః పురా సర్వే యేనాన న్తేనకర్మణా

సర్వభూతగతః స్రష్టా సర్వభూతగూణాత్మకః

నృణామింద్రియ పూర్వేణ యోగేన రమతేచయః

గతాగతాభ్యాం యోగేన య ఏవ విధిరీశ్వరః

యో గతిర్థర్మ యుక్తానా మగతిః పాపకర్మాణామ్‌

చాతుర్వర్ణస్య ప్రభవ శ్చాతుర్వర్ణ్యస్య రక్షితా

చాతుర్విధ్యస్య యోవేత్తా చాతురాశ్రమ్య సంశయః

దిగన్తరం నభో భూమిర్వాయుర్వాపి విభావసుః

చంద్ర సూర్యమయం జ్యోతిర్యుగేశః క్షణదాచరః

యః పరంశ్రూయతే జ్యోతిర్యః పరంశ్రూయతే తపః

యః పరం ప్రాహురపరం యః పరః పరమాత్మవాన్‌

ఆదిత్యానాంతుయోదేవో యశ్చదైత్యాన్త కోవిభుః

యుగాన్తే ష్వంతకోయశ్చ యశ్చ లోకా న్తకా న్తకః

సేతుర్యో లోకసేతూనాం మేథ్యో యో మేథ్యకర్మణామ్‌

వేద్యోయోవేదవిదుషాం ప్రభుర్యః ప్రభవాత్మనామ్‌

సోమభూతశ్చ సౌమ్యానామగ్ని భూతోగ్నివర్చసామ్‌

యః శక్రాణామీశభూత స్తపోభూత స్తపప్వినామ్‌

వినయో నయవృత్తీనాం తేజస్తే జస్వినామపి

క్షణములు నిమేషములు కాష్ఠలు కలలు వీని మానము ననుసరించి యేర్పడు భూత భవిష్య ద్వర్తమాన కాలములు ముహూర్తములు తిథులు నెలలు దినము సంవత్సరము ఋతువులు కాల యోగములు త్రైకాలిక కాల ప్రమాణము ఆయువు క్షేత్రములు (శరీరము) వాని యువచయము (పెరుగుదల) లక్షణము రూప సౌష్టవము ముల్లోకములు ముమ్మూర్తులు త్రివిధ కార్యము త్రేతాగ్నులు త్రికాలములు కర్మ త్రయము త్రి వర్ణములు సత్వ రజ స్తమ గుణములు నెవ్వనిచే నంతులేని కర్మ ప్రభావముచే సృష్ఠింప బడునో యా సృష్ఠికర్త హరియై యవతరించెను. సర్వ భూతాంతర్యామి యై సర్వభూత గుణ మూర్తియై మానవుల యందు నిద్రియముల వెంటనగు యోగముచేత వినోదించునో గడచిన గడువ నున్న కర్మముల యొక్క సంబంధము చేత సర్వ విధాయకు డైన యీశ్వరుడు తానై (కర్మ ఫలదాన సమర్థుడై) ధర్మపరులకు నెవ్వడు గతియు పాప కర్ములకు నగతియు నై దోచునో చాతుర్వర్ణ్య విభాగమునకు మూలమై రక్షకుడై యున్నాడో చాతుర్వర్ణ్యమున (చతుర్వేద విజ్ఞాన మునకు) నెవ్వ డెరుంగునొ బ్రహ్మచర్యాది చతు రాశ్రమముల కెవ్వ డాశ్రయుడో సర్వ దిక్కుల నడిమి భాగము నాకసము భూమి వాయువు సూర్యుడు చంద్ర సూర్య మయమైన జ్యోతిస్సు చతుర్యుగముల కధీశ్వరము నెవ్వడు పరం జ్యోతియని పరమ తపప్సని వేదము లందు విన బడునో యెవ్వని పరుని యపరినిగా కూడ (జీవాత్మగా పరమాత్మగా కూడ) బేర్కొందురో యెవ్వడు పరుడు పరమాత్మయునో యాదిత్యుల కధి నాదుడును దైత్యుల కంతకుడును నేవిభుడో యుగాంత మందంతకు దెవ్వడో యెవ్వడు లోకాంతకులకు కూడ నంతకుడో లోక సేతువుల కెవ్వడు సేతువో మేధ్యకర్ముల కెవ్వడు మేధ్యుడో (మేథ్యము = పవిత్రము) వేదము లెరింగిన వారి కెవ్వడెరుంగ తగిన వాడో సృష్టి హేతువు తైన వారికి గూడ నెవ్వడు సృష్టి బీజమో లేక ప్రభుశక్తి కలవాని కెవ్వడు ప్రభువో సౌమ్య ద్రవ్యముల కెవ్వడు సోముడో అగ్ని వర్చస్సుల కెవ్వడు అగ్నియో సర్వ లోకేశులగు శక్రులకు (ఇంద్రులకు) నీశ్వరుడో తపస్సులకు దపస్స్వ రూపుడో వినయ శీలురులలో నెవ్వడు వినయమో తేజశ్శాలుర లలో నెవ్వడు తేజస్సో.

విగ్రహో విగ్రహార్హాణాం గతిర్గతి మతామపి

ఆకాశప్రభవో వాయుర్మాయోః ప్రాణాద్‌ హుతాశనః

దివోహుతాశనః ప్రాణః ప్రాణోగ్నిర్మథుసూదనః

రసాచ్ఛోణితసంభూతిః శోణితాన్మాం స ముచ్యతే

మాంసాత్తు మేదసోజన్మ మేదసోస్థినిరుచ్యతే

అస్థ్నో మజ్జాసమభవన్మజ్జాతః శుక్రసంభవః

శుక్రాద్గర్భః సమభవద్ద్రసమూలేన కర్మణా

తత్రాపాం ప్రథమోభాగః సమ్యోసౌరాశిరుచ్యతే

గర్భోష్మసంభవో జ్ఞేయో ద్వితీయో రాశిరుచ్యతే

శుక్రం సోమాత్మకం విద్యాదార్తవం పావకాత్మకమ్‌

భావా రసానుగాశ్చైషాం బీజే చ శశిపావకౌ

కఫవర్గే భవేచ్ఛ్రుక్రం పిత్తవర్గేచ శోణితమ్‌

కఫస్యహృదయం స్థానం నాభ్యాం పిత్తం ప్రతిష్ఠితమ్‌

దేహస్యమధ్యే హృదయం స్థానం తన్మనసః స్మృతమ్‌

నాభికోష్ఠాంతరం యత్తు తత్రదేవో హుతాశనః

మనః ప్రజాపతిః జ్ఞేయః కఫః సోమో విభావ్యతే

పిత్తమగ్నిః స్మృతం త్వేవమగ్నిసోమాత్మకం జగత్‌

ఏవం ప్రవర్తితే గర్భే వర్థితేర్బుదసన్నిభే

వాయుః ప్రవేశం సంచక్రే సంగతః పరమాత్మనః

స పంచధా శరీరస్థో భిద్యతే వర్తతే పునః

ప్రాణాపానౌ సమానశ్చ ఉదానో వ్యానేవచ

ప్రాణోస్య పరమాత్మానం పర్థయన్పరావర్తతే

అపానః పశ్చిమం కాయముదానోర్థం శరీరిణః

వ్యానస్తు వ్యాప్యతే యేన సమానః సన్నివర్తతే

భూతావాప్తి స్తత స్తస్య జాయేతేంద్రియగోచరా

పృథివీ వాయురాకాశమాపో జ్యోతిశ్చ పంచమమ్‌

తస్యేంద్రియవివిష్టాని స్వంస్వం భాగం ప్రచక్రిరే

పార్థివం దేహమాహుస్తు ప్రాణాత్మానం చ మారుతమ్‌

ఛిద్రాణ్యాకాశయోనీని జలాత్స్రావః ప్రవర్తతే

జ్యోతిశ్చక్షూంసి తేజశ్చ ఆత్మా తేషాం మనః స్మృతమ్‌

గ్రామాశ్చ విషయాశ్చైవ యస్యవీర్యాత్ప్రనర్తితాః

ఇత్యేతాన్పురుషః సర్వాన్సృజల్లోకాన్సనాతనః

కలహ శీలురులలో నెవ్వడు కలహమో గతి మంతులలో నెవడు గతియో యట్టి హరి పుడమి రవతరించెను. ఆకాశము నుండి వాయువు ప్రాణ వాయువు నుండి అగ్ని పుట్టినవి. ఆకాశము అగ్ని ప్రాణము ఈ మూడును విష్ణు రూపములే. రసము నుండి శోణితము, శోణితము నుండి మాంసము, మాంసము నుండి మేదస్సు, మేదస్సు నుండి (క్రొవ్వు) (హృదయస్థ మైన) యెముక, యెముక నుండి మజ్జ (ఎముకలలోని క్రొవ్వు), మజ్జ్య నుండి శుక్రము, శుక్రము నుండి రస నిర్మాణ క్రియచే గర్భము బుట్టును. అందు మొదటి భాగము అప్పులు (ఉదకము) అదే సౌమ్య రాశియని చెప్ప బడును. గర్భగత మగు ఊష్మము నుండి రెండవ రాశి పుట్టును. శుక్రము సోమాత్మకము ఆర్తవము (స్త్రీ శోణితము) అనలాత్మకము. అగ్ని సోమాత్మక మైన ఈ ద్రవ్యములు రసము ననుసరించి యేర్పడును. శశి పావతులు బీజములు. కఫ వర్గమునకు సంబంధించి నది శుక్రము (పురష వీర్యము) పిత్త వర్గము లోనిది స్త్రీ శోణితము. కఫమునకు స్థానము హృదయము. పిత్తమునకు స్థానము నాభి. దేహమద్య మందున్న హృదయము మనస్సు యుండుచోటు. నాభి కోష్ఠము నందు అగ్ని దేవుడున్నాడు. మనస్సు ప్రజాపతి. కఫము సోముడు. పిత్తమగ్ని. ఈ విధముగ నీ జగత్తు అగ్నీ సోమాత్మకము. ఇట్లు ఏర్పడెడి గర్భము వృద్ధి బొందిన గొలది పరమాత్మతో బాటు వాయువు శరీరము నందు బ్రవేశించును. ఆ వాయువు శరీర మందు ప్రాణము, అపానము, సమానము, ఉదానము, వ్యానము అను అయిదు తెరగు లయినది. ప్రాణ వాయువు పరమాత్మను బెంపొందించుచు హృదయ మందుండును. అపానము నాభి క్రింద భాగమున (గుద స్థానం) యుండును. ఉదానము కంఠ దేశము నందుండును. వ్యాన వాయువు శరీరమెల్ల వ్యాపించి యుండును. సమాన వాయువు నాభి యందుండును. ఇంద్రియ గోచరమై యీ భూతోత్పత్తి యీ వాయువుల వలననే కలుగును. వాయువు ఆకాశము నీరు భూమి తేజస్సు అను నీ పంచ భూతాంశ లింద్రియము లందు జేరినవై తమ తమ భాగములను నిర్వహించును. దేహము పార్థివమని యందురు. వాయువును ప్రాణ స్వరూప మందురు. శరీర మందున్న నవ రంధ్రములు (అవకాశములు) ఆకాశ మూలములు. జల భూతము వలన శరీర మందు రక్త శుక్రాది స్రావ మేర్పడును. కన్నులు జ్యోతి (తేజః) స్వరూపములు. మనస్సు వానికి యాత్మ రూపము. మనశ్శక్తి వలననే విషయాదులు ప్రవర్తితము లగును. ఈ విధముగ సనాతను డైన పురుషుడు పరమాత్మ సర్వ లోకములను సృజించెను.

మునులు:

నైధనేస్మిన్కథం లోకే నరత్వం విష్ణురాగతః

ఏష నః సంశయో బ్రహ్మన్నేష నో విస్మయోమహాన్‌

కథం గతిర్గతిమతా మాపన్నో మానుషీం తనుమ్‌

ఆశ్చర్యం పరమం విష్ణుర్దేవైర్దైత్యైశ్చ కధ్యతే

విష్ణోరుతృత్తి మాశ్చర్యం కథయస్వమహామునే

ప్రఖ్యాతబలవీర్యస్య విష్ణోరమితతేజసః

కర్మణాశ్చర్యభూతస్య విష్ణోస్తత్వమిహోచ్యతామ్‌

కథం స దేవో దేవానామార్తిహా పురుషోత్తమః

సర్వవ్యాపీ జగన్నాథః సర్వలోకమహేశ్వరః

సర్గస్థిత్య న్తకృద్దేవః సర్వలోక సుఖవహః

అక్షయః శాశ్వతోనంతః క్షయవృద్ధివివర్జితః

నిర్లేపో నిర్గుణః సూక్ష్మో నిర్వికారోరికంజనః

సర్వోపాది వినిర్ముక్తః సత్తామాత్ర వ్యవస్థితః

అవికారీ విభుర్నిత్యః పరమాత్మాననాతనః

అచలోనిర్మలో వ్మాపీ నిత్యతృప్తో నిరాశ్రయః

విశుద్ధం శ్రూయతే యస్య హరిత్వం చ కృతేయుగే

వైకుంఠత్వం చ దేవేషు కృష్ణత్వం మానుషేషు చ

ఈశ్వరస్య హి తస్యేమాం గహానాం రర్మణోగతిమ్‌

సమతీతం భవిష్యంచ శ్రోతుమిచ్చాప్రవర్తతే

అవ్యక్తో వ్యక్త లింగస్థో యఏష భగవాన్ప్రభుః

నారాయణో హ్యనంతాత్మా ప్రభవోవ్యయ ఏవచ

ఏష నారాయణో భూత్వా హరిరాసీత్సనాతనః

బ్రహ్మాశక్రశ్చ రుద్రశ్చ ధర్మః శుక్రో బృహస్పతిః

ప్రధానాత్మా పురాహ్యేష బ్రహ్యోణమసృజత్ప్రభుః

సోసృజత్పూర్వ పురుషః పురాకల్పే ప్రజాపతీన్‌

ఏవం స భగవాన్విష్ణుః సర్వలోకమహేశ్వరః

కిమర్థం మర్త్యలోకేస్మిన్యాతో యదుకులే హరిః

మునులు:

నశించు స్వభావము గల నీ లోక మందు నశింపని పదార్థమగు విష్ణువు నర రూపము నెట్లు పొందెను. అని మా సందియము. విస్మయమును. ఉత్తమ గతి కేగు వారికి బరమ గతి యగు నీతడెట్లు మారవ శరీరి యయ్యెను? దేవతలు దైత్యులు గూడ నీ విషయము పర మాశ్చర్యముగా బేర్కొందురు. ఆ యాశ్చర్య కరమైన విష్ణువు యొక్క పుట్టుక వృత్తాంతము తెలుపుము. ఆయన మహా తేజస్సు. బల వీర్యములు ప్రసిద్ధములు. ఆయన చేష్ట యాశ్చర్యకరము. అట్టి విష్ణువు యొక్క తత్వ మిపుడు జెప్ప తగును. ఆ దేవుడు పురుషోత్తముడు దేవతల కష్టముల నెట్లు హరించెను. సర్వ వ్యాపకుడు సర్వ లోకేశ్వరుడు సర్వలోక సుఖ కరుడు సృష్ఠి స్థితిలయ కారుడు నగు జగన్నాథుడు శాశ్వతుడు. అంతము లేనివాడు. క్షయ వృద్ధులు లేనివాడు. పాప పుణ్య స్పర్శలేని వాడు. నిర్గుణుడు. సూక్ష్ముడు. వికార రహితుడు. నిరంజనుడు. విభుడు. నిత్యుడు. సత్తామాత్రుడు. అచలుడు నిర్మలుడు సర్వవ్యాపి నిత్య తృప్తుడు నిరాశ్రయుడు నైన యాతడు దేవతల యందు వైకుంఠ భావమును (నారాయణత్వం) మానవు లందు కృష్ణత్వమును నెట్లు పొందెను. కృతయుగ మందు విశుద్ధమైన హరిత్వమును సర్వేశ్వరుడగు నా భగవంతుని కర్మ గతిని దురవగాహ మగు గడచిన జరగ నున్న దానిని వినగోరు చున్నాము. భగవంతుడు స్వభావము చేత నవ్యక్తు డయ్యు వ్యక్త రూపమునంది యున్నాడు. ఈయన నారాయణు డయ్యు హరియను పేర అవతరించెను. బ్రహ్మ శక్రుడు(ఇంద్రుడు) రుద్రుడు ధర్ముడు (యముడు) శుక్రుడు గురుడు అయినాడు. తొలుత ప్రధానాత్మయై బ్రహ్మను సృజించెను. పురాణ పురుషు డగు నతడు పూర్వ కల్పమందు ప్రజాపతులను సృజించెను. అట్టి భగవంతుడు (షడ్గుణైశ్వర్య సంపన్నుడు) సర్వ వ్యాపకుడగు విష్ణువు సర్వ లోకేశ్వరుడు మర్త్య లోకమున యదుకుల మందు నెందులకు బ్రవేశించెను. తెలుపుము.